Capricorn
-
మకరరాశి: మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సమస్యలు, ఆత్మీయుల మధ్య విభేదాలు
మకర రాశి (ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6) మకరరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయంలో శని, తృతీయ చతుర్థాలలో గురు సంచారం, తృతీయ చతుర్థాలలో రాహుగ్రహ సంచారం, భాగ్య దశమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వివాహాది వ్యవహారాలు, నూతన స్వగృహం ఏర్పాట్లు ఈ సంవత్సరం సానుకూలపడతాయి. ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంటుంది. అవివాహితులకు వివాహకాలంగా చెప్పవచ్చు. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. దీనికి మీ బంధువుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. అయిన వాళ్ళతో సంబంధాలు చేసుకోవాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇతరుల పేరుమీద మీరు చేసే వ్యాపారాలు, బినామీ వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపార సంస్థలను విస్తరింపజేయటమే ధ్యేయంగా కష్టపడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో మీ వాటాలను తగ్గించుకుంటారు. కోళ్ళఫారాలు, పశువుల పెంపకం, ఫారిన్ కొలాబరేషన్ కంపెనీలలో లావాదేవీలు లాభిస్తాయి. భూముల కొనుగోళ్ళ విషయాలలో అగ్రిమెంట్స్‌కు ప్రాముఖ్యతనిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ, కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. అలంకార వస్తు సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి, ఉద్యోగాలలో చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు ఎంపికవడం, రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వాస్తవాలను మరుగుపరచే ప్రయత్నాలు చేసి, సమస్యలను ఎదుర్కొంటారు. మీ ప్రతిష్ఠ, స్థానం కుదుపులకు లోనైనా నిలబడుతుంది. వెన్నునొప్పి, కీళ్ళనొప్పులు ఇబ్బంది కలిగించవచ్చు. చిన్న చిన్న కలహాలు, ఆత్మీయుల మధ్య విభేదాలు చికాకు కలిగిస్తాయి. గతంలో ఫైనాన్స్ కంపెనీల్లో మీరు పొదుపు చేసిన ధనం ఒక్క రూపాయి కూడా మీ చేతికి రాదు. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. అభిమానించి నెత్తిన పెట్టుకున్న పెద్దలు నిష్కారణంగా దూరంగా ఉంచుతారు. ఎందుకు దూరంగా ఉంచారో? కారణాలు తెలియక మనోవేదనకు గురవుతారు. మీలో ప్రతీకార వాంఛ పెరుగుతుంది. మీ సన్నిహితులు చేసిన పొరపాట్లకు న్యాయస్థానాల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఖర్చులు తగ్గించే అవకాశాలు ఉండవు. పొదుపు చేసుకునే అవకాశాలు కూడా కనబడవు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా, వ్యక్తిగత కారణాల వల్ల అవకాశాన్ని చేజార్చుకుంటారు. సమాజంలోని ముఖ్యులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. పర్యటనలు, విందులు, వినోదాలు సంతోషం కలిగిస్తాయి. కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తారు. వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐకమత్యంగా వ్యాపారాలు చేస్తారు. మంచి లాభాలు పొందుతారు. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారు తరుచూ ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తిపరంగా స్థిరత్వం ఉండదు. తల్లిదండ్రులు, పెద్దలపట్ల ఎంత విధేయంగా ఉన్నా, వాళ్ళ అభిమానాన్ని సంపూర్ణంగా పొందలేకపోతారు. సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబంలో బంధువుల అతి జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంచటానికి అధికంగా శ్రమిస్తారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరఘోష తొలగిపోతుంది. పూర్తి అయ్యాయి అనుకున్న పనుల విషయంలో మళ్ళీ చర్చలు, వివాదాలు చోటు చేసుకుంటాయి. ఘర్షణలు అనివార్యం అవుతాయి. సహోదర వర్గంలో ఒకరు మీకు అండగా నిలుస్తారు. పరిచయాల కన్నా స్నేహం కన్నా ధనమే ముఖ్యమని గ్రహించి బాధపడతారు. చెప్పుకోదగిన సమస్యలు ఆందోళనకు గురిచేస్తాయి. బయటి స్నేహితులకు చెప్పుకుని ఊరట చెందుతారు. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం వల్ల సమస్యలు అధికం అవుతాయి. చదువు, ఆరోగ్యం సమస్యలుగా మారుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, వీరఖడ్గం మెడలో ధరించాలి. మొత్తం మీద మీకు ఈ సంవత్సరం బాగుంటుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ మనోధైర్యం, నిబ్బరం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరికీ మంచి చేసి, చిన్న కారణం వల్ల విరోధం అవుతారు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల నైరాశ్యం, కోపం కలుగుతాయి. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని కించపరచిన వాళ్ళు మీ సహాయం అర్థించే పరిస్థితి వస్తుంది. మీ పేరుపైన ఇతరులు చేసే వ్యాపారాలు మధ్యస్థ ఫలితాన్ని ఇస్తాయి. చిన్నచిన్న కారణాల వల్ల పెద్ద సమస్యలు పక్కతోవ పడతాయి. అష్టమూలికా తైలంతో నవగ్రహ వత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సామాజిక విషయాలలో మీ పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. కోర్టువ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సాంస్కృతిక, కళారంగాలలో గుర్తింపు లభిస్తుంది. విలువైన నగలు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నైతిక బాధ్యతలను నెరవేరుస్తారు. ప్రశాంతంగా సాగుతున్న మీ జీవిత చక్రంలో ఓ వ్యక్తి ప్రవేశం కొన్ని మార్పులకు దారితీస్తుంది. కుటుంబ వ్యవహారాల పట్ల దృష్టి పెడతారు. సంతానం క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జీవితంలోకి ఆహ్వానించి, జీవితాంతం కలిసి ఉండాలని మీరు వలచిన వ్యక్తి నిజస్వరూపం తెలుసుకుని వేదనకు గురవుతారు. అందరినీ నమ్మాల్సిన పరిస్థితి, ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఇబ్బంది పెడతాయి. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు చిక్కుల్లో పడతారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీరు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాచుకున్న ధనం, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వల్ల చిక్కులు ఏర్పడుతాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఇతర భాషల వల్ల ప్రయోజనం, పోటీ పరీక్షలకు సంబంధించి విజయం సాధిస్తారు. డాక్టర్లకు, చార్టర్డ్ అకౌంటెంట్లకు, మ్యారేజ్ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంది. గైనిక్ సమస్యలు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి. చీటీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారం వల్ల నష్టపోతారు. స్త్రీల వల్ల కొన్ని సందర్భాలలో నిందలు, ఆరోపణలు రావచ్చు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో చాలా విషయాలు పరిష్కరించు కోగలుగుతారు. దైవానుగ్రహం వల్ల కొన్ని కార్యక్రమాలు వాటికి అవే పూర్తి అవుతాయి. ఐఐటీ, మెడిసిన్ సీటు లభిస్తుంది. పోటీ పరీక్షలలో కష్టపడి చదవకపోయినా, అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సెల్ఫ్‌డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మీద ప్రేమ లేకపోయినా మీ పేరు కలిసివస్తుందని అన్ని విషయాల్లో మీ పేరుకు ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. -
మకర రాశి ఫలాలు 2022-23
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ) శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ) ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (ద్వితీయం)లోను తదుపరి మీనం (తృతీయం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం(జన్మం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (పంచమం) కేతువు వృశ్చికం (లాభం)లోను తదుపరి రాహువు మేషం (చతుర్థం) కేతువు తుల (దశమం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (పంచమం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని, అర్ధాష్టమ రాహువు, తృతీయ గురువులలో ఎవరూ అనుకూలించే గ్రహాలు కాదు. కానీ ఇతర గ్రహాలు ప్రతినెలలోను ఏదో ఒక గ్రహం ఎక్కువ కాలం పాటు సంతృప్తికర ఫలితాలు అందిస్తున్న కారణంగా విజయపథంలోనే ముందుకు వెడతారు. గత సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అందుకుంటారు. దీర్ఘకాలికమైన పనులను ఈ సంవత్సరం పెట్టుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం తగుమాత్రంగా ఉన్నా, అవసర సమయాల్లో డబ్బు తగిన రీతిగా సర్దుబాటు కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. పాత ఋణాలు తీర్చే విషయంలో అనుకూలత తక్కువగా వున్నందున ఆర్థిక ఒడంబడికలకు దూరంగా ఉండండి. మితభాషణ శ్రేయస్కరం. కుటుంబసభ్యుల ద్వారా కొన్ని విషయాలలో అనుకూల వాతావరణం. కొన్ని ఆర్థిక వ్యాపార శుభ వ్యవహారాల్లో మంచి ఫలితాలు దక్కుతాయి. పిల్లల అభివృద్ధి వార్తలు, పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉందనే వార్తలు తరచుగా వింటారు. స్థానచలనం, ప్రమోషన్ వంటి అంశాలు ఈ సంవత్సరం మీ తెలివి తక్కువతనంతో ఇబ్బందికరం కాగలవు. మందకొడి ఆలోచనలు, ప్రవర్తనలతో వ్యాపార నిర్ణయాలు సరిగా చేయలేరు. అందువల్ల వ్యాపారులకు సంవత్సరం అంతా సామాన్య ఫలితాలు మాత్రమే ఉంటాయి. కార్మికులతో సమస్యలు తప్పవు. ఉద్యోగులు నమ్మకూడని వ్యక్తులను ఆశ్రయించి, వారి సలహాలను అమలు చేసి, మీ అభివృద్ధికి మీరే అవరోధాలు సృష్టించుకుంటారు. అనవసర సమస్యలను కొని తెచ్చుకుంటారు. నిర్లక్ష్యం వల్ల ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటారు. సుగర్, బీపీ ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు పనులు వేగంగా సాగవు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారు దూకుడు ఆలోచనలు ప్రమాదకరం అని గమనించాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యాపరంగా కార్యానుకూలత ఉంది. ఉద్యోగరీత్యా అనుకూలత లేదు. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు తరచుగా కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి. కంగారు పడనవసరం లేదు. విద్యార్థులకు విద్యా వ్యాసంగం సామాన్యంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేసే ఆసక్తి తగ్గుతుంది. రైతులకు శ్రమ ఎక్కువ అయినా, ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మంచి ఫలితాలు ఆలస్యంగా అందుతాయి. గర్భిణిలు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ఉంటారు. కాలం అనుకూలమే అని చెప్పాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు తరచుగా పూజలు, వ్రతాలు, నోములు వంటి పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ధైర్యంగా తెలివిగా ఎంతటి కార్యాన్నయినా విజయవంతం చేసుకునే అవకాశం వుంటుంది. మౌనంగా వుంటూనే ప్రతి పనినీ సాధించుకోవడంలో కృతకృత్యులవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రవణ నక్షత్రం వారికి మానసిక అలజడి ఎక్కువగా వుంటుంది. సాంఘిక కార్యక్రమాలకు వీలయినంత దూరంగా వుండడం శ్రేయస్కరం. ఇతరులకు సహకరించాలనే మీ మంచితనం ఈ సంవత్సరం మీ పాలిట శాపంగా మారే అవకాశం వున్నది. ప్రయాణాలు ఒంటరిగా చేయవద్దు. ధనిష్ఠా నక్షత్రం వారికి కాలం చాలావరకు అనుకూలమనే చెప్పాలి. ప్రతిపనీ అతి శ్రమతో పూర్తవుతుంది. గతకాలం కంటే చాలావరకు సానుకూలం అనే చెప్పాలి. ఆగస్టు తరువాత తల్లి తరఫులేదా భార్యాతరఫు బంధువుల వల్ల మంచి సహకారం లభించి కొన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం వుంటుంది. శాంతి: అవకాశం ఉన్నప్పుడు శని రాహు శాంతి చేయించండి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి 11 సార్లు పారాయణం చేయడం, ‘గౌరీశంకర’ రుద్రాక్ష ధరించడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆర్థిక సౌకర్యం చాలా తక్కువ. ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి. ఇతరులను నమ్మి పనులు ప్రారంభించవద్దు. ఋణ విషయాల్లో అనుకూలత తక్కువ. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పనీ స్వయంగా చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం తక్కువ. మే: చాలా అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. క్రమంగా ఒక్కో పని వేగం పుంజుకుంటుంది. అందరూ సహకరిస్తారు. 15వ తేదీ తరువాత తరచుగా ఉష్ణప్రకోపం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్దస్థాయి ఇబ్బందులు ఉండవు. స్నేహపూర్వక వాతావరణంలో చాలా వ్యవహారాలను సానుకూలం చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలం. జూన్: ఆలోచనలు వేగంగా ఉంటాయి. పనులు వేగంగా చేస్తారు. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా వచ్చే లాభాలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో మంచి వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి వార్తలు బాగుంటాయి. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. జూలై: ఏలినాటి శని ఉన్నా, ఈ నెలలో పనులు చక్కగా పూర్తవుతుంటాయి. ప్రధానంగా పుణ్యకార్య, శుభకార్య ప్రయత్నాలలో కాలక్షేపం జరుగుతుంది. అందరూ మీకు సహకరిస్తారు. అందరికీ మీరు సహకరిస్తారు. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలం. షేర్ వ్యాపారులకు కలసివచ్చే కాలం. ఆగస్టు: సాధారణ స్థాయి ఫలితాలు మాత్రమే ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా ప్రవర్తించి లబ్ధి పొందుతారు. ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఋణ సంబంధ లావాదేవీల్లో ఎవరికీ ఎటువంటి హామీలు ఇవ్వవద్దని ప్రత్యేక సూచన. సెప్టెంబర్: కొన్ని పనులు సానుకూలంగానూ, కొన్ని పనులు ఇబ్బందికరంగానూ కావడంతో మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. చివరి వారంలో పనులు వేగంగా సాగుతాయి. పిల్లలతో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. విద్యా, విజ్ఞాన, పుణ్యకార్యాలపై దృష్టి కేంద్రీకరించలేక ఒత్తిడికి లోనవుతారు. అక్టోబర్: ఏలినాటి శని ఉన్నా, గ్రహచారం ఇబ్బంది లేకుండా మీ పనులు సాగించుకునే రీతిగా యోగిస్తుంది. చాలాకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నాలు ఈ నెల విజయవంతమవుతాయి. ప్రధానంగా ఆర్థిక వెసులుబాటు తృప్తినిస్తుంది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో ఒక్కో కోణంలో ఒక్కో రకంగా లాభం చేకూరుతుంది. నవంబర్: ఏలినాటి ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నందున అన్ని అంశాలూ సానుకూలంగా ఉంటాయి. పనుల్లో ఆలస్యం జరిగినా, సానుకూలంగా పూర్తవుతాయి. వాత సంబంధ, జీర్ణ సంబంధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం చికాకు పడతారు. ప్రధానంగా ఆర్థికంగా కుటుంబపరంగా సౌఖ్యం ఉంటుంది. డిసెంబర్: ప్రతిపనీ కూడా చాలా శ్రమతో పూర్తవుతుంది. వాహనాలు తరచుగా రిపేర్లకు వస్తాయి. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రత్యేకించి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో ఆటంకాలు, చికాకులు ఎక్కువ అవుతాయి. ఇతరుల విషయంలో కలగజేసుకోవద్దు. దూరప్రాంత ప్రయాణాలు విరమించమని సూచన. జనవరి: రవి శని బుధ గ్రహదోషంతో నెలంతా ఇబ్బందికరమే. కేవలం శుక్రసంచారం ఒక్కటే అనుకూలంగా ఉంది. ప్రశాంతత తగ్గుతుంది. తెలివిగా ప్రవర్తించి సమస్యలను అధిగమిస్తారు. వృత్తి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో కలహం రాకుండా జాగ్రత్తపడండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగానే ఉన్నా, ఖర్చులు పెరుగుతాయి. ఫిబ్రవరి: ఏలినాటి శని ఉన్నా, మిగిలిన గ్రహాల అనుకూలతతో సాధారణ జీవనానికి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు గత సమస్యలు పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. మీ తెలివి కొన్నిసార్లు పని చేయని స్థితి ఉంటుంది. ఆర్థిక మాంద్యం తప్పదు. మార్చి: గ్రహచారం అనుకూలంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రతి పనిలోనూ వేగంగా పనులు చేయడం, వేగంగా ఫలితాలు అందుకోవడం జరుగుతుంది. ప్రధానంగా వృత్తి విషయాలు అనుకూలంగా ఉంటాయి. రోజూ కొత్త కొత్త వ్యవహారాలు చేస్తారు. ఇబ్బందిలేని కుటుంబ, ఆరోగ్య జీవనం ఈ నెలలో బహు అనుకూలం. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
కెయిర్న్‌తో ‘రెట్రాస్పెక్టివ్’ వివాద పరిష్కారం
న్యూఢిల్లీ: రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారానికి సంబంధించి కేంద్రం బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి రూ.7,900 కోట్లు రిఫండ్చేసింది. కెయిర్న్ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీగా పేరు మారింది) ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ‘‘పన్ను రిఫండ్‌గా 1.06 బిలియన్ డాలర్లను స్వీకరించడం జరిగింది’’ అని పేర్కొంది. దీనితో భారత్‌తో పెట్టుబడులకు సంబంధించి గడిచిన ఏడేళ్ల నుంచి తీవ్ర వివాదాస్పంగా ఉన్న రెట్రాస్పెక్టివ్ వివాదంలో కీలక సానుకూల పరిణామం చోటుచేసుకున్నట్లయ్యింది. వివారాలు ఇవీ... 50యేళ్ల క్రితం జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేందుకు వీలు కల్పిస్తూ 2012లో చేసిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. పలు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో దీనిపై పలు సంస్థలు దావాలు దాఖలు చేసి, వాటికి అనుగుణంగా తీర్పులను పొందాయి. కెయిర్న్ విషయానికి వస్తే, 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్‌కు నోటీసులు పంపించింది. వాటిని రాబట్టుకునేందుకు కెయిర్న్ షేర్లు మొదలైన వాటిని జప్తు చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 7,900 కోట్లు. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. కానీ, భారత ప్రభుత్వం వాటిని తిరస్కరించడంతో .. తనకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు విదేశాల్లో భారత ప్రభుత్వానికి ఉన్న ఆస్తులపై కెయిర్న్ దృష్టి సారించింది. వాటిని జప్తు చేసి, తనకు పరిహారం ఇప్పించాలంటూ వివిధ దేశాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించింది. కొన్ని చోట్ల కంపెనీకి అనుకూల ఆదేశాలు కూడా వచ్చాయి. వరుసలో మరో 16 కంపెనీలు! అంతర్జాతీయంగా వివాదాస్పదం కావడంతో కేంద్రం గత ఏడాది రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఈ దిశలో వివాదాస్పద చట్ట నిబంధనల కింద వసూలు చేసిన మొత్తాలను తిరిగి రిఫండ్ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.1.10 లక్షల కోట్ల పన్ను డిమాండ్లు అందుకున్న దాదాపు 17 కంపెనీల్లో 14 కంపెనీలు వీటి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ ఒకటి. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల న్యాయస్థానాల్లో భారత్‌పై వేసిన దావాలన్నింటిని కెయిర్న్ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించింది. ఆ తర్వాత ట్యాక్స్‌ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేసింది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కెయిర్న్‌కు మార్గం సుగమం అయ్యింది. కెయిర్న్తోపాటు కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగులు వేస్తోంది. -
నవ్యక్రాంతి.. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి
సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాము. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాము. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాము కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో జనవరి నెలలో 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ వస్తుంది. తెలుగువారి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా పండుగ చేస్తాము. మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ ఇది. సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్ళతో బంధుమిత్రులతో ఇల్లు, మనసు ఆనందంతో కళకళలాడుతుంది. కనుమ నాడు ఇంతటి పాడి పంట ఇంటికి రావటానికి కారణమైన గోవులను, వృషభాలను అలంకరించి, పూజించి, చక్కటి దాణా వేసి, ఆనందింప జేస్తారు. ప్రతి సంక్రమణం పవిత్రమైనదే. ప్రతి సంక్రమణంలోనూ పితృ తర్పణాలివ్వాలి. విశేషంగా మకర సంక్రమణ కాలంలో మకర సంక్రమణ స్నానం చెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున తప్పక పితృ తర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తుతించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు గడలు, గుమ్మడి పండు మొదలైనవి దానమివ్వాలి. ఈ కాలంలో చేసే గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని చెప్తారు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసమంతా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇళ్ళ ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బెమ్మలు పెడతారు. సంక్రాంతినాడు ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన పెద్ద రంగవల్లులను తీర్చిదిద్దుతారు. వాటిమీద గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మిడి పూలతో, బంతి పూలతో అలంకరించి, చుట్టూరా రేగుపళ్ళు, చెరుకు ముక్కలు వేసి, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను ఆమె చెలికత్తెలుగా భావన చేసి, పసుపు కుంకుమలతో పూజించి, హారతిస్తారు. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు‘, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ళ మీద కూర్చుని లేవటం, ‘డూడూ డూడూ బసవన్నా‘ అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చెయ్యటం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును సాక్షాత్తుగా బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు డబ్బులిస్తారు, ధాన్యాన్నిస్తారు. వృషభం ధర్మ దేవతకు ప్రతీక. ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయపాత్రను కదలకుండా పెట్టుకుని, రెండు చేతులతో చిరుతలు పట్టుకుని వాయిస్తూ, నుదుటిన తిరునామం పెట్టుకుని, కాళ్ళకు కంచు గజ్జెలు కట్టుకుని, అవి ఘల్లు ఘల్లుమంటుండగా ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ, చిందులు వేస్తూ వస్తాడు. అలాగే చిందులేస్తూ, హరినామం గానం చేస్తూ, తంబూరా మీటుతూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ సంభావనలిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాళ్లు వస్తారు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ‘హర హర మహాదేవ‘ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిచ్చి సంభావిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీను. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ప్రార్ధిస్తారు. బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వులుండలు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ పందాలు, కొన్ని ప్రాంతాల్లో జల్లెకట్టు వంటివి ఆడి ఆనందిస్తారు. పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేసి ఆనందిస్తారు. సాధారణంగా అందరూ సంక్రాంతి పండుగకు ముందు రోజు అరిశలు, చక్కిలాలు, నువ్వులుండలు, పాలకాయలు, జంతికలు వంటివి చేస్తారు. పండుగ రోజున పరమాన్నం, బొబ్బట్లు, పులిహోర లాంటివి చేస్తారు. అన్నింటినీ దైవానికి నివేదించి, బంధువులకు, ఇంటి చుట్టుపక్కల వారికి, ఇంట్లో పనిచేసే వారికి పంచిపెడతారు. మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను కనుమనాడు పూజిస్తారు. పుడమి తల్లిని పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది’ అంటారు కనుక కనుమ నాడు గారెలు, ఆవడలు తప్పకుండా భుజిస్తారు. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మన మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా అత్యధిక శాతం మంది జరుపుకునే గొప్ప పండుగ ‘నవ్య సంక్రాంతి పండుగ‘. పెద్ద పండగ ఎలా అయింది? సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారటం వలన ప్రకృతిలో కూడా ప్రతి నెల స్పష్టమైన మార్పును సంతరించుకుంటుంది. ఈ మార్పు మానవ జీవితంపైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగ గా జరుపుకుంటున్నాము అంటే, దానికి అనేక కారణాలున్నాయి. అప్పటి వరకు ఉన్న చలి మకర సంక్రమణంతో తగ్గుముఖం పడుతుంది. వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, సుందరమైన, ఆహ్లాదకరమైన వసంత కాల ఆగమనానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభ మవుతుంది. దక్షిణాయనంలో పగళ్ళు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాయణంలో పగళ్ళు ఎక్కువ, రాత్రిళ్ళు తక్కువ ఉంటాయి. ప్రకృతిలో ఇది గొప్ప మార్పు. ఆనందకరమైన, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలిగించే మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. దక్షిణాయనం సాధనా కాలం, ఉపాసనా కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యుని రథ గమనంలో మార్పు వల్ల ఎండ వేడిమి నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ప్రారంభమవగానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభ కార్యాలను జరిపిస్తాము. కనుకే ఉత్తరాయణం ప్రారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని ‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాము. పెద్దలకు తర్పణలు విడుచుకునే పర్వదినం ఇది. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే శ్రీ సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. – డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత సంస్కృత ఆచార్యులు -
