విదేశీ మీడియా ఏమంది? | What is the foreign media sayed? | Sakshi
Sakshi News home page

విదేశీ మీడియా ఏమంది?

Nov 9 2015 2:30 AM | Updated on Jul 18 2019 2:11 PM

బిహార్‌లో మోదీ పరాజయం ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి ఎదురుదెబ్బగా విదేశీ మీడియా ఆదివారం అభివర్ణించింది.

బిహార్‌లో మోదీ పరాజయం ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి ఎదురుదెబ్బగా విదేశీ మీడియా ఆదివారం అభివర్ణించింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో మోదీ శక్తియుక్తులు, ఎన్నికల వ్యూహాలు సన్నగిల్లుతున్నాయనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని బ్రిటన్‌కు చెందిన ‘గార్డియన్’ పేర్కొంది. దేశంలో కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టాలనుకుంటున్న మోదీకి బిహార్ ఫలితాలు అడ్డంకి కావొచ్చని అభిప్రాయపడింది. ఈ ఫలితాలు మోదీ ప్రతిపాదిత ఆర్థిక సంస్కరణలకు రెఫరెండంగా పేర్కొనవచ్చని బీబీసీ వ్యాఖ్యానించింది. మోదీ సాగించిన గోవు రాజకీయాల ఫలితంగా బిహార్ ఎన్నికల్లో బీజేపీ మట్టికరిచిందని పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రిక విమర్శించింది. మోదీ మతవాద విధానాలకు వ్యతిరేకంగా భారత్ తొలిసారి తీర్పు ఇచ్చిందని ద న్యూస్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement