AIIB
-
రూరల్ రోడ్ల పనుల నాణ్యత భేష్
సాక్షి, అమరావతి: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సహాయంతో చేపట్టిన ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఆ బ్యాంకు ప్రతినిధి బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బ్యాంకు సహాయంతో చేపట్టిన ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం 5 రోజులపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించింది. జిల్లా స్థాయి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశమై పనుల ప్రగతిని, నాణ్యతను పరిశీలించింది. తదనంతరం మంగళవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డితో ఈ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించి పనులపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తమ బ్యాంకు ఆర్థిక సహాయంతో జరుగుతున్న గ్రామీణ రహదారి పనుల్లో నాణ్యతతో కూడిన ఒక ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. రూ.5,026 కోట్లతో పనులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించడంతోపాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణ సహాయంతో ఏపీ రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా.. ఏఐఐబీ రూ.3,418 కోట్లను రుణంగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,608 కోట్లను సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3,665 పనులు చేపట్టి 7,213 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటికే కాంపొనెంట్–1ఏ కింద 6,215 కిలోమీటర్ల పొడవున 3,231 పనులు చేపట్టగా.. ఇప్పటికే 2,450 కి.మీ. పొడవు గల 1,201 పనులు పూర్తయ్యాయి. మరో 3,765 కి.మీ. పొడవు గల 2,030 పనులు ప్రగతిలో ఉన్నాయి. కాంపొనెంట్–1బీ కింద 364 కి.మీ. పొడవు గల 142 పనులు చేపట్టగా.. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఎన్సీ బాలూనాయక్, ఏఐఐబీ ప్రతినిధి బృందం లీడర్ ఫర్హద్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్‌కుమార్, పర్యావరణ, సోషల్ ఎక్స్పర్ట్ శివ, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ ప్రదీప్, ట్రాన్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ తౌషిక్ పాల్గొన్నారు. -
శుద్ధ ఇంధనాలు, ఇన్ఫ్రాకు ప్రాధాన్యం ఇవ్వాలి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక అభివృద్ధి బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, విద్య, ఆరోగ్యంపైనా పెట్టుబడుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఐఐబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏడో వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ప్రాధాన్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏఐఐబీని కోరారు. విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సదుపాయాలు, విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన ప్రాధాన్యతలను మంత్రి గుర్తు చేశారు. ఈ రంగాల్లో చెప్పుకోతగ్గ మార్పును తీసుకొచ్చేందుకు మరిన్ని పెట్టుబడుల అవసరం ఉందన్నారు. ఏఐఐబీ సభ్య దేశాల విస్తృత మౌలిక అవసరాలను చేరుకోవడం కేవలం ప్రభుత్వాలు చేసే కేటాయింపులతోనే సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వావలంబన బాటలో భారత్.. భారత్ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ బాటలో ఉన్నట్టు గుర్తు చేశారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను సమర్థంగా అధిగమించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం, లక్ష్యాలకు అనుగుణమైన విధానాలు.. సవాళ్ల మధ్య బలంగా నిలబడేందుకు సాయపడినట్టు వివరించారు. -
ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా ఆర్బీఐ మాజీ గవర్నర్..!
న్యూఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు బ్యాంకు వర్గాలు ఆదివారం తెలిపాయి. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. 58 ఏళ్ల పటేల్ మూడేళ్ల పదవీకాలం గల ఏఐఐబీ ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఒకరుగా ఉంటారు. వచ్చే నెలలో ఆయన తన పదవిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఏఐఐబీలో వైస్ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన డిజె పాండియన్ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ఏఐఐబీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. గతంలో గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ ఈ నెల చివర్లో భారతదేశానికి తిరిగి రానున్నారు.సెప్టెంబర్ 5, 2016న రఘురామ్ రాజన్ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 2018లో "వ్యక్తిగత కారణాల వల్ల" పటేల్ రాజీనామా చేశారు. సెప్టెంబర్ 6, 2016న బాధ్యతలు చేపట్టడానికి ముందు అతను రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో ఆర్బీఐలో ద్రవ్య విధాన విభాగాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు. పటేల్ గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ & రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ ఇతర సంస్థలతో కలిసి పనిచేశారు. ఏఐఐబీ నుంచి 28 ప్రాజెక్టులకు 6.8 బిలియన్ డాలర్లు రుణం తీసుకుంది. అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించిన భారతదేశానికి ఏఐఐబీ పటేల్ పోస్టింగ్ ముఖ్యమైనది అని పాండియన్ శనివారం తన వీడ్కోలు సమయంలో తెలిపారు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు 2022లో పండగే..!) -
కరోనా : ఏఐఐబీ మరో భారీ రుణం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాటానికి బీజింగ్‌కు చెందిన ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) భారతదేశానికి మరోసారి భారీ నిధులు ప్రకటించింది. 750 మిలియన్ డాలర్ల (సుమారు 5,714 కోట్ల రూపాయల) రుణాన్ని ఆమోదించినట్లు బుధవారం తెలిపింది. కోవిడ్-19 కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది సహాయపడుతుందని ప్రకటించింది. కరోనా, లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు స్థంభించి పోవడంతో పేదలు కష్టాల్లో కూరుకుపోయారని, ముఖ్యంగా అనధికారిక రంగంలో పనిచేస్తున్న మహిళలు ఇందులో ఉన్నారని ఏఐఐబీ తెలిపింది. (మా వ్యాక్సిన్ ఏడాది పాటు కాపాడుతుంది) దేశంలో వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన పేద ప్రజల సహాయ కార్యక్రమాల కోసం భారత ప్రభుత్వం వీటిని ఖర్చు పెట్టనుంది. ఆసియా అభివృద్ధి బ్యాంకుతో సమన్వయంతో అనధికారిక రంగానికి సహా వ్యాపారాలకు ఆర్థిక సహాయాన్ని పెంచడం, అవసరమైనవారికి సామాజిక భద్రత విస్తరించడం, దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలో తక్కువ, మధ్య-ఆదాయ దేశాలు వైరస్ ప్రభావానికి సంబంధించి ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ మహమ్మారి ప్రభావానిక గురయ్యారని ఏఐఐబీ తెలిపింది. భారతదేశంలోని లక్షలాది మంది పేదలు అపారమైన ప్రమాదంలోకి నెట్టివేయబడతారని ఏఐఐబీ ఉపాధ్యక్షుడు (ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్) పాండియన్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మానవ మూలధనంతో సహా ఉత్పాదక సామర్ధ్యంలో దీర్ఘకాలిక నష్ట నివారణ,ఆర్థిక స్థితిస్థాపకత నిర్ధారించడం కూడా అవసరమన్నారు. ఇందుకు భారతదేశానికి మద్దతు అందిస్తున్నట్టు పాండియన్ తెలిపారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, 270 మిలియన్ల మంది ప్రజలు జాతీయ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారనీ, జనాభాలో 81 మిలియన్ల మంది పరిమిత ఆరోగ్య సేవలతో నివసిస్తున్నారని పేర్కొంది. కాగా ఇప్పటికే కోవిడ్-19 అత్యవసర సహాయంగా ఇండియాకు 500 మిలియన్ డాలర్లను ప్రకటించింది. -
సీఎం వైఎస్ జగన్‌తో బ్యాంకు ప్రతినిధుల భేటీ
-
ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఏఐఐబీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ డి.జె.పాండియన్, డైరెక్టర్ జనరల్–ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ యీ–ఎన్–పంగ్, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ సోమనాథ్ బసు భేటీ అయ్యారు. ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, 62 శాతం మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగమేనని సీఎం జగన్ ఈ సందర్భంగా వారికి వివరించారు. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమైనవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు అందగానే వెంటనే ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని బ్యాంకు ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలు సహా పలు కార్యక్రమాలపై ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు ఆరా తీశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, అట్టడుగున ఉన్న వర్గాల వారిని ఆదుకోవడానికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం జగన్ వారికి వివరించారు. స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు – నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, మధ్యాహ్న భోజనంలో చేపట్టిన మార్పుల గురించి తెలిపారు. నిరక్షరాస్యతను నిర్మూలించడానికి, ఆ దిశగా పిల్లలను బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ‘అమ్మఒడి’ కింద నేరుగా నగదు బదిలీ చేసిన అంశాన్ని కూడా బ్యాంకు అధికారులకు స్పష్టంగా వివరించారు. ఉపాధే లక్ష్యంగా ఉన్నత విద్యా కోర్సుల్లో తీసుకువస్తున్న మార్పులను, ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ విధానాన్ని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్, విద్యా వసతి పథకం గురించి కూలంకషంగా వివరించారు. ఈ కార్యక్రమాలపై ఏఐఐబీ ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. నాలెడ్జ్ మీద పెడుతున్న పెట్టుబడులుగా అభివర్ణించారు. భవిష్యత్తు తరాలకు ఇవ్వగలిగే ఆస్తి చదువేనన్న సీఎం వ్యాఖ్యలతో వారు ఏకీభవించారు. మీ ప్రణాళికలు బాగున్నాయి. 20 ఏళ్లుగా ప్రైవేటైజేషన్ మాటలు విన్నాం. ప్రజల కేంద్రంగా, వారి సంక్షేమం, నాణ్యమైన జీవన ప్రమాణాల సాధన ధ్యేయంగా చేపట్టిన కార్యక్రమాల గురించి మళ్లీ ఇప్పుడే వింటున్నాం. మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా తప్పక సాయం చేస్తాం. – సీఎం జగన్‌తో ఏఐఐబీ ప్రతినిధులు ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులకు తప్పక సాయం వైద్య విద్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై బ్యాంకు ప్రతినిధులు సీఎంను ఆరాతీశారు. ప్రతి పార్లమెంటు స్థానానికి ఒక బోధనాసుపత్రి ఉండేలా చూస్తున్నామని, దీనికోసం మరో 16 మెడికల్ కాలేజీలు కొత్తగా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా నిర్మించదలచుకున్న పోర్టుల గురించి వారు సీఎంను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో పోర్టులను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక పోర్టుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇరిగేషన్, రోడ్లు, వాటర్ గ్రిడ్, ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు తమ సహాయం ఉంటుందని తెలిపారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం గురించి కూడా సీఎం వారికి వివరించారు. సముద్రంలో కలిసిపోతున్న నీటిని తరలించడం ద్వారా శాశ్వతంగా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించుకున్న ఏ ప్రాధాన్యతలకైనా తమ సహాయం ఉంటుందని ఏఐఐబీ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించడానికి ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. -
ఏపీకి కొత్తగా ఏఐఐబీ 3 బిలియన్ డాలర్ల రుణం
-
ఏపీకి కొత్తగా ఏఐఐబీ 3 బిలియన్ డాలర్ల రుణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వ పాలసీలతో తమకు సంబంధం లేదని, నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సచివాలయంలోని కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఏఐఐబీ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. బ్యాంకు వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్టిమెంట్ ఆఫీసర్ పాండియన్, డైరెక్టర్ జనరల్–ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ యీ–ఎన్–పంగ్, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ సోమనాథ్ బసు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, 62 శాతం మంది ప్రజలు ఆదేరంగంపై ఆధారపడి ఉన్నారని, అలాగే ఎక్కువమందికి ఉపాథి కల్పించేది వ్యవసాయరంగమేనని సీఎం స్పష్టంచేశారు. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమైనవని ఏఐఐబీ ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి ఖర్చుపెట్టుకోవచ్చని ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలు సహా పలు కార్యక్రమాలపై ఆరా తీశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, అట్టడుగున ఉన్న వర్గాలవారిని ఆదుకోవడానికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం వివరించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలను కూడా సీఎం బ్యాంకు ప్రతినిధులకు సవివరంగా తెలియజేశారు. ఇంగ్లిషు మీడియంను స్కూళ్లలో ప్రవేశపెట్టడంతోపాటు, కల్పిస్తున్న కనీస సదుపాయాలు, మధ్యాహ్న భోజనంలో చేపట్టిన మార్పులను కూడా వారికి వివరించారు. నిరక్షరాస్యత నిర్మూలించడానికి, ఆ దిశగా పిల్లలను బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద నేరుగా నగదు బదిలీచేసిన అంశాన్ని కూడా బ్యాంకు అధికారులకు తెలిపారు. ఉపాథే లక్ష్యంగా ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశపెడుతున్న మార్పులను, ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ ప్రవేశపెడుతున్న విధానాన్ని, ప్రతి పార్లమెంటుకూ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్‌మెంట్, విద్యా వసతి పథకం వివరాలపై సీఎం సమగ్రంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాలపై ఏఐఐబీ అధికారులు ప్రశంసలు కురిపించారు. నాలెడ్జ్ మీద పెడుతున్న పెట్టుబడులుగా అభివర్ణించారు. భవిషత్తు తరాలకు ఇవ్వగలిగే ఆస్తి చదువేనన్న సీఎం వ్యాఖ్యలతో వారు ఏకీభవించారు. అలాగే వైద్య విద్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై బ్యాంకు ప్రతినిధులు సీఎంను ఆరాతీశారు. ప్రతి పార్లమెంటు స్థానానికీ ఒక బోధనాసుపత్రి ఉండేలా చూస్తున్నామని, దీనికోసం మరో 16 మెడికల్‌కాలేజీలు కొత్తగా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం ప్రణాళికలు బాగున్నాయని బ్యాంకు అధికారులు వ్యాఖ్యానించారు. 20 ఏళ్లుగా ప్రైవేటైజేషన్ మాటలు విన్నామని, కాని ప్రజల కేంద్రంగా, వారి సంక్షేమం, నాణ్యమైన జీవన ప్రమాణాల సాధన ధ్యేయంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి మళ్లీ వింటున్నామని ఏఐఐబీ అధికారులు సీఎంతో అన్నారు. కొత్తగా నిర్మించదలచుకున్న పోర్టులపై సీఎంను ఆరా తీయగా, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో పోర్టులను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక పోర్టుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇరిగేషన్, రోడ్లు, వాటర్ గ్రిడ్, ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు తమ సహాయం ఉంటుందని తెలిపారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానంపైన కూడా సీఎం బ్యాంకు అధికారులకు వివరించారు. సముద్రంలో కలిసి పోతున్న నీటిని తరలించడం ద్వారా శాశ్వతంగా ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించుకున్న ఏ ప్రాధాన్యతలకైనా తమ సహాయం ఉంటుందని ఏఐఐబీ అధికారులు స్పష్టంచేశారు. తన ప్రణాళికలను వివరించడానికి బ్యాంకు ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఏఐఐబీ బ్యాంకు అధికారులు ఆహ్వానించారు. -
2024 కల్లా ఏపీలో మూడు ఏఐఐబీ ప్రాజెక్టులు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : 2024 కల్లా ఏపీలో మూడు ఆసియా ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్( ఏఐఐబీ) ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ థాగూర్ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ఈ ప్రశ్నకు కేంద్ర మంతి అనురాగ్ సింగ్ సమాధానం చెప్పారు. రూ.7 వేల కోట్ల నిధులు సమకూర్చడానికి ఏఐఐబీ ఆమోదం తెలినట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా, పట్టణాలతో మెరుగైన మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, గ్రామీణ రహదారుల నిర్మాణం పేరుతో ఈ మూడు ప్రాజెక్టులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. మెత్తం రూ.14,252 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ మూడు ప్రాజెక్టులకు రూ.7000 కోట్ల వరకు నిధులు సమకూర్చడానికి ఏఐఐబీ ఆమోదం తెలిపింది. 24 గంటల విద్యుత్ సరఫరా ప్రాజెక్టు పనుల కింద ఇప్పటి వరకు రూ.224 కోట్లు, గ్రామీణ రహదారుల ప్రాజెక్టు పనుల కింద రూ.221కోట్లు, పట్టణాలలో మెరుగైన మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థ ప్రాజెక్టు కోసం రూ.7 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి థాకూర్ చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టుల కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 24 గంటల విద్యుత్ సరఫరా ప్రాజెక్టు 2022 నవంబర్ నాటికి, మిగిలిన రెండు ప్రాజెక్టులను 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. సీఎస్ఆర్ నిధులను ఫండ్‌లో జమ చేయాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద కేటాయించే నిధులను ఏదైనా పరిశ్రమ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయని పక్షంలో ఆ నిధులను నెల రోజుల వ్యవధిలో ఏదైనా బ్యాంక్‌లో ప్రత్యేకంగా అకౌంట్ తెరచి అందులో జమ చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మూడేళ్లపాటు ఖర్చు చేయకుండా ఆ అకౌంట్లో మిగిలిన సొమ్మును తృతీయ ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లో చట్టబద్దంగా ఏర్పాటు చేసి ఫండ్‌కు బదలాయించాల్సి ఉంటుందని తెలిపారు. -
ప్రపంచ బ్యాంకులో భాగమే ఏఐఐబీ రుణం
సాక్షి, అమరావతి: అమరావతి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) సంయుక్తంగా రుణం మంజూరుకు ప్రతిపాదించాయని, గత టీడీపీ సర్కారు రాజధానిలో సాగించిన అవినీతి, అక్రమాల వల్ల రుణ మంజూరును ప్రపంచ బ్యాంకు ఉపసంహరించుకోవడంతో అందులో భాగంగానే ఏఐఐబీ కూడా అదే బాటలో నడిచిందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అమరావతికి రుణం మంజూరు ప్రతిపాదనను ఏఐఐబీ ఉపసంహరించుకుందంటూ కొన్ని పత్రికలు, ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పాయి. ఉపసంహరించుకున్న రుణాన్ని మరో కొత్త ప్రాజెక్టుకు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ ఆసక్తి కనబరుస్తోందని, ఇప్పటికే ఈ విషయాన్ని రెండు బ్యాంకుల ప్రతినిధులు తెలియజేశారని గుర్తుచేశాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం... ల్యాండ్ పూలింగ్ పారదర్శకంగా జరగలేదు ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు కాకుండానే గత టీడీపీ సర్కారు అమరావతిలో రహదారులు, వరద నియంత్రణకు సంబంధించి ఏడు ప్యాకేజీలకు టెండర్లను ఖరారు చేసింది. ఆ టెండర్లలో పాల్గొన్న సంస్థలన్నీ కుమ్మక్కైనట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గుర్తించారు. వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతోపాటు రాజధాని పేరుతో టీడీపీ సర్కారు చేసిన ల్యాండ్ పూలింగ్ పారదర్శకంగా జరగలేదని తేల్చారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను తీసుకోవడంతో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. అమరావతిలో వ్యవసాయ కూలీల జీవనోపాధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రపంచ బ్యాంకు స్వతంత్ర బృందం తనిఖీల్లో వెల్లడైంది. అమరావతి ప్రాజెక్టుపై మరింత లోతుగా తనిఖీలు నిర్వహించాలని ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానల్ ప్రపంచ బ్యాంకుకు సూచించింది. దీంతో ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే... రుణం మంజూరు చేయకుండానే దేశంలో ఎక్కడా తనిఖీలు, దర్యాప్తులు జరగలేదని, ఇందుకు అనుమతిస్తే దేశంతో పాటు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు ప్రతిపాదనను మాత్రమే ఉపసంహరించుకోవాలని సూచించిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులకు రుణం మంజూరు చేశాయని, ఆ రుణాన్ని ఖర్చు చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఆ సంస్థల ప్రతినిధులు ఈ విషయాన్ని కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆ మూడు ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తామని కొత్త ప్రభుత్వం స్పష్టం చేసిందని వెల్లడించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే ప్రాజెక్టులో భాగంగా 140 మిలియన్ డాలర్లను ఏఐఐబీ ఇదివరకే మంజూరు చేసిందని, గ్రామీణ రహదారులకు 400 మిలియన్ డాలర్లు, పట్టణాల్లో పారిశుధ్య ప్రాజెక్టుకు మరో 400 మిలియన్ డాలర్లు.. మొత్తం 940 మిలియన్ డాలర్ల మేర రుణాన్ని మంజూరు చేసిందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేశాయి. కాంట్రాక్టు సంస్థల కుమ్మక్కుపై విచారణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు కొసాగిస్తామని ఏఐఐబీ ఉపాధ్యక్షుడు ఇప్పటికే హామీ ఇచ్చారని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, సంబంధిత రంగాలకు సంబంధించి రుణ ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని పేర్కొన్నాయి. 2031 నాటికి పట్టణ జనాభా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు సదుపాయాలు కల్పించాల్సి ఉందని, దీనిపై దృష్టి సారించామని అధికార వర్గాలు తెలియజేశాయి. అమరావతి ప్రాజెక్టులో భాగంగా ఏడు ప్యాకేజీ పనుల విషయంలో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కైనట్లు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. -
భారత ఆర్థిక మూలాలు పటిష్టం..
ముంబై: భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ఆర్థిక క్రమశిక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 7.4 శాతం జీడీపీ వృద్ధితో ప్రపంచ ఎకానమీ వృద్ధికి భారత్ చోదకంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) మూడో వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు. ‘చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం నిర్దేశిత శ్రేణికే పరిమితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది‘ అని ఆయన వివరించారు. స్థూల దేశీయోత్పత్తిలో ప్రభుత్వ రుణ వాటా గణనీయంగా తగ్గుతోందని, చాలా కాలం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థను రేటింగ్ ఏజెన్సీలు అప్‌గ్రేడ్ కూడా చేస్తున్నాయని మోదీ చెప్పారు. భారత ఆర్థిక పునరుజ్జీవం.. మిగతా ఆసియా దేశాల పరిస్థితులను ప్రతిబింబించేలా ఉంటోందని, ప్రపంచ వృద్ధికి ప్రస్తుతం ప్రధాన చోదకంగా మారిందని తెలిపారు. ‘నవభారతం ఉదయిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లైనా దీటుగా ఎదుర్కొగలగడంతో పాటు అందరికీ ఆర్థిక అవకాశాల కల్పన, సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యాలే పునాదులుగా భారత్ ఎదుగుతోంది‘ అని ఆయన చెప్పారు. 2020 నాటికి 40 బిలియన్ డాలర్లు, 2025 నాటికి 100 బిలియన్ డాలర్ల రుణవితరణ స్థాయికి ఏఐఐబీ ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే ఏఐఐబీ 4 బిలియన్ డాలర్ల రుణపరిమాణం ఉండే 25 ప్రాజెక్టులను 12పైగా దేశాల్లో ఆమోదించినట్లు వివరించారు. ఇన్వెస్టర్లకు అనుకూల దేశం .. ఇటు రాజకీయంగాను, అటు స్థూల ఆర్థిక పరిస్థితులపరంగాను భారత్‌లో స్థిరత్వం ఉందని, దీనికి తోడు నియంత్రణ సంస్థల విధానాలు కూడా ఊతమిచ్చేవిగా ఉంటున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు అత్యంత అనుకూలమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తోందని ప్రధాని చెప్పారు. దాదాపు 2.6 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉందని, కొనుగోలు శక్తిపరంగా చూస్తే మూడో పెద్ద దేశంగా ఉందని ప్రధాని చెప్పారు. ఈ ఏడాది గ్లోబల్ మొబిలిటీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రక్షణాత్మక విధానాలతో ముప్పు: లికున్ కొన్ని సంపన్న దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలపై ఏఐఐబీ ప్రెసిడెంట్ జిన్ లికున్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ఆయా దేశాలతో పాటు ఇతర దేశాల ఆర్థిక, వాణిజ్య అవకాశాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. -
ఆసియా బ్యాంక్ అప్పుతో‘ఆరగింపు’ సేవలు
సాక్షి, అమరావతి: సాధారణంగా తారు రోడ్డు నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా ఖర్చవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.69 లక్షలు ఖర్చు చేయాలని తెగేసి చెబుతోంది. సిమెంట్ రోడ్డు వేయడానికి కిలోమీటర్‌కు రూ.40 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు చెబుతుండగా, ప్రభుత్వం రూ.83 లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. తాను అనుకున్న వ్యయంతోనే 2,749 కిలోమీటర్ల తారు రోడ్లు, 2,206 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేసి, పనులను అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ పెద్దలు రూ.800 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ దోపిడీ బాగోతం సాగుతోంది. రాష్ట్రంలో రహదారి వసతి లేని గ్రామాలకు కొత్త రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.4,234 కోట్లు అవసరమని అంచనా వేసింది. 70 శాతం నిధులను అప్పుగా ఇచ్చేందుకు ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) అంగీకరించింది. మొత్తం 5,007 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పనులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 2,749 కిలోమీటర్ల తారు రోడ్లు, 2,206 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 52 కిలోమీటర్ల మేర 32 బ్రిడ్జిలు ఉన్నాయి. ప్యాకేజీల మాయాజాలం ఒక ఊరికి, పక్కనే మరో ఊరికి మధ్య ఉండే రెండు మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను మాములుగా అయితే స్థానికంగా చిన్న కాంట్రాక్టర్లు చేస్తుంటారు. ఇలా చిన్నచిన్న పనులైతే తమకు అంతగా గిట్టుబాటు కాదనుకున్న ప్రభుత్వ పెద్దలు మరో స్కెచ్ వేశారు. రెండు మూడు కిలోమీటర్ల పొడవుండే చిన్నచిన్న రోడ్ల పనులను 50–60 చొప్పున కలిపి ఒక ప్యాకేజీగా మార్చారు. మొత్తం 2,498 పనులను కేవలం 40 ప్యాకేజీలుగా విభజించారు. వీటిని తమకు బాగా కావాల్సిన బడా కాంట్రాక్టర్లకు అప్పగించాలని వ్యూహం పన్నారు. కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు ముందే నొక్కేయడానికి వీలుగా వారికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. డీపీఆర్ దశలోనే అంచనాలు పెంపు చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులను బడా కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వ పెద్దలు అందుకు అనుగుణంగా సమగ్ర ప్రాజెకు నివేదిక(డీపీఆర్) తయారీ దశలోనే అంచనా వ్యయాలను భారీగా పెంచారు. ప్రస్తుతం ప్యాకేజీల వారీగా తుది దశ డీపీఆర్‌లను పంచాతీయరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిద్ధం చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం పనులకు జూన్‌లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. చిన్న కాంట్రాక్టర్ల అభ్యంతరాలు ఏఐఐబీ అప్పుతో చేపట్టే రోడ్ల నిర్మాణం పనులపై కాంట్రాక్టర్ల అభిప్రాయాలు సేకరించేందుకు ఈ నెల 20వ తేదీన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్‌చీఫ్(ఈఎన్సీ) సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులను ప్యాకేజీలుగా వర్గీకరించి బడా కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న నిర్ణయంపై చిన్న కాంట్రాక్టర్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బడా కాంట్రాక్టర్లు ఆ పనులను సబ్ కాంట్రాక్టర్లకే ఇస్తారని, దీనివల్ల రోడ్ల నిర్మాణంలో నాణ్యత కొరవడుతుందని స్పష్టం చేశారు. ఏడాదిలోగా 5,007 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పనులు పూర్తి కావాలంటే ప్యాకేజీల వారీగా పెద్ద కాంట్రాక్టర్లకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈఎన్సీ తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పనులు జరిగే నియోజకవర్గాలు: 134 పనులు జరిగే మండలాలు: 484 మొత్తం పనులు: 2,498 (తారు రోడ్డు పనులు: 845, సిమెంట్ రోడ్డు పనులు: 1,631, బ్రిడ్జిలు: 22) కొత్త రోడ్ల పొడవు: 5,007 కిలోమీటర్లు అంచన వ్యయం: 4,234 కోట్లు -
