తీగల సాయంతో టమాట సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన రైతు కిషన్‌రెడ్డి పేర్కొంటున్నారు. ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల చీడపీడల బాధ తగ్గుతుందని, పంట వృథా కాదని చెబుతున్నారు.
టమాట సాగు గురించి ఆయన మాటల్లోనే..
బాల్కొండ : ‘‘జూన్ మొదటి వారంలో టమాట నా రు పోశాను. తర్వాత అర ఎకరం భూమిలో బో యలు ఏర్పాటు చేశాను. బోయలపై అక్కడక్క డ ఐదు ఫీట్ల ఎత్తు ఉండేలా వెదురు కర్రలను పాతాను. నెల రోజుల తర్వాత బోయలలో మొ క్కలను నాటాను. వెదురు కర్రలకు ఒక కర్ర నుంచి మరో కర్రకు ఫీటు ఎత్తులో స్టీల్ వైరును చుట్టాను. టమాట మొక్క ఫీటు ఎత్తు పెరిగిన తర్వాత దారాలతో తీగకు కట్టాను. మళ్లీ వెదు రు కర్రకు రెండు ఫీట్ల ఎత్తులో వైరు చుట్టాను. మొక్క రెండు ఫీట్ల ఎత్తు పెరగ్గానే దానిని దారాలతో మళ్లీ తీగకు కట్టాను. ఇలా మొక్క నేలపై పడిపోకుంగా జాగ్రత్తలు తీసుకున్నాను.
మూ డు, నాలుగు ఫీట్ల ఎత్తులోనూ ఇలాగే చేశాను. దీంతో టమాట తీగలపైనే పారుతోంది. ఈ పం ట మూడో నెలనుంచి చేతి కి వస్తుంది. ప్రస్తు తం కాత దశలో ఉంది. ఆరు నెలల వరకు ట మాట కాస్తూనే ఉంటుంది’’ అని కిషన్‌రెడ్డి వివరించారు. టమాట సైజు కూడా పెద్దగా ఉందని, మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ఖర్చు ఎక్కువే అయినా..
ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుందని రైతు తెలిపారు. వెదురు కర్రలు, స్టీల్ వైరు, దారాలకు సుమారు రూ. 15 వేల వరకు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. అయితే సాధార ణ పద్ధతుల్లో సాగు చేసిన టమాట కంటే తీగ ప ద్ధతిలో సాగు చేసిన పంటకు చీడపీడల బాధ తక్కువన్నారు. దిగుబడి కూడా ఎక్కువ వస్తుందని వ్యవసాయ అధికారులు తెలిపారని పేర్కొన్నారు.
సాధారణ పద్ధతుల్లో పంట సాగు చేస్తే వర్షాలు కురిసినప్పుడు టమాటలు కుళ్లిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని, ఈ పద్ధతిలో ఆ బాధ ఉండదని వివరించారు. సాధారణ పద్ధతిలో టమాట నేలకు ఆనుతుందని, దీంతో కాయలపై మచ్చలు ఏర్పడతాయని, కాయల సైజు కూడా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తీగ పద్ధతిలో ఆ సమస్యలు లేవన్నారు. ఈ పద్ధతిలో మదనపల్లెకు చెందిన రైతులు టమాట సాగు చేస్తారని, వారిని స్ఫూర్తిగా తీసుకున్నానని రైతు తెలిపారు. ప్రస్తుతం 25 కిలోల టమాట పెట్టె రూ. 350 పలుకుతోందని, ధర ఇలాగే ఉంటే లక్ష రూపాయల వరకు రాబడి వస్తుందని ఆశిస్తున్నానని వివరించారు.
తీగ సాయంతో టమాట సాగు
Published Thu, Sep 4 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement