ఆడదానికి ఆడదే శత్రువంటారు. నేరగాళ్లకు అడ్డా అని అందరూ చెప్పుకొనే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆ వాస్తవం మరోమారు రుజువైంది. 21 ఏళ్ల మహిళ ఒకరిపై ఆమె క్లాస్మేట్లలో ఇద్దరు అత్యాచారం చేశారు. రాహుల్, రాహుల్ కుమార్ అనే ఇద్దరు ఈ ఘాతుకానికి పాల్పడగా, వారికి రాహుల్ కుమార్ సోదరి రింకీ కూడా సహకరించింది.
మెహమూదాబాద్ ప్రాంతంలో రాహుల్ కుమార్, రింకీలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీతాపూర్ గ్రామానికి చెందిన మహిళపై ఈనెల నాలుగో తేదీన అత్యాచారం జరిగింది. లక్నోలో ఓ కోచింగ్ తరగతికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని, ఆమె పరిస్థితి ప్రస్తుతంబాగానే ఉందని పోలీసులు తెలిపారు.
క్లాస్మేట్పై సామూహిక అత్యాచారం
Published Fri, Aug 9 2013 12:09 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement