{పత్యేకహోదాపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడానికి పిలుపునిచ్చాకే టీడీపీకి ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రోజుకో మంత్రిని కలుస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ జంతర్ మంతర్‌లో ఈనెల 10వ తేదీన జరుపతలపెట్టిన ధర్నా ప్రదేశాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు శుక్రవారం సాయంత్రం పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ఏపీ నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో మూడు నుంచి నాలుగువేల మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రత్యేక హోదాను కాంక్షించేవారు సంఘీభావం తెలపడానికి ఢిల్లీకి తరలివస్తున్నారని చెప్పారు. ధర్నా అనంతరమైనా కేంద్రం కళ్లు తెరిచి ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నెరవేరుస్తుందని ఆశిస్తున్నామన్నారు.
టీడీపీ ఎంపీలవి డ్రామాలు
Published Sat, Aug 8 2015 2:25 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement