(బంగ్లా స్వాతంత్ర్యం సందర్భంగా ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న ఇందిరా గాంధీ, షేక్ ముజిబుర్ రహ్మాన్)
ఢాకా: ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టింగ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర వివాదానికి కారణమైంది. బంగ్లాదేశ్‌లోని పాక్ రాయబార కార్యాలయం అధికారి ఒకరు ఇటీవల ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు. దాని ప్రకారం.. స్వతంత్ర బంగ్లాదేశ్‌ను ప్రకటించిన వారు షేక్ ముజిబుర్ రహ్మాన్ కాదు, జియా ఉర్‌రహ్మాన్ అని దాని సారాంశం. దీనిపై బంగ్లా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ హైకమిషనర్‌ను పిలిపించి సమన్లు అందజేసింది. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే, బంగ్లా ఆగ్రహాన్ని గ్రహించిన పాక్ అధికారులు ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించేశారు.
అయినప్పటికీ ఈ వ్యవహారంలో బంగ్లా ఇంకా గుర్రుగానే ఉంది. గతంలోనూ పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే పలు తప్పిదాలు చేసిందని, ఇప్పటికీ అదే తీరు కొనసాగుతోందని విమర్శించింది. ఇదంతా కావాలనే చరిత్రను వక్రీకరిస్తూ తమను అప్రతిష్ట పాలు చేసేందుకు చేస్తున్న యత్నంగా అభివర్ణించింది. ఇలాంటి యత్నాలు ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే కాదు, మూడు మిలియన్ల మంది అమరవీరుల త్యాగాలను పల్చన చేయటమేనని తెలిపింది. పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్‌కు 1971లో బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ స్వతంత్రాన్ని ప్రకటించిన విషయాన్ని తక్కువ చేయటం తగదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment