డిమాండ్ల అంగీకారం అభినందనీయం
సిద్దిపేట జోన్: బీడీ కమీషన్దారుల డిమాండ్లను యాజమాన్యాలు అంగీకరించడం అభినందనీయమని ఆ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిరాజుద్దీన్ అన్నారు. గురువారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజులుగా నిజామాబాద్లో బీడీ కమీషన్ దారుల డిమాండ్లపై కార్మిక సంఘాలు, యాజమాన్యాల మధ్య చర్చలు జరిగాయన్నారు.
ప్రస్తుతం ఇస్తున్న కమిషన్ కంటే అదనంగా చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకు రావడం జరిగిందన్నారు. అదేవిధగా గుర్తింపు కార్డులు అందజేయడానికి వారు ఒప్పు కోవడం జరిగిందన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఎక్బాల్, శోభన్, పాషా తదితరులు పాల్గొన్నారు.