Bank Notices
-
మాఫీ మాయ
సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): రైతులు చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా నష్టపోయారు. టీడీపీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. చినుకు రాలక ఎండిన చెరువులు, బోరుబావులతో కరువు పరిస్థితులు దాపురించి సాగు చేసిన పంటలు చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీనికి తోడు చంద్రబాబు చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం మాటతప్పి కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే చేస్తామన్నారు. ఈ నగదును కూడా ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మూడు విడతలు మాత్రమే రుణమాఫీ నగదును అరకొరగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్ము ఇస్తారేమోనని రైతులు ఇప్పటి వరకు ఎదురు చూసినా చంద్రబాబు తీరుతో వారికి నిరాశే మిగిలింది. జిల్లాలో రైతుల పరిస్థితి... వాస్తవంగా 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్రంలోని రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. ఆ తరువాత అధికారంలోకి రాగానే మాటమార్చి రుణమాఫీ పరిధిని రూ.1.50 లక్షల వరకు కుదించారు. వీటిని కూడా ఒకే సారి కాకుండా ఐదు విడతలో అందజేస్తామని బీరాలు పలికారు. కానీ చెప్పిన విధంగా తన ఐదేళ్ల పాలనలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతన్న నడ్డివిరిచారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1,56,318 మంది రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ వర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కుటుంబాల్లోని అర్హత పొందిన 3,71,484 మంది ఖాతాలకు మూడు విడతల్లో నగదు జమ చేశారు. పొన్నలూరు మండలంలో రుణమాఫీకి అర్హత పొందిన రైతులు సుమారుగా 9058 మంది ఉన్నారు. వీరందరికీ వారు తీసుకున్న బ్యాంకు రుణాల అర్హతను బట్టి రూ.44 కోట్లను ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే గత ఐదేళ్లుగా ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.26 కోట్ల రుణమాఫీ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయినా ఇంకా సుమారుగా రూ.18 కోట్లు మండలంలోని రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నగదును నాలుగు, ఐదు విడతల్లో అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంత వరకు మిగిలిన రుణమాఫీ నగదును రైతుల ఖాతాలకు జమచేయలేదు. అప్పుల ఊబిలో అన్నదాత మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికినా నేటికీ ఎలాంటి తోడ్పాటు కల్పించలేదు. పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటి సాయం ప్రభుత్వం నుంచి సక్రమంగా అందలేదు. దీంతో ప్రభుత్వ సాయంతో పాటు అనుకున్న స్థాయిలో పంటల దిగుబడులు, మద్దతు ధర లేకపోవడం వలన రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. అలాగే పండిన పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. కనీసం బీమా డబ్బులు వస్తే కొంత వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చన్న రైతుల ఆశలను చంద్రబాబు నీరుగార్చారు. రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి మోసపూరిత వాగ్దానాలు, మాయ మాటలు చెబుతూనే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు వలన నష్టపోయిన పంటలకు రైతులు ప్రీమియం డబ్బులు చెల్లించినా, ఈ ఐదేళ్ల కాలంలో బీమా చెల్లించకుండా కాలయాపన చేసింది. గ్రామాల్లో రైతులు సాగుచేసి ఎండిపోయిన పంటలను పరిశీలించి సంబంధిత వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నివేదికగా తయారుచేసి ప్రభుత్వానికి పంపించనా బీమా ఊసేలేదు. బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని తొంగలో తొక్కి పూర్తి స్థాయిలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదు. ఈ క్రమంలో బ్యాంకులు నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలని గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు వందల మంది రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు అందుతూనే ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో అరకొర నగదును రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసినా, ఆ నగదు రైతులు తీసుకున్న పెట్టుబడి రుణాల వడ్డీలకు కూడా సరిపోలేదు. ఇటువంటి తరుణంలో చెప్పిన మాటలను అమలు చేయని చంద్రబాబు మళ్లీ ఎన్నికలు రావడంతో జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లోని వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కాపీ కొడుతూ రైతులను మభ్యపెడుతున్నారు. ఎదురు చూసిన అన్నదాతలు ఇదిలా ఉంటే నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్మును గత ఏడాది డిసెంబర్ నెలలో రైతులకు అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ ఏడాది వ్యవసాయ పనులు మొదలై నెలలు గడిచినా రైతులను ఆదుకునేలా నాలుగు, ఐదో విడత రుణమాఫీ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నించ లేదు. దీంతో వ్యవసాయ పనులకు పెట్టుబడి డబ్బులు లేక రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. రుణమాఫీ సొమ్ము వారి ఖాతాల్లో జమకాకపోవడంతో గత్యంతరం లేక బయట అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి వ్యవసాయ పనులు చేపట్టారు. వర్షాభావ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి వలన సాగు చేసిన పంటలు చేతికిరాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఇటువంటి తరుణంలో కనీసం రానున్న ఎన్నికల ప్రకటనకు ముందన్నా రుణమాఫీ చేస్తే కొంత మేర ఆదుకుంటుందని ఆశపడిన రైతులకు ప్రభుత్వ తీరు వలన నిరాశ మిగిలింది. అధికారుల సమాచారం మేరకు జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కింద రూ.348.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి పది శాతం వడ్డీ కలిపితే రూ.34.81 కోట్లు చొప్పున రూ.382.98 కోట్లు అవుతుంది. దీంతో పాటు ఐదో విడత నగదు కూడా రూ.348.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇలా నాలుగు, ఐదో విడత రుణమాఫీ నగదు కలిపితే రూ.731.15 కోట్లును చంద్రబాబు ప్రభుత్వం అందించాల్సి ఉంది. రైతులను మోసం చేసిన చంద్రబాబు వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకులో రూ.5 లక్షలు రుణం తీసుకున్నాను. కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసి అరకొరగా రుణాలు మాఫీ చేయడంతో బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. ప్రభుత్వం జమ చేసిన రుణం వడ్డీలకు కూడా సరిపోలేదు. అవి కూడా మూడు విడతలు మాత్రమే ఇచ్చారు. నాలుగు, ఐదో విడత సొమ్ము ఇంత వరకు ఇవ్వలేదు. – వరికూటి బ్రహ్మరెడ్డి, రైతు, సుంకిరెడ్డిపాలెం పెట్టుబడుల కోసం అప్పులు చేశాం చంద్రబాబు రైతులను అన్ని విధాలుగా దగా చేయడం వలన రైతులు పూర్తిగా మోసపోయారు. ఈ ఏడాది వ్యవసాయ పెట్టుబడులకు రైతుల దగ్గర డబ్బులు లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేశారు. కనీసం ప్రభుత్వం నాలుగు, ఐదో విడత రుణమాఫీ డబ్బులు చెల్లిస్తే అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. – దావులూరి మాల్యాద్రి, రైతు, విప్పగుంట ప్రభుత్వం ఆదుకోలేదు నేను 15 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన పంట ఎండిపోయింది. సుమారుగా ఒక లక్ష వరకు పెట్టుబడి పెట్టాను. అంతేకాకుండా పంటకు బీమా కూడా చేశాను. ఇంత వరకు బీమా అందలేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రైతులను ఏ విషయంలో ఆదుకోలేదు. – శిరిగిరి వెంకటకృష్ణారెడ్డి, రైతు, సుంకిరెడ్డిపాలెం -
అప్పుడు కట్టొద్దన్నారు
జంగారెడ్డిగూడెం : డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఆంధ్రాబ్యాంక్ నుంచి 170 మంది మహిళలకు నోటీసులు అందాయి. దీంతో ఆ మహిళలంతా బ్యాంక్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక జగ్జీవన్‌రామ్ నగర్లో 17 గ్రూపులకు సంబంధించి 170 మందికి బ్యాంక్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, వాటిని అందుకున్న మహిళలంతా బ్యాంక్ వద్దకు చేరుకుని ఇదేం దారుణమంటూ అధికారులను నిలదీశారు. మరణించిన వారినీ వదల్లేదు మృతి చెందిన డ్వాక్రా మహిళల పేరిట కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. వర్షిత గ్రూపునకు చెందిన పినెల్లి సావిత్రి ఏడాది క్రితం మరణించింది. సావిత్రి తల్లి ముప్పిడి వీరమ్మ కూలి పనులు చేసుకుంటూ మనుమరాలిని చదివించుకుంటోంది. వర్షిత గ్రూప్‌లోని సభ్యులంతా కలసి రూ.50 వేలు రుణం తీసుకోగా, రూ. 80వేలు చెల్లించాలని అధికారులు నోటీసు పంపించారు. మృతురాలు సావిత్రికి పిన్నికూతురైన మల్లెల రఘుపతి ఆ నోటీసు తీసుకుని ఆందోళనతో బ్యాంక్‌కు చేరుకుంది. నడ్డివిరిచే వడ్డీలు జగ్జీవన్‌రామ్ నగర్‌లోని పావని గ్రూప్ మహిళలు రూ.1.47 లక్షలను రుణం తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.92 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. ఇదే గ్రూప్ సభ్యులు గృహ రుణం కింద రూ.80 వేలు తీసుకోగా, రూ.2.46 లక్షలు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. భార్గవి గ్రూప్ మహిళలు రూ.లక్ష తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.87 లక్షలు చెల్లించాలని.. అరుంధతి గ్రూప్ సభ్యులు రూ.1.81 లక్షల రుణం తీసుకోగా, రూ 3.51 లక్షలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారు. అప్పుడు కట్టొద్దని.. ఇప్పుడు నోటీసులా నోటీసులు అందుకున్న 17 గ్రూపులకు చెందిన 170 మంది మహిళలు బ్యాంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని నమ్మబలికారని, ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ రుణం చెల్లించవద్దని ఎన్నికల సభల్లో చెప్పారని బాధిత మహిళలంతా గుర్తు చేశారు. ఇప్పుడు అసలుకు రెండింతలు వడ్డీ వేసి తమ నడ్డి విరిగేలా నోటీసులు ఇచ్చి రుణాల వసూళ్లకు తమ ఇళ్లపైకి వస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రుణం చెల్లించకపోతే తమ ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపారని మహిళలు ధ్వజమెత్తారు. ‘తీసుకున్న రుణాలకు ఎటువంటి వడ్డీలు చెల్లించవద్దన్నారు. అసలుతోపాటు వడ్డీలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ మాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు ఆ హామీల విషయం మాకు తెలియదంటున్నారు. రుణం కట్టాల్సిందే అంటున్నారు. ఇదేం ఇరకాటమో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. రుణమాఫీ చేయడం చేతకాదని చెబితే తినో, తినకో రుణాలు తీర్చుకునే వాళ్లమని, ఇప్పుడు పెద్దఎత్తున వడ్డీలు వేసి అసలు కంటే రెండు రెట్లు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హామీలు అమలు చేయడమా.. ప్రజలను వంచించడమా అని ప్రశ్నించారు. దారుణంగా మోసగించారు కూలీ నాలీ చేసుకుని బతుకున్నాం. అంతంత వడ్డీలు ఎలా కట్టాలి. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారని కట్టలేదు. తీరా.. రుణం రద్దుకాకపోగా రూ.1.20 లక్షలు తీసుకుంటే ఇప్పుడు రూ.3 లక్షలు కట్టమని నోటీసులు అందాయి. ఈ మొత్తాన్ని మేం ఎలా కట్టాలి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. – బొబ్బర వెంకాయమ్మ, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం అధికారులు బెదిరిస్తున్నారు బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారు. డ్వాక్రా రుణం చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణం మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రూ.లక్ష తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.2.50 లక్షలు అయ్యింది. రోజువారీ పనిచేసుకునే మేం ఇంత సొమ్ము ఎక్కడినుంచి తెచ్చి కట్టాలి. – కొత్తూరు లక్ష్మి, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం చనిపోయిన వాళ్లకూ నోటీసులు ఇచ్చారు మా పెద్దమ్మ కూతురు పినెల్లి సావిత్రి. ఆమె మృతిచెంది ఏడాదైంది. చనిపోయిన సావిత్రి పేరిట కూడా రుణం కట్టాలని నోటీసులు ఇచ్చారు. మా పెద్దమ్మ ముప్పిడి వీరమ్మ వృద్ధురాలు. కూలి పనులు చేసుకుంటూ సావిత్రి కూతుర్ని చదివిస్తోంది. ఆ వృద్ధురాలు బకాయిల్ని ఎలా చెల్లించగలదు. – మల్లెల రఘుపతి, జంగారెడ్డిగూడెం -

ఆయన మాట.. ముంచె నట్టేట!
డ్వాక్రా మహిళలకు బ్యాంకర్ల బెదిరింపులు ఆస్తులు జప్తు అంటూ బ్యాంకు నోటీసులు బెంబేలెత్తుతున్న డ్వాక్రా మహిళలు వైఎస్సార్ సీపీ నేతల వద్ద ఆవేదన ‘సకాలంలో వాయిదాలు కట్టకపోవడం వల్ల మీకు వడ్డీ రాయితీ రాకపోవడంతో పాటు చట్టరీత్యా తీసుకునే చర్యలకు మీరే బాధ్యులు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే అవకాశంతో పాటు అర్హత కోల్పోతారు. బాకీ వసూలుకు కోర్టు, పోలీసు, రెవెన్యూ వారి సహకారంతో మీ ఆస్తులు, సామగ్రి, ఇతర వస్తువులను జప్తు చేస్తాం.’ – డ్వాక్రా రుణాలు చెల్లించాలంటూ మండపేట మండలం తాపేశ్వరంలోని ఐఓబీ ఇచ్చిన నోటీసు సారాంశమిది. – మండపేట డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది నేనేనని చెప్పుకొనే చంద్రబాబు ఇప్పుడు ఆ సంఘాలను నిండా ముంచారు. రుణమాఫీ జరగక వడ్డీతో కలి పి రుణభారం పెరిగిపోగా, తిరిగి చెల్లించకుంటే ఇళ్లకు తాళాలు వేస్తామంటూ బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మహిళలు బెంబేలెత్తుతున్నారు. నమ్మి ఓట్లేస్తే, కోర్టు నోటీసులు ఇప్పిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే మండలంలోని తాపేశ్వరంలో డ్వాక్రా మహిళలకు కోర్టు ద్వారా బ్యాంకు నోటీసులు జారీ చేయగా, జిల్లాలోని పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. మాట మార్చిన బాబు డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తాం, బకాయిలు ఎవరూ చెల్లించనవసరం లేదంటూ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం డ్వాక్రా సంఘాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చంద్రబాబు హామీని నమ్మి ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నుంచీ మహిళలు రుణాలు చెల్లించడం మానేశారు. అధికారంలోకి వచ్చాక రుణాలన్నీ రద్దు కావు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వరకు భారం మాత్రమే తగ్గిస్తామంటూ మాటమార్చారు. ఆ మొత్తాన్ని మూడు దఫాలుగా పొదుపు ఖాతాలకు జమ చేస్తామనడంతో కంగుతినడం మహిళల వంతైంది. వారి అప్పులపై వడ్డీ భారం పెరిగిపోయింది. బ్యాంకుల వేధింపులు జిల్లావ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో సుమారు 18 వేల గ్రూపులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 77,800 సంఘాలున్నాయి. అధిక శాతం సంఘాలు వడ్డీ రాయితీకి దూరమయ్యాయి. పాత బకాయిలు పేరుకుపోయాయంటూ కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపుతుండటంతో, రుణ లక్ష్యాలను చేరుకోవడం గగనంగా మారింది. పొదుపు ఖాతాల్లోని సొమ్మును వడ్డీకి జమ చేసుకుంటున్నారని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్యాంకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. సకాలంలో రుణాలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ ఇప్పటికే మండపేట మండలం తాపేశ్వరంలోని బ్యాంకు అధికారులు డ్వాక్రా సంఘాలకు కోర్టు నోటీసులు జారీచేయడం వెలుగుచూసింది. నమ్మించి మోసగించారు : వైఎస్సార్ సీపీ నేతల వద్ద ఆవేదన రుణాలు మాఫీ చేస్తామంటూ నమ్మించి మోసగించారని తాపేశ్వరంలోని డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపు సొమ్మును వడ్డీగా జమ చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు రెండు రోజుల క్రితం డ్వాక్రా మహిళలను కలిశారు. బ్యాంకు నుంచి వచ్చిన కోర్టు నోటీసులను మహిళలు వారికి చూపించారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి డ్వాక్రా మహిళలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. అధైర్యపడవద్దని, రుణమాఫీ హామీ అమలుకు అధికార పార్టీ నేతలను నిలదీయాలని సూచించారు. యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు వారి వెంట ఉన్నారు. నమ్మి ఓట్లేస్తే.. నోటీసులిప్పిస్తున్నారు గతంలో సకాలంలో రుణాలు చెల్లించేవాళ్లం. రుణమాఫీ చేయక అసలు, వడ్డీ కలిపి రుణభారం బాగా పెరిగిపోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మాకు కోర్టు నోటీసులు ఇప్పిస్తున్నారు. – దొండపాటి సరస్వతి, తాపేశ్వరం ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు రుణాలు చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు. మా ఖాతాలోని పొదుపు సొమ్మును కూడా వడ్డీగా జమ చేసుకున్నారు. తరచూ వచ్చి మమ్మిల్ని బెదిరించి వెళుతున్నారు. రేషన్ సరుకులు, మీ పిల్లల స్కాలర్షిప్లు, పింఛను సాయాన్ని ఆపేస్తామంటున్నారు. – కౌరోజు మంగ, తాపేశ్వరం చెప్పిన వారిని తీసుకురమ్మంటున్నారు రుణాలు రద్దయిపోతాయి, కట్టొద్దని చెప్పడం వల్లే చెల్లించలేదని చెబితే, మాకు సంబంధం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రు ణాలు కట్టొద్దని చెప్పిన వారిని తీసుకురమ్మంటున్నారు. వచ్చినప్పుడల్లా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాం. – తాతపూడి పాప, తాపేశ్వరం -
అన్నపూర్ణ స్టూడియోకు బ్యాంకు నోటీసులు
హైదరాబాద్: తమ వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని అన్నపూర్ణ స్టూడియోకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు రెండు జాతీయ బ్యాంకులు సోమవారం నోటీసులు జారీ చేశాయి. బంజారాహిల్స్ రోడ్ నం 2లోని అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం ఇండియన్ బ్యాంక్‌కు రూ.32,30,60,281 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.29,76,70,292 కోట్లు బకాయి పడింది. 2014 జనవరి 2న డిమాండ్ నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో అన్నపూర్ణ స్టూడియో కార్యాలయంలో నోటీసులను అందజేశారు. అన్నపూర్ణ స్టూడియోకు చెందిన ఆస్తులు తమ స్వాధీనంలో ఉన్నాయని వీటిపై ఎవరూ ఎలాంటి లావాదేవీలు జరపవద్దని నోటీసుల్లో హెచ్చరించారు. -
‘బంధు’ బాగోతం
సాక్షి, ఖమ్మం:మెప్మా లింకేజి రుణాన్ని కార్పొరేషన్..ఆ సంస్థ సిబ్బంది కుమ్మక్కై స్వాహా చేసినట్లు సమాచారం. ఈ సంస్థల్లోని కొంతమంది సిబ్బంది బంధుగణం పేరుతో బినామీ గ్రూపులను సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా లింకేజి రుణాన్ని అందినకాడికి దండుకున్నారు. ఒక్క ఏపీజీవీబీలోనే 18 గ్రూపులను డిఫాల్టర్‌గా గుర్తించారు. ఈ గ్రూపులు రూ.52 లక్షలకు పైగా రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో ఈ స్వాహా బండా రం బయటపడింది. ఈ విషయమై కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి మెప్మా అధికారులను ఆరా తీశారు. పూర్తి వివరాలు నివేదికగా అందజేయాలని పీడీని ఆదేశించారు. కార్పొరేషన్ ఆవరణలోని ఏపీజీవీబీలో 10 గ్రూపులు రూ.36 లక్షల వరకు రుణం తీసుకున్నాయి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించగా మిగతా రూ.34 లక్షలు బకాయిగా ఉంది. ఇందులో కొన్ని రుణాలు 2012 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. రుణాలు పొందిన వారికి పలుమార్లు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరు ఎంతకు చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా ప్రకటించారు. వీరు రుణం ఎందుకు చెల్లించడం లేదు, రికవరీ చేయాలంటూ మెప్మా అధికారులకు ఈ గ్రూపుల జాబితాను అందజేశారు. చర్చికాంపౌండ్‌లో ఈ బ్యాంకు బ్రాంచ్‌లో కూడా ఇదే రీతిలో 8 గ్రూపుల పేరుతో రూ.18 లక్షల వరకు రుణం తీసుకున్నారు. ఈ గ్రూపులు కూడా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు డిఫాల్టర్స్‌గా ప్రకటించి మెప్మాకు సమాచారం అందజేశారు. బినామీ గ్రూపులు ప్రతి నెల రుణం చెల్లిస్తున్న ఒక్కో గ్రూపు నుంచి ఇద్దరి చొప్పున సభ్యులతో మొత్తం ఇలా పది మందితో ఒక్కో బినామీ గ్రూపును ఏర్పాటు చేశారు. కార్పొరేషన్, మెప్మాలోని కొంతమంది సిబ్బంది తమ బంధువులతో ఇలా గ్రూపులను ఏర్పాటు చేసి రుణం పొందారు. ఈ తతంగంలో మెప్మాలో పనిచేస్తున్న ఓ రిసోర్సు పర్సన్‌తో పాటు మరో కమ్యూనిటీ ఆర్గనైజర్ ప్రధాన పాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఇలా ఏపీజీవీబీలోని రెండు బ్రాంచ్‌ల్లో కలిపి రుణం స్వాహా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మూ డు రోజులుగా నగరంలోని గాంధీనగర్, దానవాయిగూడెం, రామన్నపేటకాలనీ, రేవతిసెంటర్ ప్రాంతాల్లో 20 మంది రిసోర్సు పర్సన్లతో మెప్మా ఉన్నతాధికారులు రహస్య విచారణ చేయిస్తున్నారు. విచారణలో గ్రూపుల వారీగా వివరాలు తీస్తే ఒక వ్యక్తి రెండుకు మించి గ్రూపుల్లో రుణం పొందినట్లు వెల్లడైంది. దీని వెనక కొంతమంది నాయకులు, ఉద్యోగుల ఉన్నట్లు సమాచారం. బ్యాంకు క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర బ్యాంకులో ఒక గ్రూపునకు రుణం మంజూరు చేయాలంటే రిసోర్సుపర్సన్తో పాటు కమ్యూనిటీ ఆర్గనైజర్ తప్పనిసరి అన్ని పత్రాలను తనిఖీ చే యాలి. సరిగా ఉంటేనే సంతకం చేయాలి. దీన్ని బ్యాంకు అధికారులకు ఇవ్వాలి. వాటిని బ్యాంకు క్షేత్ర స్థాయి సిబ్బంది.. గ్రూపులో ఉన్న ప్రతి సభ్యురాలి అర్హతను పరిశీలించిన మీదటే రుణం మంజూరు అవుతుంది. ఇలా రుణం మంజూరైన తర్వాత ఆన్లైన్లో నమోదు చేస్తారు. వీధిగా నెలకు ఒకసారి ఆయా బ్యాంకులు ఏయే గ్రూపులకు ఎంత రుణం మంజూరు చేశామో మెప్మా కార్యాలయానికి పంపాలి. కానీ ఇక్కడ అదేమి జరగలేదు. రుణం మంజూరైన గ్రూపుల వివరాలు ఇటు బ్యాంకులో కానీ అటు మెప్మా కార్యాలయంలోనూ ఆన్లైన్ చేయలేదు. బ్యాంకు, మెప్మా సిబ్బంది కుమ్మక్కు కావడం వల్లే ఇప్పటి వరకు ఈ వ్యవహారం బయటకు పొక్కలేదు. ఇటీవల బ్యాంకు సిబ్బంది మారడంతో డిఫాల్టర్ గ్రూప్స్ అవినీతి వ్యవహారం బయటకు వచ్చింది. కొనసాగుతున్న విచారణ బినామీ గ్రూపుల వ్యవహారంపై మెప్మా ఉన్నతాధికారులు 20 మంది రిసోర్సుపర్సన్ల బందాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన డిఫాల్ట్ గ్రూపు జాబితాల వారీగా ఒక్కో దాంట్లో నమోదైన సభ్యులు ఉన్నారా..? ఎంత రుణం తీసుకున్నారు..? తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఓవైపు విచారణ జరుగుతుండగానే మరో వైపు రుణాలు స్వాహా చేసిన కొంత మంది సిబ్బంది ఆయా సభ్యులతో మాట్లాడుతున్నారు. ‘రుణాలు తామే చెల్లిస్తామని, ఎవరూ బాధ పడాల్సిన పని లేదు’అని నమ్మబలుకుతున్నారు. రామన్నపేటలో 6 గ్రూపులు డిఫాల్టర్స్ అని తేలడంతో రెండు రోజుల నుంచి ఇక్కడ విచారణ చేస్తున్నారు. ఇక్కడి గ్రూపు బాధ్యులు, మెప్మా అధికారులకు.. తామే ఈ రుణం చెల్లిస్తామని ఈ స్వాహాపర్వంలో భాగస్వామ్యం ఉన్న రిసోర్సు పర్సన్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ప్రాంసరీ నోటీసు ఇచ్చినట్లు సమాచారం. అసలు రూ.కోట్లలో స్వాహా జరిగినట్లు ప్రచారం జరుగుతున్నా మెప్మా ఉన్నతాధికారులు తమకేం సంబంధం లేదని చెబుతుండటం గమనార్హం. ఇంత జరిగినా మెప్మా అధికారులు బ్యాంకర్లతో సమావేశం జరపడానికి ఎందుకు వెనకాడుతున్నారది అనుమానాలకు తావిస్తోంది. నగరంలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి డిఫాల్టర్ల జాబితా తీసుకొని విచారణ చేయిస్తే అసలు ఎంత రుణం స్వాహా చేశారో పూర్తి స్థాయిలో బయటపడనుంది. కలెక్టర్ ఆదేశాలతోనైనా అధికారులు స్పంది స్తారా..? అన్నది వేచిచూడాలి. -
కౌలు రైతు అనాథే
* అరకొరగానైనా రుణ మాఫీ పొందిన కౌలు రైతు అరుదే * కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇచ్చిందే అతి తక్కువ * తొలుత కౌలు రైతుల రుణాలే మాఫీ అంటూ చంద్రబాబు ఆర్భాటం * కానీ కౌలు రైతుకు రూపాయి కూడా మాఫీ అయిన దాఖలాలే లేవు * నిలువునా మోసపోయామంటున్న కౌలురైతులు * బ్యాంకు నోటీసులు, ప్రయివేటు అప్పులతో కుదేలు * కాడి కింద పడవేయక తప్పదంటున్న కౌలు రైతులు * సాక్షి నెట్వర్క్ క్షేత్రస్థాయిలో నిర్వహించిన కేస్ స్టడీస్‌లో వాస్తవాలు చంద్రబాబు సర్కారు రుణ మాఫీ మాయాజాలంలో ఇది మరో కోణం! అరకొరగా విదిల్చిన రుణ మాఫీ సొమ్ము.. రైతులు తమ సొంత భూములపై తీసుకున్న అప్పులకు ఇప్పటివరకూ అయిన వడ్డీకి కూడా ఏ మూలకూ రాలేదు. వ్యవసాయం కోసం తాకట్టు పెట్టిన పుస్తెలు, తాళిబొట్లు విడిపించి తెస్తానన్న మాట.. నీటి మూటగానే మిగిలిపోయింది. ఒక్కటంటే ఒక్క పుస్తెల తాడు కూడా విడిపించలేదు. ఇక.. ‘ఒక పొలంపై భూ యజమాని, కౌలు రైతు ఇద్దరూ రుణం పొంది ఉంటే మాఫీ కౌలురైతుకే వర్తిస్తుంద’ని చంద్రబాబు ప్రభుత్వం గంభీరమైన ప్రకటనలు చేసింది. ఆచరణలో చూస్తే.. కౌలురైతు అనాథగానే మిగిలిపోయాడు. వారు తీసుకున్న రుణాల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల్లో ఊరూ వాడా హామీలు గుప్పించిన చంద్రబాబు అందలం ఎక్కాక ఇంత మోసం చేస్తాడనుకోలేదంటూ కౌలు రైతులు బిక్కమొహం వేస్తున్నారు. ‘‘మాకు బ్యాంకులు రుణాలు ఇవ్వడమే తక్కువ.. ఆ తక్కువ రుణాలను కూడా మాఫీ చేయకుండా మమ్మల్ని బ్యాంకులు, రెవెన్యూ ఆఫీసులు, జిరాక్సు సెంటర్ల చుట్టూ చంద్రబాబు తిప్పుతున్నాడు’’ అని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీ అమలులో కౌలు రైతుల స్థితిగతులను ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. రుణమాఫీ వల్ల సంతృప్తి చెందిన ఒక్క కౌలు రైతు కుటుంబమూ కనిపించలేదు. కనీసం పేద కౌలు రైతులకున్న రూ. 10 వేలు, రూ. 15 వేలు రుణాలు కూడా మాఫీకి నోచుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతు కార్డులు, ఆధార్ కార్డులు వంటి అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా రుణ మాఫీ ఎందుకు కాలేదని వారు అడిగితే.. సమాధానం చెప్పే వారే కరువయ్యారు. అదేమంటే ఆ ఆఫీసుకు వెళ్లు, ఈ ఆఫీసుకు వెళ్లు అని వాళ్లు కాళ్లరిగేలా తిప్పుతున్నారు. రెండు మూడేళ్లుగా అధిక వర్షాలు, తుపానుల తాకిడికి, వర్షాభావ పరిస్థితుల్లో పంటలు చేతికందక అప్పుల్లో మిగిలిన కౌలు రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. భూ యజమానులకు ముందస్తు కౌలు చెల్లించలేక, బయట ప్రైవేటు అప్పులు పుట్టక, బ్యాంకులు జారీ చేసే నోటీసులతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటను నమ్మి నిలువునా మోసపోయామని వాపోతున్నారు. - సాక్షి నెట్వర్క్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. బ్యాంకుల నిరాదరణ... ప్రభుత్వాల నిర్లక్ష్యం, బ్యాంకుల నిరాదరణ కారణంగా కౌలు రైతులు చాలా కాలంగా వ్యవస్థాగత రుణాలకు (బ్యాంకు) దూరంగానే ఉన్నారు. ఉదాహరణకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో 14.55 లక్షల మంది కౌలురైతులకు ‘ఎల్ఈసీ’ల (రుణ ఆర్హత కార్డులు) జారీ లక్ష్యంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే చివరకు జారీ చేసింది మాత్రం 4.39 లక్షల మందికే. పోనీ వీరికైనా బ్యాంకు రుణాలు అందాయా అంటే అదీలేదు. వీరిలో కేవలం 1.14 లక్షల మందికి మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. 2013-14 ఖరీఫ్‌లో రూ. 31,996 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, అందులో రూ. 26,609 కోట్లు (83 శాతం) పంట రుణాలిచ్చారు. ఇందులో కౌలురైతులకు ఇచ్చిన రుణ మొత్తం రూ. 231.70 కోట్లు మాత్రమే. 2013-14 ఖరీఫ్‌లో బ్యాంకులు ఇచ్చిన మొత్తం పంటరుణాల్లో కౌలు రైతులకు దక్కింది కేవలం 0.87 శాతం మాత్రమే. ఈ కొద్దిపాటి రుణాలను మాఫీ చేయడానికి కూడా చంద్రబాబుకు చేతులు రావడంలేదు. ఇదమిత్థమైన కారణాలు ఏమీ తెలపకుండానే వీరు మాఫీ మాఫీకి అర్హులు కాదంటున్నారు. మేం ఎందుకు అర్హులం కాదన్న కౌలు రైతుల ప్రశ్నకు అటు బ్యాంకులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ సమాధానం చెప్పడం లేదు. రైతుల ఆగ్రహాన్ని బ్యాంకులపైకి మళ్లించే ఎత్తుగడ... కౌలు రైతులకు రుణమాఫీ వర్తింప చేయడంలో ఇన్ని అవకతవకలు చోటుచేసుకుంటుంటే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా.. బ్యాం కులపై తిరగబడమంటూ రైతులకు సలహాలిస్తోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రే ‘రుణాలు మాఫీ చేయకపోతే బ్యాంకుల ముందు ఆందోళనలు చేయండి. పోలీసు కేసులు లేకుండా మేం చూసుకుంటాం’ అనడంలోని పరమార్థం ఇప్పుడిప్పుడే రైతులకు అర్థమవుతోంది.రుణమాఫీలోని డొల్లతనం కారణంగా వ్యక్తమయ్యే ఆగ్రహావేశాలను ప్రభుత్వం వైపు కాకుండా బ్యాంకుల వైపు మళ్లించే చౌకబారు ఎత్తుగడే ఇది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుణమాఫీ వర్తించక, బ్యాంకుల్లో కొత్త రుణాలు పుట్టకపోతే కాడి కిందపడేయాల్సిందే అని కౌలు రైతు అంటున్నాడు. పేరు: శేఖన్న ఊరు: కర్నూలు జిల్లా బేవినహాల్ కౌలు పొలం: 5 ఎకరాలు రుణం: రూ. 