awarao pet
-
అశ్వారావుపేటలో భారీ చోరీ
అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న మూర్తిరాజు కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో దొంగలు పడి ఇంట్లో ఉన్న 8 తులాల బంగారం, కిలో వెండి, రూ. 2 లక్షల విలువ చేసే పట్టుచీరలు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించిన స్థానికులు మూర్తి సహా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
అటవీ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించిన గిరిజనులు
అశ్వారావుపేట: అటవీశాఖ అధికారులు తమపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అటవీశాఖ గెస్ట్‌హౌస్‌ను ముట్టడించారు. అనంతరం చెక్‌పోస్ట్ వద్ద ధర్నా నిర్వహించారు. అటవీశాఖ అధికారులు అనవసరంగా గిరిజనులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, వాటిని ఎత్తివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని బండారుగుంపు వద్ద అటవీశాఖ అధికారులపై పోడు సాగుదారులు దాడి చేయడం... దానిపై కేసు నమోదు చేయడం తెలిసిందే.