'స్వచ్ఛ భారత్లో అందరూ భాగస్వాములు కావాలి'
తూర్పుగోదావరి (అంబాజీపేట): తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని ఇరుసుమందలో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రామన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు ఏజీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులకోసం రూ. 70కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు.