పెళ్లింట్లో చోరీ..
జగిత్యాల: వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలోని మార్కెట్రోడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాలనీలో నివాసముంటున్న ఓ ఇంట్లో త్వరలో పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో నిమగ్నమైన కుటుంబ సభ్యులు పత్రికలు పంచడానికి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు.
ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదుతో పాటు పలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మంగళవారం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అనంత్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.