Allan Lichtman
-
Nostradamus: కమలా హారిస్‌దే విజయం
నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికా ఎన్నికల నోస్ట్రడామస్‌గా పేరొందిన చరిత్రకారుడు అలాన్ లిచ్‌మన్ జోస్యం చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అలాన్ దాదాపు ఖచ్చితంగా ఊహించి చెప్పడం విశేషం. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని్రష్కమిస్తే వాళ్ల పార్టీ గెలుపు కష్టమేనన్న ఆయన.. ఇప్పుడు హారిస్ వచ్చాక తప్పక విజయం సాధిస్తారని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. డెమొక్రాట్లు అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించిన కమలా హారిస్ అంతే ధీమాతో దూసుకెళ్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఓడించేందుకు రెడీ అయ్యారని అలాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితం ఏమిటన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బయటకు వచ్చి ఓటు వేయండి’’అని తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు ఇచి్చన 7 నిమిషాల వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. 1984 నుంచి విశ్లేషణలు 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ ‘గెలుపునకు 13 సూత్రాలు’అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనావేస్తానని చెప్పారు. 2016లో ట్రంప్ గెలుస్తాడని, 2020లో బైడెన్ గెలుస్తాడని చెప్పిన మాటలు నిజం కావడం విశేషం. 2000లో అల్‌గోర్‌పై జార్జి డబ్ల్యూ బుష్ విజయం సాధించడం మినహా మిగిలిన ఫలితాలన్నీ ఆయన చెప్పినట్లుగా రావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రధాన ఒపీనియన్ పోల్స్ చెప్పగా.. లిచ్‌మన్ మాత్రం ట్రంప్ తిరుగులేని విజయం సాధిస్తారని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా అభిశంసనకు గురవుతారని చెప్పారు. అలాన్ చెప్పినట్లే ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కమల’ వికాసం సాధ్యమే: లిచ్‌మాన్
వాషింగ్టన్: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను దాదాపు ఖచి్చతంగా ఊహించి చెప్పిన అలాన్ లిచ్‌మాన్ మరోమారు తన విశ్లేషణను వెల్లడించారు. తాజా ఎన్నికల ప్రచార సరళి, అమెరికా ఓటర్ల మనోభావాలను లెక్కలోకి తీసుకుంటే డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే నెలలో డెమొక్రటిక్ కన్వెన్షన్ తర్వాతే తన తుది అంచనాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ 1981 ఏడాదిలో ‘గెలుపునకు 13 సూత్రాలు’ అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనా వేస్తానని ఆయన చెప్పారు. 2016లో ట్రంప్, 2020లో బైడెన్ గెలుస్తారన్న జోస్యాలు నిజమవడంతో 2024లో గెలుపుపై ఏం చెప్పబోతున్నారోనని ఆసక్తి నెలకొంది. -
వందశాతం వారు చెప్పినట్టే జరిగింది!
న్యూఢిల్లీ: అగ్రరాజ్య ఎన్నికల ఫలితాలను ఆయన ముందుగానే జోస్యం చెప్పారు. అయితే అప్పట్లో ఆయన మాటలను ఎవరూ నమ్మలేదు సరికదా... అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. అయితే సర్వేలు తారుమారయ్యాయి. అంచనాలు తలకిందులయ్యాయి. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఓటింగ్ ముందు రోజు వరకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం ఖాయమని పలు సర్వేలు చెప్పాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. దీంతో అమెరికన్ ప్రొఫెసర్ అలాన్ లిచట్మన్ జోస్యం నిజమైంది. గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆయన వేసిన అంచనా ఎన్నడూ తప్పుకాలేదు. 