శార్వరి నామ సంవత్సర (మకర రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ సంబంధమైన అవకాశాలు మీకు మీ రక్తసంబంధీకులకు, మీ కుటుంబీకులకు వస్తాయి. ఇది మీ ప్రతిష్ఠను పెంచుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాలలో ఋజువు అవుతుంది. విదేశాలలో మీ వారికి కీలక సమయంలో తగు సహాయం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి వస్తుంది. కుటుంబ విషయాల తాలూకు ప్రభావం మీ వృత్తి ఉద్యోగ, వ్యాపారాల మీద పడుతుంది, జాగ్రత్త వహించండి. ఎంత జాగ్రత్త వహించినా సహచరవర్గము, అనుచర వర్గము, సోదర వర్గము వల్ల కొన్ని చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. ఎవరిని నమ్మాలో ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టతరం అవుతుంది. ఈ విషయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభపడగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో, అభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల సగౌరవంగా ప్రవర్తించరు. మీ వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. ఒకనాటి శత్రువులు, మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి లభిస్తుంది. నమ్మకద్రోహాన్ని, కృతఘ్నతను భరించలేరు. ఇవి పదేపదే గుర్తుకువచ్చి మనస్సును బాధిస్తాయి. లౌక్యం లోపించటం వల్ల, స్వతంత్ర భావాల వల్ల కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. దైవానుగ్రహం వల్ల ఆపదలను దాటుకుని అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయసహకారాలు, సేవలు అందుతాయి. ఉద్యోగపరంగా స్థానచలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లీజులు, లైసెన్సులు అనుకూలిస్తాయి. ప్రభుత్వపరంగా రావలసిన రాయితీలు, మినహాయింపులు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానధర్మాలు సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. మీ సంస్థ గుడ్‌విల్, ప్రతిష్ఠ పెరుగుతుంది. రవాణా సంబంధితమైన ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాలలో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. రొటీన్ సంతకాల విషయంలో సాంప్రదాయ వ్యక్తిగత బంధుత్వ అనుబంధాలకు అతీతంగా వ్యవహరించండి. పొరపాటు సంతకాల వల్ల ఇబ్బందులు రావచ్చు. అతికష్టం మీద ముఖ్యమైన తప్పిదాలలో మీ పొరపాటు లేదని మాత్రం ఋజువు అవుతుంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పిక్నిక్లు, విందువినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలలో అపశ్రుతులు సంభవించవచ్చు, జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మీ స్థానాన్ని ఆశించిన వారు భంగపడటం మీకు ఆశ్చర్యం కలిగించదు. ఎందరు ఏమి చేసినా దైవానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగా మారుతుందని ఋజువు అవుతుంది. మీ స్వయంకృతాపరాధాలు, మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు. సంవత్సర ద్వితీయార్ధంలో స్త్రీలకు సంబంధించి వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. పంతాలు, పట్టింపులకు పోకుండా చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. నిందల బరువు దింపుకుంటారు. మీ ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. అయితే కృత్రిమంగా ప్రభుత్వపరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద, వృత్తిఉద్యోగాల మీద ప్రభావం చూపుతుంది. స్వంత విషయాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడతారని మీ మీద వచ్చిన ఆరోపణలకు సంఘటనలే సమాధానం చెబుతాయి. వృత్తిఉద్యోగాల కొరకు శ్రమించి సంపూర్ణ న్యాయం చేశామన్న సంతృప్తి కలుగుతుంది. అందరినీ సమన్యాయంతో చూస్తారన్న ప్రఖ్యాతి కూడా లభిస్తుంది. మీ సహచరవర్గంలో ప్రతిభ కలిగిన వాళ్ళను గుర్తించలేకపోయామన్న బాధ కలుగుతుంది. ఈ విషయంలో అంతర్మ«థనం చెందుతారు. నిబంధనలకు, నైతిక ధర్మానికి తిలోదకాలు ఇచ్చి మీ సాటి వాళ్ళు అధికంగా, మీతో సమానంగా ప్రయోజనాలు పొందుతారు. ఇందువల్ల మానసిక వైరాగ్యం కలుగుతుంది. ఆలోచనలు పరిపరివిధాలా పోతాయి. శత్రువర్గం ఐకమత్యంగా ఉండకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహం అమలు చేస్తారు. చివరివరకు మీ ఆంతర్యం ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడతారు. విద్యా ఆర్థిక సంబంధిత విషయాలలో పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలో అండదండగా ఉంటారు. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద సజావుగానే సాగుతుంది. మంచివాళ్ళను ఆదర్శంగా తీసుకుని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. కొన్ని మంచి కార్యాలకు సంబంధించి ఋణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తిఉద్యోగాలపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు. ఆర్థికపరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషిచేస్తారు. సన్నిహితుల పేరుమీద వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం సక్రమంగా సాగడానికి అవసరమైన బలం, బలగం, రాజకీయ పలుకుబడి ఉపయోగపడతాయి. విలువైన స్థిరాస్తులలో కొంత భాగాన్ని అమ్ముదామని ప్రయత్నించినా కొన్ని కారణాల వలన కొంతకాలం వాయిదా వేస్తారు. న్యాయస్థానాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అందువలన ఎంతో ఊరట కలుగుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలు సానుకూలంగా ఉంటాయి, మంచిపేరు వస్తుంది. అసూయాగ్రస్తులైన కొంతమంది వల్ల కృత్రిమంగా ఇబ్బందులు ఏర్పడతాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడతారు. ఐకమత్యంతో సమిష్టిగా కృషి చేస్తే ఏ కార్యాన్నైనా సఫలీకృతం చేయవచ్చునని భావిస్తారు. అందరినీ కలుపుకుని ఒక ముఖ్యమైన కార్యంలో లాభం పొందుతారు. సమిష్టిగా లాభాలు పంచుకుంటారు. ఇతరులు అడిగే ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెబుతారు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ స్వంత వ్యక్తిగా భావిస్తారు. విదేశాలలోని మీ వారికి గ్రీన్‌కార్డు లభించిందన్న శుభవార్త అందుకుంటారు. క్రయవిక్రయాలలో మెలకువలు పాటించండి. కళ్ళు అలసటకు విద్యాసంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు. పోటీపరీక్షలో గానీ మామూలు పరీక్షలలో గానీ మీరు వ్రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాపీయింగును ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు. రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్‌కాల్స్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిష్కారణ వేధింపులకు గురి అవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లరమల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీయత్నాలు విసుగుపుట్టిస్తాయి. ఏ పనిచేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనులను కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహయోగం ఏర్పడుతుంది. -
వికారినామ సంవత్సర (మకర రాశి ) రాశిఫలాలు
మకర రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వ్యయంలో శని కేతువుల సంచారం, షష్ఠమంలో రాహుగ్రహ సంచారం, వ్యయంలోనూ, జన్మరాశిలోను గురు గ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ప్రతి కార్యక్రమం అధిక శ్రమానంతరం అనుకూల ఫలితాలను ఇస్తుంది. జలసంబంధమైన విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రతి విషయంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పనికీ ఒకటికి నాలుగుసార్లు కష్టపడాల్సి వస్తుంది. కళా సంబంధిత వ్యాపారాలలో కూడా రాణిస్తారు. బినామీ పేర్లమీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది. మీలో ఉన్న చిన్న లోపాలను పెద్దది చేసి మీ ప్రతిష్ఠను భంగపరచాలని అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ, పట్టు తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. కుటుంబ పురోగతి బాగుండడం మీకు సంతోషం కలిగిస్తుంది. కొన్ని బాధ్యతలు విస్మరించినందుకు వృత్తి ఉద్యోగాలకు తాళికట్టినందుకు బాధపడతారు. మీవైపు దొర్లిన లోపాలను మీవాళ్ళు బయటపడకుండా సమర్థిస్తారు. మీ ఆశయ సాధనకు పరోక్షంగా సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పాదాలు, కీళ్ళనొప్పులు, ఎముకలకు సంబంధించిన నొప్పులు ఇబ్బంది పెడతాయి. టెండర్లు, ప్రింటెడ్ పనులు, చేతివృత్తులకు సంబంధించిన కాంట్రాక్టులు అధికంగా లాభిస్తాయి. ధనం స్థిరం చేసుకోవడం సమస్య అవుతుంది. ఆస్తుల సంరక్షణకు, వాటిని సంపాదించడానికి పడినంత శ్రమపడాల్సి వస్తుంది. స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలలో వివాదాలు ఏర్పడతాయి. చివరకు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. సన్నిహితవర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వల్ల చివరకు వాళ్ళ వల్లనే అధిక పోటీ ఏర్పడుతుంది. బంధువులతో విభేదాలు చాలాకాలం కొనసాగుతాయి. విదేశీయానం, విదేశీ విద్య, ఉద్యోగం, సాంకేతిక విద్య, వైద్యవిద్య మొదలైనవి లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు లేనివారిని చేరదీసి ఆశ్రయం ఇస్తారు. జీవితంలో ఇది మలుపుగా మారుతుంది. వివాహాది శుభకార్యాలు మీ ఇష్టం మీదనే జరుగుతాయి. మీరు ఆశించిన ప్రేమాభిమానాలు మటుమాయం అవుతాయి. మారుతున్న సమాజంతో పాటు ఏనాడో మీ ఆత్మీయ, కుటుంబవర్గం కూడా మారిపోయారని ఆలస్యంగా గ్రహిస్తారు. సన్నిహితుల సహకారం వల్ల రాజకీయపదవి ప్రాప్తి. కార్యాలయంలో, సంస్థలో ప్రతి విషయానికి విమర్శకుల వల్ల, చాడీలు చెప్పేవారి వల్ల ఆటంకాలు, వాగ్వివాదాలు సంభవం. మొండి వైఖరితో ఎవరినీ లెక్క చేయక దేవుడిమీద భారం వేసి మీ పనిని సక్రమంగా నిర్వహించి మంచి ఫలితాన్ని సాధించి, వృత్తి ఉద్యోగాలపరంగా రక్షణ ఏర్పరచుకుంటారు. రాజకీయ వ్యవహారాలలో, శుభకార్యాల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కార్యాలను సానుకూలం చేస్తారు. ఇందుకు సంబంధించి మీరు పేరుప్రఖ్యాతులు ఆశిస్తారు. అందుకు విరుద్ధంగా విమర్శలు ఎదురవుతాయి. ఇతరుల అసమర్థతకు మీరు పరోక్షంగా బాధ్యత వహించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మీ నిజాయతీని నిరూపించుకోవలసిన పరిస్థితి రావచ్చు. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. గృహసంబంధిత ఖర్చులు అధికం అవుతాయి. దూరప్రాంతం నుండి వచ్చిన లేఖలు, టెలిఫోన్లు మానసిక ఆనందం, ఉత్సాహం, ఆర్థికాభివృద్ధికి కారణం అవుతాయి. కొన్ని ఆలోచనలు ఆలోచనలుగానే ఉంటాయి, అవి అమలు కావు. సంవత్సర ద్వితీయార్ధంలో పట్టుబట్టి కొన్ని ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో స్త్రీలకు సంబంధించిన వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానధర్మాలు, సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి. కొన్ని దురలవాట్లను వదిలించుకుంటారు. అందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావలసిన అనువంశిక ఆస్తి మూడువంతులు మీ చేతికి అందుతుంది. అధికమొత్తం ధనం సంతానం కోసం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పిక్నిక్లు, విందువినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలలో అపశ్రుతులు సంభవించవచ్చు. వీలైనంతవరకు ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. లోహ, ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి, చిన్న వ్యాపారాలు చేసేవారికి, హోటల్, రియల్ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు సంభవం. స్థానిక రాజకీయ నాయకులతో విభేదాలు వస్తాయి. గట్టిగా ప్రయత్నించి పెండింగ్ బిల్స్ మంజూరు అయ్యే విధంగా శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాలకు శ్రమించి సంపూర్ణ న్యాయం చేశామన్న సంతృప్తి కలుగుతుంది. అందరినీ సమన్యాయంతో చూశారన్న ప్రఖ్యాతి లభిస్తుంది. మీ సహచరవర్గంలో ప్రతిభ కలిగిన వాళ్ళను గుర్తించలేకపోయామన్న బాధ కలుగుతుంది. ఈ విషయంలో అంతర్మథనం చెందుతారు. ఆలోచనలు పరిపరివిధాలుగా వెళతాయి. అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహం అమలు చేస్తారు. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. అప్పులు ఇస్తారు, కానీ తిరిగి రావడం గగనం అవుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఆశించే వారికి నిరుత్సాహం కలుగుతుంది. తోటి ఉద్యోగులు మీపై అధికారులకు చెప్పిన చాడీల వలన ప్రమోషన్లు నిలిచిపోతాయి. ఇది మీ మనోవేదనకు కారణం అవుతుంది. సంతానం పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయ సహకారాలు అందుతాయి. సాంకేతిక వైద్య, న్యాయరంగాలలో రాణిస్తారు. స్కాలర్షిప్లు లభిస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ వంటి వాటికి ఎంపికవుతారు. దగ్గరి దాకా వచ్చి దూరంగా వెళుతున్న సంబంధాలు ఈ సంవత్సరం కుదురుతాయి. సామాజిక సేవాకార్యక్రమాలలో, యూనియన్ కార్యక్రమాలలో పేరుప్రఖ్యాతులు పెంచుకోగలుగుతారు. మీ అభిరుచికి తగిన విధంగా ఒక గార్డెన్హౌస్ని ఏర్పాటు చేసుకుంటారు. అందరితో చర్చించి నిర్ణయాలను అమలు చేస్తారు. మీ వ్యక్తిగత, వ్యాపార, ఆర్థిక సంబంధ విషయాలు ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది. వృత్తిపరంగా నక్క మనస్తత్వం కలిగిన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్త వహించండి. సంతాన పురోగతి బాగుంటుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. కార్యాలయంలో రాజకీయాలు అధికమవుతాయి. ఉద్యోగపరంగా ఇతరులపై వచ్చిన నిందలు, ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో తేల్చి నివేదిక ఇవ్వవలసిన బాధ్యత మీపై పడుతుంది. సున్నితమైన ఈ అంశంలో వాస్తవాల కన్నా మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు చేస్తారు. మధ్యవర్తుల మాటలు నమ్మి వాస్తవాలు విస్మరించి ఒక పొరపాటు సమాచారాన్ని మీరు కూడా ధ్రువీకరిస్తారు. ఇందువల్ల మీ సన్నిహితవర్గం నష్టపోతారు. మీ ఎదుగుదల కొందరికి కంటకంగా మారుతుంది. అసూయగ్రస్తులైన వారితో మీ సన్నిహితులు కూడా చేరటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కొంత అశాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో సమీప బంధువుల జోక్యం ఈ అప్రశాంత వాతావరణానికి కారణం అవుతుంది. యుక్తిగా వ్యవహరించి వాళ్ళని కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంచుతారు. నూతన ఆదాయమార్గాలలో శ్రమించి మంచి ఫలితాలను పొందుతారు. మీ సంతానానికి బాధ్యత తెలుస్తుంది. బాగా చదువుకుని కుటుంబ ప్రతిష్ఠ నిలబెట్టడానికి çఉత్సాహంగా శ్రమిస్తారు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక అవసరాల కోసం విలువైన స్థిరాస్తులు తాకట్టు పెడతారు. పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహంకాని వారికి వివాహప్రాప్తి. సంతానంలేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైరివర్గం గురించి రహస్య సమాచారం మీ చేతికి అందుతుంది. వాళ్ళు తప్పు చేశారనే సాక్ష్యాధారాలు కొన్ని మీ చేతికి లభిస్తాయి. తొందరపడకుండా సమయం, సందర్భం కోసం వేచిచూస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో ముఖ్యమైన వ్యక్తులకు మీరే ఆంతరంగికులు అవుతారు. మీ మంచితనానికి మీరు అందించే సహాయసహకారాలకు మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధుమిత్రుల నుండి సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు సమసిపోతాయి. కార్యాలయ సంబంధమైన విషయాలు కొన్ని అభూతకల్పనలతో మీడియా ద్వారా వెల్లడవుతాయి. కార్యాలయ ప్రతిష్ఠకు తాత్కాలికంగా భంగం కలుగుతుంది. ఆర్థికంగా పరిపుష్టి సాధించడానికి మీ ప్రణాళికలకు తగినటువంటి విషయాలకు ఒక ఉన్నతవ్యక్తి సహకారం లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మంచి పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. వాటిని నిలబెట్టుకోవడానికి జీవితంలో మీరు ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు. మోసపూరిత డాక్యుమెంట్ల వల్ల, దొంగ స్వామీజీల వల్ల, నకలీ వస్తువుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సహోదర సహోదరీవర్గంలోని ఒకరికి రహస్యంగా సహాయం చేస్తారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న వారికి మంచి పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. లాటరీలు, జూదాలు, క్రికెట్, రాజకీయ ఫలితాల బెట్టింగ్‌లు పనికిరావు. మీ సన్నిహిత వర్గానికి చట్ట పరమైన చిక్కులు, ట్యాక్సులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు మీ శత్రువర్గం వల్ల ఏర్పడతాయి. రాజకీయ పరపతిని ఉపయోగించి వాటి నుండి మీ వారిని రక్షించుకోగలుగుతారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. దీని ప్రభావం మీ వృత్తి ఉద్యోగాల మీద పడకుండా జాగ్రుత్త వహించండి. పిల్లల పురోగతికి ఖర్చు చేయవలసిన ధనం చేతికి అందుతుంది. సమస్యలు పరిష్కారం కావాలి, కొంతమందికి దారి దొరకాలి. అప్పుడే అన్నివిధాలుగా మీకు ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు సంబంధించిన వస్తువులుగానీ, పత్రాలుగానీ, డాక్యుమెంట్లుగానీ మీ దగ్గర ఉండడం వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో చికాకులు పోయి మంచికాలం వచ్చినట్లుగా కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. కరస్పాండెన్స్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైద్య, విద్య, మందుల వ్యాపారం, ఎరువుల వ్యాపారం, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం అనుకూల దిశలో పయనిస్తాయి. మీ శక్తిసామర్థ్యాలు, మీ ప్రతిభ ఆకస్మాత్తుగా చాలామందికి గుర్తుకువస్తాయి. సాంకేతిక, విద్యారంగాలలో ఉన్నవారికి ప్రజాదరణ, ప్రభుత్వపరమైన అవార్డులు, రివార్డులు సూచిస్తున్నాయి. మీ నెలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. మారిన సామాజిక, రాజకీయ పరిస్థితులు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తమ స్వశక్తితో, తమ స్వంతకాళ్ళపై నిలబడే యత్నాలు చేసి నిలబడతారు. పొదుపు చేసిన ధనంతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆభరణాల పట్ల గతంలో ఉన్న మోజు తగ్గుతుంది. మన ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా భగవంతుడే నిర్ణయాలు తీసుకుంటాడని తెలుసుకుంటారు. రాజకీయాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. పెళ్ళిచూపుల తతంగాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటారు. కుటుంబ ప్రతిçష్ఠ నిలబెట్టడానికి శ్రమిస్తారు. పిల్లలను తమ అభిరుచికి అనుగుణంగా పెంచాలని అనుకుంటారు. కానీ పిల్లలు ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే చూసీ చూడనట్లుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కఠిన నిర్ణయాలు అమలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనితో భర్తతో విభేదాలు తలెత్తుతాయి. సాధారణ విద్యలోనూ, సాంకేతిక విద్యలోనూ బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న చోట చదువుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. చదువుకోసం దివారాత్రులు శ్రమిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. జుట్టు సంరక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు కలిసివస్తాయి. సొంత వ్యాపారాలు కలిసివస్తాయి. బ్యూటీపార్లర్స్ నిర్వహణ, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసి వస్తుంది. మీకు రావలసిన ధనం మెల్లిమెల్లిగా చేతికి వస్తుంది. సామాజిక జీవితంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యతనిస్తారు. ఎందరు ఎన్నివిధాలుగా చెప్పినా మీ అభిప్రాయంలో మార్పురాదు. సంస్థాపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు గోప్యంగా ఉంచడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఆంతరంగిక వ్యక్తులను దూరంగా ఉంచుతారు. వైద్యవిద్యను అభ్యసించాలనే కోరిక నెరవేరుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. చోరభయం పొంచివుంది. ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. ఐఐటీ, సీఏ, ఎంబీఏలలో కూడా రాణిస్తారు. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. -
కాప్రికార్న్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: కాప్రికార్న్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇండియా కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.171 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారుల నుంచి 76.43 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ఆఫర్ చేస్తుంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.400–600 కోట్ల రేంజ్లో నిధులు సమీకరిస్తుందని అంచనా. రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వ్యాపార అవసరాలకు ఈ ఐపీఓ నిధులను వినియోగించుకోవాలని చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్లుగా ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీఎఫ్సీ బ్యాంక్‌లు వ్యవహరిస్తున్నాయి. 1998లో ఆరంభమైన కాప్రికార్న్ ఫుడ్ కంపెనీ.. ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా–పసిఫిక్, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల్లోని తన క్లయింట్లకు సేవలందిస్తోంది. దేశీయంగా పండ్లు, కూరగాయల ఆధారిత ఇన్‌గ్రెడియంట్లను కోక–కోలా, వరుణ్ బేవరేజెస్, మన్‌పసంద్ బేవరేజెస్ తదితర సంస్థలకు సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.461 కోట్ల ఆదాయంపై రూ.23 కోట్ల నికర లాభం సాధించింది. -
రాజీ పడరు...వెనకడుగు వేయరు...
ఆస్ట్రోఫన్డా రాశిచక్రంలో పదో రాశి మకరం.. ఇది సరి రాశి. పృథ్వీతత్వం, వైశ్య జాతి, సౌమ్య రాశి, పింగళ వర్ణం. శరీరంలో ఇది మోకాళ్లను, పిక్కలను సూచిస్తుంది. ఇది చర రాశి, స్త్రీ రాశి, దీని దిశ దక్షిణం. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం పూర్తిగా, ధనిష్ఠ 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి అధిపతి శని. ఇనుము, సీసం, తగరం, కంచు, రాగి, బొగ్గు, చెరకు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది. ఈ రాశి అల్బీనియా, బల్గేరియా, బంగ్లాదేశ్, పంజాబ్ తదితర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. మకర రాశిలో పుట్టినవారు క్రమశిక్షణకు, కఠిన పరిశ్రమకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటారు. చాలా నిరాడంబరంగా కనిపిస్తారు. ప్రతి పనిలోనూ ఆచి తూచి వ్యవహరిస్తారు. పురోగతికి కఠిన పరిశ్రమ మాత్రమే ఏకైక మార్గమని నమ్ముతారు. ఎలాంటి వ్యవహారంలోనైనా రాజీ పడటాన్ని ఏమాత్రం ఇష్టపడరు. ఓపిక, సహనం వీరి తిరుగులేని బలాలు. ఏమాత్రం ఆత్రపడకుండా నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు. ఓర్పు, సహనాలతో ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధిస్తారు. కార్యాచరణలో ప్రాక్టికల్‌గా వ్యవహరించే వీరికి సెంటిమెంట్లు ఉండవని ఇతరులు అపోహ పడతారు. అయితే, తమ పట్ల ఇతరులు చూపే ప్రేమాభిమానాలకు సానుకూలంగా స్పందిస్తారు. ఎంతటి బాధ్యతనైనా అంకితభావంతో నెరవేరుస్తారు. ఎక్కువగా పనిలో నిమగ్నమై ఉండేందుకే ఇష్టపడతారు. బద్ధకం, క్రమశిక్షణరాహిత్యం వీరికి అసలు గిట్టదు. తమ పద్ధతులకు భిన్నంగా అలసత్వం చూపేవారి పట్ల కఠినంగా ఉంటారు. సంపదను, పేరు ప్రఖ్యాతులను కష్టపడి సాధిస్తారు. ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడతారు. తమను నమ్ముకున్న వారికి నమ్మకమైన ఆసరాగా ఉంటారు. పోటీల జోలికి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు గానీ, లక్ష్యసాధనలో మాత్రం వెనుకంజ వేయరు. సివిల్, మెకానికల్, ఐటీ ఇంజనీరింగ్ విభాగాల్లో, అకౌంటింగ్, కార్మిక వ్యవహారాలు, ఖజానా పర్యవేక్షణ, నిఘా, పోలీసు, సైనిక ఉద్యోగాల్లో వీరు బాధ్యతాయుతంగా రాణించగలరు. వైద్య, బోధన, గృహనిర్మాణ, రాజకీయ, మెకానిక్, అకౌంటింగ్ వృత్తులు వీరికి అనుకూలంగా ఉంటాయి. గ్రహగతులు అనుకూలించకుంటే, కఠిన క్రమశిక్షణ, రాజీపడని మొండివైఖరి కారణంగా శత్రువులను కొనితెచ్చుకుంటారు. అలర్జీలు, రక్తపోటు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. మకర రాశిలో పుట్టిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనె