
రాంరెడ్డి మృతదేహం
గోపాల్‌పేట : వనపర్తిలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వంత గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కేఎల్‌ఐ డీ–8 కాల్వలో పడిన ఓ రిటైర్డ్ ఇరిగేషన్ ఏఈ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని ఏదుట్ల శివారులో వెలుగు చూసింది. ఏఎస్సై ఇలియాజ్ తెలిపి న వివరాలిలా ఉన్నాయి. రేవల్లి మండల కేంద్రానికి చెందిన జిల్లెల రాంరెడ్డి(73) ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈగా పని చేసి రిటైర్ అయ్యారు.
కుటుంబంతో సహా హైదరాబాదులో స్థిరపడ్డారు. రేవల్లిలో ఉన్న సొంత ఇంటిని ఇటీవలే తహసీల్దార్ కార్యాలయా నికి అద్దెకు ఇచ్చిన రాం రెడ్డి.. సోమవారం వనపర్తి లో ఉంటున్న మనవడైన న్యాయవాది విజయకుమార్‌రెడ్డి ఇంటికి వచ్చి రాత్రి రేవల్లి బయలుదేరాడు. రాత్రి 8.30 గంటల సమయంలో బైకుపై బయలుదేరగా ఏదుట్ల శివారులో డీ–8 కాల్వ రోడ్డుకు అడ్డంగా వెళ్లడంతో పైపులతో ప్రత్యామ్నాయ వంతెన వద్ద మూలమలుపును గమనించ ప్రమాదవశాత్తు బైకుతో సహా కాల్వలో పడిపోయాడు.
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదలగా మంగళవారం ఉద యం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమి చ్చారు. ఏఎస్సై ఇలియాజ్ సిబ్బందితో టన స్థలానికి చేరుకుని మృతుడి వద్ద ఉన్న ఫోన్ సాయంతో కుమారుడికి సమాచారం అందించారు. మృతుడికి భార్య అనసూయమ్మ, కుమారుడు అశోక్‌రెడ్డిని ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎంపీపీ జానకీరాంరెడ్డి పరామర్శించారు.