Book festival
-
విజయవాడలో పుస్తకాల పండుగ ప్రారంభం (ఫొటోలు)
-
Vijayawada Book Festival Photos: కొలువుదీరిన పుస్తక వనం..విజయవాడలో బుక్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
Vijayawada Book Festival Photos: విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం (ఫొటోలు)
-
విజయవాడ: కళాశాల గ్రౌండ్స్ లో 33వ బుక్ ఫెస్టివల్
-
విజయవాడలో బుక్ఫెస్టివల్ (ఫోటోలు)
-
హైదరాబాద్: పుసక్త ప్రియుల కిటకిటతో ముగిసిన బుక్‌ఫెయిర్ (ఫొటోలు)
-
విజయవాడలో పుస్తక మహోత్సవం
-
హైదరాబాద్ లో జాతీయ పుస్తకోత్సవం
-
Vijayawada:1 నుంచి పుస్తక మహోత్సవం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): జనవరి 1వ తేదీ నుంచి 32వ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. పుస్తక మహోత్సవం విజయవాడలోని స్వరాజ్ మైదానం లేదా శాతవాహన కళాశాలలో నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారన్నారు. జనవరి 3న రావిశాస్త్రి శత జయంతి సభ, 4న పుస్తక ప్రియుల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు బాల గంగాధర తిలక్ శత జయంతి సభ, 6వ తేదీ సాయంత్రం ఆత్రేయ శత జయంతి సభ, 7వ తేదీ సాయంత్రం వడ్డాది పాపయ్య శత జయంతి సభ జరుగుతుందన్నారు. పుస్తక మహోత్సవం సందర్భంగా ప్రతిరోజూ వివిధ సామాజిక అంశాలపై మేధో చర్చలు, ప్రముఖుల ప్రసంగాలు, కవి సమ్మేళనం, గోష్టులు, పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు, విద్యార్థులు, చిన్నపిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 10న ముగింపు సభ, విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పుస్తక మహోత్సవ బ్రోచర్‌ను సొసైటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు టి.మనోహరనాయుడు, కార్యదర్శి లక్ష్మయ్య, కోశాధికారి కె.రవి, సంయుక్త కార్యదర్శి కొల్లూరి, ఉపాధ్యక్షుడు బి.రవికుమార్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్
-
వేడుకలా పుస్తక ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ అనగానే పుస్తకాల పండుగ గుర్తొస్తుంది. కవులు, కళాకారులు, రచయితల సందడి కన్పిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా అరుదైన నవలలు, ప్రముఖల జీవితగాథలు, చారిత్రక పోరాటాలు, కథలు, ట్రావెలాగ్స్, కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలన్నీ ఒకే చోట దర్శనమిస్తాయి. రాజధాని నలుమూలల నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల పాఠక ప్రియులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో పాఠకులు వస్తారని మా అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది’అని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. పుస్తక ప్రదర్శన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే! సాక్షి ప్రతినిధి: హైదరాబాద్ బుక్ ఫెయిర్ విశిష్టత ఏమిటీ? జూలూరి: దేశంలోనే అతి ప్రాచీనమైన బుక్‌ఫెయిర్ ఇదే. దీనికంటూ ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. సంస్కృతి, సాహిత్యం, సాహిత్య వేత్తలకు సంబంధించిన సేవలను నెమరువేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఈ నేలమీద పుట్టిన రచయితలకు, వారి రచనలకు ఓ వేదిక కల్పిస్తుంది. భిన్న జాతులు, మతాలు, కులాలు, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ప్రజలు జీవిస్తున్నారు. వారి ఆలోచనలకు, అభిరుచికి తగిన పుస్తకాలు అందుబాటులోకి తెచ్చి వారిలో పఠనాసక్తిని పెంచుతుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైంది? 1985లో మొదటగా చిక్కడపల్లిలోని నగరకేంద్ర గ్రంథాలయంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. స్థలాభావంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియన్ థియేటర్ వద్దకు మార్చాం. ఆ తర్వాత కేశవ్‌మెమోరియల్ గ్రౌండ్స్, ఎగ్జిబిషన్ మైదానం, నిజాం కళాశాల, పీపుల్స్‌ప్లాజా, ఆ తర్వాత తెలంగాణ కళాభారతిని (ఎన్టీఆర్ స్టేడియాన్ని) పుస్తక ప్రదర్శనకు వేదికగా మార్చాం. తొలి రోజుల్లో 50 స్టాల్స్‌తో ప్రారంభమైన ఈ ప్రదర్శన ప్రస్తుతం 320 స్టాల్స్‌కు చేరుకుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన పుస్తకాలే కాదు.. వంటలు, బ్యూటీ టిప్స్ బుక్స్, భక్తి, ముక్తి సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి. మారుతున్న కాలంలో పుస్తకాలకున్న ప్రాధాన్యం ఏంటి? ఇంటర్నెట్, యూట్యూబ్, స్మార్ట్ఫోన్లు, టీవీలు వచ్చాక పుస్తక పఠనం తగ్గిన మాట వాస్తవమే. టెక్నాలజీ ఎంత వచ్చినా పుస్తకాల అమ్మకాలు మాత్రం తగ్గలేదు. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ సాహిత్యం, చరిత్ర పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. పీడీఎఫ్, ఈ–బుక్ కాపీలను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మరీ చదువుతున్నారు. బుక్‌ఫెయిర్‌కు లక్షల్లో తరలివస్తున్న పాఠకులే ఇందుకు నిదర్శనం. తెలుగు సాహిత్య విమర్శ ఏ స్థితిలో ఉంది? విమర్శ అసలు లేదని కాదు. అది చేయాల్సినంత పని చేయట్లేదన్నది వాస్తవం. విమర్శ సాహిత్యంలోని విలువలను విశ్లేషించి చూపాలి. సమర్థనకో, విస్మృతికో గురిచేయడం సరికాదు. కవిత్వం, కథ వచ్చినంతగా, నవల, విమర్శ రావట్లేదు. కవుల సంఖ్య పెరిగినంతగా విమర్శకుల సంఖ్య పెరగట్లేదు. ఉన్నవాళ్లలో కూడా లోతైన అధ్యయనంతో నిలబడే విమర్శకులను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. యూనివర్సిటీ విద్యార్థుల రూపంలో విమర్శకు కావాల్సిన ముడి సరుకు ఉంది. -
పుస్తకాలు ప్రగతికి సోపానం : ఉమ్మారెడ్డి
సాక్షి, విజయవాడ : స్వతంత్రం వచ్చిన నాటి నుంచి రాజకీయవేత్తలను మూడు కేటగిరీలుగా చూడొచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో ప్రారంభమైన పుస్తక మహోత్సవానికి విచ్చేసిన ఆయన మాట్లాడారు. మొదటి కేటగిరీలో స్వతంత్రం కోసం అన్ని త్యాగాలు చేసి, తర్వాత ఎన్నికల్లో నిలబడి గెలిచిన వారు ఉన్నారని చెప్పారు. వీరికి ప్రజల్లో అపారమైన గౌరవం ఉందని తెలిపారు. రెండోతరం కొంతమేర డబ్బుతో రాజకీయం చేయడం ప్రారంభించారని అన్నారు. ఇక మూడోతరం పూర్తిగా డబ్బు రాజకీయాలతో పెద్ద ఎత్తున వచ్చిందని అన్నారు. వీరికి మొదటితరం గురించి తెలియదని, వారి ఆదర్శాలు కూడా తెలియవని చెప్పారు. ఈ తరానికి చెందిన వాళ్లు అసలు పుస్తకాలు కూడా చదవరని తెలిపారు. పుస్తక పఠనం తగ్గడం వల్ల మానవ విలువలు తగ్గడం మొదలైందని అన్నారు. పుస్తకాలకు వెలకట్టలేమని చెప్పారు. డాక్టర్ చదవాల్సిన తాను కారల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్ చదివి ప్రేరణకు గురైనట్లు వెల్లడించారు. ఆ తర్వాత అగ్రికల్చర్ ఎకనామిక్స్‌ను ఎంచుకున్నట్లు చెప్పారు. పుస్తకాలు, విద్య జీవితాలను మార్చేస్తాయని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ రాసిన పుస్తకాలు తనలో ఆలోచనలు కలిగించినట్లు చెప్పారు. -
విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం
-
విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం
సాక్షి, విజయవాడ: విజయవాడలో 29వ పుస్తక మహోత్సవం నేడు ప్రారంభమైంది. 28 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న విజయవాడ పుస్తక మహోత్సవం ఈ ఏడాది కోత్త హంగులతో కొలువుదీరింది. ఈ సందర్భంగా స్వరాజ్ మైదాన్‌లో ‘ నన్ను ప్రభావితం చేసిన పుస్తకం’ అనే అంశంపై సదస్సి జరిగింది. ఈ సరస్సుకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయ నాయకులతో వారికి నచ్చిన పుస్తకం పై మాట్లాడించాలనేది మంచి ఆలోచన. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశం ప్రేరణ కలిగిస్తుంది. ఈ ప్రేరణ తో తమ జీవనశైలిని మార్చుకునే వారే తమ లక్ష్యం సాధిస్తారు. దేశ, విదేశాల్లో అనేక ఉద్యమాలను నడిపిన వారికి పుస్తకాలే ప్రేరణ కలిగించాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మందిని ప్రభావితం చేసినవి కూడా పుస్తకాలే. సమాజాన్ని, దేశాన్ని అర్ధం చేసుకోవడానికి పుస్తకాలు దోహదం చేశాయి. ఇప్పుడు పుస్తకానికి, రాజకీయానికి మధ్య దూరం పెరుగుతోంది. పుస్తక స్పర్శ తెలియని రాజకీయ నాయకులకు, పుస్తకాల ద్వారా జ్ఞానం ఆర్జించిన నేతలకు మధ్య తేడా తెలిసిపోతోంది’ అని ఆయన అన్నారు. ఇందులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లక్షీపతి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ మహోత్సవం నేటి నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. -
స్వరాజ్ మైదానంలో బుక్ ఫెస్టివల్
-
బుక్ ఫెస్టివల్ కోసం స్వరాజ్ మైదానంలో ఏర్పాట్లు
-
నేటి నుంచి నవ్యాంధ్ర పుస్తక సంబరాలు
90 స్టాల్స్ ఏర్పాటు ప్రతిరోజు విద్యార్థులకు పోటీలు బ్రోచర్లు ఆవిష్కరించిన నిర్వాహకులు నెల్లూరు(అర్బన్): నగరంలోని వీఆర్ కళాశాల మైదానంలో శనివారం నుంచి 9 రోజుల పాటు నవ్యాంధ్ర పుస్తక సంబరాలను నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని, సాహిత్యాభిలాషను పెంపొందించేందుకు, మాతృభాషను కాపాడుకునేందుకు పుస్తక సంబరాలు నిర్వహిస్తున్నామని విజయవాడ బుక్స్ ఫెస్టివల్ సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు. వీఆర్ కళాశాలలో పుస్తక ప్రదర్శనకు సంబంధించిన బ్రోచర్లను నిర్వాహకులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 ఏళ్ల చరిత్రలో నెల్లూరులో తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్టు, ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో పుస్తక సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోని కలకత్తా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీస్థాయిలో పుస్తక సంబరాలు జరుగుతాయన్నారు. అందుకే అక్కడ మాతృభాష ఫరిడవిల్లుతోందన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పుస్తక సంబరాలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నెల్లూరులో 90 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ఎగ్జిక్యూటీవ్ ఆర్ రామకృష్ణ మాట్లాడుతూ రోజూ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 రకాల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు బహుమతులను 50శాతం పుస్తకాలు, 50శాతం నగదు రూపంలో ఇస్తామన్నారు. పుస్తకాలు కొనుగోలు చేసిన వారికి ప్రతిరోజు లక్కీ డ్రా తీసి బహుమతులు అందజేస్తామన్నారు. డిగ్రీ చదివిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై చెన్నై, బెంగళూరుకు చెందిన నిపుణులు సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. 8న నగరంలో పుస్తక పాదయాత్ర చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్స్ ఫెస్టివల్ కార్యదర్శి సాయిరాం, ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ, సాహితీవేత్త భాస్కర్‌రెడ్డి, మ్యూజికల్ కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నవ్య స్ఫూర్తి
నేటితో ముగియనున్న పుస్తక సంబరాలు అనంతపురం కల్చరల్ : బాల సాహిత్యం.. వ్యక్తిత్వ వికాసం.. ఆధ్యాత్మికం..సినీ, క్రీడా ఇలా అన్ని రకాల సాహితీ విందునందించిన నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ఆదివారంతో ముగియనున్నాయి. రాష్ట్ర సాంస్కతిక శాఖ, ఎన్టీఆర్ బుక్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల ఒకటి నుంచి అనంతపురంలో సాగిన. పుస్తక ప్రదర్శనతో జిల్లా వాసులకు ప్రఖ్యాతి చెందిన రచయితలు, రాజకీయ విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పేరు గాంచిన పబ్లిషింగ్ అధినేతలతో దగ్గరగా పరిచయం ఏర్పడింది. వివిధ పుస్తకాల ఆవిష్కరణల ద్వారా అనంత కరువు, సీమ కడగండ్లపై సాగిన రచనలలోని గొప్పతనాన్ని తెలుసుకునే వీలును కూడా బుక్ ఫెస్టివల్ కల్పించింది. యువతకు స్ఫూర్తి రగిలించే క్విజ్లు, సెమినార్లు, వ్యాసరచనలు, వక్తత్వం, చిత్రలేఖనం, స్పెల్‌బీ, పాటల, పద్యపఠన పోటీలు ఎన్నో జరిగాయి. ప్రాచీన కళల ప్రదర్శనకు పెద్ద పీట వేశారు. గడువు ఇక ఒక్కరోజే ఉంటుందని నగరవాసులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు అంటున్నారు. పుస్తక ప్రదర్శనను వినియోగించుకోండి వివిధ ప్రదేశాలలో రాష్ట్రస్థాయి పుస్తక సంబరాలు నిర్వహించాలన్న రాష్ట్ర సాంస్కతిక శాఖ ఆలోచన మేరకు తొలిసారి అనంతలో జరగడం ఆనందంగా ఉంది. నవ్యాంధ్ర, తెలంగాణాల రాష్ట్రాల నుండి వివిధ పుస్తక ప్రచురణ సంస్థలు తరలి వచ్చాయంటే నిజంగా వారిని అభినందించాలి. అందరి అభిరుచికి తగ్గట్టు పుస్తకాలను జిల్లా వాసుల ముగింట చేర్చాము. మిగిలిన ఒక రోజు గడువును కూడా సాహితీ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలన్నదే మా విన్నపం. – అనంత్, పుస్తక ప్రదర్శన సమన్వయకర్త -
అనంతపురంలో బుక్ ఫెస్టివల్
-
26 ఏళ్ల ఆనవాయితీకి తిలోదకాలు
ప్రభుత్వ అధీనంలోనే స్వరాజ్య మైదానంలోని సగభాగం సగం స్థలంలోనే బుక్ ఫెస్టివల్ విజయవాడ : ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే బెజవాడ పుస్తక మహోత్సవం ఈసారి చిన్నబోయే పరిస్థితి ఏర్పడింది. ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటుచేసే స్వరాజ్య మైదానంలో (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్) సగభాగాన్ని మాత్రమే ఈసారి ప్రభుత్వం కేటాయించడంతో స్టాల్స్ సంఖ్య కుదించక తప్పలేదు. దేశ, విదేశాలకు చెందిన ప్రఖ్యాత ముద్రణ సంస్థలతో నిర్వహించే ఈ మహోత్సవానికి స్వరాజ్య మైదానం వేదిక. మైదానం సమీపంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉందనే కారణంతో ఈ ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్‌గా చూపి అందులో పుస్తక మహోత్సవ నిర్వహణకు ఆంక్షలు విధించారు. 11 ఎకరాల ఈ మైదానంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఉన్న వైపునంతటినీ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. బందరు రోడ్డువైపు రైతు బజార్ నుంచి కల్యాణ్ జ్యూయలర్స్ షోరూమ్ సమీపం వరకే ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో 400 వరకూ ఏర్పాటుకావాల్సిన స్టాల్స్ 230కి తగ్గిపోయాయి. గత సంవత్సరం 389 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ నిర్వహించగా ఈసారి ఆ స్థాయిలో నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. ప్రముఖ ముద్రణా సంస్థల స్టాల్స్: సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలు జరుపుకొన్న విజయవాడ బుక్ ఫెస్టివల్ కోసం ప్రతి సంవత్సరం వేలాదిమంది ఎదురుచూస్తుంటారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ముద్రణా సంస్థలు, ఎస్ చాంద్, హిమాలయ వంటి పేరొందిన ముద్రణా సంస్థలు ప్రతి ఏటా ఇక్కడ తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తాయి. ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదో తేదీ వరకూ జరిగే ఈ ఎగ్జిబిషన్‌ను నాలుగు లక్షల మంది సందర్శిస్తారని, రెండు కోట్లకు పైగా విక్రయాలు జరుగుతాయని అంచనా. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు దొరకని పుస్తకం ఉండదు. అందుకే దూరప్రాంతాల నుంచి కూడా అనేకమంది ఇక్కడకొస్తారు. 1989 నుంచి ఇలా నిరాఘాటంగా జరుగుతున్న పుస్తక మహోత్సవానికి భద్రత కారణాల పేరుతో ఈసారి అధికార యంత్రాంగం బ్రేకు వేసింది. తొలుత పుస్తక మహోత్సవాన్ని వేరే చోట పెట్టుకోవాలని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీకి సూచించారు. కానీ నగరం నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉన్న గ్రౌండ్‌ను కాదని వేరేచోట పెడితే ఇబ్బంది వస్తుందని నిర్వాహకులు ఆందోళనతో సగం స్థలం కేటాయించారు. పుస్తక ప్రియుల ఆందోళన నగరంలో విజ్ఞాన, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు స్వరాజ్య మైదానం ఎంతోకాలం నుంచి వేదికగా ఉంటోంది. కొద్దిరోజుల నుంచి భద్రత పేరుతో వీటికి అనుమతివ్వడంలేదు. దీంతో భవిష్యత్తులో పుస్తక మహోత్సవాలు, ఇతర కార్యక్రమాలకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఈ తరహా మైదానం మరొకటి లేకపోవడంతో అలాంటి కార్యక్రమాలు నగరం వెలుపల నిర్వహించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఒకే ఒక మైదానాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమను ఊరిబయటకు వెళ్లమనడంపై పుస్తక ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేటినుంచి పుస్తకాల పండగ
విజయవాడ, న్యూస్‌లైన్ : ఏడాది గిర్రున తిరిగి వచ్చేసింది. నూతన సంవత్సరంతో పాటు పుస్తకాల పండగ కూడా సాహితీ అభిమానుల ముంగిటకు అరుదెంచింది. అనేక సాహిత్యాంశాలతో కూడిన పుస్తకాలన్నీ ఒకేచోట కొలువై ఉండే అరుదైన ఘట్టం మరోసారి మన ముందుకొచ్చింది. విజయవాడ నగరానికి తలమానికంగా నిలిచే పుస్తకాల పండగ స్వరాజ్య మైదానంలో బుధవారం ప్రారంభం కానుంది. పుస్తక మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. స్వరాజ్య మైదానంలో పుస్తక మహోత్సవ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు డీ అశోక్‌కుమార్, రావిక్రింది రామస్వామి ఈ వివరాలు వెల్లడించారు. గడిచిన 24 సంవత్సరాలుగా పుస్తక మహోత్సవాలను ప్రచురణకర్తలు, సాహితీవేత్తలు, నగర ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి ప్రఖ్యాత ప్రచురణకర్త సీకే నారాయణరెడ్డి పేరును, ప్రధాన వేదికకు సుప్రసిద్ధ రచయిత్రి మాలతీ చందూర్ పేరును పెట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది పలు ప్రచురణా సంస్థలు తమ పుస్తకావిష్కరణలను పుస్తక మహోత్సవ ప్రాంగణంలో జరుపుకోనున్నాయని వివరించారు. 