రోమ్ : ఇటలీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న ఓ ట్రక్కు, లారీ వెనకభాగాన్ని ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి రోడ్డు మార్గం పాక్షికంగా పాడైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 70 మందికిపైగా గాయాలయ్యాయి. ఉత్తర ఇటలీలోని బొలోగ్నా నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు దాటికి సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దట్టమైన పొగకారణంగా చుట్టుపక్కల నివసించే ప్రజలు తాత్కాలిక ఉపశమనం కోసం సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత భారీ పేలుడు సంభవించడానికి కొద్ది సమయం పట్టింది. దీంతో ట్రక్కు చుట్టు పక్కనే ఉన్న కార్లు, వ్యాన్లు ఇతర వాహనాలు వెనక్కు వెళ్లిపోయాయి. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే భారీ విస్పోటనం సంభవిస్తే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment