అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: దానం | Will not tolerate if anyone criticise Sonia gandhi, says Danam Nagender | Sakshi
Sakshi News home page

అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: దానం

Published Thu, Dec 12 2013 2:44 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: దానం - Sakshi

అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది: దానం

హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ను సమైక్యవాదులు అడ్డుకోవడంపై మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి .. .పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆయన గురువారమిక్కడ ఖండించారు. పార్టీలో కీలక పదవులు పొందిన జేసీ ఇప్పుడు సోనియాను విమర్శించటం తగదన్నారు. ఎవరైనా సోనియాని విమర్శిస్తే
సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. దిగ్విజయ్ సింగ్ ను గోబ్యాక్ అనడానికి అశోక్ బాబు ఎవరంటూ దానం ప్రశ్నించారు. అశోక్ బాబు ఒక ఉద్యోగ సంఘం నేతగా వాళ్ల సమస్యలనే ప్రస్తావించాలే కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని దానం అన్నారు. హైదరాబాద్పై అందరికి సమానంగా హక్కు ఉందని దానం అన్నారు. అన్నదమ్ముల్లా విడపోవాలంటే...రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement