ఖమ్మం వ్యవసాయం: ‘నా 16వ ఏటనుంచే వ్యవసాయం చేస్తున్నా. నాకు మూడు ఎకరాల భూమి ఉంది. మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొదటి నుంచి వ్యవసాయానికి సంబంధించి ఏ విషయమైనా నాకు ఆసక్తి. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ఏర్పాటు చేసే శిక్షణ తరగతులకు వెళ్తుంటాను. సాగు సంబంధ విషయాలను టీ వీలు, పేపర్లలో చూస్తుంటాను.
వ్యవసాయాధికారులు, రైతులు ఎవరు చెప్పినా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలనే చెబుతుంటారు. కూలీల కొరత, కూలి రేట్లు పెరగటం, సకాలంలో కూలీలు దొరకపోవడం, ఇవన్నీ చూశాక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలనుకున్నాను. గడ్డికోసే యంత్రానికి గేర్ బాక్స్‌ను అమర్చి, దానికి బ్లేడ్‌లు బిగించి ఈ యంత్రాన్ని తయారు చేశాను.
గడ్డి కోసే పవర్ వీడర్ యంత్రానికి అదనంగా పనిముట్లు బిగించాను. పవర్ వీడర్‌కు రెండు వీల్స్ ఏర్పాటు చేశాను. దానికి గేర్ బాక్స్‌ను అమర్చాను. ఈ యంత్రం కోసం వివిధ సైజుల్లో బ్లేడ్‌లు తయారు చేశాను. అవసరాన్ని బట్టి ఏ బ్లేడ్ సరిపోతుంది దాన్ని బిగిస్తాను. పైనీర్ కంపెనీకి చెందిన 27364 హైబ్రిడ్ వరి విత్తనాలను సాగు చేస్తున్నాను. ఎకరానికి నాలుగు కిలోల విత్తనాలను 10 కిలోల నూకలతో కలిపి తాను రూపొందించుకున్న డ్రమ్ సీడర్ (కేసింగ్ పైపు)తో వేశాను. మొక్కల మధ్య దూరం 10 సెం.మీ, సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ చొప్పున ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాను. నేనే స్వయంగా విత్తనాలు వేసుకున్నాను.
కలుపు నివారణ కూడా ఈ యంత్రంతోనే చేయాలని భావించి పవర్ వీడర్‌కు గేర్ బాక్స్, వీల్స్, బ్లేడ్‌లు ఏర్పాటు చేశాను. దీని సహాయంతో కలుపు కూడా నేనే స్వయంగా తీసుకుంటున్నాను. సాళ్ల మధ్య యంత్రాన్ని నడుపుతూ కలుపు తొలగిస్తున్నాను. పొలంలో గడ్డి ఉండటాన్ని బట్టి ఎకరానికి 4 నుంచి 6 గంటలు పడుతుంది. గంటకు లీటర్ పెట్రోలు ఖర్చవుతుంది. మొత్తంగా ఎకరానికి పెట్రోలుకు రూ.300 వరకు ఖర్చు వస్తుంది. అదే కూలీలకైతే కలుపును బట్టి ఎకరానికి ఒకసారికి దాదాపు రూ.2 వేలకు వరకు ఖర్చు వస్తుంది.
ఈ యంత్రం ద్వారా కలుపు తీయటం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. కలుపు మట్టిలోనే కలిసిపోయి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. వానపాముల చర్యలు క్రియాశీలకంగా ఉంటాయి. ఎరువుల విని యోగం కూడా తగ్గుతుంది. కలుపు నివారించబడి వరి మొక్కలకు గాలి, వెలుతురు సరిగా సోకుతుంది. తెగుళ్లు, పురుగులు సోకవు. పొ లంలో చాలినంతగా నీరు పెట్టి కలుపును బట్టి రెండు సార్లు కలుపు తీసుకుంటే మంచిది.
ఎకరానికి మొత్తంగా 10 వేల వరకు ఖర్చు తగ్గుతుంది. గతంలో శ్రీ వరి సాగు పద్ధతిలో సేద్యం చేసి ఎకరానికి 50 బస్తాల వరకు దిగుబడి సాధిం చాను. వరి వేసే ముందు పచ్చిరొట్ట వేసి దున్నటం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించటం, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తున్నాను.
కలుపు తీత భలే తేలిక
Published Fri, Oct 3 2014 2:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement