Bhajarangdal
-
హైకోర్టు అనుమతిచ్చినా వీరహనుమాన్ విజయ యాత్రకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరగాల్సిన వీరహనుమాన్ విజయ యాత్రకు అకస్మాత్తుగా బ్రేక్ పడింది. హైకోర్టు యాత్రకు అనుమతిచ్చినా కూడా యాత్ర ఆగిపోయింది. అయితే యాత్రను తామే స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు హిందూ సంఘాలు ప్రకటించాయి. వాస్తవంగా హైదరాబాద్‌లో మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా పాతబస్తీ నుంచి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభయాత్ర జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు. అయితే న్యాయస్థానాలు ఎన్నో ఆంక్షలతో వీరహనుమాన్ విజయ యాత్రకు అనుమతిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పక్కాగా నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో భజరంగ్‌దల్, విశ్వహిందూ పరిషత్ తదితర సంఘాలు యాత్రపై సమాలోచనలు చేశాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో యాత్ర విరమించుకుంటే మంచిదనే అభిప్రాయానికి ఆయా సంస్థలు వచ్చాయి. చివరకు వీరహనుమాన్ విజయ యాత్రను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ప్రతినిధులు బండారి రమేశ్, రామరాజు, సుభాశ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం కరోనా నియమాలు మత రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. చదవండి: ఈ హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.. చిరంజీవి చదవండి: గుడ్‌న్యూస్.. 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం -
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగదళ్ కార్యకర్తలు
-
కంటపడ్డారు.. పెళ్లి చేశారు
సాక్షి, హైదరాబాద్ : ప్రేమికుల రోజు జరుపుకోవడానికి వీల్లేదు... అది మన కల్చర్ కాదు... లవర్స్ డే రోజున జంటగా కనిపిస్తే పెళ్లి చేసేస్తాం... అంటూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా.. వాటిని నిజం చేసి చూపారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. ఆదేశాలను లెక్క చేయకుండా జంటగా తిరుగుతున్న ఓ ప్రేమ జంటకి పెళ్లి చేసేశారు. వివరాలు.. మేడ్చల్‌లో కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో ఓ ప్రేమ జంట తిరుగుతుండగా వాళ్లకు బలవంతంగా పెళ్లిచేశారు భజరంగ్‌దళ్ కార్యకర్తలు. దాన్ని మొబైల్లో వీడియో తీసారు. దాంతో ఆ జంట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు మొదలుపెట్టారు. వీడియో ఆధారంగా వాళ్లను పట్టుకుంటామంటున్నారు. ఇదిలా ఉండగా ప్రేమికుల దినోత్సవ వేడుకలకు వ్యతిరేకంగా వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు... అబిడ్స్‌లోని జీపీఓ చౌరస్తా దగ్గర ఆందోళనలు చేస్తూ... దిష్టిబొమ్మను తగలబెట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సాగర్ రోడ్లో గల సితార గ్రాండ్లో వాలెంటైన్స్ డే వేడుకలు జరుగుతున్నట్లు తెలుసుకున్న ఏబీవీపీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు అక్కడికి వెళ్లి వాటిని ధ్వంసం చేశారు. -
అందరూ భారత్ మాతాకీ జై అనాల్సిందే..
వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్‌జైన్ హైదరాబాద్ : దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ భారత్‌మాతాకీ జై, గోమాతాకీ జై అనాల్సిందేనని, అలా అననివారు దేశం నుండి వెళ్లిపోవాల్సిందేనని వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్‌జైన్ అన్నారు. హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం కోఠి వద్ద జరిగిన హనుమాన్ శోభాయాత్రను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతదేశంలో అన్ని వర్గాలవారికి, అన్ని మతాలవారికి సమానహక్కులు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ భారతమాతను గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాల క్రితం భజరంగ్‌దళ్,వీహెచ్పీల ఆధ్వర్యంలో ప్రారంభమైన హనుమాన్ జయంతి శోభాయాత్ర నేడు దేశంలోని ప్రతి నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా ఆదర్శంగా నిలిచిందన్నారు. పోలీసు ల తీరు దారుణంగా ఉందని భజరంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై. భానుప్రకాష్ మండిపడ్డారు. ప్రతి సంవత్సరం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తుంటే పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నేతలు గోవింద్‌రాఠి, యమన్‌సింగ్, విమల్‌దాల్మియా, భరత్‌వంశీ, సత్యనారాయణ, రమేష్, వీరేశలింగం, లక్ష్మణ్‌రావు, గిరిధర్, ప్రకాష్ గిరి, అనిల్, కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
శత్రువు అవ్వాలని ఉంటే ఏం చేయలేం
♦ ఇక్కడ పుట్టినవారంతా మా సోదరులే.. ♦ వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా కరీంనగర్ కల్చరల్: భారతదేశంలో ఉంటూ శత్రువు కావాలని వారికుంటే ఏమీ చేయలేమని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయి తొగాడియా అన్నారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తల శిక్షణకు ఆదివారం హాజరైన ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారతమాతాకీ జై అంటే వారు తమ వారేనని, భారతదేశం అంటే ఇష్టంలే ని వారికి ఈ దేశంలో స్థానం లేదన్నారు. ఇక్కడ పుట్టిన వారు తమ సోదరులేనని, భాయి భాయి అంటూనే శత్రువుగా తయారుకావాలని చూస్తుంటే ఏం చేసేది లేదని, వారే ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిం చారు. రానున్న వందేళ్లలో హిందూ దేశంలోనే హిం దువులు మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రభాతసేవలో ప్రవీణ్ తొగాడియా వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్టు సభ్యుడు జి. భానుప్రకాష్‌రెడ్డి ఆయనకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
పార్కులు వెలవెల!
వీహెచ్‌పీ, బజరంగ్దళ్ హెచ్చరికల ఎఫెక్ట్! పోలీసులు అండగా నిలిచినా.. స్వాగతం పలికేందుకు సీపీఐ నాయకులు వచ్చినా... పార్కులకు రాని ప్రేమికులు కవాడిగూడ/వెంగళరావునగర్: ప్రేమికులతో ప్రతి రోజూ కళకళలాడే పార్కులు శనివారం ప్రేమికుల దినోత్సవం రోజున మాత్రం బోసిపోయాయి. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కృష్ణకాంత్, కేబీఆర్ తదితర పార్కులన్నీ వెలవెలబోయాయి. పాశ్చాత్య సంస్కృతికి చిహ్నమైన ప్రేమికుల రోజును బహిష్కరిస్తున్నట్లు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సంస్థలు ప్రకటించడంతోపాటు, ప్రేమికులు పార్కుల్లోనూ, రహదారుల వెంట కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా ప్రేమికులను అడ్డుకున్నా, వారి పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించినా తీవ్రచర్యలు తీసుకుంటామని, ప్రేమికులకు అండగా ఉంటామని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించి, ఇందిరాపార్కును సందర్శించినా ప్రేమికులు వచ్చేందుకు సాహసించలేదు. ఇందిరాపార్కు ప్రవేశ రుసుం రూ.5, బైక్, ఫోర్ వీలర్ వాహనాల పార్కింగ్‌కు కనీసం రూ. 10 ఉంటుంది. ప్రతిరోజు దాదాపు రూ.7 వేలకు పైగా ఆదాయం వస్తుంది. పార్కింగ్‌కు రూ.3 వేలకు పైగా వస్తాయి. అలాంటిది శనివారం మాత్రం ఎంట్రెన్స్ టెకెట్లకు రోజంతా కనీసం వెయ్యి రూపాయలు రాలేదు. అలాగే పార్కింగ్ కౌంటర్‌కు కనీసం రూ. 600 కూడా రాలేదు. కాగా ముందు జాగ్రత్తగా నగరంలో 36 మందిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. సీపీఐ గులాబీ పూల స్వాగతం... ప్రేమికులకు గులాబీ పూలతో స్వాగతం పలికేందుకు సీపీఐ హైదరాబాద్ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్‌తో పాటు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ కార్యకర్తలు ఇందిరాపార్కు వద్ద ఎదురు చూశారు. కానీ ప్రేమికులెవరూ కన్పించలేదు. కార్యక్రమంలో సీపీఐ నగర నాయకులు రాకేష్ సింగ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, నాయకులు సత్యప్రసాద్, దర్మేంధర్, వంశీ, ఏఐవైఎఫ్ నాయకురాలు ఉషారాణి, నాయకులు రాజేందర్, బాలు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక ముందుజాగ్రత్తగా పోలీసులు ప్రేమికులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఏఐఎస్ఎఫ్ నాయకులు వేణు, కృష్ణ నాయక్, నరేష్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా యూసుఫ్‌గూడ కృష్ణకాంత్పార్కుకు జూబ్లీహిల్స్ పోలీసులు ఉదయమే వచ్చి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్వైజర్లకు, సెక్యూరిటీ గార్డులకు సూచించారు. ఉదయం 11 గంటల తర్వాత పార్కు తెరిచి పోలీసులు కాపలాగా ఉన్నప్పటికీ యువతీయువకులెవరూ రాలేదు. కనీసం సందర్శకులు కూడా రాకపోవడంతో పార్కు బోసిపోయింది. -
ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తాం
-
'తల్లిదండ్రులను పిలిపించి పెళ్లిళ్లు చేస్తాం'
హైదరాబాద్ : వాలంటైన్స్ డే జరుపుకోవడానికి ప్రేమ జంటలు ఎదురు చూస్తుంటే...మరోవైపు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ), భజరంగ్‌దళ్..ప్రేమికుల రోజును బహిష్కరించాయి. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు పేరుతో విచ్చలవిడి కార్యకలాపాలు చేస్తే ఊరుకునేది లేదని వీహెచ్‌పీ నేతలు రామరాజు, వెంకటేశ్వర రాజు హెచ్చరించారు. ప్రేమికులు ఆరోజు జంటగా కనిపిస్తే వారి తల్లిదండ్రులను పిలిపించి పెళ్లిళ్లు చేస్తామని వారు తెలిపారు. పబ్‌లు, హోటళ్లు, రిసార్ట్స్‌లో ప్రేమికుల రోజున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టకూడదని వీహెచ్‌పీ నేతలు సూచించారు. -
ఇస్లామిక్ కళాశాల ఏర్పాటుపై ఆగ్రహం
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : తిరుపతిలో అంతర్జాతీయ ఇస్లామిక్ కళాశాలను ఏర్పాటు చేయడంపై ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ స్థానిక ప్రకాశంచౌక్‌లో గురువారం రాస్తారోకో నిర్వహించాయి. ఆర్ఎస్ఎస్ నాయకులు గంటా కృష్ణహరి, వీహెచ్‌పీ నాయకులు వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, భజరంగ్‌దళ్ నాయకులు వేణుగోలపారాజు మాట్లాడుతూ హిందువుల పుణ్య స్థలమైన తిరుపతిలో అక్రమంగా ఇస్లామిక్ కళాశాలను నిర్మిస్తే అధికారులు, ప్రజాప్రతినిధు లు, టీటీడీ ట్రస్టు బోర్డు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దేశంలో అనేక ప్రాంతాలు ఉండగా తిరుపతిలోనే కళాశాలను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేసి కళాశాలను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ధర్మ రక్షా వేదిక పట్టణ అధ్యక్షుడు పులఖండం కోటేశ్వరరావు, ధర్మ ప్రచార పరిషత్ జిల్లా అధ్యక్షుడు తోరం సూర్యనారాయణ, బీజేపీ పట్ణణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం, కేవీ రమేష్, వానపల్లి సూర్యప్రకాశరావు, పి.లక్ష్మణవర్మ, కఠారి వెంకటేశ్వరరావు, కొమ్ము శ్రీనివాస్, బి.శ్రీనివాస్, జి.కృష్ణవేణి, గన్నపురెడ్డి గోపాలకృష్ణ పాల్గొన్నారు.