వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు లాంటి వ్యక్తులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు.
నంద్యాల: వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు లాంటి వ్యక్తులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. జగన్ ఏమిటో ప్రజలందరికీ తెలుసని, ఇక చంద్రబాబు ఎలాంటివారో చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నారు. ఆదివారం నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన మాట్లాడారు.
‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు దివంగత మహానేత వైఎస్‌ఆర్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులు చేయలేని అసమర్థుడు చంద్రబాబునాయుడు. ఆయన పులివెందుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. పులివెందులను అభివృద్ధిచేసిన ఘనత వైఎస్సార్‌దే’ అని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. నంద్యాలను కూడా పులివెందుల మాదిరే అభివృద్ధి చేస్తామని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.