
హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు

వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది

వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్- అదితి పెళ్లి జరిగింది

అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021) మూవీలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది

అప్పటినుంచి ఇద్దరూ వెకేషన్‌కు, ఈవెంట్స్‌కు కలిసే వెళ్తున్నారు

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్, పెళ్లికి సైతం జంటగా హాజరవడంతో వీరి ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు


















