శని సింగనాపూర్ ఆలయ చైర్‌పర్సన్‌గా మహిళ
ముంబై: మహారాష్ట్రలోని ప్రఖ్యాత శని సింగనాపూర్ ఆలయ బోర్డు చైర్‌పర్సన్‌గా అనితా సేథే అనే మహిళ నియమితులయ్యారు. అయిదొందల ఏళ్లకు పైగా చరిత్రగల ఈ ఆలయానికి ఒక మహిళకు బోర్డు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. బోర్డు సభ్యుల్లో ఈమెతోపాటు మరో మహిళ ఉంది. ఆలయంలో శనిదేవునికి మహిళలు పూజలు చేయడం నిషేధం.
దీన్ని ఇటీవల ఒక మహిళ ఉల్లంఘించి పూజలు చేయడంతో వివాదం చెలరేగి ఆలయంలో సంప్రోక్షణ జరిపారు. ఈ నేపథ్యంలోనే ఒక మహిళకు బోర్డు సారథ్య బాధ్యతలను అప్పగించడం గమనార్హం. ఆలయంలో కొనసాగుతున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని సేథే అన్నారు.