Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Thopudurthi Prakash Reddy Strong Counter to Ramagiri SI Sudhakar Yadav1
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?

అనంతపురం, సాక్షి: రామగిరి ఎస్సై సుధాకర్‌ యాదవ్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy). మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్‌ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన. ..సుధాకర్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా?. పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా?. అసలు ఎస్సై సుధాకర్‌ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా?. నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు?.టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది?.. అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు... ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ, పరిటాల సునీత(Paritala Sunitha) ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్‌ గ్రహించాలి. చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా?. పోలీసుల పై చంద్రబాబు దూషణలు వినిపించవా?. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు?. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే... వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా?అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Amid Trump tariffs come into effect big Cabinet meet India today Updates2
ట్రంప్‌ టారిఫ్‌.. భారత ప్రతీకారం అనుమానమే?

న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో.. అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి కేబినెట్ భేటీని కీలకంగా భావిస్తోంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో.. అమెరికా , భారతీయ ఉత్పత్తులపై విధించిన సుంకాల పై కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు, ఆటోపార్ట్స్‌పై సుంకాల ప్రభావం పడనుంది. ఈ క్రమంలో.. ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే.. అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం.. WTO వద్ద సమస్యను లేవనెత్తే దిశగా ఆలోచనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే.. ప్రతిస్పందనగా భారత్ తరఫున కొంతమేర కౌంటర్ టారిఫ్‌లు విధించాల్సిన అవసరం ఉందా? అనే దానిపై విస్తృతంగా చర్చించనుందని సమాచారం. అయితే, అవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. అలాంటి ఒప్పందాల దిశగా సిద్ధమవుతోందని భోగట్టా. అలాగే.. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక అమెరికా సుంకాల వల్ల ప్రభావితమవుతున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతు కల్పించేలా ఆదాయ పరంగా వెసులుబాట్లు ఇవ్వాలనే ప్రతిపాదన కేబినెట్‌ ముందుకు రానుంది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో అమెరికా ప్రభుత్వంతో ఉన్న చర్చలను వేగవంతం చేసే అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమ దేశంపై ట్రంప్‌ 104 శాతం సుంకాల విధింపును అన్యాయంగా పేర్కొంటున్న చైనా.. అగ్రరాజ్య ప్రాధాన్యతను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామంటూ భారత్‌కు ప్రతిపాదన చేసింది. అయితే కేబినెట్‌ భేటీలో చైనా ప్రతిపాదన అంశం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లలో ఇప్పటికే 10 శాతం అమల్లోకి రాగా.. తాజాగా మరో 16 శాతం నేటినుంచి అమలవుతోంది. తనకు భారత ప్రధాని మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్‌ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని టారిఫ్‌ల విధింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు. తాము అందులో సగమే విధిస్తున్నామని ఆయన చెప్పారు.

home loan emi reducing due to rbi repo rate cut3
ఆర్‌బీఐ తాజా నిర్ణయం.. గృహ రుణంపై ఊరట

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. మరోసారి తాజాగా మరో 25 పాయింట్లు తగ్గుస్తున్నట్లు తెలిపింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్‌ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్‌ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.గృహ రుణంపై ఊరట ఎంతంటే..?ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.75 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,093 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్‌బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.21,696కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.397 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.95,280 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఇదీ చదవండి: ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయంరెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుంది.

Manchu Manoj Issue With Mohan Babu Latest4
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన

ప్రస్తుతం సైలెంట్ అయ్యారే అనుకుంటున్న టైంలో మంచు కుటుంబంలో(Manchu Family) మరోసారి వివాదం మొదలైంది. తాను ఇంట్లో లేనప్పుడు తన కారు, ఇతర వస్తువుల్ని ఎత్తుకెళ్లారని మనోజ్(Manchu Manoj).. అన్న విష్ణుపై కేసు పెట్టాడు. జల్‌పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదంతా మంగళవారం జరిగింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)తాజాగా బుధవారం ఉదయం.. జల్ పల్లిలోని మోహన్ బాబు(Mohan Babu) ఇంటి ముందు మనోజ్ ఆందోళనకు దిగాడు. కూతురు పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లగా.. తన ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లారని, దీని గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించట్లేదని మనోజ్ చెప్పాడు. దీంతో గేటు ముందే బైఠాయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొన్నాళ్ల క్రితం విష్ణు-మనోజ్ మధ్య మొదలైన గొడవ.. చాలారోజుల పాటు నడిచింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏమైందో ఏమో మరి సైలెంట్ అయ్యారు అనుకునేంతలోపు మళ్లీ వివాదం రాజుకున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!)

High Risk Batting He Played Well: Ruturaj Blames His Side After Loss To PBKS5
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్‌ అద్భుతం’

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్‌ ఓటములతో డీలా పడిన సీఎస్‌కే.. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ చేతిలోనూ చేదు అనుభవం ఎదుర్కొంది. ముల్లాన్‌పూర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు పోరాడి విజయానికి పద్దెనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఆ తప్పులే మా కొంప ముంచాయిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం చెన్నై సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) స్పందిస్తూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఫీల్డింగ్‌ తప్పిదాలే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘గత నాలుగు మ్యాచ్‌లలో ఒకే పొరపాటు.. అదే ఫీల్డింగ్‌. మేము క్యాచ్‌లు డ్రాప్‌ చేస్తూనే ఉన్నాం.అతడి బ్యాటింగ్‌ అద్భుతంతద్వారా ఆ బ్యాటర్లు అదనంగా 15, 20, 30 పరుగులు చేసేందుకు ఆస్కారం ఇస్తున్నాం. ఈరోజు ప్రియాన్ష్‌ ఆర్య అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. నిజానికి హై రిస్క్‌తో కూడిన ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, పరిస్థితులు అతడికి అనుకూలించాయి.ఇదే వికెట్‌పై మేమూ బ్యాటింగ్‌ చేశాం. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. అంతకుముందు కీలక సమయాల్లో క్యాచ్‌లు కూడా డ్రాప్‌ చేశాం. ఇంకో 10- 15 పరుగులు కట్టడి చేయాల్సింది. అలాగే ఇంకో మూడు- నాలుగు సిక్సర్లు బాదాల్సింది.బ్యాటింగ్‌ పరంగా పర్లేదుఏదేమైనా మా ఉత్తమ బ్యాటర్లు రచిన్‌ రవీంద్ర, డెవాన్‌ కాన్వే పవర్‌ ప్లేలో రాణించడం సానుకూలాంశం. బ్యాటింగ్‌ పరంగా మేము పర్లేదు. ముందుగా చెప్పినట్లు ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సి ఉంది’’ అని రుతురాజ్‌ గైక్వాడ్‌ పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌ను ఆస్వాదిస్తేనే తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయని.. టెన్షన్‌ పడితే మరిన్ని పొరపాట్లకు ఆస్కారం ఉంటుందే తప్ప లాభమేమీలేదని తమ ఫీల్డర్లకు సందేశం ఇచ్చాడు.క్యాచ్‌లు డ్రాప్‌ చేసి.. మూల్యం చెల్లించారుకాగా టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన సీఎస్‌కే ఆరంభంలోనే వరుస వికెట్లు తీసింది. కానీ యువ ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య మెరుపు సెంచరీ (42 బంతుల్లో 103)తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ప్రియాన్ష్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌలర్‌ మిస్‌ చేశాడు.అదే విధంగా ఐదో ఓవర్‌ రెండో బంతికి స్టొయినిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను విజయ​ శంకర్‌ వదిలేశాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి ప్రియాన్ష్‌ బంతిని గాల్లోకిలేపగా.. శంకర్‌ మరోసారి డ్రాప్‌ చేశాడు. ఇక అశ్విన్‌ బౌలింగ్‌లో పన్నెండవ ఓవర్‌ రెండో బంతికి ప్రియాన్ష్‌ సిక్సర్‌ బాదగా.. బంతిని అందుకున్న ముకేశ్‌ చౌదరి బౌండరీ లైన్‌ను తాకాడు.I.C.Y.M.I 𝗣𝗼𝘄𝗲𝗿💪. 𝗣𝗿𝗲𝗰𝗶𝘀𝗶𝗼𝗻👌. 𝗣𝗮𝗻𝗮𝗰𝗵𝗲💥. Priyansh Arya graced the home crowd with his effortless fireworks 🎆Updates ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/7JBcdhok58— IndianPremierLeague (@IPL) April 8, 2025ఆ తర్వాత పదిహేడో ఓవర్‌లో నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో శశాంక్‌ సింగ్‌ ఇచ్చిన సిట్టర్‌ను రచిన్‌ రవీంద్ర డ్రాప్‌ చేశాడు. ఇలా సీఎస్‌కే ఫీల్డింగ్‌ తప్పిదాల వల్ల పంజాబ్‌ బ్యాటర్లు.. ముఖ్యంగా ప్రియాన్ష్‌ చాలాసార్లు లైఫ్‌ పొందాడు. అతడికి తోడుగా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు శశాంక్‌ సింగ్‌ (36 బంతుల్లో 52 నాటౌట్‌), మార్కో యాన్సెన్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌) దుమ్ములేపారు.తప్పని ఓటమిఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమై.. 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్‌కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్‌ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్‌ అవుట్‌), శివం దూబే (27 బంతుల్లో 42) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో ధోని మెరుపు ఇన్నింగ్స్‌ (12 బంతుల్లో 27) ఆడాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) మాత్రం మరోసారి విఫలమయ్యాడు.చదవండి: గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ! Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025

Venkatagiri Municipal Council Motion of no confidence Updates6
వెంకటగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ అవిశ్వాస తీర్మానం.. టీడీపీ కుట్రలు!

సాక్షి, తిరుపతి: నేడు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌కు అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్స్‌ కౌన్సిల్‌ హాల్‌కు బయలుదేరారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నియోజకవర్గ ఇంచార్జ్‌ రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వాహనాలలో 20 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు.ఇక, వెంకటగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ అవిశ్వాస తీర్మానాన్ని గూడూరు సబ్‌కలెక్టర్‌ రాఘవేంద్రమీనన్‌ నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సబ్‌ కలెక్టర్‌తోపాటు గూడూరు డీఎస్పీ గీతాకుమారి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఎలాగైనా ఈ ఎన్నికను వాయిదా వేయించాలని కూటమి నేతలు కుయుక్తులు పన్నుతుండటం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు, వెంకటగిరిలో 25 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ ప్రతినిధులే ఉన్నారు. 20 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ నక్కా భాను ప్రియపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ చేసిన కుట్రను వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు భగ్నం చేయనున్నారు.

Karnataka Yadgir district Village Fears Mangalavaram Ratri Reason Is7
మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట

బెంగళూరు: ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో నిద్రలోకి జారుకుంటారనగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలయం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి.. కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్‌పూర్‌ తాలుకా జాలిబెంచి(Jalibenchi village) అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పిట ఉంచింది. విద్యుత్‌ సరఫరాలో షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలే అందుకు కారణం.విద్యుత్‌ సరఫరాలో కలిగిన అంతరాయం.. ఏకంగా ఒక ఊరినే వణికించింది. మంగళవారం రాత్రి జాలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో కరెంట్‌ వైర్లు ఒకదానికొకటి రాజుకుని.. షార్ట్‌ సర్క్యూట్‌ చోటు చేసుకుంది. అలా మంటలు రాజుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్‌ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జిలు కాలిపోయాయి. సెల్‌ఫోన్లు పేలిపోయాయి. కరెంట్‌ స్తంభాల నుంచి వైర్లు ఇళ్ల పైకప్పుల మీద తెగి పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాలతో భీతిల్లిన ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు.సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్‌ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడపడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అయితే వాళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు.సుమారు వంద ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గులబర్గ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానిక చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లను పునరుద్ధరించే పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంట్‌ సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్‌ అవుతోంది.Shocking, terrible video!!A tragic incident unfolded in Jalibenchi village of Surpur taluk on Tuesday around 6 PM, as powerful winds caused an electricity-related accident, plunging the area into chaos and fear.Cc @OfficialGescom pic.twitter.com/VCQXLqQymW— Nishkama_Karma (@Nishkama_Karma1) April 8, 2025

Telangana BJP MPs Key Meeting Over HCU Land Issue8
కేటీఆర్‌ వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు నేడు సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసంలో వీరంతా సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా హెచ్‌సీయూ భూముల వివాదంపై ఎంపీలు చర్చించనున్నారు.అంతకుముందు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు బీఆర్‌ఎస్‌ పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల, మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌ను కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు.

India China Should Stand Together Against us Tariffs9
ట్రంప్‌ సుంకాలపై భారత్‌- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్‌- చైనా(India-China)లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో తెలియజేశారు. ‘చైనా-భారత్‌ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై(Mutual benefits) ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్‌-చైనా) కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఏప్రిల్ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్‌కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.అయితే భారత్‌.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్‌ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.ఇది ‍కూడా చదవండి: Dominican Republic: నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు

special story on family widows study and empowement10
ఎడబాటు మానసికమా? భౌతికమా?

కాలం మారుతోంది... కాలం మారితే కొత్త ప్రశ్నలు వస్తాయి.భర్త మరణించిన తర్వాత స్త్రీల పట్ల వివక్షాపూరితమైన వ్యవహారశైలిమన దేశంలో అన్ని మతాలలో ఉంది.అయితే ఆ ఎడబాటును మానసికంగా ఉంచుకుంటే చాలదా... భౌతిక ఆనవాళ్లతో వివక్షకు గురవ్వాలా అనే చర్చ ఇప్పుడు మహారాష్ట్రలో నడుస్తోంది. అక్కడి 7000 గ్రామాలు వితంతువులు తాము వితంతువులుగా వెలిబుచ్చే చిహ్నాలతో ఉండాల్సిన పనిలేదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ గ్రామాల సంఖ్య ఇంకా పెరగనుంది.నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చదువుకుంటుంటే అందరూ అభ్యంతర పెట్టారు... వితంతువుకు చదువు ఏంటని. నా వయసు 42. ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయాడు. చదువుకుని టీచర్‌ అయి నా పిల్లలను చూసుకోవాలని నా ప్రయత్నం. అందుకోసం సల్వార్‌ కమీజ్‌ వేసుకుని బయటకు వచ్చినా తప్పే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది’ అంది సోనాలి పాట్‌దర్‌. ఈమెది కొల్హాపూర్‌లోని అంబప్‌ అనే గ్రామం. ఈమే కాదు పశ్చిమ మహారాష్ట్రలోని సుగర్‌ బెల్ట్‌గా చెప్పుకునే ప్రాంతంలో ఒక విప్లవంలా ఉద్యమం రేగి వితంతువులు వివక్ష లేకుండా జీవించే మార్పులు జరుగుతున్నాయి.గ్రామాలే మారాలి... మారాయిమన దేశంలో గ్రామాల్లోనే పట్టింపు ఎక్కువ. ముఖ్యంగా వితంతువులకు గ్రామాల్లో ఎక్కడా లేని అనాదరణ ఉంటుంది. వాళ్లు బొట్టు, గాజులు, పూలు పెట్టుకోకూడదు. మంగళసూత్రం వేసుకోకూడదు. శుభకార్యాలకు రాకూడదు. కొన్నిచోట్లయితే గణేశ్‌ ఉత్సవాలకు వచ్చినా ఊరుకోరు. వీరిని పనిలో కూడా పెట్టుకోరు. కొన్ని ఇళ్లల్లో వీరు రావాల్సిన ఆస్తి రాక అవస్థలు పడుతుంటారు. వితంతువులు కావడం వారి తప్పా? భర్త చన΄పోయిన బాధ ఒకవైపు... బయట సమాజం నుంచి వచ్చే బాధలు మరోవైపు. తమ బాధ మానసికంగా ఉంచుకుని బయట మామూలు జీవితం గడిపే హక్కు తమకు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.2022లో మొదలైన ఉద్యమంమహారాష్ట్రలో పేరు పొందిన ప్రమోద్‌ జింజడే అనే సామాజిక కార్యకర్త పల్లెల్లో వితంతు స్త్రీలకు జరిగే అన్యాయాన్ని ఒకరోజు గమనించాడు. ‘భర్త చనిపోయాక ఒక స్త్రీ అతని గుర్తుగా బొట్టూ గాజులు ఉంచుకుంటానని బతిమిలాడుతుంటే సాటి స్త్రీలు వాటిని తొలగించడం చూశాను’ అన్నాడాయన. 2022లో ఒక అర్ధరాత్రి ఆయనకు సుస్తీ చేసింది. ప్రాణంపోపోయే స్థితి. కాని బయటపడ్డాడు. ఆయన ‘కర్మలా’ అనే ఊరిలో ఉంటాడు. వెంటనే ఆయన కర్మలా తాసిల్దార్‌ దగ్గరకు వెళ్లి ఒక అఫిడవిట్‌ సబ్మిట్‌ చేశాడు. ‘నేను చనిపోతే నా భార్య వొంటి మీద బొట్టు గాజులు మంగళసూత్రం తీసే హక్కు ఎవరికీ ఉండకూడదు. అలా చేసినవారిని చట్టపరంగా శిక్షించాలి’ అని ఆ అఫిడవిట్‌ సారాంశం. అక్కడున్న వారు ప్రమోద్‌కు పిచ్చెక్కిందనుకున్నా క్రమంగా ఈ సంగతి ప్రచారం పొందింది. మే 2022లో ఈ ఘటన జరిగితే వెంటనే ‘హెర్వాడ్‌’ అనే పల్లె నుంచి ఈ ఉద్యమం మొదలైంది.ముక్తి పొందిన 7,683 గ్రామాలుమహారాష్ట్రలో ఇప్పటికి 7,683 గ్రామాలు, 1,182 మునిసిపల్‌ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపం అని తీర్మానాలు చేశాయి. వితంతువులు తమకు నచ్చిన ఆహార్యంతో ఉండవచ్చని, అన్ని చోట్లకు రాక΄ోకలు సాగించవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని అవి వారిని ్ర΄ోత్సహించడానికి ముందుకొచ్చాయి. కొన్నిచోట్ల ఆగస్టు పదిహేనున వితంతువులతో జెండా వందనం కూడా చేయిస్తూ ఉన్నారు. ‘ఈ ఉద్యమం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పాకుతోంది. ముందుగా గోవా అందుకుంది’ అని ఉద్యమకారులు అంటున్నారు. భర్త చనిపోయాక నిరాశ నిస్పృహల్లో ఉన్న స్త్రీలకు సమాజమే బాసట. దాని నుంచి వందల ఏళ్లుగా ఎదుర్కొంటున్న వివక్షతో ఎంత మంది స్త్రీలు కుమిలిపోయి ఉంటారో అర్థం చేసుకుంటే ఈ ఉద్యమం అవసరం తెలిసి వస్తుందని ఈ ఉద్యమకారుల వాదన. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. 78 శాతం గురించి ఆలోచించాలిమన దేశంలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి సంఖ్య సుమారు ఐదున్నర కోట్లు ఉంది. వీరిలో 78 శాతం స్త్రీలు. వీరిలో 32 శాతం సగటున 40 ఏళ్ల వయసున్న వారు. ఈ వయసు స్త్రీలు ఇందరు వివక్షను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లలేక΄ోతే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది. బహుశా ఈ స్త్రీలే తమ ఆకాంక్షలను సమాజానికి మరింత గట్టిగా తెలియ చేస్తారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement