Carlsen
-
రెండో గేమ్‌లో కార్ల్సన్ విజయం
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రెండోగేమ్‌లో భారత్ ఆటగాడు ఆనంద్ ప్రత్యర్థి కార్ల్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో 12 గేమ్‌ల టోర్నీలో కార్ల్సన్ ఆధిక్యం లభించింది. ఆనంద్‌పై 35 ఎత్తుల్లో కార్ల్సన్ విజయం సాధించాడు -
ఈ సారి ‘సోచి’లో...
ఆనంద్-కార్ల్సెన్ పోరు మాస్కో: విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) మధ్య ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ రీ మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. రష్యాలోని ‘సోచి’లో నవంబర్ 7నుంచి 28 వరకు వీరిద్దరు ప్రపంచ కిరీటం కోసం పోటీ పడతారు. వేదికను ప్రకటిస్తూ ‘ఫిడే’ అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యుమ్‌జినోవ్, ఈ మెగా ఈవెంట్ కోసం 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 18 కోట్లు) బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య మ్యాచ్‌లు ఒలింపిక్ విలేజ్‌లో జరుగుతాయి. దీనికి ఇద్దరు ఆటగాళ్లూ అంగీకరించారు. గత ఏడాది నవంబరులో ఆనంద్, తన వరల్డ్ టైటిల్‌ను కార్ల్సెన్కు కోల్పోయాడు. అయితే ఈ ఏడాది క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి మరో సారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోరుకు అర్హత సాధించాడు. -
ఈ ‘డ్రా’లతో ఆనంద్‌కే మేలు
చెస్ బోర్డులోని గడుల్లాగే నాలుగో గేమ్ 64 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. ఆనంద్ రెండో గేమ్ ఓపెనింగ్నే కొనసాగించినా... కార్ల్సెన్ వ్యూహం మార్చి బెర్లిన్ డిఫెన్స్‌ను ఉపయోగించాడు. ఈ ఓపెనింగ్‌తోనే క్రామ్నిక్ బాగా పాపులర్ అయ్యాడు. 2001లో కాస్పరోవ్‌ను ఇదే ఆయుధంతో ఓడించాడు కూడా. కార్ల్సెన్ సెకండ్స్లో నార్వే నుంచి జాన్ లూడ్విగ్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. బెర్లిన్ డిఫెన్స్‌లో తనకు చాలా వైవిధ్యాలు తెలుసు. దీనికి కార్ల్సెన్ బృందం బాగా సన్నద్ధమయింది. మరోవైపు ఆనంద్ ఆశ్చర్యకరంగా దీనికి సన్నద్ధం కాలేదు. నాలుగో గేమ్‌లో కార్ల్సెన్కు చాలా అవకాశాలు కనిపించినా... ఎక్కడా అతను గెలుస్తాడని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం స్కోరు 2-2గా ఉంది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఆడిన తర్వాత ఒక రోజు విశ్రాంతి అవసరం. ఇప్పటివరకూ ఇద్దరూ ప్రత్యర్థి ఓపెనింగ్స్‌ను బాగా చదివారు. ఇక తర్వాతి గేమ్‌లలో కాస్త వేగం ఉంటుందని నా అభిప్రాయం. కార్ల్సెన్ రెటి ఓపెనింగ్‌కు కట్టుబడి 1, 3 గేమ్‌ల కంటే కాస్త మెరుగ్గా ఆడే అవకాశం ఉంది. ఇప్పటివరకూ నల్లపావులతో ఆడిన వాళ్లే గేమ్‌లో బాగా ఆడారు. నాలుగు గేమ్స్‌లో మూడుసార్లు నల్లపావులతో ఆడిన వాళ్లే ఆధిపత్యం చూపారు. తెల్లపావులతో ఆడటం వల్ల ఉండే లాభాన్ని ఇద్దరూ వినియోగించుకోలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇది ఆశ్చర్యకరమే. తెల్లపావులతో ఓపెనింగ్ చేసేవాళ్లు సాధారణంగా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతారు. కానీ ఈసారి గేమ్‌లు అలా సాగడం లేదు. ఆనంద్ నల్లపావులతో జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఐదోగేమ్లో కార్ల్సెన్ కాస్త దూకుడు పెంచి విజయం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఇద్దరూ ఎవరూ ఎవరిపైనా ఆధిపత్యం చూపలేదు. డ్రా ల సంఖ్య పెరిగే కొద్దీ ఆనంద్‌కే పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కార్ల్సెన్పై ఒత్తిడి పెంచే అంశం. ఇలా వరుసగా డ్రాలు అయ్యే పరిస్థితిని గతంలో కార్ల్సెన్ ఎప్పుడూ ఎదుర్కోలేదు. కాబట్టి ఇది ఆనంద్‌కు మేలు చేసే అంశం. ఈ ఒక్క గేమ్ నల్లపావులతో ఆడితే... తర్వాత ఆనంద్ వరుసగా రెండు గేమ్‌లు తెల్లపావులతో ఆడొచ్చు. కాబట్టి మరో డ్రా జరిగినా ఆనంద్‌కు లాభమే. -
ఆనంద్ తొలి గేమ్ నల్లపావులతో
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను నల్ల పావులతో ఆరంభించనున్నాడు. 12 రౌండ్ల పాటు జరిగే ఈ పోరులో ఆనంద్ నార్వేకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో పోటీపడనున్నాడు. ఈనెల 9 నుంచి 28 వరకు స్థానిక హయత్ రీజెన్సీ హోటళ్లో పోటీ జరుగుతుంది. ఫిడే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన తమిళనాడు సీఎం జయలలిత డ్రా తీశారు. తొలి బౌల్ నుంచి ఆనంద్ ఫొటోను, ఇంకో బౌల్ నుంచి నల్ల పావును బయటికి తీశారు. వెంటనే అక్కడున్న ప్రేక్షకులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తూ ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ డ్రా ఫలితంతో ఆనంద్ వరుసగా ఆరు, ఏడు గేమ్‌ల్లో తెల్ల పావులతో ఆడే అవకాశం చిక్కనుంది. నిబంధనల ప్రకారం తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడే ఆటగాడు ఏడో గేమ్‌లో నల్ల పావులతో ఆడాల్సి ఉంటుంది. 2000, 2007, 2008, 2010 ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలుచుకున్న సమయంలో ఆనంద్ నల్ల పావులతోనే ఆటను ప్రారంభించాడు. 2012లో మాత్రం తెల్ల పావులతో ఆడాడు. ‘భారత్ నుంచి ఆనంద్ అత్యుత్తమ ఆటగాడు’ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను గురువారం ముఖ్యమంత్రి జయలలిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇరువురు ఆటగాళ్లతో పాటు ఫిడే అధ్యక్షుడు కిర్సన్ ఇల్యుమ్‌జినోవ్ తదితరులు హాజరయ్యారు. ఏడుగురు వర్ధమాన చెస్ ఆటగాళ్లు ఆనంద్, కార్ల్సెన్లను వెంటబెట్టుకుని వేదికపైకి తీసుకొచ్చారు. వీరికి ప్రేక్షకులు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. ‘దేశంలో చెస్‌కు పర్యాయపదం ఆనంద్. అంతేకాకుండా ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలిచాడు. ఇంతటి అద్భుత ఆటగాడు చెన్నై నుంచి ఎదగడం అమితానందాన్ని కలిగిస్తోంది’ అని జయలలిత కొనియాడారు. కార్ల్సెన్ను చెస్ మేధావిగా అభివర్ణించారు. దూకుడునే కొనసాగిస్తా.. ఆరో ప్రపంచ చాంపియన్ టైటిల్ సాధించేందుకు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోరులో తన ప్రత్యర్థిపై దూకుడు మంత్రాన్ని ప్రయోగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 22 ఏళ్ల ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌తో ఆనంద్‌కు గట్టి పోటీనే ఎదురుకాబోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన కార్ల్సెన్.. ఆనంద్‌తో పోటీపడే అర్హత సాధించాడు. గురువారం నాటి విలేకరుల సమావేశంలో ఆనంద్ తన సన్నాహకాలను వివరించాడు. ‘ఎప్పటిలాగే ఈ ఈవెంట్‌కు కూడా కఠినంగానే సన్నద్ధమవుతున్నాను. కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటున్నాను. అందుకే బరిలోకి దిగేందుకు నేను సిద్ధంగా ఉన్నానని భావిస్తున్నాను. పోటీ ఎలా ఉంటుందో మున్ముందు చూస్తారు. సొంత నగరంలో ఆడడం చాలా ఉత్సుకతగా ఉంది. దీనికి కారణం సీఎం జయలలిత. ఆమె పట్టుదల కారణంగానే ఈ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది’ అని ఆనంద్ అన్నాడు. ఆనంద్ టీమ్ ఇదీ... అత్యంత ఆసక్తికరంగా సాగే ఈ మెగా టోర్నీలో ఆనంద్ తన సహాయకుల పేర్లను ప్రకటించాడు. వీరిలో ఇద్దరు భారత ఆటగాళ్లున్నారు. కె.శశికిరణ్, సాందీపన్ చందాలకు ఇందులో చోటు దక్కింది. ఇక రెగ్యులర్‌గా ఉండే రడోస్లావ్ వొటస్జెక్ (పోలండ్), గతంలో ఆనంద్‌తో చాలాసార్లు తలపడిన పీటర్ లెకో (హంగేరి) కూడా ఆనంద్ బృందంలో ఉన్నారు. నేను చెప్పను: కార్ల్సెన్ మరోవైపు ఆనంద్ ప్రత్యర్థి కార్ల్సెన్ మాత్రం తన టీమ్‌ను బహిర్గతపరచలేదు. ‘ఆనంద్ జట్టు సభ్యులను అభినందిస్తున్నాను. అయితే నా వారి గురించి చెప్పను. భారత్‌లో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. -
