bifercation
-
ఏపీ విభజన కేసు విచారిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను విచారిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. శుక్రవారం సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమ కోహ్లిల ధర్మాసనం ముందు ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యాయవాదులు ప్రశాంత్‌భూషణ్, రమేశ్ అల్లంకి ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2014లో ఏపీ విభజన పూర్తికాలేదని, విభజన చట్టం కొట్టేయాలని ఉండవల్లి అరుణ్‌కుమార్, మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేశారని న్యాయవాదులు తెలిపారు. ఆ సమయంలో జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రతివాదులకు నోటీసులు జారీచేశారని, కానీ ఆ పిటిషన్లపై ఇప్పటివరకు విచారణ జరగలేదని చెప్పారు. 2019లో ఉండవల్లి ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేసినా ఇప్పటివరకు జాబితాలోకి రాలేదని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో తమ ప్రేయర్‌ను సవరిస్తూ పిటిషన్ వేశామన్నారు. 2014లో ఏపీ విభజన జరిగింది.. తప్పోఒప్పో ఏపీ విభజన జరిగిపోయిందని, భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు సూచించాలని కోరామన్నారు. అదే సమయంలో విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్థికంగా సాయం చేయాలని సవరణ పిటిషన్ వేసినట్లు వివరించారు. తక్షణమే విచారించాలని తాము కోరడం లేదని, ఏదో ఒకరోజు తేదీని నిర్ణయించాలని న్యాయవాదులు అభ్యర్థించారు. సవరణ పిటిషన్ విచారణకు తేదీ కేటాయిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు. -
ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేసిన కేంద్ర న్యాయశాఖ అందు లో మార్పులు, చేర్పులు చేసి తుది నోటిఫికేషన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్‌కు ప్ర«ధాని మోదీ ఆమోదముద్ర వేశారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31(2) ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏపీ హైకోర్టు ఏర్పాటయ్యే తేదీని (అపాయింటెండ్ డే) అందులో పొందుపరుస్తారు. ఏపీ హైకోర్టు ఏర్పా టయ్యే ప్రాంతాన్ని కూడా నోటిఫై చేస్తారు. నోటిఫి కేషన్ జారీ అయిన తేదీ నుంచి 3 నెలల్లోపు హైకోర్టు ను తరలించాల్సి ఉంటుంది. ఈ గడువును పెంచాల ని కోరే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హైకోర్టు విభజనపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2019 జనవరి 1 నాటికి కేంద్రం విభజన నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 15 నాటికి హైకోర్టు భవనం సిద్ధమవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపిన విష యం తెలిసిందే. నేలపాడులో నిర్మిస్తున్న హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ 15 నాటికి భవనం పూర్తవుతుందని చెప్పిన ప్రభు త్వం, ఇప్పుడు డిసెంబర్ 31 నాటికి భవనం సిద్ధమ వుతుందని చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల బట్టి చూస్తే నెలాఖరుకు భవనం సిద్ధమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో తరలింపు ఎప్పుడన్న ప్రశ్న తలెత్తుతోంది. ‘నోటిఫికేషన్ వెలువడటం అన్నదే ముఖ్యం. కేంద్రం నిర్ణయించిన విధంగా ఈ వారంలో నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇదే సమయంలో హైకోర్టు తరలిం పునకు 90 రోజుల గడువు ఎలానూ ఉంది. కాబట్టి ఈ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ వచ్చినా, రాబోయే 3 నెల ల్లోపు ఎప్పుడైనా అమరావతికి హైకోర్టును తర లించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆలోచన తోనే ఉంది’’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హైకోర్టు విభజనకు వీలుగా న్యాయమూర్తుల విభజన కూడా పూరై్తన విషయం తెలిసిందే. -
రాజకీయ లబ్ధికోసమే జిల్లాలు
న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు పాల్వంచ : రాజకీయ లబ్ధికోసమే సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా జిల్లాల విభజన చేపట్టారని సీపీఐ (ఎంఎల్) న్యూడమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటులో ఆదివాసీ గిరిజనులకు కనీస ప్రాధాన్యమివ్వలేదన్నారు. గిరిజన ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పొరుగున ఉన్న వరంగల్‌ను ఐదు జిల్లాలుగా చేసిన కేసీఆర్ ఆదివాసీలు అధికంగా ఉన్న భద్రాచలంను జిల్లా చేయక పోవడం దారుణమన్నారు. జిల్లాలో వనరులు, ఖనిజాలు బడా పారిశ్రామిక వేత్తలకు, బహుళజాతి కంపెనీలకు అప్పగించే కుట్రలో భాగంగానే జిల్లాను బలహీనం చేస్తున్నారని ఆరోపించారు. భద్రాచలం, ములుగు, ఉట్నురు ప్రాంతాలను ఆదివాసీ జిల్లాలుగా ప్రకటించాలని, పాల్వంచ డివిజన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య, నాయకులు ముద్దా భిక్షం, నిమ్మల రాంబాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
వెనక్కి తగ్గేది లేదు
- విద్యుత్ ఉద్యోగుల విభజనపై తెలంగాణ సర్కారు - సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై సోమవారం డివిజన్ బెంచ్‌కు అప్పీలు - ఏపీ ఉద్యోగులను మళ్లీ విధుల్లో చేర్చుకోకూడదని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ‘స్థానికత’ కలిగిన 1151 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునేదిలేదని నిర్ణయించింది. విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు, రిలీవ్ ఆదేశాలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ శుక్రవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ ముందు సోమవారం అప్పీలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మధ్యంతర ఉత్తర్వుల వచ్చిన తర్వాత ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల చెర్మైన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపారు. ఏపీ స్థానికత గల ఉద్యోగులందరినీ టి.ట్రాన్స్‌కో, టి.జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లు శుక్రవారం మూకుమ్మడిగా రిలీవ్ చేశాయి. ఈ పోస్టుల్లో తక్షణమే ‘పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు’(ఎఫ్ఏసీ) చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు ఆదేశించాయి. దీంతో అప్పటికప్పుడు ఇన్చార్జీ అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ నిలుపుదల చేసినా, మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోకూడదని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. హైకోర్టు ఉత్తర్వులు కేవలం పిటిషన్లర్లకే వర్తిస్తాయా? లేక రిలీవైన ఉద్యోగులందరికీ వర్తిస్తాయా? అన్న అంశంపై స్పష్టత వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. స్పష్టత కోసం హైకోర్టు ఉత్తర్వుల రాతప్రతి కోసం ఎదురు చూస్తున్నామని జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు. పోస్టులు తక్కువ.. వివాదం ఎక్కువ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ పోస్టులు 75 వేలకుపైనే ఉన్నాయి. తెలంగాణలో 1151 మంది ఏపీ ఉద్యోగులు, ఏపీలో 450 మంది తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానికత ఆధారంగా ఎవరి రాష్ట్రాలకు వారిని కేటాయిస్తే ఏపీకు అదనంగా 701 ఉద్యోగులు మాత్రమే వెళ్తారు. మంజూరు పోస్టులతో పోల్చితే ఇది కేవలం ఒక్క శాతం కూడా కాదు. అయినా, ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని కావాలని పెద్దదిగా చేస్తోందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ 1 కల్లా పూర్తి కావాల్సిన ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి ఉద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ఉద్యోగులను తమ రాష్ట్రంలోకి తీసుకుని అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త కె.రఘు విజ్ఞప్తి చేశారు. ‘విద్యుత్’ విభజనకు హైకోర్టు బ్రేక్ విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని, ఇలా ఇచ్చే ఉత్తర్వులు తెలంగాణ ఉద్యోగుల పట్ల మరణశాసనం అవుతాయని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి గట్టిగా వాదించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేస్తూ తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును హైకోర్టు నిలిపేసింది. అంతేకాక హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యే నాటికి (9వ తేదీ) ఏ పరిస్థితి ఉందో, ఉద్యోగుల రిలీవ్ విషయంలో అదే పరిస్థితి కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి రెడ్డి కాంతారావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.