ప్రపంచ బ్యాంకుతో కేంద్రం ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటలు విద్యుత్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ నుంచి 240 మిలియన్ డాలర్లు, ఏఐఐబీ నుంచి 160 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ తరఫున ఆపరేషన్స్ మేనేజర్ హిషం అబ్డో, ఏఐఐబీ ఉపాధ్యక్షుడు డీజే పాండ్యన్ గురువారం సంబంధిత ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం అమలు ఒప్పందంపై ఏపీ ప్రభుత్వ విద్యుత్ సలహాదారు కె.రంగనాథం, ప్రపంచ బ్యాంక్, ఏఐఐబీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 570 మిలియన్ డాలర్లు కాగా, మిగిలిన వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. -
ఏఐఐబీ హెడ్‌గా జిన్ లిక్విన్
బీజింగ్: ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) హెడ్‌గా చైనా మాజీ ఉప ఆర్థిక మంత్రి జిన్ లిక్విన్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం ధ్రువీకరించింది. చైనా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్‌లోనూ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గానూ జిన్ లిక్విన్ బాధ్యతల నిర్వహించారు. ఏఐఐబీని ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులకు పోటీగా పరిగణిస్తున్నారు. -
ఏఐఐబీ బ్యాంక్ ఏర్పాటులో ముందడుగు
భారత్ సహా 50 దేశాల సంతకాలు ఆసియా దేశాల్లో మౌలిక రంగ వృద్ధి లక్ష్యం అమెరికా, యూరప్ ప్రాబల్య బ్యాంకులకు పోటీపూర్వక వ్యవస్థ ఈ ఏడాది చివరికల్లా కార్యకలాపాలు! బీజింగ్: చైనా నేతృత్వంలోని 100 బిలియన్ డాలర్ల ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఏర్పాటు దిశలో ముందడుగు పడింది. బ్యాంకు చట్టబద్దతకు సంబంధించి ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై భారత్‌సహా 50 దేశాలు సోమవారం సంతకాలు చేశాయి. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆసియా దేశాల్లో మౌలిక రంగం వృద్ధే లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటవుతోంది. బహుళజాతి బ్యాంకర్‌గా అమెరికా, యూరప్ ప్రాబల్య బ్యాంకింగ్ సంస్థలకు (ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) ఏఐఐబీ పోటీపూర్వక పరిస్థితి సృష్టిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది చివరికల్లా బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యాంశాలు... ఇది 60 అధికరణల ఒప్పందం. సభ్యదేశాల షేరింగ్, బ్యాంకింగ్ పాలనా వ్యవస్థ, విధాన నిర్ణయ యంత్రాంగం, వంటి అంశాలను ఈ అధికరణలు నిర్దేశిస్తున్నాయి. ఒప్పందంపై సంతకం చేసిన మొట్టమొదటి దేశం- ఆస్ట్రేలియా. తరువాత 49 ఇతర దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరో 7 దేశాలు వాటివాటి చట్టసభల నుంచి ఆమోదం తరువాత ఈ ఏడాది చివరికల్లా సంతకాలు చేయాల్సి ఉంది. ఏఐఐబీ అథీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లు. ఇందులో 75 శాతం ఆసియన్ దేశాలు సమకూర్చుతాయి. ప్రతి దేశానికి దాని ఆర్థిక పరిమాణం ప్రాతిపదిన కోటా ఉంటుంది.30.34 శాతంతో చైనా, 8.52తో భారత్, 6.66 శాతంతో రష్యా మూడు అతిపెద్ద వాటాదారులుగా ఉండనున్నాయి. దీనిని బట్టి వోటింగ్ షేర్ 26.06 శాతం, 7.5 శాతం, 5.92 శాతంగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలకు సంబంధించి చైనాకు వీటో అధికారం ఉండే అవకాశమూ ఉంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కార్యక్రమానికి హాజరవనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, దీనికి భిన్నంగా కొద్దిమంది భారత్ ప్రతినిధులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. చైనాలో భారత్ రాయబారి అశోక్ కే కాంతా ఒప్పందంపై సంతకం చేశారు.