BDS Course
-
TG: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు.. స్థానికతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులేనని సీజే ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో స్థానికులు ఎవరు అనే అంశంపై సరైన మార్గదర్శకాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులు ఎవరనే విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రూపొందించిన మార్గ నిర్దేశకాల ప్రకారం కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు సూచించింది. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ప్రవేశాల్లో స్థానికత జీవోకు సంబంధించి నేడు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక, జీవోలో భాగంగా నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం తీర్పును వెల్లడించింది. -
నీట్ విద్యార్థులకు తీపికబురు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరడానికి నీట్ రాసిన అభ్యర్థులకు శుభవార్త. ఈ ఏడాది నుంచే ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు ఆయా వైద్య కళాశాలల్లో సీట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) రద్దు అనంతరం ఏర్పడ్డ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ దేశవ్యాప్తంగా ఈడబ్లు్యఎస్ విద్యార్థులకు ప్రత్యేక కోటా కింద సీట్లు కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 25 శాతం వరకు సీట్లు పెరగనున్నాయి. వాస్తవానికి.. ఆర్థికంగా బలహీనవర్గాలకు 10 శాతం కోటా మాత్రమే ఉంది. కానీ నియర్ రౌండప్ పేరుతో 100 సీట్లున్న కళాశాలకు అదనంగా మరో 25 నుంచి 50 సీట్ల వరకు పెంచనున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రస్తుతం 1,750 సీట్లు ఉండగా అదనంగా 550 సీట్లు పెరుగుతాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా పెంచిన సీట్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పెంచిన సీట్లకు ఏడాది లోపు వసతులు కల్పించే విధంగా కళాశాలలకు అవకాశం ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం (2019–20) నుంచే పెంచిన సీట్లు అమల్లోకి వచ్చేలా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పెద్ద ఊరట మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,750 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 52 వేల మందికి పైగా నీట్ రాస్తే అందులో 39 వేల మందికి పైగా అర్హత సాధించారు. ఒక్కో సీటుకు 22 మందికి పైగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో 550 సీట్లు రాష్ట్రంలో పెరుగుతుండటంతో నీట్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఒక్కో కళాశాలకు 50 సీట్లు పెరగడమంటే చాలా కష్టం. అలాంటిది 10 శాతం ఈడబ్లు్యఎస్ కోటా రావడం, దానికి తోడు మరిన్ని సీట్లు పెరుగుతుండటంతో విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన సీట్లు రెండో విడత కౌన్సెలింగ్ నాటికి అందుబాటులోకి రావచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి వారంలో తొలి విడత కౌన్సెలింగ్ మొదలు కానుంది. జూలై 30 నాటికి చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆర్థికంగా బలహీనవర్గాల కోసం కేటాయించే సీట్లలో ఒకవేళ జాప్యం జరిగితే ఆగస్టులో కూడా కౌన్సెలింగ్ నిర్వహించడానికి సడలింపు వచ్చే అవకాశం ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెప్పారు. ప్రతిపాదనలు పంపాం.. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించిన సీట్ల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు పంపినట్లు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ కె.బాబ్జీ చెప్పారు. ఈ ఏడాది నుంచే సీట్ల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, సీట్లు పెరిగిన వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సమాచారమిస్తామన్నారు. పెరిగిన సీట్లను బట్టి యూనివర్సిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతుందని తెలిపారు. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో పెరగనున్న సీట్ల వివరాలు.. -
జీవో 130 ప్రకారమే భర్తీ చేయండి..
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అన్ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యా సంస్థల్లో మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించిన కన్వీనర్ కోటా (ఏ), యాజమాన్య కోటా (బీ), ప్రవాస భారతీయ కోటా (సీ) సీట్లను గత ఏడాది జారీ చేసిన జీవో 130 ప్రకారమే భర్తీ చేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ రజనీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కన్వీనర్ కోటా సీట్లను తగ్గిస్తూ, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా ఫీజులను గణనీయంగా పెంచడంపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. యాజమాన్య కోటా సీట్లను తగ్గిస్తూ, బీ, సీ కేటగిరీల ఫీజులను పెంచుతూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ బషీరుద్దీన్ సిద్దిఖీ, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఏకపక్షంగా జీవోలు... పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏ కేటగిరీ సీట్ల తగ్గింపు, బీ, సీ కేటగిరీ సీట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా ఈ జీవోల వల్ల యాజమాన్యపు కోటా సీట్లను ఎంపిక చేసుకోవాల్సిన దుస్థితి కలుగుతోందన్నారు. గత ఏడాది జారీ చేసిన జీవో 130 ప్రకారం మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను యాజమాన్యపు కోటా కింద భర్తీ చేసి, మిగిలిన 40 శాతం సీట్లను బీ,సీ కేటగిరీ కింద భర్తీ చేసే వారన్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన జీవోల ప్రకారం కన్వీనర్ కోటా సీట్లను 60 శాతం నుంచి 50 శాతానికి తగ్గించిందన్నారు. అలాగే యాజమాన్య కోటా సీట్లను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారని ఆమె తెలిపారు. అంతేకాక బీ కేటగిరీ ఫీజును ఎంబీబీఎస్ కోర్సుకు రూ.11.55 లక్షలు, బీడీఎస్ కోర్సుకు రూ.4.2 లక్షలుగా నిర్ణయించిందన్నారు. అలాగే సీ కేటగిరీ ఫీజును రూ.23.10 లక్షలు, బీడీఎస్ కోర్సుకు రూ.5.25 లక్షలుగా ఖరారు చేసిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం జీవో 130 ప్రకారమే సీట్లు భర్తీ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
‘అగ్రి’కి యమా క్రేజ్..!
♦ మెడిసిన్ లేకున్నా అగ్రికల్చర్ ఎంసెట్‌కు అధిక డిమాండ్ ♦ అగ్రికల్చర్ కోర్సుల కోసం భారీగా వచ్చిన దరఖాస్తులు ♦ ఇప్పటికే దరఖాస్తు చేసిన 65 వేల మంది విద్యార్థులు ♦ ఇంజనీరింగ్ కోసం 1.19 లక్షలకుపైగా దరఖాస్తులు ♦ మొత్తంగా ఇప్పటివరకు 1.87 లక్షల దరఖాస్తులు ♦ ఈనెల 15తో ముగియనున్న దరఖాస్తుల గడువు సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్, దాని పరిధి లోని పలు కోర్సులకు ఈసారి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంసెట్ పరిధిలో నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులతోపాటు ఆయు ర్వేద, హోమియోపతి, నేచురోపతి, యోగా వంటి ఆయుష్ కోర్సులు నీట్ పరిధిలోకి వెళ్లినా అగ్రికల్చర్ దాని పరిధిలోని కోర్సుల్లో చేరడానికి ఎంసెట్ రాసేందుకు ఇప్పటికే 65 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా రు. అగ్రికల్చర్ ఎంసెట్ పరిధిలోని బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మా, బయోటెక్నాలజీ, ఫార్మా–డి కోర్సు ల్లో చేరేందుకు నిర్వహించే అగ్రి ఎంసెట్ రాసేందుకే వీరంతా దరఖాస్తు చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్ కోసం ఫీజు చెల్లించే గడువు ఈనెల 15 వరకు ఉంది. అప్పటి వరకు దరఖాస్తుల సంఖ్య 75 వేలు దాటుతుందని అధికారుల అంచనా. గత ఏడాది కంటే ఎక్కువ... గత ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తోపాటు అగ్రికల్చర్ దాని పరిధిలోని కోర్సు ల్లో చేరేందుకు 1.02 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకే 56 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయుష్ కోర్సుల కోసం మరో 10 వేల మంది వరకు దరఖాస్తు చేసు కున్నారు. అంటే అగ్రికల్చర్ దాని పరిధిలోని కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసిన వారు 35 వేల మందే. ఈ ఏడాది ఇప్పటికే 65,459 దరఖాస్తులు రాగా ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉన్నందున మరో 10 వేల దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. మరో వైపు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు అగ్రికల్చర్, దాని పరిధి లోని కోర్సులపై దృష్టి సారించినట్లు «అధికారు లు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినందున విద్యార్థులు ఆయా కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతు న్నారు. మరోవైపు నీట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కూడా ప్రాక్టీస్ కోసం ఎంసెట్‌కు కూడా దరఖాస్తు చేసి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంజనీరింగ్ దరఖాస్తులు 1.19 లక్షలు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటి వరకు 1,19,720 మంది విద్యార్థులు దర ఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య గతేడాదిలాగే 1.40 లక్షలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,44,511 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,33,428 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 1,03,923 విద్యార్థులు అర్హత సాధించారు. మరోవైపు అగ్రికల్చర్, ఇంజనీరింగ్ రెండింటికి హాజరయ్యేందుకు మరో 1,195 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ దరఖాస్తులు 18,973 తెలంగాణ ఎంసెట్ రాసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 18,973 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ కోసం 10,093 మంది.. అగ్రికల్చర్ ఎంసెట్ కోసం 8,750 మంది, రెండూ రాసేందుకు 65 మంది దరఖాస్తు చేశారు. -
కోచింగ్ సెంటర్లు, బ్రోకర్లపై నిఘా
* 11న ఎంసెట్-3కి ఏర్పాట్లు పూర్తి * పోలీస్ ఉన్నతాధికారులతో ఎంసెట్ కమిటీ భేటీ * బయోమెట్రిక్ పరికరాలను పెంచాలని నిర్ణయం * నేడూ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న ఎంసెట్-3 పరీక్షకు ఎంసెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో తెలంగాణతోపాటు పక్క రాష్ట్రాల్లోనూ కార్పొరేట్ విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, బ్రోకర్లపై ఇంటెలిజెన్స్, సీఐడీ నేతృత్వంలో పోలీసుశాఖ నిఘా పెట్టింది. ముఖ్యంగా వచ్చే మూడు రోజులు బ్రోకర్ల కదలికలను పరిశీలించాలని, నిర్ణయించింది. ఏపీలో ఏర్పాటు చేసే 25 పరీక్ష కేంద్రాలపైనా పకడ్బందీ నిఘాకు చర్యలు చేపడుతోంది. ప్రశ్నపత్రాల విషయంలో ఇప్పటికే అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసింది. గురువారం ఇక్కడి ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఎంసెట్ కమిటీ సమావేశమై నిఘా, పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంసెట్-3 చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్-3 కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ సీపీ వీవీ శ్రీనివాసరావు, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, లా అండ్ ఆర్డర్ డీఐజీ కల్పనా నాయక్ తదితరులు సమావేశమయ్యారు. ఈసారి పరీక్షకు బయోమెట్రిక్ పరికరాలను పెంచాలని నిర్ణయించారు. గతంలో ప్రతి 250 మందికి ఒక బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేయగా, ఈసారి ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక పరికరం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులను తనిఖీ చేసే ప్రదేశాల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మహిళా కానిస్టేబుళ్లను మోహరించడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. మరోవైపు హాల్‌టికెట్ నంబర్లలో మార్పులు చేశారు. వాటిని ఏడు అంకెల నుంచి ఎనిమిది అంకెలకు పెంచారు. పరీక్ష కేంద్రాలను కూడా జంబ్లింగ్ చేశారు. పాత పరీక్ష కేంద్రాల్లో ఏ విద్యార్థీ పరీక్ష రాసే అవకాశం లేకుండా కొత్త కేంద్రాల్లోనే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులకు కార్బన్‌లెస్ జవాబుల కాపీలను అందించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించం: ప్రొఫెసర్ పాపిరెడ్డి ఎంసెట్-3 పరీక్షకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలన్నారు. బయోమెట్రిక్ డేటా సేకరించాల్సి ఉన్నందువల్ల విద్యార్థులు 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం మంచిదన్నారు, ఉదయం 9 గంటల నుంచే వారిని పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. 96 పరీక్ష కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 56,153 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు సిద్ధం చేశామన్నారు. గురువారం సాయంత్రం వరకు 33,169 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, మిగతా విద్యార్థులు శుక్రవారం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని పాపిరెడ్డి స్పష్టం చేశారు. -
ఎంసెట్-3 నోటిఫికేషన్ జారీ
* సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హాల్‌టికెట్లు * 11న రాత పరీక్ష.. వారం రోజుల్లో ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాత పరీక్ష నిర్వహించేందుకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 11 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. గతంలో ఎంసెట్-2 రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 56,153 మంది అభ్యర్థులంతా ఎంసెట్-3 రాసేందుకు అర్హులేనని, వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం.. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యార్థులు సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు tseamcet.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పరీక్ష జరిగిన వారం రోజుల్లోగా (వీలైతే 16, 17 తేదీల్లో) ఫలితాలు, ర్యాంకులను విడుదల చేయనుంది. ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. పరీక్ష నిర్వహణకు గతంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కేంద్రాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ఒక్కో రీజనల్ కేంద్రం పరిధిలోని పరీక్ష కేంద్రాలు మాత్రం మారుతాయని తెలిపింది. -
ఎంసెట్-2కు 30,787 దరఖాస్తులే!
తెలంగాణ నుంచి 20 వేలు, ఏపీ నుంచి 10 వేలు సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్-2కు ఇప్పటివరకు 30,787 దరఖాస్తులు వచ్చాయి. నీట్ ద్వారా నింపే సీట్లు పోనూ మిగిలిన 1,725 సీట్లను ఈ ఎంసెట్-2తో భర్తీ చేస్తారు. జూలై 7న నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే వారి నుంచి ఈనెల 1 నుంచి ఎంసెట్ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈనెల 7వ తేదీతో ఆన్లైన్లో దరఖాస్తుల గడువు ముగియనుంది. అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించినా తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక ఆలస్య రుసుముతో మాత్రం పరీక్షకు ఒక రోజు ముందు వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఎంసెట్-1కు మాత్రం లక్ష మందికిపైగా విద్యార్థులు అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ ఎంసెట్ ద్వారా అగ్రికల్చర్, వెటర్నరీ తదితర 12 రకాల కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉండటంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం జూన్ 7న నిర్వహించబోయే ఎంసెట్-2 ద్వారా కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోనే ప్రవేశాలు చేపట్టనున్న నేపథ్యంలో దరఖాస్తులు తగ్గాయని అధికారులు పేర్కొన్నారు. ఇక విద్యార్థులు జూలై 2 నుంచి 7వరకు ఎంసెట్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవ చ్చు. ఇదీ ఎంసెట్-2 షెడ్యూల్... 7-6-2016: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 14-6-2016: రూ. 500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ 21-6-2016: రూ. 1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ 28-6-2016: రూ. 5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ 6-7-2016: రూ. 10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ 2-7-2016 నుంచి 7-7-2016 వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ 9-7-2016: రాత పరీక్ష (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు) -
నేటినుంచి రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ, న్యూస్‌లైన్ : ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడల్లో గురువారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. సీట్లు, కళాశాల వివరాలతో కూడిన సీట్మ్యాట్రిక్స్ యూనివర్సిటీ వెబ్సైట్ హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్‌లో ఉంచారు.