నిజామాబాద్ వ్యవసాయం : రైతుల సమస్యలపై గురువారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని నిజామాబాద్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పవన్‌చంద్రారెడ్డి తెలిపారు. పలువురు రైతులు ఫోన్ చేసి పం టలను ఆశించిన చీడపీడల గురించి తెలిపారని, వాటి నివారణ చర్యలను తాము సూ చించామని పేర్కొన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో రుద్రూర్‌లోని వరి, చెరుకు పరిశోధ న స్థానం శాస్త్రవేత్తలు కేఆర్.ఠాగూర్, కేఎన్.సంధ్యకిషోర్, జి.ప్రవీణ్, జె.కమలాకర్, రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి.వెంకట్‌రాజకుమార్ పాల్గొన్నారని తెలి పారు. రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తల సూచనలు..
వరిలో ఆకునల్లి నివారణకు..
వరి గింజలను ఆకునల్లి, కలకెనల్లి పురుగు లు ఆశించినట్లయితే లీటరు నీటికి 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2 మి.లీ. ప్రొఫార్‌గైట్ కలిపి ఎకరానికి 400 మి.లీటర్ల మందును గింజలపై పిచికారి చేయాలి.
వరిలో దోమపోటు నివారణకు..
గోధుమ వర్ణపు/తెల్ల మచ్చదోమలు దుబ్బుల అడుగున నీటి మట్టంపై ఉండి దుబ్బుల నుంచి రసాన్ని పీలుస్తున్నాయి. దీని వల్ల పైరు ఎండిపోతుంది.
దోమపోటు నివారణకు పొలాన్ని అప్పుడప్పుడు ఆరబెడుతుండాలి. పొలంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు వదలాలి. సుడి దోమ నివారణకు ఎకరానికి 320 మి.లీ. బుప్రొఫెజిన్ లేదా 400 మి.లీ. ఇతోఫెన్‌ప్రాక్స్ లేదా 50 గ్రాముల ఇయడాక్లోప్రిడ్ + ఎఫిప్రోల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్లు బాగా తడిచేలా పిచికారి చేయాలి.
కాండం తొలిచే పురుగు నివారణకు..
జిల్లాలో వరి పైరు వివిధ దశలలో ఉంది. కాండం తొలిచే పురుగు పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. అదే ఈనిక దశలో ఆశిస్తే తెల్ల కంకులు వస్తాయి. పైరు నాటిన 15-30 రోజులలోపు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు లేదా 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు లేదా 4 కిలోల క్లోరాన్‌ట్రనిలిప్రోల్ 0.4 జీ గుళికలు వేసుకోవాలి. చిరుపొట్ట దశలో ఎకరానికి 80 మి.లీ. క్లోరాన్‌ట్రనిలిప్రోల్ 20 ఎస్సీ మందును పిచికారి చేయాలి.
సోయాలో
పొగాకు లద్దె పురుగు నివారణకు..
ఈ పురుగు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫేట్(ఎకరానికి 200 గ్రాములు) లేదా 1.6. మి.లీ. మోనోక్రొటోఫాస్(ఎకరానికి 320 మి.లీ.) లేదా 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్(ఎకరానికి 500 మి.లీ.) పిచికారి చేయాలి.
టమాటలో ఆకు మాడు తెగులు నివారణకు..
ఈ తెగులు నివారణ కోసం లీటరు నీటికి 2 గ్రాముల క్లోరోథలోనిల్(ఎకరానికి 200 గ్రాములు) లేదా 3 గ్రాముల కాప్టాన్(ఎకరానికి 600 గ్రాములు) లేదా 3 గ్రాముల మాంకోజెబ్(ఎకరానికి 600 గ్రాములు) లేదా ఒక మి.లీ. ప్రొపికొనజోల్(ఎకరానికి 200 మి.లీ.) కలిపి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారి చేయాలి.