రెండు తరాల మధ్య పోరాటం
64 గడులు.. ఎత్తులు మాత్రం అనంతం... చెస్ బాగా ఆడే వ్యక్తిని మేథావి అనడం అతిశయోక్తి కాదు. అలాంటి చెస్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడెవరో తేల్చుకునే పోరాటం ప్రపంచ చాంపియన్‌షిప్. ఈసారి ఈ మెగా ఈవెంట్‌కు చెన్నై ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 9 నుంచి 27 వరకు విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సెన్ ఈ మెగా టైటిల్ కోసం పోరాడనున్నారు. ఆనంద్ డిఫెండింగ్ చాంపియన్ కాగా... కార్ల్సెన్ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్‌లో చెస్ ఖ్యాతిని పెంచిన ఆటగాడు పెంటేల హరికృష్ణ. ఆనంద్ ఏం ఆడుతున్నాడు..? టోర్నీ ఎలా జరుగుతోంది..? ఎవరు ఎక్కడ తప్పు చేశారు..? ఎవరికి గెలిచే అవకాశం ఉంది..? ఇలాంటి ప్రశ్నలకు అందరికంటే బాగా సమాధానం చెప్పగలిగే వ్యక్తి హరికృష్ణ. ఈ భారత గ్రాండ్ మాస్టర్, తెలుగుతేజం...ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన ప్రివ్యూ, గేమ్‌ల విశ్లేషణలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తాడు. పెంటేల హరికృష్ణ ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య ప్రపంచ టైటిల్ పోరాటం కోసం మొత్తం చెస్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పోరుపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది రెండు తరాల మధ్య పోరాటం. ఇద్దరి మధ్యా 20 ఏళ్లకు పైగా వయసు వ్యత్యాసం ఉంది. బోట్వినిక్-తాల్ల మధ్య పోరాటం తర్వాత ఇంత వయసు తేడా ఉన్న ఆటగాళ్లు తలపడలేదు. అంతేకాదు... చాంపియన్ కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న వ్యక్తి టైటిల్ కోసం తలపడటం కూడా 1972 (ఫిషర్-స్పాష్కీల మ్యాచ్) తర్వాత ఇప్పుడే. క్లాసికల్ చెస్‌లో కార్ల్సన్ మీద ఆనంద్‌కు 6-3 విజయాల రికార్డు ఉంది. కానీ గత రెండు సంవత్సరాల్లో కార్ల్సెన్... ప్రపంచ చాంపియన్ మీద రెండుసార్లు గెలిచాడు. వీరిద్దరి ముఖాముఖి పోరులో 2007, 08,10 సంవత్సరాల్లో ఆనంద్ గెలిస్తే... 2009, 12,13 సంవత్సరాల్లో ప్రత్యర్థి నెగ్గాడు. ఇద్దరి విజయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే... మెరుగైన సన్నాహకాలు, అనుభవం ఆనంద్‌ను గెలిపించాయి. సాధారణంగా ప్రారంభంలోనే ఆనంద్ అడ్వాంటేజ్ తీసుకుని ఆ ఒత్తిడిని చివరి వరకూ కొనసాగిస్తాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నల్లపావులతో ఆనంద్ కార్ల్సన్ మీద గెలిచాడు. మరోవైపు కార్ల్సెన్ గెలిచినవన్నీ తెల్లపావులతో ఆడినవే. ఎండ్గేమ్లో కాస్త మెరుగ్గా ఆడటం వల్ల తనకి విజయాలు వచ్చాయి. 2012లో బిల్బావోలో జరిగిన గేమ్‌లో విజయం ఆనంద్‌పై కార్ల్సెన్కు అత్యుత్తమం. ఆనంద్ బాగా ఆడినా కార్ల్సెన్ 30 ఎత్తుల్లో గెలిచాడు. వీళ్లిద్దరి మధ్య చివరిసారి 2013లో తాల్ మెమోరియల్ టోర్నీలో గేమ్ జరిగింది. ఇందులోనూ 30 ఎత్తుల్లోపే కార్ల్సన్ నెగ్గాడు. ఈ విజయం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 2012లో లండన్‌లో, 2013లో నార్వేలో జరిగిన రెండు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ రెండు గేమ్‌ల్లోనూ ఆనంద్ నల్లపావులతో ఆడి ఒత్తిడిలోకి వెళ్లినా... పుంజుకుని డ్రాలు చేశాడు. మొత్తంమీద తెల్లపావులతో ఆడుతున్నప్పుడు కార్ల్సన్ ప్రమాదకారి.