amita singh
-
రాజుగారి పెద్ద భార్యదే పైచేయి
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన అమేథి అసెంబ్లీ ఎన్నికల్లో రేపిస్టు మంత్రి గాయత్రి ప్రజాపతిని, తోటికోడలు అమితా సింగ్‌ను కూడా వెనక్కి నెట్టి.. పెద్ద భార్య గరిమాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు. అమేథి మహారాజాగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ సింగ్ ఇద్దరు భార్యలే గరిమా సింగ్, అమితా సింగ్. వీళ్లలో అమితాసింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమేథి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, తన మంత్రివర్గంలో సభ్యుడైన గాయత్రి ప్రజాపతికి తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సి రావడంతో ఆయన పేరును అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఇక గరిమా సింగ్ బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆమె సంజయ్‌సింగ్ నుంచి ఎప్పుడో విడిపోయారు. ఇక అమేథిలో మూడు సార్లు గెలిచిన అమితాసింగ్.. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ హవాకు తోడు తోటికోడలు కూడా కావడం, మరోవైపు బలమైన మంత్రి గాయత్రి ప్రజాపతి పోటీలో ఉండటంతో ఓట్లు బాగా చీలిపోయాయి. ఒక దశలో గాయత్రి ప్రజాపతి ఆధిక్యంలో ఉన్నా.. ఆ తర్వాత మళ్లీ గరిమాసింగ్ పుంజుకుని ముందుకొచ్చారు. అత్యాచారం కేసులో ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించినప్పటి నుంచి గాయత్రి ప్రజాపతి పరారీలో ఉన్నారు. ఆయన లక్నోలోని తన సొంతింట్లో గానీ, అమేథీలో గానీ ఎక్కడా కనిపించలేదని పోలీసులు చెప్పారు. -
మాజీ భార్య తన భార్యను ఓడిస్తుందని బెంగతో..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన అమేథి సీటుకు విచిత్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా సింగ్, ప్రస్తుతం ఉన్న భార్య అమితా సింగ్ మధ్య రసవత్తర పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్ పోటీ చేయగా బీజేపీ తరుపున సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా బరిలోకి దిగింది. తొలుత మాజీ భార్యతో పరోక్షంగా సంప్రదింపులు జరపాలనే యోచన చేసినప్పటికీ ఆ పనిని విరమించుకున్న సంజయ్ సింగ్ తానే స్వయంగా ఎన్నికల ప్రచార భారాన్ని మీద వేసుకున్నారంట. ఎట్టి పరిస్థితుల్లో తన ఇల్లాలిని ఓడిపోనివ్వకూడదని, సరిగ్గా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మాదిరిగానే ప్రతి ఇల్లు తిరిగి తలుపుకొట్టి మరి ప్రచారం చేసి ఓట్లు అడిగారంట. ఓ పక్క మాజీ భార్య, తన ప్రస్తుత భార్య మధ్య రాయల్ కుటుంబానికి చెందిన ఆయన పరిస్థితి చూసి ఓట్లర్లంతా అయ్యోపాపం అనుకున్నారట. ప్రచారంలో ఎంతసేపటికి బీజేపీపైనే విమర్శలు చేసిన ఆయన తన మాజీ భార్యపై దురుసుగా ఒక్క కామెంట్ కూడా చేయలేదని, కేవలం తన ప్రస్తుత భార్యకు ఓటు వేయాలని మాత్రమే కోరారని తెలుస్తోంది. అయితే, ఈ నియోజకవర్గానికి సోమవారం ఎన్నికలు ముగిశాయి. దీంతో ప్రస్తుతం గెలుపు ఓటములపై సమానమైన ఆలోచనను కలిగి ఉన్నారంట. ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారని సంజయ్ సింగ్‌ను ప్రశ్నించగా.. ‘నేను నా వైపు గెలవాలని కోరుకుంటున్నాను.. ఒక వేళ ఏం జరిగినా సరే నన్ను నేను సముదాయించుకుంటాను’ అంటూ ఆయన వేదాంత ధోరణిలో సమాధానం ఇవ్వడం చూసి విలేకర్లు కూడా అహా.. అని అంటున్నారు. సంబంధిత మరిన్ని వార్తా కథనాలకూ చదవండి అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య -
అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన అమేథి సీటుకు రసవత్తర పోటీ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్ పోటీ చేస్తారని ముందుగా రాజకీయవర్గాలు భావించాయి. అయితే ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్–సమాజ్‌వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గాయత్రి ప్రజాపతి పోటీచేస్తారని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దీంతో తాను తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తానని అమితా సింగ్ ప్రకటించారు. గాయత్రి ప్రజాపతి సిట్టింగ్ సభ్యుడే కాకుండా అఖిలేష్ క్యాబినెట్లో మంత్రి కూడా. ఇక అమితా సింగ్ అమేథి మహారాజాగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ సింగ్‌కు రెండో భార్య. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గరిమా సింగ్‌ను ఎంపిక చేసింది. ఆమె సంజయ్ సింగ్ నుంచి విడిపోయిన మొదటి భార్య కావడం విశేషం. అమేథి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానని అమితా సింగ్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే అమేథి, సమీపంలోని రాయ్‌బరేలి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పదేసి స్థానాలను చెరిసగం పంచుకోవాలని రాహుల్, అఖిలేష్ నిర్ణయించడంతో అమితా సింగ్‌కు అభ్యర్థిత్వం దక్కలేదు. ‘అమేథి నా కుటుంబం, నా ఇల్లు, దీన్ని నేను వదిలిపెట్టలేను. ఈ నియోజకవర్గం అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను’ అని అమితా సింగ్ తెలిపారు. ఈ విషయంలో పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఒకవేళ టిక్కెట్ లభించకపోతే తిరుగుబాటు అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ సీటు నుంచి మూడు సార్లు గెలిచిన ఆమె ఓ సారి మంత్రిగా కూడా పనిచేశారు. తన భర్త మాజీ భార్య అయిన గరిమా సింగ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. ప్రజలకు ఆమె ఎవరో తెలియదని, వారు కనీసం ఆమెను చూసి కూడా ఉండరని, ప్రజాజీవితంతో ఎలాంటి సంబంధం లేని ఆమెను ఎంపిక చేయడమేమిటని విమర్శించారు.