aarogya setu
-
నకిలీ ఎస్ఎంఎస్.. హానికరమైన యాప్
న్యూఢిల్లీ: కరోనా టీకా పొందాలంటే కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేర్లు, వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే, పేర్ల రిజిస్ట్రేషన్ కోసమంటూ హానికరమైన యాప్‌ను సూచిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ ఒకటి సర్క్యులేట్ అవుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) సూచించింది. ఇలాంటి యాప్‌లను ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే ప్రమా దమని హెచ్చరించింది. నకిలీ ఎస్ఎంఎస్లో ఒక లింక్‌ను సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారని, దానిపై క్లిక్ చేస్తే హానికరమైన యాప్ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో ఇన్స్టాల్ అవుతుందని తెలిపింది. అనంతరం బాధితుల ఫోన్లలోని కాంటాక్టులన్నింటికీ దానంతట అదే ఎస్ఎంఎస్ రూపంలో చేరుతుందని పేర్కొంది. ఈ యాప్ ఫోన్లలో ఉంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడం ఖాయమంది. Covid19. apk;Vaci&&Regis.apk; MyVaccin&v2. apk;Cov&Regis.apk; Vccin&Apply.apk. అనే లింక్‌లను సూచిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ వస్తున్నట్లు వెల్లడించింది. కేవలం http:// cowin.gov. in అనే అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. -
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏమి చేయాలి?
న్యూఢిల్లీ: 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టీకా తీసుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం నిన్న ప్రారంభించింది. రిజిస్టర్డ్ చేసుకున్న లబ్ధిదారులకు టీకాలు వేయడం మే 1 నుంచి ప్రారంభంకానుంది. ఇంకా కోవిడ్ టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోక పోతే కోవిన్ ఆన్లైన్ పోర్టల్(cowin.gov.in), ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. కోవిడ్-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించిన రోజున 1.32 కోట్లకు పైగా ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఏమి చేయాలి? కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారుడు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నిర్ణీత తేదీ, ప్రదేశం, టీకా వేసుకునే సమయం గురించి మీ మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ లో తెలిపిన తేదీ నాడు టీకా కేంద్రాల దగ్గరకు వెళ్లేటప్పుడు మీరు ఫోటో ఐడీని, పోర్టల్ లేదా యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న రశీదును మీ వెంట తీసుకొని వెళ్లాలి. కోవిడ్ -19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత, లబ్ధిదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. వ్యాక్సిన్ అన్ని డోస్ లు తీసుకున్న తర్వాత, లబ్ధిదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు క్యూఆర్ కోడ్ ఆధారిత సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికెట్‌ను డిజి-లాకర్లో భద్రపరుచుకోవచ్చు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించి నలుగురు వ్యక్తులు కోవిడ్ -19 టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. మీరు ఉమ్మడి టీకా కోసం నమోదు చేసుకుంటే, వేర్వేరు వయసుల క్రిందకు వచ్చే టీకాలు పొందాలనుకునే వారు, అంటే 45 కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ(18-44 వయస్సు) గల వారు, మీరు మీ టీకా కేంద్రాన్ని జాగ్రత్తగా ఎన్నుకోవాలి. కేంద్ర ప్రభుత్వం టీకా కేంద్రాల వద్ద 45 ఏళ్లు పైబడిన లబ్ధిదారులకు మాత్రమే టీకాలు వేస్తుంది. మిగతా వారికీ మే 1 నుంచి అనేక రాష్ట్రాలు టీకా కేంద్రాలలో ఉచిత టీకాలు వేస్తున్నట్లు ప్రకటించాయి. మీ రాస్ట్రంలో అలాంటి ప్రభుత్వ టీకా కేంద్రం లేకపోతే, మీరు ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బులు చెల్లించి టీకాల కోసం వేసుకోవాల్సి ఉంటుంది. చదవండి: భారీగా బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా? -
దేశంలో మూడోదశ వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్లు మొదలు
-
Cowin, Arogya Setu: కరోనా వ్యాక్సినేషన్ యాప్, పోర్టల్ క్రాష్!
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశ ఎదురైంది. దేశంలో కరోనా బారిన పడుతున్న కేసులలో యువత, మధ్య వయస్సు గలవారు వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో 18-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి టీకా రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం అవకాశం కల్పించింది. అయితే నేడు సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిన్ యాప్-పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ ల సర్వర్లు అన్నీ క్రాష్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించంగా సర్వర్ క్రాష్ అయ్యింది. సర్వర్లు క్రాష్ అవుతున్నాయని వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వినియోగదారులు లాగిన్ అవ్వడానికి అవసరమైన వన్ టైమ్ పాస్వర్డ్(OTP) కూడా రావడం లేదని ఫిర్యాదు చేశారు. అధిక సర్వర్ లోడ్ కారణంగా సాయంత్రం 4 గంటలకు కోవిన్ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఒకే సమయంలో భారీగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
వ్యాక్సిన్ కోసం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కోసం భారతదేశం యువత ఎదురుచూస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా బారిన పడుతున్న కేసులలో యువత, మధ్య వయస్సు గలవారు వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కోవిడ్-19 వల్ల మరణిస్తున్న వారిలో సైతం 20 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారే అధికంగా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైడిన అందరికీ దేశ వ్యాప్తంగా కరోనా టీకాలకు అర్హులుగా ప్రకటించింది. నేటి(ఏప్రిల్ 28) నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచే చాలా మంది యువత కోవిన్ యాప్, వెబ్సైట్లలో కోవిడ్19 టీకా రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తొలుత రిజిస్ట్రేషన్ సమయం చెప్పకపోవడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 28న(బుధవారం) సాయంత్రం 4 గంటల నుంచి కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ లలో కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సేతు అదికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన వారికి దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు మే 1 నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్19 టీకాల కోసం కొవిన్ యాప్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ ల ద్వారా ఆసక్తిగల వారు కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. Registration for 18 plus to begin on https://t.co/S3pUooMbXX, Aarogya Setu App & UMANG App at 4 PM on 28th April. Appointments at State Govt centers & Private centers depending on how many vaccination centers are ready on 1st May for Vaccination of 18 plus. #LargestVaccineDrive — Aarogya Setu (@SetuAarogya) April 28, 2021 చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టీకా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మే 1వ తేదీ నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. టీకా డోసు కోసం అపాయింట్మెంట్ పొందడానికి కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల సెంటర్ల వద్ద రద్దీని అరికట్టడానికే రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. అయితే, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి వ్యాక్సినేషన్ యథాతథంగా కొనసాగుతుందని, వారు నేరుగా వ్యాక్సిన్ కేంద్రానికి చేరుకొని, అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా వేయించుకోవచ్చని అధికారులు సూచించారు. 18–44 ఏళ్ల వయసున్న వారికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 28 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ లేకుండా టీకా కోసం వస్తే అనుమతించరు. 18–44 ఏళ్లలోపు వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా టీకా కోసం ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి, వాటి ధర ఎంత అనే వివరాలను మే 1 నుంచి కోవిన్ పోర్టల్‌లో పొందుపరుస్తారు. అపాయింట్మెంట్ పొందే సమయంలో ఇష్టమైన టీకాను ఎంచుకోవచ్చు. 18–44 ఏళ్ల వయసువారు నిర్ణీత రుసుము చెల్లించి ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో(సీవీసీ) టీకా వేయించుకోవచ్చు. కోవిషీల్డ్ ఒక్కో డోసును రాష్ట్రాలకు రూ.400, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600 చొప్పున ధరకు విక్రయిస్తామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక కోవాగ్జిన్ డోసును రాష్ట్రాలకు రూ.600, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1,200 చొప్పున ధరకు అమ్ముతామని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. వయల్‌లో టీకా మిగిలిపోతే.. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల రకాలు, వాటి ధరలు, నిల్వల సమాచారాన్ని ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాలు కోవిన్ పోర్టల్‌లో ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా అపాయింట్మెంట్ పొందినవారికే టీకా ఇవ్వాలని ప్రైవేట్ సీవీసీలకు సూచించారు. ఒక రోజులో చివరగా తెరిచిన సీసా(వయల్)లో ఇంకా డోసులు మిగిలిపోతే ఆన్సైట్ రిజిస్ట్రేషన్/అపాయింట్మెంట్లకు అనుమతి ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. ఎంతో విలువైన టీకా వృథాను కనిష్ట స్థాయికి తగ్గించాలన్నారు. -
వ్యాక్సిన్ కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకోవాలంటే కచ్చితంగా కోవిన్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారు కొవిన్ వెబ్‌పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. కానీ, వారు ఆధార్ కార్డుతో నేరుగా వాక్సినేషన్ కేంద్రానికి వెళ్లినా వైద్య సిబ్బంది పేరు, వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ ఇస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ కేసుల భాగ పెరుగుతున్న నేపథ్యంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ మే 1 నుంచి టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాక్సిన్ కు డిమాండ్ పెరగడం వల్ల వాక్సినేషన్ కేంద్రల వద్ద జనాభా తాకిడి ఎక్కువవుతుంది కాబట్టి కోవిన్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసినట్లు ఒక అధికారి పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28 నుంచి కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్‌లో ప్రారంభమవుతుంది. మరోవైపు వ్యాక్సిన్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ప్రకటించగా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్లు స్పష్టం చేశాయి. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి
కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభమయ్యింది. అర్హులు టీకా తీసుకోవాలంటే ముందుగా కో–విన్ 2.0 పోర్టల్ (http://cowin.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని, అపాయింట్మెంట్ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. 1. పోర్టల్‌లో మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. 2. ఫోన్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్ నొక్కాలి. 3. రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీలోకి ప్రవేశిస్తారు. 4. పేరు, వయసు వంటి వివరాలతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాలి. 5. ఒకవేళ 45 నుంచి 59 ఏళ్ల వయసుండి, వ్యాధులతో బాధపడుతూ ఉంటే గుర్తింపు కార్డుతోపాటు ఆర్ఎంపీ సంతకం చేసిన సంబంధిత ధ్రువపత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 6. రిజిస్ట్రేషన్ బటన్ నొక్కాలి. 7. ఇప్పుడు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. 8. ఒకే ఫోన్ నంబర్‌తో ఒక్కరి కంటే ఎక్కువ మంది(గరిష్టంగా నలుగురు) రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ‘యాడ్ మోర్’ ఆప్షన్ ఎంచుకోవాలి. వారి వివరాలు నమోదు చేయాలి. 9. ‘షెడ్యూల్ అపాయింట్మెంట్’ బటన్ నొక్కాలి. 10. రాష్ట్రాలు, జిల్లాల వారీగా టీకా అందజేసే వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారంతోపాటు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్లాట్లు తేదీలు, సమయం వారీగా కనిపిస్తాయి. 11. ఒక స్లాట్‌ను ఎంచుకొని, ‘బుక్’ బటన్‌పై నొక్కాలి. 12. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్తో కూడిన సందేశం ఫోన్‌కు వస్తుంది. 13. వ్యాక్సినేషన్ కంటే ముందు వరకూ అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే తేదీ, సమయం మార్చుకోవచ్చు. ఇందుకోసం అదే ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లో మళ్లీ లాగిన్ కావాలి. 14. టీకా తీసుకున్న తర్వాత రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీనిద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా... కరోనా టీకా తీసుకోవడానికి ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా అపాయింట్మెంట్ పొందవచ్చు. 1. మొబైల్ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. 2. యాప్ ఓపెన్ చేసి, కో–విన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. 3. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. 4. ఫోన్ నెంబర్, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరిఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 5. రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీలోకి వెళ్లాలి. దీనితర్వాత కో–విన్ 2.0 పోర్టల్‌లోని ప్రక్రియనే యథాతథంగా అనుసరిస్తూ ముందుకెళ్లాలి. పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ కో–విన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘‘కరోనా టీకా కోసం కో–విన్ పోర్టల్ (www.cowin.gov. in) ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ పొందాలి. రిజిస్ట్రేషన్ల కోసం కో–విన్ యాప్ అంటూ ఏదీ లేదు. ప్లేస్టోర్‌లో ఉన్న కో–విన్ యాప్ కేవలం అడ్మినిస్ట్రేటర్ల కోసమే. పోర్టల్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టీకా తీసుకునే సమయం వరకూ లబ్ధిదారులు పోర్టల్‌లో నమోదు చేసిన వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు, తొలగింవచ్చు. టీకా తీసుకున్న తర్వాత రికార్డు మొత్తం లాక్ అవుతుంది. వివరాలను మార్చడానికి వీలుండదు’’ అని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. -
ఆరోగ్య సేతుని ఎవరు క్రియేట్ చేశారు?
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్, శానిటైజర్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ కూడా తప్పనసరిగా మారింది. మిలియన్ల మంది భారతీయులు తమ మొబైల్ ఫోన్లలో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారనే ప్రశ్న తలెత్తింది. అయితే ఆరోగ్య సేతు వెబ్సైట్లో దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిందని చూపెడుతుంది. అయితే ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా ఈ రెండు శాఖలు యాప్‌ని ఎవరు సృష్టించారో తెలియదనే సమాచారం ఇచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర సమాచార కమిషన్ యాప్‌ని ఎవరు సృష్టించారనే దానిపై "తప్పించుకునే సమాధానాలు" ఇవ్వడంతో ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అధికారులు సమాచారాన్ని తిరస్కరించడాన్ని అంగీకరించము అని స్పష్టం చేసింది. ‘యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారు.. ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి సంబంధిత శాఖ అధికారులు ఎవరూ వివరించలేకపోయారు. ఇది సరైన పద్దతి కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత విభాగాలు నవంబర్ 24న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించిది. (చదవండి: ఆరోగ్య సేతుకు మరో ఘనత) ఆరోగ్య సేతు యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారనే విషయం తెలుసుకోవడం కోసం సౌరవ్ దాస్ అనే కార్యకర్త ప్రయత్నం చేశాడు. యాప్ ప్రతిపాదన మూలం, దాని ఆమోదం వివరాలు, పాల్గొన్న కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వ విభాగాలు, యాప్‌ని అభివృద్ధి చేయడంలో పాల్గొన్న ప్రైవేట్ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ల కాపీలు వంటి వివరాలను ఆయన అడిగారు. రెండు నెలల పాటు ఇది వివిధ విభగాలలో చక్కర్లు కొట్టింది కానీ సరైన సమాధానం మాత్రం లభించలేదు. దాంతో యాప్ క్రియేషన్ గురించి సమాచారం ఇవ్వడంలో వివిధ మంత్రిత్వ శాఖలు విఫలమయ్యాయని సౌరవ్ దాస్ సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీఐ పరిధిలోకి ‘సీజేఐ’) నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ "యాప్ సృష్టికి సంబంధించిన మొత్తం ఫైల్ ఎన్ఐసీ వద్ద లేదు" అని తెలిపింది. ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ప్రశ్నను జాతీయ ఇ-గవర్నెన్స్ విభాగానికి బదిలీ చేసింది. అది "కోరిన సమాచారం (మా విభాగానికి) సంబంధించినది కాదు" తెలిపింది. ఈ క్రమంలో ఆర్టీఐ బాడీ.. చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగానికి షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. తప్పించుకునే సమాధానం ఇస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని కమిషన్ తన నోటీసులో కోరింది. -
‘ఆరోగ్యసేతు తప్పనిసరి కాదు’
శివాజీనగర: స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ లేదనే కారణంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అనుబంధ సంస్థలు ప్రజలకు సేవలను నిరాకరించటానికి లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది. కరోనా వైరస్ బాధితులపై నిఘా పెట్టే ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌ను ప్రజలు స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని ఉండాలని రైల్వే, మెట్రోరైల్, ఆర్టీసీ వంటి పలు ప్రభుత్వ సంస్థలు షరతును విధించాయి. అరవింద్ అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. కోర్టు స్పందిస్తూ ఆరోగ్యసేతు తప్పనిసరి కాదని పేర్కొంటూ, కేంద్రానికి అభ్యంతరాల దాఖలుకు అవకాశమిస్తూ విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది. చదవండి: ఆరోగ్య సేతులో మరో కొత్త ఫీచర్ -
షూటింగ్స్ ప్రారంభించుకోండి!
కరోనా వల్ల ఏర్పడ్డ అనిశ్చితి అలానే ఉంది. సినిమా షూటింగ్స్ పరిస్థితి అయోమయంగా మారింది. ఒకటీ అరా తప్పిస్తే పెద్దగా షూటింగ్స్ జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ చాలా వరకూ సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతి ప్రకటించాయి. తాజాగా కేంద్రప్రభుత్వం కూడా సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆరోగ్య శాఖ సూచనల మేరకు కొన్ని గైడ్ లైన్స్ కూడా తయారు చేసింది. ఆ గైడ్ లైన్స్ ఈ విధంగా.. ► కెమెరా ముందు ఉన్నప్పుడు తప్ప నటీనటులతో సహా సెట్లో ఉండే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ► కాస్ట్యూమ్స్, విగ్, మేకప్ సామాన్లు ఒకరివి ఒకరికి వాడటం వీలైనంత తగ్గించేయాలి. ► చిత్రీకరణకు సంబంధించిన ప్రదేశాల్లో (కెమెరా ముందు కాకుండా) ఆరు అడుగులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ► సెట్లో వీలైనన్ని చోట్ల హ్యాండ్ వాష్ చేసుకునే ఏర్పాటు చేయాలి. పని ప్రదేశాల్లో ఉమ్మేయడం నిషేధం. ► ఆరోగ్య సేతు యాప్‌ను (కోవిడ్ సోకిన వారికి మనం ఎంత దగ్గర/దూరంలో ఉన్నామో తెలియజేసే ప్రభుత్వం యాప్) అందరూ ఉపయోగించేలా చేయాలి. ► మెడికల్ టీమ్‌ను అందుబాటులో ఉంచాలి. మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్స్, బాత్రూమ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► సెట్లో అడుగుపెట్టే చోట థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. కోవిడ్ లక్షణాలున్న వారిని అనుమతించకూడదు. ► పార్కింగ్ ప్రదేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడ కూడా వీలైనంత దూరం పాటించగలిగేలా చూసుకోవాలి. ► వీలైతే కోవిడ్ జాగ్రత్తలను తెలిపే పోస్టర్లు, వీడియోలను ఏవీలు రూపంలో ప్రదర్శించగలగాలి. ► పని చేసిన ప్రదేశంలో ఎవరికైనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే వెంటనే శానిటైజ్ చేయాలి. ► అనారోగ్యం అనిపిస్తే వెంటనే టీమ్‌కు త్వరగా రిపోర్ట్ చేయాలి. అశ్రద్ధ చేయకూడదు. ► లొకేషన్లో తక్కువ మంది ఉండేలా చూసుకోవాలి. విజిటర్స్‌ను, ఆడియన్స్‌ను లొకేషన్లోకి అనుమతించకూడదు. ► స్టూడియోల్లో ఒకేసారి రెండు మూడు సినిమా యూనిట్లు ప్యాకప్ చెప్పకుండా టైమింగ్స్ విషయంలో జాగ్రత్తలుపడాలి. ► సినిమా పరికరాల్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ గ్లౌజ్ ధరించాలి. మేకప్ ఆర్టిస్ట్‌లు, హైయిర్ డ్రెస్సర్లు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలి. ‘‘ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని, ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వాళ్లు హర్షిస్తారని అనుకుంటున్నాం. సినిమా అనేది ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనది. అలానే సినిమా ఎంతో మందికి ఉపాధి కలిగిస్తుంది. సినిమా నిర్మాణం అనేది పెద్ద వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ తిరిగి పుంజుకోవాలి, ఎప్పటిలానే మళ్లీ పరిగెత్తాలని షూటింగులకు ప్రభుత్వం అనుమతించింది’’ అన్నారు సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. -
ఆరోగ్య సేతులో మరో కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా సోకకుండా జాగ్రత్త పడేందుకు సాయం చేసే కోవిడ్ ట్రేసింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో వ్యాపార సంస్థల కార్యకలాపాలు సులభతరం చేసేలా ‘‘ఓపెన్ ఏపీఐ సర్వీస్’’ను తీసుకువచ్చింది. దీని ద్వారా వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు, ఈ యాప్‌ను ఉపయోగించే ఇతర యూజర్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలు కల్పించింది. అయితే ఇందుకు సదరు యూజర్ల అంగీకారం తప్పనిసరి అని, దీని ద్వారా ఆరోగ్య సేతు యాప్ యూజర్ల డేటా, గోప్యతకు ఎలాంటి భంగం కలగబోదని స్పష్టం చేసింది. (ఆరోగ్య సేతు: మీ అకౌంట్ డిలీట్ చేయాలా..) అదే విధంగా ఇందులో కేవలం ఆరోగ్య సేతు స్టేటస్, యూజర్ పేరు తప్ప మరే ఇతర వివరాలు ఉండవని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రాణాంతక కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 30 వేల పాజిటివ్ కేసులను ట్రేస్ చేసినట్లు సమాచారం. దీంతో కరోనా బాధితులను గుర్తించడంతో పాటు వారిని అప్రమత్తం చేసి తగిన చికిత్స అందించడం ఆరోగ్య కార్యకర్తలకు తేలికైంది. ఇక ఆరోగ్య సేతు యాప్‌నకు సుమారు 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.(ఆరోగ్య సేతు: ప్రపంచంలోనే అధిక డౌన్లోడ్లు) అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు వద్దు: కేంద్రం -
తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉన్న వైష్ణోదేవి ఆలయం ఆదివారం నుంచి తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 18న ఆలయం మూతబడగా, దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకోనుంది. మొదటి వారంలో రోజుకు 2,000 మందిని మాత్రమే అనుమతించనున్నామని ఆలయాధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. వారిలో 1,900 మందిని జమ్మూకశ్మీర్ నుంచి మరో 100 మందిని బయట రాష్ట్రాల నుంచి అనుమతిస్తామని చెప్పారు. సందర్శకులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టంచేశారు. ఫేస్ మాస్క్, ఫేస్ కవర్ తప్పనిసరి అని చెప్పారు. వచ్చేవారంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలన్నారు. -
జిమ్స్ రీ ఓపెన్.. కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేకుందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నెల 5 నుంచి వీటిని తిరిగి ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ మేరకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. జిమ్ ట్రైనర్లు, సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తెలిపింది. మాస్క్ తప్పక ధరించాలని.. అంతేకాక జిమ్‌కు వచ్చే ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. అయితే కంటైన్మెంట్ జోన్లలోని యోగా ఇనిస్టిట్యూట్లు, జిమ్‌లు తెరిచేందుకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అంతేకాక స్పాలు, స్మిమ్మింగ్ ఫూల్లు తెరవడానికి కూడా అనుమతిలేదు. జిమ్‌లు తెరుస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి... (లాక్డౌన్ ఎఫెక్ట్.. శరీరం సహకరించడం లేదు) 1. 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు మూసివేసిన ప్రదేశాలలోని జిమ్‌లను ఉపయోగించవద్దని కోరింది. 2. జిమ్ సెంటర్లలో అన్ని వేళలా ఫేస్ కవర్, మాస్క్ తప్పనిసరి. కానీ వ్యాయామం చేసేటప్పుడు, మాస్క్ వాడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది కనుక విజర్ మాత్రమే ఉపయోగించవచ్చు. 3. ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. 4. యోగా సెంటర్, జిమ్‌లో వ్యక్తుల మధ్య నాలుగు మీటర్ల దూరం ఉండాలి. పరికరాలను ఆరు అడుగుల దూరంలో ఉంచాలి. సాధ్యమైతే వాటిని ఆరుబయట ఉంచాలి. 5. గోడలపై సరైన గుర్తులతో భవనంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి నిర్దిష్ట మార్గాలను ఏర్పాటు చేయాలి. 6. ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ కోసం, ఉష్ణోగ్రతను 24-30 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంచాలి. వీలైనంతవరకు తాజా గాలిని తీసుకోవాలి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జిమ్, యోగా సెంటర్ గేట్లలో శానిటైజర్ డిస్పెన్సర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు తప్పనిసరిల. సిబ్బందితో సహా కరోనా లక్షణాలు లేని వ్యక్తులు మాత్రమే జిమ్‌లోనికి అనుమతించబడతారు. -
విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. ఆగస్ట్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఆ వివరాలు.. ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా www.newdelhiairport.in లో 7 రోజుల పాటు పెయిడ్ ఇన్సిట్యూషనల్ క్వారంటైన్లో, 7 రోజులు హోం క్వారంటైన్లోఉంటామని అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ► కుటుంబంలో ఎవరైనా చనిపోయినవారు, వృద్ధులు, సీరియస్ వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలున్నవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండవచ్చు. అయితే, వారు బోర్డింగ్‌కు మూడు రోజుల ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ► ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చినవారు కూడా ఆ డాక్యుమెంట్ చూపించి, 14 రోజుల హోం క్వారంటైన్ అవకాశం పొందవచ్చు. ఆ పరీక్ష బోర్డింగ్‌కు గరిష్టంగా నాలుగు రోజుల లోపు జరిపి ఉండాలి. ► అంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఎలాంటి కోవిడ్–19 లక్షణాలు లేనివారినే బోర్డింగ్‌కు అనుమతిస్తారు. ► భూ సరిహద్దుల ద్వారా వచ్చేవారు కూడా పై నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ► ప్రయాణంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్క్, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర నిబంధనలు పాటించాలి. ► ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్–19 లక్షణాలు కనిపిస్తే.. వారిని ఫ్లైట్/షిప్ గమ్యస్థానం చేరిన వెంటనే కోవిడ్ స్పెషల్ హెల్త్ సెంటర్లకు తరలించి, చికిత్స అందిస్తారు. -
ఆరోగ్య సేతుకు మరో ఘనత
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా రక్కసి నుంచి కాపాడుకునేందుకు సాయం చేసే ఆరోగ్య సేతు యాప్ మరో ఘనత సాధించింది. ఏప్రిల్‌లో 80 మిలియన్లుగా ఉన్న డౌన్లోడ్ల సంఖ్య జూలై నాటికి 127.6 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అధికంగా డౌన్లోడ్ చేసుకున్న కోవిడ్ ట్రాకింగ్ యాప్‌గా నిలిచింది. ఆరోగ్య సేతు.. కరోనా తాజా సమాచారంతోపాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలను అందిస్తూ, చుట్టుపక్కల కరోనా రోగులుంటే అలర్ట్ చేస్తుంది. ఈ యాప్‌ని ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయగా కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఏప్రిల్ 28 నాటికి ఈ సంఖ్య 75 మిలియన్లు దాటింది. మే 6 వరకు ఈ సంఖ్య 90 మిలియన్లను అధిగమించింది. జూలైలో 127 మిలియన్ల మైలురాయిని దాటేసింది. (ప్రతి ఉద్యోగి చేతిలో ఆరోగ్యసేతు) అయితే జనాభా పరంగా ఈ యాప్ వినియోగంలో భారత్ నాల్గవ స్థానంలో ఉందని అంతర్జాతీయంగా యాప్‌ల డౌన్లోడ్స్, వాటి ర్యాంకింగ్‌లను విశ్లేషించే సెన్సర్ టవర్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య సేతును దేశ జనాభాలో 12.5 శాతం మంది మాత్రమే వినియోగిస్తుండటంతో భారత్ 4వ స్థానానికే పరిమితమైందని తెలిపింది. ఆస్ట్రేలియాలో కోవిడ్ భద్రత కోసం ప్రవేశపెట్టిన 'కోవిడ్ సేఫ్' యాప్‌ను అక్కడి 21 శాతం జనాభా డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని పేర్కొంది. దీంతో కోవిడ్ ట్రాకింగ్ యాప్‌కు అత్యధిక ఆదరణ కలిగిన దేశంగా ఆస్ట్రేలియా ప్రథమ స్థానంలో ఉంది. కాగా భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు ఆరోగ్య సేతు వంటి ఇతర యాప్‌లను వృద్ధి చేయడంతో అక్కడి జనాభా స్థానిక యాప్‌లను వినియోగిస్తోంది. ఇది ఆరోగ్య సేతు డౌన్లోడ్ల సంఖ్యను, వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది. (సాహో.. ఆరోగ్య సేతు..!) -
ఆరోగ్య సేతు: మీ అకౌంట్ డిలీట్ చేయాలా..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం తీసుకు వచ్చిన ఆరోగ్య సేతు యాప్‌లో వినియోగదారులు తమ అకౌంట్‌ను తొలగించేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. అంతేగాక ఆరోగ్య సేతు యాప్‌లో వినియోగదారుని మొత్తం డేటాను కూడా డిలీట్ చేసేందుకు అనుమతిచ్చింది. అకౌంట్ డిలీట్ చేసిన 30 రోజులకు యాప్ నుంచి డేటా తొలగించడతుంది. అయితే అకౌంట్‌ను తొలగించడం వలన కేవలం ఫోన్ నుంచి మాత్రమే డేటా డిలీట్ అవుతుంది. ఇది ప్రభుత్వ సర్వర్ల నుంచి తీసివేసే వరకు వేచి ఉండాల్సిందే. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత యాజమానులకు) కాగా ఆరోగ్య సేతులో వినియోగదారుడు తనకు కరోనా సోకిందా అన్న విషయంతోపాటు చుట్టుపక్కల కరోనా రోగి ఉన్నట్లయితే ఆ విషయాన్ని కూడా తెలుసుకునేందుకు దోహదపడుతుంది. జీపీఎస్, బ్లూటూత్‌లో రూపొందించిన ఈ కరోనా ట్రాకింగ్ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇటీవల బ్లూటూత్ కాంటాక్ట్స్ ఆధారంగా ప్రమాద స్థాయిని అంచనా వేసే లక్షణాన్ని కూడా ఆరోగ్యా సేతు డెవలపర్లు పొందుపరిచారు. తాజాగా ఆరోగ్య సేతులో హెల్త్ డేటాను ఇతర హెల్త్ యాప్‌లలో షేర్ చేసేందుకు కొత్త అప్డేట్ను తీసుకువచ్చింది. అయితే ఈ మార్పులన్నీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఓఎస్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని త్వరలో పొందనున్నారు. (సాహో.. ఆరోగ్య సేతు..!) అకౌంట్ డిలీట్ చేసే విధానం యాప్‌లో ఎడమవైపు ఉన్న యూజర్ ఐకాన్‌ను క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్‌ను రూపొందించడం. స్కాన్ చేయడం, ప్రభుత్వంతో డేటాను భాగస్వామ్యం చేయడం, కాల్ హెల్ప్‌లైన్ (1075), సెట్టింగ్ ఆప్షన్లు కన్పిస్తాయి. వీటిలో సెట్టింగ్‌ను క్లిక్ చేసి డిలీట్ మై అకౌంట్‌పై నొక్కాలి. అప్పుడు అకౌంట్‌ను డిలీట్ చేస్తే ఏం అవుతుందో చూపిస్తుంది. దాన్ని ఓకే చేసి మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీంతో యాప్‌లో మీ అకౌంట్ డిలీట్ అవుతోంది. (ఆరోగ్య సేతు ఉంటేనే ఏపీ సచివాలయంలోకి..) -
బాధ్యతతో వ్యవహరించండి: మహేశ్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదని పేర్కొంటున్నారు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు. కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న వేళ అనేక రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. అంతేకాకుండా పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించే ఆలోచనలో ఉన్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను మహేశ్ బాబు మరోసారి అప్రమత్తం చేశారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత పాజిటివ్‌ల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కఠిన సమయంలో ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని మహేశ్ విజ్ఞప్తి చేశారు. (100 రోజుల లాక్డౌన్.. ఏం జరిగింది?) ‘లాక్డౌన్ సడలింపులు తర్వాత కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మనల్ని, మన కుటుంబాల్ని, మన చుట్టు పక్కల ప్రజలను రక్షించుకునే సమయమిది. బయటకు వెళ్లేటప్పుడు తప్పుకుండా మాస్క్ ధరించండి. భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం సూచించిన అన్ని భద్రతా ప్రమాణాలను పాటించండి. అదేవిధంగా ప్రతీ ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించండి. ఇప్పటివరకు ఎవరైన ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మన చుట్టుపక్కల నమోదయ్యే కరోనా కేసులను సూచిస్తూ ఈ యాప్ మనల్ని అప్రమత్తం చేస్తుంది. అంతేకాకుండా అత్యవసర వైద్య సదుపాయాలను కూడా ఆరోగ్యసేతు ద్వారా పొందవచ్చు. అందరూ సురక్షితంగా ఉండండి, బాధ్యతతో వ్యవహరించండి. త్వరలోనే మంచి రోజులు వస్తాయి’ అంటూ మహేశ్ పోస్ట్ చేశాడు. (మహారాష్టలో జూలై 31 వరకూ లాక్డౌన్) ఇక దేశంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మహేశ్ పలు పోస్టులు చేసిన విషయం తెలిసిందే. అనేక సలహాలు ఇస్తూనే ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ కష్టకాలంలో విశేష సేవలందిస్తున్న కరోనా ఫ్రంట్ వారియర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినప్పటికీ ముందు నుంచి షూటింగ్‌లు వద్దని మహేశ్ బాబు వారిస్తునే ఉన్నారు. ఇక తన సినిమా షూటింగ్‌లు కూడా ఇప్పట్లో మొదలు పెట్టడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిర్మాతలకు కూడా తెలిపారని సమాచారం. (మీ త్యాగం అర్థం చేసుకోగలం: మహేశ్) View this post on Instagram Since the lockdown was eased, the cases seem to be going up. It's time we protect ourselves and the people around us. Always wear a mask when stepping out. Be aware of your surroundings, maintain social distancing and follow all the safety measures. Also, download the Aarogya Setu app if you haven't as yet. This will help you track positive cases and alerts you if you are in close proximity to anyone who is covid positive! It also makes access to healthcare and emergency services easier. Let’s all be safe, be aware and be responsible!! A post shared by Mahesh Babu (@urstrulymahesh) on Jun 29, 2020 at 2:47am PDT -
ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం విధించిన ఐదవ దశ లాక్‌డౌన్‌ను జూన్ 8వ తేదీ నుంచి సడలించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఉద్యోగులు చేత అమలు చేయించాల్సిన బాధ్యతను యాజమాన్యాలకు అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ యాప్‌ను ఉపయోగిస్తోన్న వినియోగదారుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఆ వ్యక్తి ఎవరెవరిని కలుసుకున్నారో తెలుసుకునేందుకు ఆరోగ్యసేతు యాప్‌ను ‘నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్’ అభివృద్ధి చేసింది. అంతేకాకుండా వినియోగదారుడు తన చుట్టుపక్కల కరోనా రోగి ఉన్నట్లయితే ఆ విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. (సాహో.. ఆరోగ్య సేతు..!) విమానాల్లో, రైళ్లలో ప్రయాణించేవారు ఈ యాప్‌ను విధిగా డౌన్లోడ్ చేసుకొని తీరాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ యాప్‌ను అమలు చేయడం అంటే వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన గోప్యతకు ముప్పు వాటిల్లినట్లేనని సామాజిక కార్యకర్తలు భావిస్తున్నారు. వ్యక్తిగత వివరాల భద్రతకు సంబంధించి ఇప్పటి వరకు సరైన చట్టమంటూ లేకపోవడమే తమ ఆందోళనకు కారణమని వారు చెబుతున్నారు. ‘భారత వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్19’ ఇప్పటికీ మోక్షం లేకపోవడమే వారి ఆందోళనకు కారణం. (‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులచేత ఈ యాప్‌ను విధిగా ఉపయోగించేలా చేయాలనేది కేంద్రం లక్ష్యం. ఆ విషయాన్ని విఫులంగా చెప్పకుండా ఈ బాధ్యతను యాజమాన్యాలకు అప్పగిస్తున్నట్లు మాత్రమే కేంద్రం ప్రకటించింది. ఇలా యాజమాన్యాల చేత ఉద్యోగలపై ఒత్తిడి తీసుకరావడం మంచిది కాదని, ఈ విషయంపై తాము కోర్టులను ఆశ్రయిస్తామని సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. (ఇకపై ఆ యాప్‌లో రిజిస్టర్ అయ్యాకే..) -
ఆరోగ్య సేతు ఉంటేనే ఏపీ సచివాలయంలోకి..
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్ ఉన్నవారిని మాత్రమే సచివాలయంలోకి అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. హై రిస్క్ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. విధులకు వచ్చే ఉద్యోగులు కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు, మాస్కులు వినియోగించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులతో పాటు సచివాలయ సందర్శనకు వచ్చే వారిని కూడా ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే అనుమతించాలని, లేదంటే అనుమతించరాదన్నారు. దీన్ని కఠినంగా అమలు చేయాల్సిందిగా సచివాలయ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌కు సూచించారు. సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ బ్లాక్ ప్రవేశం ద్వారం వద్దే థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు చేతులను శానిటైజ్ చేసుకోవాలన్నారు. (‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ) ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా కార్యాలయానికి బయల్దేరే ముందు తన ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను యాప్‌లో స్టోర్ చేయాలి. ఆఫీసుకు వెళ్లే ముందు ‘సేఫ్, లో రిస్క్’ అని సందేశం వచ్చినప్పుడు మాత్రమే కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. కాగా కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆరోగ్య సేతు అప్డేటెడ్ వెర్షన్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తే కరోనా వ్యాప్తిని పసిగట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. (ఉద్యోగులకు మహారాష్ట్ర కీలక ఆదేశాలు) -
31 దాకా లాక్డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్డీఎంఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(ఎన్ఈసీ) చైర్మన్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదివారం రాత్రి నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలు జారీచేశారు. విమానాలు, మెట్రో రైళ్ల రాకపోకలపై ఉన్న నిషే«ధాన్ని యథాతథంగా కొనసాగించారు. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవని స్పష్టం చేశారు. నిర్ధిష్టంగా నిషేధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలకు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇచ్చారు. (ఒక్కరోజులోనే 4,987) చిక్కుకుపోయిన వారంతా తరలింపు దేశంలో చిక్కు కుపోయిన విదేశీ యులు, ఇతర ప్రాంతాల్లో చిక్కు కుపోయిన శ్రామికులు, భారతీయ సీఫేరర్స్, వలస కూలీలు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరుల తరలింపునకు అను మతి. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయు లు, భారతీయ విద్యార్థుల తరలింపునకు అనుమతి. ప్రత్యేక రైళ్ల ద్వారా వ్యక్తుల ప్రయా ణం వంటి అంశాల్లో ఇదివరకే జారీచేసిన ప్రామాణిక నియమావళి వర్తిస్తుంది. కొవిడ్– 19 మేనేజ్మెంట్కు సంబంధించి జాతీయ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి. కట్టడి, బఫర్, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ► కేంద్ర ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలో రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. ► రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కట్టడి జోన్లు, బఫర్ జోన్లను జిల్లా యంత్రాంగాలు నిర్ధేశిస్తాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని గుర్తిస్తాయి. ► కట్టడి జోన్లలో కేవలం అత్యవసర సేవలనే అనుమతిస్తారు. ఆయా జోన్లలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తారు. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు తప్ప వ్యక్తులు ఈ జోన్లలో రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► కట్టడి జోన్లలో పటిష్టమైన కాంటాక్ట్ ట్రేసిం గ్, ఇంటింటిపై నిఘా, అవసరమైనప్పుడు వైద్య సేవలు అందించడం వంటి కార్యకలాపాలు కొనసాగుతాయి. రాత్రి పూట కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధం. అవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుంది. సీఆర్పీసీ సెక్షన్ 144 కింద స్థానిక యంత్రాంగం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. కట్టడి జోన్లలో అత్యవసరానికే అనుమతి నిర్ధిష్టంగా నిషేధించిన వాటికి మినహా ఇతర అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అయితే, కట్టడి జోన్లలో మాత్రం ఐదో నిబంధనలో పేర్కొన్నట్టుగా అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిస్థితిని అంచనా వేసి, విభిన్న జోన్లలో కార్యకలాపాలపై నిషేధం విధించవచ్చు. అవసరమైన మేరకు ఆంక్షలు విధించవచ్చు. హాని పొంచి ఉన్న వారికి రక్షణ 65 ఏళ్ల వయస్సు పైబడి ఉన్నవారు, ఇతర వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరాలు, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి మినహాయింపు ఉంటుంది. ‘ఆరోగ్యసేతు’ వినియోగం ► పని ప్రదేశాలు, ఆఫీసుల్లో రక్షణ కోసం యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలి. ► వ్యక్తులు ఆరోగ్యసేతు యాప్ ఇన్స్టాల్ చేసుకుని తరచుగా తమ ఆరోగ్య స్థితిని తనిఖీ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు, వస్తు రవాణాకు ప్రత్యేకం ► రాష్ట్రంలో, అంతర్రాష్ట్ర పరిధిలో వైద్య నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అంబు లెన్స్‌ల రాకపోకలపై ఆంక్షలు కూడదు. ► ఖాళీ ట్రక్కులు సహా అన్ని రకాల వస్తు, కార్గో రవాణా వాహనాల అంత ర్రాష్ట్ర రాక పోకలపై ఆంక్షలు ఉండరాదు. ► ఏ రాష్ట్రమైనా అంతర్జాతీయ భూ సరిహద్దు వద్ద వస్తు రవాణాను అడ్డుకోరాదు. కచ్చితంగా అమలు చేయాల్సిందే ► జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద జారీచేసిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు ఏ విధంగానూ బలహీన పర్చరాదు. ► అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. వీటిని అమలు చేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లను ఇన్సిడెంట్ కమాండర్లుగా పంపాలి. వారి పరిధిలో నిబంధనల అమలుకు ఇన్సిడెంట్ కమాండర్లు బాధ్యులుగా ఉంటారు. ► జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పరిధిలోని సెక్షన్ 51 నుంచి సెక్షన్ 60 మధ్య ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్ 180 పరిధిలో శిక్షార్హులు. -
2 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: డొమెస్టిక్ విమాన సర్వీసులు సోమవారం తర్వాత పరిమిత సంఖ్యలో ప్రారంభమయ్యే అవ కాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు విమానాశ్ర యాలకు వచ్చే ప్రయాణికులు పాటించాల్సిన, అధి కారులు చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ విభాగమే విమానాశ్రయాల సెక్యూరిటీ బాధ్యతలు పర్యవేక్షి స్తుండటం తెలిసిందే. ‘వందే భారత్’విమానాల రాకపోకల సందర్భంగా పలు విషయాలు గమనిం చిన విమానాశ్రయాల సెక్యూరిటీ విషయంలో పలు మార్పులు చేసినట్లు సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ శుక్రవారం తెలిపారు. తొలుత మే 1 నుంచి దేశీయ విమాన సర్వీసుల్ని ప్రారంభించాలని యోచిం చారు. అయితే సోమవారం తర్వాత ఎప్పుడైనా ఇవి మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ విమానాశ్రయాలతోపాటు మరి కొన్ని చోట్ల సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే ఇతర విభాగాల అధికారు లకు ఎలాంటి వ్యాప్తి జరగలేదు. దీంతో తనిఖీలు, సోదాలు చేసే విషయంలో పలు మార్పుచేర్పులు చేశారు. ప్రయాణికులను తాకాల్సిన అవసరం లేకుండా, భౌతిక దూరం పాటిస్తూ తనిఖీలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు డొమెస్టిక్ ప్యాసింజర్లు బోర్డింగ్ పాస్ తీసుకుంటే 45 నిమిషాలు, లేకుంటే గంట ముందు విమానా శ్రయంలో రిపోర్ట్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని రెండు గంటలకు పెంచారు. ప్రతి ప్రయాణికుడు తన ఫోన్లో కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ప్రతి ప్రయాణికుడు సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వాలి. వీలున్నంత వరకు ప్రయాణికులు తమ వెంట ప్రింట్ చేసిన లేదా ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాసులు కలిగి ఉండటం ఉత్తమం. ప్రతి ఒక్క ప్యాసింజర్ కచ్చితంగా ఫేస్‌మాస్క్ ధరించాలి. భౌతిక దూరం తప్పనిసరి డిపార్చర్ గేటు వద్ద క్యూలో నిర్దేశించిన బాక్సులు/సర్కిల్స్‌లో నిల్చుని ఉండాలి. ఈ దూరాన్ని కనిష్టంగా నాలుగు, గరిష్టంగా 6 అడుగులుగా నిర్దేశించారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హ్యాండ్ శానిటైజర్ కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా వాటి వద్ద చేతులను శానిటైజ్ చేసుకోవాలి. గేటు వద్దకు వెళ్లిన తర్వాత థర్మల్ ్రస్రీనింగ్ చేస్తారు. ఎవరికైనా సాధారణం కంటే ఎక్కవ ఉష్ణోగ్రతలు ఉంటే వారిని క్యూ నుంచి వేరు చేసి, తదుపరి పరీక్షల కోసం హెల్త్ డెస్క్‌కు పంపిస్తారు. పీపీఈ సూట్స్ లేదా ఫేస్‌మాస్క్, షీల్డ్స్‌లో ఉండే సీఐఎస్ఎఫ్ సిబ్బంది సైతం ప్రయాణికుడి సమీపం నుంచి తనిఖీలు చేయరు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల వద్ద ప్రయాణికులు తమ టికెట్, గుర్తింపు కార్డులను ప్రదర్శించాలి. వీటిని వెబ్‌క్యామ్ లేదా ట్యాబ్‌ల్లో తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణికుడిని పంపుతారు. ప్రయాణికులు తమ వెంట హ్యాండ్ బ్యాగేజ్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. లగేజ్‌లో కూడా 20 కేజీల కంటే తక్కువ బరువు ఉండాలి. తమ వెంట గరిష్టంగా 350 ఎంఎల్ శానిటైజర్ బాటిల్ తీసుకెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారు. విమానయాన సంస్థలు సైతం ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం ఉన్న కౌంటర్లను యథాత«థంగా వినియోగించేందుకు అనుమతి లేదు. బోర్డింగ్ పాసులు, టికెట్లు ఇచ్చే కౌంటర్లు ఒకటి విడిచి మరొకటి పని చేయాల్సి ఉంటుంది. వీలున్నంత వరకు టికెట్ స్కానర్లు, బోర్డింగ్ పాస్ ప్రింటర్లు, బ్యాగ్ ట్యాగ్ ప్రింటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానంలో ఎక్కడా విమానయాన సంస్థ సిబ్బందితో పని ఉండదు. సిబ్బందికి పీపీఈ కిట్లు.. కౌంటర్ల వద్ద ఉద్యోగులు, ప్రయాణికుడికి మధ్య గ్లాస్లు ఏర్పాటు చేయనున్నారు. కౌంటర్ నుంచి పిలుపు వచ్చే వరకు ప్రయాణికులు బాక్సులు, సర్కిల్స్‌లోనే నిల్చుని ఉండాలి. సెక్యూరిటీ చెక్ జరిగే ప్రదేశంలోనూ బాక్సులు, సర్కిల్స్ గీస్తున్నారు. వీటిలో నిల్చునే ప్రయాణికులు తమంతట తాముగా తమ ఒంటిపై ఉన్న లోహంతో కూడిన వస్తువుల్ని తీసి ట్రేలో పెట్టాల్సి ఉంటుంది. డీఎఫ్‌ఎండీల ద్వారా ప్రయాణికుడు వచ్చినప్పుడు బీప్ శబ్దం వస్తే వ్యక్తిగతంగా తనిఖీ చేయనున్నారు. బోర్డింగ్ కార్డులపై ఎలాంటి స్టాంపింగ్స్ ఉండవు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్డీ సీసీటీవీల ద్వారా వీటిని మానిటర్ చేయనున్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, హ్యాండ్ హెల్డ్ మెటర్ డిటెక్టర్లు తప్పనిసరి చేశారు. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత ప్రయాణికుల్ని బోర్డింగ్ గేట్స్ వద్ద ప్రత్యేకంగా మార్కింగ్ చేసిన సీట్లలో కూర్చోబెడతారు. ఈ ప్రాంతాల్లో ఆహార పదార్థాలు ఆర్డర్ చేయడం, డెలివరీ అన్నీ కాంటాక్ట్ లెస్‌గానే జరుగుతుంది. ప్రయాణికుడు విమానం ఎక్కేందుకు విమానం బయల్దేరడానికి 15 నిమిషాల ముందే అనుమతించేవారు. ఇప్పుడు గంట ముందే అనుమతించనున్నారు. ప్రయాణికుల్ని విమానం వరకు తరలించే బస్సుల్ని రోజూ కనీసం రెండు మూడుసార్లు శానిటైజ్ చేయనున్నారు. విమానం లోపల స్వాగతం పలికే ఎయిర్‌హోస్టెస్ పీపీఈ కిట్లు ధరించేలా చూడాలని భావిస్తున్నారు. విమానం లోపల ఆహారం సరఫరా చేయడానికి ముందు శానిటైజర్ ఇవ్వనున్నారు. విమాన ప్రయాణం పూర్తయ్యే వరకు మాస్క్ ధరించే ఉండాలి. విమాన సర్వీసులు ప్రారంభమయ్యే లోపు మరికొన్ని మార్పులకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సీఐఎస్ఎఫ్ పాత్ర కీలకం: సీవీ ఆనంద్, ఎయిర్‌పోర్ట్స్ సెక్టార్ ఐజీ సీఐఎస్ఎఫ్ కరోనా విస్తరణ నేపథ్యంలో విమానయానంలో సీఐఎస్ఎఫ్ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. దీంతో సిబ్బంది, అధికారులు ఇకపై ‘మినిమం టచ్.. మినిమం ఎక్స్పోజర్’విధానంలో విధులు నిర్వర్తించనున్నారు. తనిఖీలు సహా ఏ విషయంలో ప్రయాణికుల్ని నేరుగా తాకాల్సిన అవసరం లేకుండా వీలున్నంత వరకు అత్యాధునిక పరిజ్ఞానంతో పని చేయనున్నారు. ప్రయాణికులు సైతం ఈ విషయంలో తమకు సహకరించాల్సిన అవసరముంది. లాక్డౌన్ నేపథ్యంలో గడిచిన 2 నెలలుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక సంసిద్ధతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక తర్ఫీదు పొందారు. – సీవీ ఆనంద్, ఎయిర్‌పోర్ట్స్ సెక్టార్ ఐజీ సీఐఎస్ఎఫ్ -
కొన్ని చోట్ల ఎక్కువ కేసులు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయనీ, ఈ దశలో వైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం కీలకమని కేంద్రం పేర్కొంది. దేశంలో 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో 4,213కు చేరుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడారు. ‘దేశంలోని కొన్ని క్లస్టర్లతోపాటు, కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. వీటిని సమర్థంగా కట్టడి చేయకుంటే వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది’అని తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ ప్రభుత్వం మత ప్రాతిపదికన కరోనా హాట్స్పాట్లను గుర్తించే ప్రయత్నం చేస్తోందంటూ వస్తున్న వార్తలును కొట్టిపారేశారు. దేశీయంగా రూపొందించిన ఎలిసా టెస్ట్ కిట్ 97 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని అగర్వాల్ స్పష్టం చేశారు. విమాన ప్రయాణికులకూ ఆరోగ్యసేతు విమాన ప్రయాణికులు కూడా తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ యాప్ లేని ప్రయాణికులను విమానంలోకి అనుమతించబోరని చెప్పారు. పౌర విమాన యాన శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా, కరోనా కేసులు అత్యధికంగా ఉన్న నగరాల్లో రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్(గుజరాత్)లో వ్యాప్తి కట్టడికి చెల్లింపులను కరెన్సీ నోట్ల రూపంలో కాకుండా డిజిటల్ ద్వారానే జరపాలని నిర్ణయించారు. -
సాహో.. ఆరోగ్య సేతు..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు సాయం చేసే ఆరోగ్య సేతుకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్‌గా ఆరోగ్య సేతుకు అరుదైన గుర్తింపు లభించింది. గూగుల్ ప్లే డౌన్‌లోడ్‌లో 5వ స్థానం లభించగా, ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ డౌన్‌లోడ్స్‌లో 7వ స్థానం లభించడం విశేషం. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ ఆరోగ్య సేతు యాప్‌ను అభివృద్ధి చేసింది. జీపీఎస్, బ్లూటూత్‌లో రూపొందిం చిన ఈ కరోనాట్రాకింగ్ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓ ఎస్ ఫోన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. భారతీ యులను కరోనా నుంచి ఆరోగ్యం దిశగా పయ నింపజేసేందుకు ఉద్దేశించిన వారధి ఈ యాప్.. అందుకే, దీనికి ఆరోగ్య సేతు అని పేరు పెట్టారు. ఏం చేస్తుంది? దేశ, విదేశాల్లోని కరోనా కేసుల సమాచారం, మిమ్మల్ని మీరు కరోనా బారి నుంచి ఎలా కాపాడుకోవాలి? మీ నుంచి కరోనా పాజిటివ్ పేషెంట్లు 500 మీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు ఎంతమంది ఉన్నారో గుర్తించి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. కేవలం 3.7 ఎంబీ కలిగిన ఈ యాప్‌ను జూమ్, టిక్–టాక్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్లోడ్ చేసుకున్నారని అంతర్జాతీయంగా యాప్‌ల డౌన్ లోడ్స్, వాటి ర్యాంకింగ్‌లను విశ్లేషించే సెన్సర్ టవర్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అనుకూలాంశాలు.. ఈ యాప్‌ని ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయగా కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఏప్రిల్ 28 నాటికి ఈ సంఖ్య 75 మిలియన్లు దాటింది. మే 6 వరకు ఈ సంఖ్య 90 మిలియన్లను అధిగమించింది. అంటే 9 కోట్ల మంది ప్రజలు ఈ యాప్ సేవలు పొందుతున్నారు. 12 భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని మెజారిటీ ప్రజలకు ఈ యాప్ దగ్గరైంది. ప్రధాని మోదీ కూడా ఈ యాప్‌ని వినియోగించాలని ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఏ యాప్ కూడా ఇంతవేగంగా ఇన్ని మిలియన్ల డౌన్లోడ్లను సాధించలేదు. అందులోనూ ఇది ఒక దేశీయ యాప్ కావడం గమనార్హం. దీని కంటే ముందున్న యాప్‌లన్నీ కేవలం వినోదం, సమాచార యాప్‌లు కాగా.. ఇదొక్కటే ఆరోగ్యానికి సంబంధించినది. -
యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్
న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో సాధారణ వినియోగదారుడి వివరాలైతే 30 రోజుల్లో, కరోనా సోకిన వ్యక్తి వివరాలైతే 45–60 రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. ఆరోగ్య సేతు యాప్ అనేది కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన సోఫిస్టికేటెడ్ సర్వీలెన్స్ కలిగిన యాప్ అని తెలిపారు. ఈ యాప్‌ను ఇప్పటికే 9.5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, దీనిపై ప్రజలకు ఎంత నమ్మకముందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా సోకిన వారు దగ్గరలో ఉంటే హెచ్చరిచేందుకు ఈ యాప్‌ను వాడేవారిలొకేషన్ వివరాలను తీసుకుంటుందని తెలిపారు. ఇతర దేశాల్లో ఇలాంటి యాప్‌లు వాడుతున్నారని, దీనిపై అక్కడ మనదేశంలో వచ్చినట్లు ఆరోపణలు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దంటూ రాహుల్ గాంధీని కోరారు. ప్రజల కోసమే ఐసీఎంఆర్ వద్ద ఉన్న డేటాబేస్‌తో దాన్ని నడుపుతున్నట్లు తెలిపారు.