alapati rajendra prasad
-
డ్రగ్స్ కేసులో మరో టీడీపీ నేత హస్తం
-
ఆలపాటి ఔట్.. అధికారికంగా చెప్పేసిన లోకేష్
తెనాలి: తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశల అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్ లేదని సాక్షాత్తూ నారా లోకేశ్ మంగళ వారం తేల్చి చెప్పేశారు. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల నేపథ్యంలో తెనాలి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీచేస్తారని, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రెండు నెలల క్రితమే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెనాలి జనసేన నేతలకు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ వర్గాలను మభ్యపెడుతూ తానూ పోటీలో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆలపాటి. పైగా ప్రజా చైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. వార్డులవారీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. నాదెండ్ల మనోహర్‌తో పోలిస్తే పార్టీ సర్వేలో తనకే ఎక్కువ స్కోరు ఉన్నట్టుగా కార్యకర్తలు, నాయకులకు చెప్పారు. చివరి నిముషంలో తనకే టికెట్ వస్తుందని నమ్మబలుకుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తే చెయ్... లేదంటే నీదారి నువ్వు చూసుకొమ్మని లోకేశ్ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. బుర్రిపాలెంకు చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీనితో ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. -
ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనేనన్న ఆలపాటి
-
రా కదలిరా సభలో సీఎం జగన్‌ను పొగిడిన ఆలపాటి రాజేంద్రప్రసాద్
-
చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో ‘రా కదలిరా’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన పొగిడారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనేనని ఆలపాటి అన్నారు. దీంతో సభతో పాటు ఒక్కసారిగా చంద్రబాబు అవాక్కయ్యారు. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. ఇదీ చదవండి: జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు -
టీడీపీ-జనసేనలో సీట్ల పంచాయితీ
-
ఎల్. విజయలక్ష్మికి ఎన్టీఆర్ అవార్డు
అలనాటి అందాల తార, ప్రముఖ నర్తకి ఎల్. విజయలక్ష్మిని ఎన్టీఆర్ అవార్డు వరించింది. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శితమవుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతి నెలా ఎన్టీఆర్ కుటుంబం నుండి ఒకరు పాల్గొంటారు. ఎన్టీఆర్‌తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్‌కు ప్రతి నెలా అవార్డు, గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారు. అక్టోబర్ నెలకిగాను ఎన్టీఆర్ పురస్కారానికి ఎల్. విజయలక్ష్మి ఎంపికయ్యారు. బాలనటిగా ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ‘జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తనశాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు–భీముడు, భక్త ప్రహ్లాద’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో సుమారు 15 సినిమాలకు పైగా నటించారు విజయలక్ష్మి. 50 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా అమెరికాలో స్థిరపడ్డారామె. ఈ నెల 30న తెనాలిలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి ఆమె ఇక్కడికి రానున్నారు. కాగా ‘ఎన్టీఆర్ శతజయంతి’ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ, అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బుర్రా సాయిమాధవ్ వ్యవహరిస్తున్నారు. -
TDP Alapati Raja: నవ్విపోదురు ‘రాజా’
సాక్షి, గుంటూరు(తెనాలి): దశలవారీ మద్య నిషేధంపై అవాకులు చెవాకులు పేలుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడే యథేచ్ఛగా అక్రమ మద్యం అమ్మకాలకు తెగబడ్డాడు. గోవా నుంచి కంటైనర్‌లో మద్యం తెప్పించి ఓ రహస్య ప్రదేశంలో అమ్ముతూ ఎస్ఈబీ పోలీసులకు ఈనెల 19న రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ వ్యక్తి గతంలో ఓ హత్యకేసులోనూ నిందితుడు. ఇతను తెనాలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అనుచరుడే కావడం గమనార్హం. మహిళలను వెంటేసుకుని ఆలపాటి రాజేంద్రప్రసాద్ మద్యం అమ్మకాలపై ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన వెలుగు చూడడంతో ప్రజల్లో ప్రతిపక్షం నవ్వులపాలవుతోంది. చదవండి: (పరిటాల సునీత, శ్రీరామ్‌పై కేసు నమోదు) అసలేం జరిగిందంటే..! బుర్రిపాలెంకు చెందిన శాఖమూరి బాబు సురేంద్ర తెలుగు యువత తెనాలి రూరల్ మండల అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అనుచరుడు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులో నివాసం ఉంటాడు. ఇతను వేంపాటి వేణుబాబు, జాస్తి సతీష్, గడ్డిపాటి బాపనయ్య చౌదరి అనే వ్యక్తులతో కలిసి గోవా నుంచి కంటైనర్‌లో మద్యం తీసుకొచ్చాడు. వీరందరూ కలిసి రెడ్డిపాలెం దగ్గర్లో రహస్యంగా అమ్మకాలు చేస్తూ ఈనెల 19న గుంటూరులో ఎస్ఈబీ పోలీసులకే మద్యం అమ్మబోయి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 174 బాక్సుల్లోని 2,800 మద్యం సీసాలను ఎస్ఈబీ గుంటూరు–2 టౌన్ సీఐ కర్ణ, అడిషనల్ ఎస్పీ బిందు మాధవ్, ఈఎస్ అన్నపూర్ణమ్మ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. గతంలోనూ నేరచరిత్ర ►సురేంద్ర గతేడాది నల్లపాడు పోలీస్ స్టేషను పరిధిలో జరిగిన హత్య కేసులో రెండో నిందితుడు. ►2020 లాక్డౌన్ సమయంలోనూ బుర్రిపాలెంరోడ్డులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నేరంపై శాఖమూరి బాబు సురేంద్రపై కేసు నమోదైంది. ►ఆలపాటి రాజా దన్నుతోనే ఇతడు ఇన్ని నేరాలకు పాల్పడుతున్నాడని, అక్రమ మద్యాన్ని గుంటూ రులోని ఆలపాటి రాజాకు చెందిన హోటల్‌కూ సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. -
రిజర్వ్ ఇన్స్పెక్టర్పై లోకేశ్ హత్యాయత్నం
సాక్షి, అమరావతి/మంగళగిరి: టీడీపీ ఎమ్మెల్సీలు లోకేశ్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్ విధి నిర్వహణలో ఉన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్పై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఏకంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోని ఓ గదిలో ఆ పోలీసు అధికారిని బంధించి కులం పేరుతో దూషిస్తూ దాడికి తెగబడటం విస్మయం కలిగిస్తోంది. చివరికి మంగళగిరి సీఐ వచ్చి ఆ అధికారిని విడిపించి ఆస్పత్రికి తీసుకెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బాధిత రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకేశ్ ఏ1, అశోక్‌బాబు ఏ2, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏ3, తెనాలి శ్రావణ్‌కుమార్ ఏ4గా, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, కులం పేరుతో దూషించడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ప్రకారం వివరాలివీ.. టీడీపీ ఆఫీసు వద్ద దాడిచేసి, బంధించి.. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం సాయంత్రం మంగళగిరి బెటాలియన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. విధి నిర్వహణ కోసం టీడీపీ ప్రధాన కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. తాను పోలీసు అధికారినని చెబుతున్నా వినిపించుకోకుండా ఆయన్ని బలవంతంగా టీడీపీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు. తరువాత టీడీపీ ఎమ్మెల్సీలు లోకేశ్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, శ్రావణ్ తదితరులు పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలతో ఆ గదిలోకి వచ్చారు. తాను పోలీసు అధికారినని చెబుతున్నా, తన గుర్తింపు కార్డు చూపించినా వారు పట్టించుకోలేదు. అందరూ కలసి రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్పై తీవ్రంగా దాడిచేశారు. లంబాడి తెగకు చెందిన ఆయన్ని కులం పేరుతో దుర్భాషలాడారు. హత్యాయత్నం చేశారు. అశోక్‌బాబు ఆయన గుర్తింపు కార్డును లాక్కున్నారు. సెల్‌ఫోన్‌ను నేలకేసి కొట్టారు. మళ్లీ అందరూ కలసి మూకుమ్మడిగా ఆయనపై దాడిచేశారు. అతి కష్టం మీద అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన సక్రూనాయక్‌ను అశోక్‌బాబుతోపాటు పలువురు మళ్లీ పట్టుకుని బంధించారు. బలవంతంగా ప్రెస్మీట్లో కూర్చోబెట్టి ఆయనపై అసత్య ఆరోపణలు చేశారు. అంత జరుగుతున్నా సరే ప్రాణభయంతో సక్రూనాయక్ మౌనంగా ఉండిపోయారు. ప్రెస్‌మీట్ అనంతరం ఆయన్ని మళ్లీ గదిలో బంధించారు. సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ సీఐ భూషణం మంగళవారం రాత్రి 10.30 గంటలకు టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఆయన్ని విడిపించి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సక్రూనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్, అశోక్‌బాబు, ఆలపాటి రాజా, శ్రావణ్‌కుమార్, పోతినేని శ్రీనివాసరావులతోపాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి ఇరువైపులా అర కిలోమీటరు దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. టీడీపీ నాయకులను మాత్రమే అనుమతించారు. టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ లోకేశ్ పోలీసులను బెదిరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం దాడిలో గాయపడ్డారని చెబుతున్న కార్యకర్తలు కార్యాలయానికి వస్తుండగా వాహనాన్ని బెటాలియన్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ కార్యకర్తలతో తరలివచ్చి గాయపడినవారి అంబులెన్స్‌ను ఎందుకు వదలరని ప్రశ్నించడంతోపాటు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు వేలు చూపిస్తూ బెదిరించారు. దీంతో విధుల్లో ఉన్న పోలీసులు విస్తుపోయారు. వాహనాల రాకపోకలు అడ్డుకోవడంపై కేసు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవిపై మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన వివాదంలో గంజి చిరంజీవితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనదారులను అడ్డుకుని ఇబ్బందులు కలిగించారు. జాతీయ రహదారులశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంజి చిరంజీవితో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 70 మందిపై కేసు నమోదు మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి గుర్తుతెలియని 70 మందిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ పార్టీ కార్యాలయంపై దాడిచేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా.. టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని మరికొందరు కూడా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో తమకు పలు ఫిర్యాదులు అందాయని, అన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ సీఐ భూషణం చెప్పారు. -
టీడీపీ నేత నుంచి ప్రాణహాని: శ్రీధర్
సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి తనకు ప్రాణ ముప్పు ఉందని ఎన్ఆర్ఐ విద్యాసంస్థల తాజా మాజీ సీఈవో శ్రీధర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల సీఈవోగా రాజీనామా చేసి బయటకు వచ్చానని తెలిపారు. వచ్చిన లాభాల్లో 5 శాతం వాటా ఇస్తామని తానను మోసం చేశారన్నారు. కోవిడ్ సమయంలో ఫీజులు తగ్గించమని చెప్పినా పూర్తిగా వసూలు చేశారని.. తనపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. తనకేదైనా జరిగితే టీడీపీ నేత ఆలపాటిదే బాధ్యత అని శ్రీధర్ స్పష్టం చేశారు. చదవండి: రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్, లుక్ అదిరిపోయింది..! -
టీడీపీ నేత ఆలపాటిపై కేసు నమోదు
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని చినకాకాని గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి పాలకవర్గంలో వివాదాలు పోలీస్‌స్టేషన్ దాకా చేరాయి. ఈ వివాదాల నేపథ్యంలో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో పాలకవర్గంలో విభేదాలు తలెత్తడంతో ఎన్ఆర్ఐ పాలకవర్గంలో డైరెక్టర్‌గా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోదరుడు రవిని ఆ పదవి నుంచి తొలగించారు. దీనిపై కోర్టులో కేసు కొనసాగుతోంది. గత టీడీపీ పాలనలో ఆలపాటి ఆసుపత్రి పాలకవర్గాన్ని బెదిరించి తన ఆధిపత్యం కొనసాగించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 2019లో టీడీపీ ఓటమితో ఆలపాటి ఆధిపత్యానికి గండిపడింది. రవిని పాలకవర్గంలోకి తిరిగి తీసుకోకపోతే చంపుతానని రాజేంద్రప్రసాద్ బెదిరించారని, అక్రమంగా ఆసుపత్రిలోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారని ప్రస్తుత వైస్‌ప్రెసిడెంట్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ మంగళగిరి రూరల్ పోలీసులకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవినీతి..అక్రమాల్లో ‘రాజా’ ది గ్రేట్
సాక్షి, తెనాలి : ఆంధ్రాప్యారిస్ తారల తళుకులతో, కళాకారుల కౌసల్యంలో వాసికెక్కిన పట్టణం.. ఐదేళ్లుగా ఆలపాటి అంతులేని అవినీతిలో మకిలీ అయ్యింది. అభివృద్ధి మాటున అడ్డగోలు దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొల్లిపర మండలంలోని రీచ్‌లతో తవ్విన ఇసుక.. పేదలకు చేరకుండా అడ్డదారుల్లో తరలింది. ఉచితమనే మాట అనుచితమై.. అది రాజావారి ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితైంది. ఎమ్మెల్యే అండదండలతో టీడీపీ నేతలు సాగించిన కబ్జాకాండకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇదేమని ప్రశ్నించిన గొంతులను అక్రమ కేసులు నొక్కేశాయి. సహజ వనరులు ఎమ్మెల్యే ఆలపాటి రాజా అక్రమాల దెబ్బకు గుల్లయ్యాయి. కాసుల రూపంలో టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. నిలదీయాల్సిన అధికారులకు బెదిరింపులు, మామూళ్లు నజరానాగా మారి.. ఆలపాటి అంతులేని అవినీతికి ఎర్రతివాచీ పరిచాయి. అధికార అండతో అక్రమ నిర్మాణాలు గుంటూరు నగరంలోని విద్యానగర్‌లో ఎన్నారై ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ ఆలపాటి రాజాకు చెందింది కావడంతో రోడ్డుపైకి అక్రమంగా రెండు షాపులను నిర్మించేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. నిరుపేదలు చిన్న రేకుల షెడ్డు నిర్మిస్తేనే పెద్ద తప్పు చేసినట్లు హడావుడి చేసి తొలగించే టౌన్ ప్లానింగ్ అధికారులు.. దీనిపై చెయ్యి వేసేందుకు కూడా సాహసించలేకపోయారు. నగరం నడిబొడ్డున అరండల్‌పేట 12వ లైను ఎదురుగా ఉన్న గ్రాండ్ నాగార్జున హోటల్ సెల్లార్లో బార్‌ను నడుపుతున్నప్పటికీ అధికారులు ఎవరూ అడ్డుచెప్పని పరిస్థితి. గుంటూరు నగరంలో ట్రాఫిక్ పెరిగిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సెల్లార్లో పార్క్ చేయాల్సిన వాహనాలను రోడ్డుపైనే పెడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం సదరు హోటల్ ఆలపాటి రాజాకు చెందింది కావడమే. పంట పొలాల దురాక్రమణ తెనాలి రూరల్ మండలం కఠెవరంలో తినీతినకా ఆస్తులు కూడబెట్టిన ఒకరు పాతికేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. అతడి ఏకైక కుమారుడు సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ కుటుంబానికి వారసులు ఎవరూ లేరు. కఠెవరం పరిధిలో 14 ఎకరాల పంట భూములపై హక్కుల కోసం కొందరు కోర్టును ఆశ్రయించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దృష్టి ఆ భూములపై పడింది. కోర్టులో వాజ్యం నడుపుతున్న వారికి తలా కొంత ముట్టజెప్పి, తన పార్టీకి చెందిన బినామీల పేరిట రిజిస్టర్ చేయించారు. వీరిలో విశాఖకు చెందిన బినామీ కూడా ఉన్నారు. ఆ విధంగా రూ.2 కోట్లలోపు ఖర్చుతో రూ.70 కోట్ల విలువైన పంట పొలాలను సొంతం చేసుకున్నారు. నీరు–చెట్టు పథకం కింద తెనాలి రూరల్ మండలం మల్లెపాడులో 11 ఎకరాల చెరువు ఆక్రమణలకుపోగా ప్రస్తుతం ఏడెకరాల్లో ఉంది. రెండేళ్లకోసారి చేపల వేలం ద్వారా పంచాయతీకి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల ఆదాయం సమకూరేది. వేలం లేకుండా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర కనుసన్నల్లో తెలుగుదేశం నేత, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రావి రామ్మోహన్ నేతృత్వంలో ఇక్కడ మట్టి తవ్వకాలు సాగించారు. మూడు నాలుగు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి అమ్ముకున్నారు. ఇలా మట్టి తవ్వకాల్లో అ«ధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర కోటి రూపాయలకుపైగా గడించారు. రెండేళ్లలో కొల్లిపర మండలం కొల్లిపర, పిడపర్రు, వల్లభాపురం, అన్నవరం, తూములూరు, దావులూరు, పిడపర్తిపాలెం, శిరిపురం, కుంచవరం, చక్రాయపాలెం, అత్తోట, అత్తోట యాదవపాలెం గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. కేవలం కొల్లిపర మండలంలోనే ఎమ్మెల్యే ఆయన బినామీలు రూ.2.50 కోట్లను ఆర్జించారు. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువుల తవ్వకాల్లో అధికార పార్టీ నేతల్లో కలహాల కుంపటి రగిలిన సందర్భాలు లేకపోలేదు. తెనాలి మండలం కంచర్లపాలెంలో 5 ఎకరాల ఊరచెరువులో ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన అనుచరులు మట్టి తవ్వారు. 