bail extention
-
ఢిల్లీ లిక్కర్ కేసు: రౌస్ అవెన్యూ కోర్టుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. గురువారం కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిగణనలోకి తీసుకునే అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు.మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను విచారించే అవకాశం లేదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. అందుకే ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని పేర్కొంది.ఈ నెల మొదట్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం కోసం షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్ 2న మళ్లీ తిరిగి తిహార్ జైలులో లొంగిపోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. గడవు దగ్గర పడుతున్న సమయంలో అనారోగ్యానికి సంబంధించి మరో ఏడు రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణార్హమైనది కాదని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
30న సీబీఐ కోర్టులో లొంగిపోండి
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్‌ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. ఈనెల 30వ తేదీలోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లాలూను ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించడం తెల్సిందే. జైలులో లాలూ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్సకోసం బెయిలివ్వాలంటూ హైకోర్టును కోరారు. దీంతో మే 11న ఆయనకు 6 వారాల తాత్కాలిక బెయిలిచ్చింది. తర్వాత ఆ బెయిల్‌ను పొడిగించింది. తాజాగా మరో 3 నెలలపాటు బెయిల్‌ను పొడిగించాలంటూ లాలూ కోరారు. అందుకు హైకోర్టు జడ్జి నిరాకరించారు. అవసరమైనప్పుడు వైద్యం అందించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు, ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీదేవిలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. -
జయలలితకు ఊరట..
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు మరింత ఊరట లభించింది. ఆమె బెయిల్ గడువును సుప్రీంకోర్టు 2015 ఏప్రిల్ 18 వరకూ పొడిగిస్తూ తీర్పు చెప్పింది. అలాగే జయలలిత కేసును విచారించేందుకు స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయాలని కర్ణాటక హైకోర్టును ఆదేశించింది. మరోవైపు జయ కేసు విచారణ మూడు నెలల్లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
జయలలిత బెయిల్ పొడగింపు