1984 ఎన్నికల నుంచి ఎవరు అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారో ఆయన కచ్చితంగా అంచనా వేస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మొగ్గు ఉందని సర్వేలు చెప్పినప్పటికీ.. అలాన్ మాత్రం ట్రంప్ గెలుస్తారని ఘంటాపథంగా తేల్చి చెప్పారు. లిచట్మన్ ఏదో ఆషామాషీగా అంచనా వేసి ఈ ఫలితాలను ప్రకటించలేదు. రాజకీయ అభిప్రాయాలు, ప్రాంతీయ ప్రజల మనోభావాలను అంచనా వేసి ఆయన ఈ నిర్ధారణకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే విజయం సాధిస్తారని అలాన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ట్రంప్ ఎందుకు గెలుస్తారో వివరిస్తూ 'ప్రిడిక్టింగ్ ద నెక్ట్స్ ప్రెసిడెంట్: ద కీస్ టు వైట్‌హౌస్ 2016' పుస్తకాన్ని ప్రచురించారు. అప్పట్లో నమ్మకపోయినా ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఈ అమెరికా ఆక్టోపస్ జోస్యం నిజమైందనుకుంటున్నారు. హెల్మట్ నార్పోత్ మోడల్ ప్రకారం... అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారంటూ.. యూఎస్ ప్రఖ్యాత ఎన్నికల నిపుణుడు హెల్మట్ నార్పోత్ కూడా తెలిపారు. ఆయన మోడల్ ప్రకారం ప్రైమరీలు, కాకసెస్ (ఆ పార్టీలోని ఎన్నికైన సభ్యులు)లో మెజారిటీ సంపాదించిన బలమైన నేత శ్వేతసౌధానికి ఎంపికవుతారు. ఈ మోడల్‌కు మారుతున్న రాజకీయ, అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం ఉండదు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రైమరీలు, కాకసెస్‌లో పార్టీపరంగా బలమైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత పార్టీలో వ్యతిరేకత ఎదురైనా ఇది ట్రంప్ విజయంపై ప్రభావం చూపదని హెల్మట్ తెలిపారు. ఈ మోడల్ ప్రకారం 1912 నుంచి ఒబామా వరకు (2000లో తప్ప) అన్ని అంచనాలు నిజమయ్యాయి. చెన్నై చాణక్య జోస్యం... మరోవైపు ట్రంప్ గెలుపుపై చెన్నై 'చాణక్య' చెప్పిన జోస్యం కూడా నిజమైంది. ఈ చాణక్య.. మనిషి అనుకుంటే పొరపాటు. చాణక్య అంటే బుల్లి చేప. హిల్లరీ, ట్రంప్ ఫొటోలను చాణక్య ఉన్న నీటి తొట్టెలో ఉంచగా, అది ట్రంప్ ఫొటోను నోటితో కరిచిపట్టుకుని జోస్యం చెప్పింది. రెండు రోజుల క్రితం చాణక్య చెప్పిన జోస్యంపై గురి కుదరకపోయినా తాజా ఫలితాలతో అది వాస్తవమని తేలింది. గతంలోనూ ఫుట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా చాణక్య చెప్పిన జోస్యాలు నిజమయ్యాయి. అలాగే 2015 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా చాణక్య జోస్యానికి యమ క్రేజ్ ఏర్పడింది. ట్రంప్ ఘన విజయంతో చాణక్య మరోసారి వార్తల్లో నిలిచింది. -
ట్రంప్‌పై అమెరికా ఆక్టోపస్ పక్కా జోస్యం!
నవంబర్ 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పగలరా? హోరాహోరీగా తలపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరు గెలుస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ ఒక్క వ్యక్తి మాత్రం అగ్రరాజ్య ఎన్నికల ఫలితం తనకు తెలుసు అని అంటున్నాడు. ఆయనే ప్రొఫెసర్ అలాన్ లిచట్మన్. గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆయన వేసిన అంచనా ఎన్నడూ తప్పుకాలేదు. 1984 ఎన్నికల నుంచి ఎవరు అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారో ఆయన కచ్చితంగా అంచనా వేస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మొగ్గు ఉందని సర్వేలు చెప్తున్నా.. అలాన్ మాత్రం ట్రంప్పే గెలిచే అవకాశముందని అంచనా వేస్తున్నాడు. లిచట్మన్ ఏదో ఆషామాషీగా అంచనా వేసి ఈ ఫలితాలను ప్రకటించలేదు. రాజకీయ అభిప్రాయాలు, ప్రాంతీయ ప్రజల మనోభావాలను అంచనా వేసి ఆయన ఈ నిర్ధారణకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే గెలిచే అవకాశముందని ఆయన చెప్ప్తున్నారు. ఈ మేరకు ట్రంప్ ఎందుకు గెలిచే అవకాశముందో వివరిస్తూ 'ప్రిడిక్టింగ్ ద నెక్ట్స్ ప్రెసిడెంట్: ద కీస్ టు వైట్‌హౌస్ 2016' పుస్తకాన్ని ప్రచురించారు. పార్టీ మ్యాండెట్, ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్థిక విధానాలు, సామాజిక అనిశ్చితి, విదేశాంగ, సైనిక విధానాలు ఇలాంటి చాలా అంశాలను బేరీజు వేసి ఈసారి ఆయన ట్రంప్‌కు ఓటువేశారు. మరీ ఈసారి ఎన్నికల్లో ఈ అమెరికా ఆక్టోపస్ జోస్యం నిజమవుతుందా? చూడాలి.