5600 ట్రక్కుల మట్టిని తీసి ఒక్కో ట్రక్కు రూ.600 చొప్పున అమ్మేశారు. పూడికతీతతో రూ.35 లక్షల ఆదాయం సమకూరగా, రూ.6 లక్షలతో చెరువు చుట్టూ కంచె వేయించారు. మిగిలిన సొమ్ము తమ జేబుల్లో వేసుకున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద నీరు–చెట్టు పథకం కింద ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమంగా తవ్వుకున్న మట్టి విలువ రూ.6 కోట్లపైమాటే! అమాయకుల్ని బలి తీసుకున్న ఇసుక ట్రాక్టర్లు.. ఎడతెరిపిలేని ఇసుక ట్రాక్టర్ల పరుగులో పొలం నుంచి ఇంటికి వస్తున్న మున్నంగికి చెందిన వంగా శేషిరెడ్డిని ఓ ఇసుక ట్రాక్టరు బలి తీసుకుంది. గత ఏప్రిల్ 23న ఈ దుర్ఘటన జరగ్గా.. అంతకు రెండు నెలల ముందు ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో అదే గ్రామస్తురాలైన కనపాల విశ్రాంతమ్మ విగతజీవురాలైంది. దీనిపై గ్రామస్తులు తిరుగుబాటు చేసి వల్లభాపురం రేవులో ఉచిత ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయించారు. ఇదే రేవులో ఇసుక తవ్వకాలను ప్రశ్నించారనే ఆగ్రహంతో టీడీపీ నేతల అనుచరులు వల్లభాపురానికి చెందిన అవుతు చంద్రశేఖరరెడ్డిపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర రెడ్డి బొటనవేలు తెగిపోయింది. ముందు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. తెలుగుదేశం నేతల జోక్యంతో సాధారణ దాడి కేసుగా మార్చారు. ఎగ్జిబిషన్లకు అనుమతులు.. సుప్రీం కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సొసైటీ, కళాశాల యాజమాన్యం వివాదాస్పద స్థలాన్ని ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి అనుమతించింది. స్థలం తమ చేతిలో ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పుకోవడానికి, ఆ మేరకు ఆధారాలు సంపాదించుకోవడానికి వీలుగా అధికార బలంతో ఎగ్జిబిషన్, శుభకార్యాల నిర్వహణకు స్థలాన్ని ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ. 15 కోట్లకుపైనే పలుకుతోంది. భారీ ఇసుక దోపిడీ... 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే ఆలపాటి కనుసన్నల్లో కృష్ణానది భూముల్లో మేట పేరుతో అవినీతి వేట సాగింది. గోరంత భూమికి అనుమతులు తీసుకొని, కొండంత మేర ఆక్రమించటం, ఆ పరిధిలో ఇసుకను తవ్వేసుకొని రూ. కోట్ల రూపాయలను పిండుకోవడం ఈ నాలుగున్నరేళ్లలో పరిపాటిగా మారింది. కొల్లిపర మండం అన్నవరం పరిధిలో కేవలం 1.70 ఎకరాల్లో ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు పొందారు. కానీ 30 ఎకరాలకుపైగానే తవ్వేసి రూ. 20 కోట్లు ఎమ్మెల్యే దండుకున్నారన్నది బహిరంగ రహస్యం. పాత బొమ్మువానిపాలెం ఉచిత ఇసుక రేవు గుంటూరుకు చెందిన తెలుగుదేశం నేత నల్లమోతు శ్రీను కనుసన్నల్లో నడిచింది. అనుమతులకు మించి ఇక్కడ కూడా 21 ఎకరాల్లో ఇసుక తవ్వుకుని రూ. 10 కోట్లు సంపాదించారు. 2016లో డ్వాక్రా మహిళల పేరిట రూ.3 కోట్ల విలువైన ఇసుకను ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన బినామీలు తవ్వి అమ్ముకున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద నాలుగున్నరేళ్లలో కృష్ణానదిలో ఇసుక తవ్వి ఎమ్మెల్యే రూ. 200 కోట్లు గడించారు. -
టీడీపీ అభ్యర్థి కారు ఢీకొని యువకుడి మృతి
-
టీడీపీ అభ్యర్థి కారు ఢీకొని యువకుడి మృతి
తెనాలి: తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సతీమణి మాధవి ప్రయాణిస్తున్న కారు, బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వేరొక వాహనంలో మాధవి వెళ్లిపోగా, క్షతగాత్రులను తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వీరిలో ఒక యువకుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆలపాటి మాధవి, హనుమాన్‌పాలెం–గుంటూరు రహదారిలో తిరిగి వెళుతుండగా, రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. తెనాలి రూరల్ మండలం ఖాజీపేట సెంటరులో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో బైకుపై వస్తున్న సమీప కొలకలూరు గ్రామ యువకులు సుద్దపల్లి రవీంద్ర (30), పొన్నెకంటి పవన్‌కుమార్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని తెనాలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పవన్‌కుమార్ మృతి చెందగా, రవీంద్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. విషయం తెలిసిన కొలకలూరు దళితవాడ ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకుని, ఆందోళన చేపట్టారు. తెనాలి రూరల్ ఎస్ఐ రాంబాబు అక్కడకు చేరుకుని న్యాయం చేస్తామని పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఐ హేట్యూ.. రాజా
సాక్షి,తెనాలి : కల్మషం లేని ప్రజానీకం.. కల్చర్ నేర్చిన పట్టణం. ఉద్యమాలకు పురిటి గడ్డ.. ఒకప్పుడు జలరవాణాకు వాణిజ్య కేంద్రం. సాహిత్య సామ్రాజ్యం.. ఇలాంటి విశిష్టతలెన్నో ఉన్న ఆంధ్రా ప్యారిస్ తెనాలికి రాజకీయంగానూ ప్రత్యేకత ఉంది. ఎన్నికల నగారా మోగిన తరుణంలో ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అదే ఇప్పుడు అధికార టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. అసమ్మతి సెగలు రాజేస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై సొంత సామాజిక వర్గమే గుర్రుగా ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే, మరికొందరు అలకపాన్పుఎక్కుతున్నారు. వారిని బుజ్జగించలేక.. మండే ఎండలో ప్రచారం చేయలేక.. ఇప్పుడెలా అంటూ ఆలపాటి దిక్కులు చూస్తున్నారు. నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత జరగనున్న రెండో పర్యాయం ఎన్నికల్లో మళ్లీ త్రిముఖ పోటీ నెలకొంది. అధికార టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ ఈ సారి ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే మంచి పేరుంది. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు చివరి స్పీకరుగా పనిచేసి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన నాదెండ్ల మనోహర్ ఈసారి జనసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూలు ముందు నుంచి ప్రారంభమైన∙చేరికలు, ప్రచారం పుంజుకునేకొద్దీ ఊపందుకున్నాయి. దూరం పెరుగుతోంది.. పొరుగు నియోజకవర్గం నుంచి వలస వచ్చిన టీడీపీ అభ్యర్థి రాజేంద్రప్రసాద్ నివాసం గుంటూరులో ఉంది. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు సహా వివిధ వ్యాపారాల నిర్వహణలో బిజీగా ఉండే ఆలపాటి, గుంటూరు కేంద్రంగానే వీటిని నిర్వర్తిస్తుంటారు. నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా గుంటూరుకు చెందిన అస్మదీయులే వెంట ఉంటారు. ఇక్కడి వ్యాపార లావాదేవీలన్నీ వారే పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆలపాటి ఆయన ఆంతరంగికుడితో అంతర్గత విభేదాల కారణంగా ఒకరొకరుగా దూరమవుతూ వచ్చారు. ప్రస్తుతం అన్నంగి శ్రీను ఒక్కరే గుంటూరు నుంచి వస్తున్నారు. స్థానికంగా కూడా పట్టణ పార్టీ నేత, మరొక ఆంతరంగికుడికి మినహా మిగిలిన ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వటం లేదనీ, తమ మాట వినిపించుకున్న పాపాన పోవటం లేదని ద్వితీయశ్రేణి పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. అక్కడ పార్టీ ఖాళీ.. ఆలపాటి సన్నిహితుల హవాతో టీడీపీలో సొంత సామాజికవర్గంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో క్రియాశీలకంగా ఉండే మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, పార్టీ గ్రాడ్యుయేట్స్ విభాగం జిల్లా నాయకుడు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉండిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారని తెలుసుకున్న ఆలపాటి, స్వయంగా వెళ్లి, దూతలను పంపి, ఏదోరకంగా సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి, వ్యాపార ప్రముఖుడిని ఇదే తరహాలో బుజ్జగిస్తున్నట్టు సమాచారం. ఇన్ని చేస్తున్నా కొల్లిపరలో పార్టీలోని అక్కడి కీలక సామాజికవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ, జనసేనలో చేరటంతో అక్కడ టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లు తెలుస్తోంది. ప్రచారానికి వెళ్లిన ఆలపాటిని, ఆయన సతీమణిని అభివృద్ధి ఎక్కడంటూ స్థానికులు నిలదీస్తున్నారు. అసమ్మతి నేతలతో తంటాలు.. పట్టణంలోని పలు వార్డుల్లోని అసమ్మతి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. పట్టణ 16వ వార్డులోని టీడీపీ కౌన్సిలర్, ఆమె భర్త భారీ సంఖ్యలో అనుచరులతో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీలో తాను ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావని అప్పట్లో వారు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. 33వ వార్డు కౌన్సిలర్ కూడా ఇదే తరహాలో టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వివిధ వార్డుల నుంచి స్థానిక ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే ఆలపాటిపై అలకబూనారు. ఆలపాటి స్వయంగా ఇంటికెళ్లి బతిమిలాడినా, దిగిరాలేదని నియో జకవర్గంలో గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ వ్యక్తి∙మళ్లీ ప్రచారంలో పాల్గొనటంతో, ఏదొక పదవి హామీతోనే అలక విరమించి ఉంటారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పెచ్చుమీరిన అవినీతి నియోజకవర్గంలో అవినీతి పరాకాష్టకు చేరుకోవటం, కొల్లిపర మండల పరిధిలోని కృష్ణానదిలో ఇసుక మేట పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు, నీరు–చెట్టు పథకం అక్రమాలకు నిలయంగా మార్చటం, పట్టణంలో టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారమెత్తి మురుగు కాలువలు, రోడ్లు పేరుతో డబ్బు దోచుకోవటం, పట్టణంలో గత నాలుగేళ్లలో నిర్మించిన భవనాలకు ప్రతి అంతస్తుకో రేటు చొప్పున నిర్ణయించి, వసూళు సాగిస్తున్న వైనం టీడీపీ సానుభూతిపరులను కూడా ఆలోచింపజేస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమార్జనపై స్థానికులు ఏవగించుకుంటున్నారు. ఆలపాటికి ఆంతరంగికులైన కోటరీ చర్యల కారణంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెట్టి పనిచేసే నాయకులు, కార్యకరులు దూరమయ్యారు. ఫలితంగానే ఈ పర్యాయం ఎన్నికల్లో టీడీపీ గట్టెక్కటం అసాధ్యమనే భావనతోనే అసమ్మతి సెగ ఊపందుకుంటుంది. -
జంధ్యాల మార్క్ కామెడీతో.
హాస్యనటుడు అలీ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. (వీడు ఫోటో తీస్తే పెళ్లి అయిపోద్ది) అన్నది ట్యాగ్‌లైన్. రిషిత కథానాయికగా నటిస్తున్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో పెదరావూరు ఫిల్మ్ స్టూడియో పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్లాప్ ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘హాస్యానికి, అపహాస్యానికి రెండు అక్షరాలు మాత్రమే తేడా. దీన్ని గమనించే పూర్తిస్థాయి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులతో మా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హాస్యంలో జంధ్యాలగారి, దర్శకత్వంలో బాలచందర్‌గారి ప్రభావం నాపై ఉంటుంది. అందుకే దేవుళ్లను మొక్కకుండా వారికే మొక్కాను. ఈ సినిమా జంధ్యాల మార్క్ కామెడీగా ఉంటుంది’’ అన్నారు. ‘‘కథ చాలా బాగుంది. ఇళయరాజాగారి వద్ద పనిచేసిన యాజమాన్య సంగీతంలో, శ్రేయా ఘోషల్ పాడిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయి. చాలా కాలం తర్వాత ఫుల్ కామెడీ సినిమా చేస్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని అలీ అన్నారు. ప్రదీప్ రావత్, జీవ, సుధ, దేవిశ్రీ, ‘చిత్రం’ శ్రీను, టీనా చౌదరి, ‘జబర్దస్త్’ రాము తదితరులు నటిస్తున్నారు. -
సింగిల్ షెడ్యూల్లో...
ఆయూష్, వర్ణిక హీరో హీరోయిన్లుగా రవికుమార్ పొన్నగంటి దర్శకత్వంలో వ్యాంకిష్ మీడియా పతాకంపై షేక్ గౌస్ నిర్మిస్తున్న చిత్రం గుంటూరులో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్లాప్‌నివ్వగా, నిర్మాత షేక్ గౌస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. గుంటూరు ఎస్.పి వై.టి. నాయుడు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ –‘‘నాన్‌స్టాప్‌గా ఒకే షెడ్యూల్లో సినిమా కంప్లీట్ చేయనున్నాం. కలకత్తా, వైజాగ్, బ్యాంకాక్‌లో షూటింగ్ జరపనున్నాం. ఏప్రిల్ చివరి వారంలో లేదా మే ఫస్ట్ వీక్‌లో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అమ్మపండు, కెమెరా: దుర్గా ప్రసాద్. -
'ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయండి'
హైదరాబాద్: తెనాలి ఎమ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్‌తోపాటు మరో నలుగరిపై కేసు నమోదు చేయాలని మేడ్చల్ కోర్టు జీడిమెట్ల పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వారిపై 420, 458, 471, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొంది. అలాగే కుత్బుల్లాపూర్ మాజీ కార్పొరేటర్‌తోపాటు మున్సిపల్ మాజీ కమిషనర్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఎన్నారై కాలేజీ అక్రమ అనుమతుల నేపథ్యంలో మేడ్చల్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. -
అందరూ ఆశావహులే...
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా వ్యవధి ఉండటంతో మంత్రి పదవులకోసం పోటీ ఎక్కువైంది. జిల్లాలో ఆశావహుల సంఖ్య బాగానే ఉంది. సీనియారిటీ, సిన్సియారిటీ అంటూ కొంతమంది నేతలు చెబుతుంటే మరికొంత మంది మాత్రం సామాజిక వర్గాన్ని నమ్ముకుంటున్నారు. గ్రూపులుగా విడిపోయిన దేశం ఎమ్మెల్యేలు మంత్రి పదవి తనదంటే తనదేనని అనుయాయుల వద్ద చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, గుంటూరు: జిల్లాలో 17 శాసనసభ స్థానాలకూ 12 స్థానాలను దక్కించుకుని పట్టు సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు మంత్రి పదవులకోసం పట్టుపడుతున్నారు. సీనియారిటీ... సామాజికవర్గాలవారీగా తమకు అనుకూలమైన సమీకరణలు సృష్టించుకుని అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అవసరాన్ని బట్టి పైరవీలూ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా జిల్లా నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(తెనాలి), ధూళిపాళ్ల నరేంద్ర(పొన్నూరు), ప్రత్తిపాటి పుల్లారావు(చిలకలూరిపేట), యరపతినేని శ్రీనివాసరావు(గురజాల),కోడెలశివప్రసాదరావు(సత్తెనపల్లి),జి.వి.ఆంజనేయులు(వినుకొండ), మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి(గుంటూరువెస్ట్), నక్కా ఆనంద్‌బాబు(వేమూరు) మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. అయితే వీరిలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నక్కా ఆనందబాబు తప్ప మిగిలిన వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. వీరిలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుంద న్న ధీమాలో ధూళిపాళ్ల నరేంద్ర ఉండగా, మాజీ మంత్రులైన ఆలపాటి రాజేంద్రప్రసాద్, కోడెల శివప్రసాద్‌లు అనుభవమున్న తమకు తప్పకుండా మంత్రిపదవి వస్తుందని భావిస్తున్నారు. అదేసమయంలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా పదేళ్ల పాటు పార్టీకి సేవలందించిన తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ప్రత్తిపాటి పుల్లారావు అధిష్టానం వద్ద ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఎవరూ చంద్రబాబునాయుడు పర్యటనకు ముందుకు రాలేదని, ఆ సమయంలో తన నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేసి విజయవంతం చేశానని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెబుతున్నారు. అలాగే వినుకొండ నుంచి రెండుసార్లు ఎక్కువ మెజార్టీతో గెలిపించిన తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కొంతమంది అధిష్టానానికి దగ్గరగా ఉండే నేతలతో వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సిఫార్సులు చేయిస్తున్నారు. మాకు రాకున్నా... ఆయనకు రాకూడదు జిల్లాలో తమలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు కాని కోడెలకు మాత్రం మంత్రి పదవి ఇవ్వవద్దంటూ కొంతమంది నాయకులు చంద్రబాబునాయుడును కోరినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కోడెలకు బీజేపీ అగ్రనాయకుడైన వెంకయ్యనాయుడుతో మంచి సంబంధాలు ఉండటంతో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవచ్చనే అనుమానాలను సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. గ్రూపులుగా విడిపోయిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక నరసరావుపేట ఎంపీగా పోటీచేసే అవకాశమివ్వాలని కోరిన వేణుగోపాలరెడ్డిని గుంటూరు పశ్చిమనుంచి పోటీచేసి గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తానంటూ బాబు హామీ ఇచ్చారనీ, దాని ప్రకారం తనకు అవకాశం తప్పక దక్కుతుందని ఆయన అనుయాయుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదెంతవరకు నిలబెట్టుకుంటారన్నది వేచి చూడాలి. వేమూరు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నక్కా ఆనందబాబుకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆయన అనుయాయులు ఆశపడుతున్నారు. అయితే ఇందులో మరో చిన్న తిరకాసును సైతం వారు చెబుతున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తే ఆయన శిష్యుడైన నక్కా ఆనందబాబుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. పైరవీల జోరు.. టీడీపీలో చక్రం తిప్పుతున్న సుజనాచౌదరి, సీఎం రమేష్‌తో కొంతమంది నాయకులు సంప్రదింపులు జరుపుతుండగా మరికొంతమంది మాత్రం బీజేపీలోని జాతీయ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుంటున్నారు. ఏది ఏమైనా జూన్2న కొత్త రాష్ట్రం అవతరించిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గం కూర్పు పెద్ద సవాల్ కాకతప్పదని భావిస్తున్నారు.