299 స్టాల్స్ ఏర్పాటు... గత ఏడాది 258 స్టాల్స్ ఏర్పాటు చేయగా ఈ ఏడాది దానిని 299కు పెంచినట్లు వారు చెప్పారు. ఈ ఏడాది ప్రధానంగా మళయాళ మనోరమ వంటి దిన, వారపత్రికలు, తెలుగు అకాడమీ, నేషనల్ బుక్‌ట్రస్ట్, సాహిత్య అకాడమీ వంటి ప్రభుత్వ సంస్థలు, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, పీఆర్సన్ తదితర బహుళ జాతీయ సంస్థలు పాల్గొనున్నాయని వివరించారు. ముఖ్యాంశంగా ‘బాల సాహిత్యం’... ఈ ఏడాది పుస్తక మహోత్సవం ప్రత్యేక ముఖ్యాంశంగా బాల సాహిత్యాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్స్ లిటరేచర్ సహాయంతో నాలుగు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాహిత్య అకాడమీ ‘పిల్లల కోసం రాయటం’ అనే అంశంపై కన్నడ, తెలుగు రచయితల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. శత జయంతులు... 2014 సంవత్సరంలో శత జయంతులు వచ్చే రచయితలు జీవీ కృష్ణారావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, శంకరంబాడి సుందరాచారి, కాళోజీ, కోదాటి నారాయణరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, సంజీవ్‌దేవ్‌ల శతజయంతి సభలు జరుగుతాయన్నారు. ఆయా సభలకు ప్రముఖ రచయితలు, వారితో అనుబంధం ఉన్న ప్రముఖులు అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు... విద్యార్థుల కోసం పతిభ వేదిక ప్రత్యేకంగా ఏర్పాటుచేసి పలు పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఈ వేదికకు మన సాహిత్యంపై పిల్లలకు ఇష్టమయ్యే రీతిలో సచిత్రంగా శ్రీకారం చుట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను తీసుకొచ్చిన అమరచిత్రకథ వ్యవస్థాపకుడు అనంత్‌పాయ్ పేరు పెట్టారని వివరించారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రముఖులు కే రవి, వీజీఎస్ రామారావు, నవోదయ రామ్మోహనరావు, బీ బాబ్జి, బీ రవికుమార్, జే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పుస్తక పండుగ వచ్చేస్తోంది..
=7 నుంచి బుక్ ఫెస్టివల్ =ప్రవేశం ఉచితం =ప్రతీ పుస్తకంపై రాయితీ పంజగుట్ట,న్యూస్‌లైన్: ఒకటికాదు..రెండుకాదు. వేలాది పుస్తకాలు ఒకేచోట.. చిన్నారులు, పెద్దలు, యువతకు కావాల్సిన అన్నిరకాల పుస్తకాలు కొలువుదీరనున్నాయి. అంతేకాదు ఒక్కో పుస్తకానికి 10 నుంచి 50 శాతం వరకు రాయితీ కూడా ఇస్తున్నారు. ప్రతియేటా నగరంలో నిర్వహించే పుస్తకమేళా డిసెంబర్ 7 నుంచి 15 తేదీ వరకు జరగనుంది. దీనికి సంబంధించిన విషయాలను హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు హన్మంతరావు, పుస్తక మేళా ఆఫీసర్ ఇన్ఛార్జ్ డా.పత్తిపాక మోహన్లతో కలిసి నేషనల్ బుక్ ట్రస్ట్ డెరైక్టర్ సికందర్ శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈసారి మేళా పీపుల్స్‌ప్లాజాలో కాకుండా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 8గంటల వరకు జరిగే ఈ పుస్తక ప్రదర్శనలో మొదటిసారిగా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, మేళాలో విక్రయించే ప్రతీ పుస్తకంపై పదిశాతం రాయితీ ఉంటుందని, ఆంగ్లభాష కాకుండా అన్ని భారతీయ భాషల్లో పుస్తకాలు అమ్మే స్టాళ్లకు యాభైశాతం ప్రత్యేకరాయితీ ఉంటుందన్నారు. మొత్తం 300కు పైగా స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని,ప్రదర్శనలో పాల్గొనే ప్రచురణకర్తలు, విక్రేతలు మేళావేదికపై సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు జరపదల్చుకునే వారు 09811239219, లేదా www.nbtindia.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన కోరారు.