10,000, మాఫీ: ఒక్క పైసా కూడా కాలేదు కారణం: తెలీదు బాబు వచ్చాక అప్పుపోతుందనుకున్నా.. ‘‘మూడేళ్ల కిందట.. నాతో సహా ఐదుగురు కౌలు రైతులను గ్రూపుగా చేసి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున హాలహర్వి ఇండియన్ బ్యాంకు వారు రూ. 50,000 అప్పు ఇచ్చారు. మూడేళ్లుగా చెల్లిస్తూ వచ్చాం. చంద్రబాబు వచ్చాక అప్పు పోతుందని కట్టలేదు. అన్ని పత్రాలను బ్యాంకుకు ఇచ్చాను. అయినా అప్పు పోలేదు. ఇప్పుడేమో అసలు,వడ్డీ కూడా కట్టమంటున్నారు. .’’ పేరు: యనమదల సత్యనారాయణ ఊరు: తూ.గో. జిల్లా మామిడికుదురు, కౌలు భూమి: 70 సెంట్లు రుణం: రూ. 10,000 మాఫీ: పైసా కూడా కాలేదు కారణం: ఎవరూ చెప్పటం లేదు మాఫీ హామీని నమ్మి మోసపోయా ‘‘నేను 70 సెంట్లు భూమి కౌలుకు తీసుకుని వరి వేశాను. మా ఉళ్లో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకులో రూ. 10 వేలు రుణం తీసుకున్నాను. మాఫీ అయిపోతుందన్న నమ్మకంతో రుణం చెల్లించలేదు. అన్ని పత్రాలిచ్చినా మాఫీ కాలేదు. ఇప్పుడు కొత్తగా రుణం పొందే అవకాశం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రుణ మాఫీ హామీని నమ్మి మోసపోయాను. కొత్తగా అప్పు తీసుకుని వ్యవసాయం చేసుకునే వాడిని.’’ పేరు: బెలగాపు చిన పండయ్య ఊరు: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం మరువాడ కౌలు రుణం: రూ. 50,000 (మరో నలుగురు రైతులతో కలిసి) వడ్డీ: రూ. 10,000, మాఫీ: కాలేదు అన్నిపత్రాలిచ్చినా.. పైసా మాఫీ కాలేదు! ‘‘నాతోపాటు మాగ్రామానికి చెందిన బెలగాం సోములు, రాములు, మండంగి నర్శింహులు, పారయ్య తదితరులంతా కలిపి ఉమ్మడి కౌలు కార్డుతో జియ్యమ్మవలస వికాస్ గ్రామీణ బ్యాంకులో 2012-13లో రూ. 50,000 వ్యవసాయ రుణం తీసుకున్నాం. రూ. 10,000 వడ్డీ అయ్యింది. చంద్రబాబు ప్రకటనతో అప్పు తీరిపోతుందని ఆశించి ఓటేశాం. పత్రాలన్నీ ఇచ్చాం. అయితే మాకు పైసా కూడా రుణ మాఫీ కాలేదు. ’’ పేరు: పల్లంరెడ్డి సాయిమోహన్‌రెడ్డి ఊరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం కౌలు పొలం: 7 ఎకరాలు రుణం: రూ. 50వేలు, మాఫీ: కాలేదు, కారణం:తెలియదు విముక్తి పత్రం ఇచ్చి.. మాఫీ కాలేదన్నారు! ‘‘ఏడెకరాల పొలం కౌలు తీసుకున్నాను. నాలుగెకరాల కు రూ.50 వేల రుణం తీసుకొని వరి పంట వేశాను. ఇటీవల రుణవిముక్తి పత్రమిచ్చారు. కానీ గతనెల 25న నోటీసు పంపారు. ఆధార్ వివరాలు సక్రమంగా లేవని.. మాఫీ వర్తించలేదని బ్యాంకు అధికారులు చెప్పారు. కానీ వివరాలు సక్రమంగానే ఉ న్నాయి. అప్పు చెల్లించకపోతే కోర్టుకు వేస్తామంటున్నారు.’’ పేరు: కలిగినీడి దుర్గాదత్ ఊరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రుణం: రూ. 15,000 మాఫీ: రూపాయి కూడా కాలేదు కారణం: తెలియదు ఎంత తిరిగినా.. ప్రయోజనం లేదు ‘‘2012 సెప్టెంబర్‌లో నరసాపురం సహకార వ్యవసాయ పరపతి సంఘంలో రూ. 15,000 అప్పు తీసుకున్నాను. మాఫీ అవుతుందని ఆశగా ఎదురు చూసాను. అయితే పైసా కూడా రుణ మాఫీ జరగలేదు. ఆరా తీస్తే.. పాస్‌బుక్ నెంబర్ తప్పుగా ఉందన్నారు. ఏదోరకంగా రుణ మాఫీ చేయకూడదనే ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రుణ మాఫీ పేరుతో మమ్మల్ని మోసం చేసారు. పేరు: శనివాడ అప్పారావు. ఊరు: విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట కౌలు పొలం: 2.5 ఎకరాలు రుణం: రూ. 40,000 వడ్డీ: రూ. 12,000 మాఫీ: రూపాయి కూడా కాలేదు ఎంతో ఆశపడ్డాను.. ఏమీ తీరలేదు... ‘‘నా సొంత పొలం అర ఎకరాతో పాటు, రెండున్నర ఎకరాల మెరక భూమిని ఆరేళ్లుగా కౌలు చేస్తున్నాను. కౌలు రైతు కార్డు మీద బంగారాన్ని తాకట్టుపెట్టి 2013లో రూ. 40,000 పంట రుణం తీసుకున్నాను. చెరకే పంట వేస్తే వర్షాలు, తుపాను దెబ్బతీశాయి. ఇప్పుడు వడ్డీతో కలిసి రూ. 52,000 కట్టాలని, లేకపోతే బంగారం వేలం వేత్తామంటున్నారు బ్యాంకోళ్లు.’’ పేరు: పెరుమాళ్ల కోటయ్య ఊరు: గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు ఎస్సీ కాలనీ కౌలు భూమి: 1.99 ఎకరాలు రుణం: రూ. 35వేలు, వడ్డీ: రూ. 5,347, మాఫీ: కాలేదు అప్పు ఎలా తీర్చాలో అర్థం కావటంలేదు ‘‘నేను 1.99 ఎకరాల కౌలు భూమిలో మిర్చి సాగుచేసా ను. నేను ఆదర్శరైతుగా కూడా పనిచేసాను. 2012 ఆగస్టులో బంగారం తాకట్టు పెట్టి రూ. 35,000 వ్యవసాయ రుణం తీసుకున్నా. వడ్డీతో రూ. 40,347 అయింది. రుణమాఫీ జాబితాల్లో నాకు మాఫీ కాలే దని వచ్చింది. దీంతో బంగారం బయటకు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రైవేట్, బ్యాంకు అప్పు ఎలా తీరుదుందో ఏమో.’’ పేరు: ఈరమ్మ ఊరు: కర్నూలు జిల్లా తుంబళబీడు కౌలు పొలం: 6 ఎకరాలు రుణం: రూ. 15,000 మాఫీ: రూపాయి కూడా కాలేదు కారణం: ఎందుకో తెలియదు మాఫీ కాలేదు.. పంట రాలేదు.. ‘‘పదేళ్లుగా గ్రామంలో మా బంధువులకు చెందిన ఆరు ఎకరాల భూమిని నా భర్త, కుటుంబ సభ్యులతో కలిసి కౌలుకు చేస్తున్నాం. 2012-13లో ఆలూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 15,000 వేలు అప్పు ఇచ్చారు. ఆ అప్పును తిరిగి వడ్డీతో సహా ప్రతి ఏటా చెల్లిస్తున్నాం. రుణమాఫీ అవుతుందని ఈ యేడాది కట్టలేదు. కానీ బాకీ మాఫీ కింద పోలేదు. ఇప్పుడేం చేయాలో ఏమో’’ -
రైతు నెత్తిన పిడుగు
బాబు సీఎంగా ప్రమాణం చేసి నెలవుతున్నా మాఫీపై స్పష్టత కరువు తాకట్టు బంగారం, భూములు వేలం వేస్తామంటూ బ్యాంకుల హెచ్చరికలు రైతులకు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి చేస్తున్న బ్యాంకు అధికారులు పాత రుణాలు పూర్తిగా తీరనిదే కొత్తవి ఇచ్చేది లేదని స్పష్టీకరణ రైతుల్లో తీవ్ర ఆందోళన.. రుణాల మాఫీపై ఆవిరవుతున్న ఆశలు మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా రాష్ట్ర రైతాంగం.. నిపుణుల ఆందోళన నెట్వర్క్: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత మళ్లీ పెనుగండంలో పడ్డాడు. ఒకవైపు వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు సర్కారు పిల్లిమొగ్గలు.. మరోవైపు రుణాలు తిరిగి చెల్లించాలంటూ బ్యాంకుల తాఖీదులు.. ఇంకోవైపు మళ్లీ సాగు కోసం కొత్త రుణాలు లభించిని దుస్థితి.. బ్యాంకుల రుణాలు, సాగు కోసం ప్రయివేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి.. ఇంత చేసినా ఖరీఫ్ ఆరంభమైనా వర్షాల జాడలేని ఆందోళనకరస్థితి.. అన్నీ కలగలిసి రైతన్నను అగాథంలోకి నెట్టివేస్తున్నాయి. తీవ్ర ఆందోళన, ఆశాభంగం, నిరాశానిస్పృహలతో రాష్ట్ర రైతాంగం కుంగిపోతోంది. నలుదిక్కుల నుంచీ సమస్యల దాడితో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సర్కారు ఇప్పటికైనా ఆదుకుంటుందా.. అన్నమాటను నిలబెట్టుకుంటుందా.. అని దైన్యంగా నిరీక్షిస్తోంది!! ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలుత వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రైతుల రుణాల మాఫీపైనే తొలి సంతకం చేస్తాననీ హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేయగానే ఫైలుపై సంతకం కూడా చేశారు. కానీ.. అది రుణాల మాఫీపై అధ్యయనానికి సంబంధించిన ఫైలు! మాఫీ ఎలా, ఎవరికి, ఎంత చేయాలి వంటి విధివిధానాలను సిఫారసు చేయటానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ఫైలు! కమిటీ 15 రోజుల్లో మధ్యంతర నివేదిక ఇస్తుందని, దాన్ని బట్టి రుణ మాఫీపై స్పష్టత ఇస్తామని బాబు ప్రకటించారు. ఆ 15 రోజులూ గడిచాయి. మధ్యంతర నివేదికకే మరో 10 రోజుల గడువు పెంచారు. బాబు సీఎంగా ప్రమాణం చేసి దాదాపుగా నెల కావస్తున్నా రుణ మాఫీ ఊసే లేదు! ఎట్టకేలకు సదరు కోటయ్య కమిటీ తాత్కాలిక నివేదిక ఇచ్చినా.. అందులో విధివిధానాల మాట లేదు!! ఇప్పుడేమో రుణాల మాఫీ మాట పక్కన పెట్టేసి రీషెడ్యూల్ రాగం వినిపిస్తున్నారు! అంటే రుణాల మాఫీ ఇప్పుడుండదు. ఎప్పుడుంటుందో తెలియదు. ఎవరికుంటుందో కూడా తెలియదు! పోనీ రీషెడ్యూల్ అయినా జరుగుతుందా అంటే అదీ అయోమయమే! ఇన్ని వేల కోట్ల రూపాయల రుణాలను రీషెడ్యూల్ చేయటం సాధ్యం కాదని భారతీయ రిజర్వు బ్యాంకు స్వయంగా స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా, కోటయ్య కమిటీ కలిసి విజ్ఞప్తి చేసినా అదే మాటను పునరుద్ఘాటించింది. రుణ మాఫీపై స్పష్టత ఇవ్వండని తాజాగా రాష్ట్ర స్థాయి సమావేశంలో బ్యాంకర్లు కోరినా బాబు నుంచి స్పష్టతే రాలేదు. మాఫీకి కట్టుబడ్డామన్నారే తప్ప ఎప్పుడు, ఎలా, ఎంత రుణాన్ని మాఫీ చేస్తామన్నది మాత్రం చెప్పలేదు. పైగా రైతు రుణాలను రీషెడ్యూల్ చేయండంటూ బ్యాంకర్లను కోరారు బాబు! ఆర్బీఐ అంగీకరిస్తేనే అది సాధ్యమని, ఆర్బీఐని సంప్రదించి అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని బ్యాంకర్లు స్పష్టంచేశారు. మరి రీషెడ్యూలైనా జరుగుతుందా, జరిగితే ఎన్ని మండలాలకు, ఎంతమందికి, ఎంత మొత్తానికి, బంగారం రుణాలకు, టర్మ్ రుణాలు కూడా వర్తిస్తుందా వంటి అనేకానేక ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. కానీ వీటిలో ఒక్కదానిపైనా స్పష్టత లేదు!! ఒకవైపు ఖరీఫ్ సీజన్ మొదలై రోజలు, వారాలు గడిచిపోతున్నాయి. మరోవైపు గత ఏడాది తీసుకున్న వ్యవసాయ రుణాల చెల్లింపు గడువు ముగిసిపోయింది. తీసుకున్న అప్పులు మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే తాకట్టు పెట్టిన బంగారాన్ని, భూములను వేలం వేసి తమ రుణాలకు జప్తులు చేసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. నోటీసు అందుకున్న 15 రోజుల్లో బ్యాంకు బకాయి చెల్లించకుంటే నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని స్పష్టంచేస్తున్నాయి. పలు చోట్ల రైతులు తాకట్టు పెట్టిన నగలు వేలం వేస్తున్నారు కూడా. కొన్ని ప్రాంతాల్లో అయితే రుణ బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది రైతులకు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి తెస్తున్నారు. ‘అసలు రుణమాఫీ అయ్యేది కాదు.. రీషెడ్యూలు చేసినా మీకే భారం పెరుగుతుంది. వడ్డీ పెరుగుతుంది. చక్ర వడ్డీ పడుతుంది. ఇప్పుడు చెల్లిస్తేనే మంచిది. కొత్త రుణాలు వస్తాయి. లేదంటే కొత్త అప్పులూ పుట్టవు’ అని చెప్పేస్తున్నారు. దీంతో.. రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పైగా.. బకాయిలు చెల్లించే దాకా కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తేల్చి చెప్తున్నారు. రుణాలు రికవరీ కాకపోవడంతో పంట రుణాల పంపిణీని బ్యాంకులు పూర్తిగా పక్కన పెట్టాయి. సమస్యల సుడిగుండంలో... అప్పులు కట్టే మార్గం లేదు.. అప్పులు పుట్టకపోతే మళ్లీ సాగు చేసేదెలాగో తెలీదు! ప్రభుత్వ ఇచ్చిన హామీల మేరకు రుణాలన్నీ మాఫీ అవుతాయని.. మళ్లీ కొంత అప్పుచేసి సాగు చేసుకోవచ్చని గంపెడాశతో ఎదురు చూస్తున్న అన్నదాతలపై పిడుగులు పడ్డట్లే అవుతోంది. ఖరీఫ్ సీజన్లో అదును దాటిపోతుండటంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. వంద రూపాయలకు మూడు రూపాయలు, ఐదు రూపాయలు వడ్డీ చొప్పున అప్పులు చేస్తూ పాత బకాయిలపై వడ్డీలు కడుతున్నారు. వ్యవసాయం చేయకపోతే బతుకే లేని పరిస్థితుల్లో ప్రయివేటు అప్పులతో సాగుకు సమాయత్తమవుతున్నారు. పైగా.. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఇక అప్పులు చేసి సాగు చేసినా పంటల పరిస్థితి ఏమిటన్న భయాందోళనలు రైతులను పీడిస్తున్నాయి. బ్యాంకుల అప్పులు మాఫీ కాక, బ్యాంకుల నుంచి కొత్త రుణాలు రాక.. పాత బాకీలు తీర్చటానికి, మళ్లీ సాగుచేయటానికి భారీ వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేస్తూ... ఇలా ఎటు చూసినా రైతన్న మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. వెరసి ఆంధ్రప్రదేశ్ మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీపై సర్కారు పిల్లిమొగ్గలు, బ్యాంకుల నోటీసులు, కొత్త అప్పుల బాధలతో చాలామంది రైతుల నోట ఆత్మహత్యల మాటలు వినిపిస్తుండటం పెను ప్రమాద ఘంటికలను మోగిస్తోందని.. ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకుని అన్నదాతను ఆదుకోకపోతే పది పదిహేనేళ్ల కిందటి పరిస్థితులు పునరావృతమవుతాయని హెచ్చరిస్తున్నారు. బ్యాంకర్లు, అధికారులు ముందే వివరాలిచ్చినా... నిజానికి కోటయ్య కమిటీ ఏర్పాటుకు ముందే, అంటే బాబు సీఎంగా ప్రమాణం చేయడానికి ముందే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో రైతులకు ఎంత మేరకు రుణాలు ఇచ్చామన్న విషయాన్ని బ్యాంకర్లు, అధికారులు ఆయనకు నివేదికలు అందించారు. పంట రుణాలెన్ని, బంగారం కుదవపెట్టి వ్యవసాయానికి తీసుకున్న రుణాలెన్ని వంటి వివరాలన్నింటినీ కేటగిరీలవారీగా అందజేశారు. అయినా బాబు మాత్రం వాటి సంగతిని పక్కన పెట్టి కోటయ్య కమిటీ వేశారు. అదేమో తన పని ప్రారంభిస్తూనే రుణాలు తీసుకున్న రైతుల సంఖ్యను, తద్వారా రుణాల మొత్తాన్ని కుదించడంపైనే దృష్టి సారించింది! -
కట్టకుంటే ఖబడ్దార్
అప్పులు చెల్లించాలంటూ బ్యాంక్‌లు నోటీసులు డ్వాక్రా మహిళల నుంచి రికవరీకి రంగం సిద్ధం రుణమాఫీ ప్రకటనలో ప్రభుత్వ తాత్సారం ఆందోళన చెందుతున్న రైతులు రుణాల ఉచ్చులో రైతులు, డ్వాక్రా మహిళలు గిలగిల కొట్టుకుంటున్నారు. రుణమాఫీ ఆశతో వారంతా ఆరు నెలల నుంచి చెల్లింపులు ఆపేశారు. రూ. వందల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కుదేలయ్యే ప్రమాదం ముంచుకురావడంతో దానిని అధిగమించేందుకు బ్యాంకర్లు చర్యలు చేపట్టారు. రైతులకు నోటీసులు పంపడంతోపాటు అప్పు తీర్చాలంటూ ఫోన్లు చేస్తున్నారు. నర్సీపట్నం/చోడవరం : రుణమాఫీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడం తో బ్యాంకులు రైతులపై ఒత్తిడి పెంచుతున్నా యి. తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలం టూ నోటీసులు జారీ చేస్తున్నాయి. ఈ పరిస్థితితో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. చం ద్రబాబు ప్రకటనతో పాటు కాలం కలిసిరాక ఆరు నెలలుగా రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. జిల్లాలో సుమారు రెండు లక్షల మందికి సంబంధించి రూ.1700 కోట్లు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో వీలైనంతమేరకు వసూళ్లకు బ్యాంకర్లు చర్యలు చేపట్టారు. అప్పు తీర్చాలంటూ నేరుగా రైతులకు ఫోన్లు చేయడంతో పాటు నోటీసులు జారీచేస్తున్నారు. ఉదాహరణకు మాకవరపాలేనికి చెందిన రైతు కోలా బాబూరావు గత ఖరీఫ్‌లో నర్సీపట్నం జాతీయ బ్యాంకు లో రూ. 80వేలు అప్పు తీసుకున్నాడు. ప్రస్తుతం అసలుతో పాటు వడ్డీతో చెల్లించాల్సి ఉంది. గతేడాది కాలం కలిసి రాకపోవడంతో బకాయి చెల్లించలేదు. రుణం తీసుకుని ఏడాది పూర్తికావడంతో అధికారులు నోటీసులు జారీచేశారు. అలాగే రోలుగుంట మండలం జానకిరాంపురానికి చెందిన రైతు దేవాడ సత్తిబాబు జాతీయ బ్యాంకులో రూ. 90వేల రుణం తీసుకున్నాడు. రుణమాఫీ అమలు చేస్తారని అప్పు విషయంలో నిర్లక్ష్యం చేశాడు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని వడ్డీతో చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేశారు. జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో రూ.300కోట్లకు పైబడే బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చాయి. మూడు రోజులుగా చోడవరం ఆంధ్రాబ్యాంక్ రైతులకు అప్పు తీర్చాలంటూ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. బంగారు వస్తువులపై తీసుకున్న పంట రుణాలు నెలాఖరులోగా చెల్లించకపోతే ఆభరణాలను వేలం వేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ బ్యాంక్ 200 మందికి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇదే తరహాలో మిగతా కమర్షియల్ బ్యాంక్‌లు కూడా బకాయి ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తున్నాయి. మరో పక్క వెంటనే పంట రుణాన్ని చెల్లించాలంటూ యూనియన్‌బ్యాంక్ రైతులకు సెల్ ఫోన్లలో మెసేజ్‌లతో ఒత్తిడి తెస్తోంది. ఇక నిత్యం రైతులతో మమేకమయ్యే డీసీసీబీ బ్యాంక్‌లు కూడా పరోక్షంగా తమ సిబ్బందితో రైతులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ ప్రభుత్వం రుమాఫీ చేయకపోతే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. ఇక డ్వాక్రా సంఘాల విషయానికొస్తే జిల్లా వ్యాప్తంగా రూ. 521 కోట్ల రుణాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకు లు సన్నద్ధమయ్యాయి. ఒక్కో డ్వాక్రా సంఘానికి కనీసం రూ. లక్ష వరకు అప్పు ఉంటుందని బ్యాంకర్ల అంచనా.