CBCID police
-
చిక్కిన బాబా శివ శంకర్..
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న, అవతార పురుషుడిగా చెప్పుకునే శివశంకర్ బాబ ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. బుధవారం అక్కడి ఖాజీయాబాద్లోని ఓ భక్తుడి ఇంట్లో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ పాఠశాలలో సోదాలు నిర్వహించారు. ఇలా బుక్కయ్యాడు... లైంగిక ఆరోపణలు రావడంతో శివశంకర్ బాబా ఆధ్యాత్మిక అదృశ్యం అయ్యాడు. జార్ఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ ఆస్పత్రిలో గుండెపోటు చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించిన సీబీసీఐడీ విచారణ ముమ్మరం చేశారు. విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో బయటకు వెళ్లే మార్గం లేక ఢిల్లీలోని ఓ భక్తుడి వద్ద తలదాచుకునే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైయ్యారు. భక్తుడి ఇంట్లో బస.. డెహ్రాడూన్‌లో ఓ భక్తురాలితో కలిసి ప్రత్యక్షమైన బాబా, ఆ తర్వాత పత్తా లేకుండా పోయినట్టు సీబీసీఐడీ బృందం విచారణలో తేలింది. అంతే కాకుండా సాధారణ రోజుల్లో ఢిల్లీ వెళ్లినప్పుడు ఓ భక్తుడి ఇంట్లో బస చేసే వాడని సమాచారం అందడంతో అతని ఇంటిపై నిఘా ఉంచారు. బుధవారం వేకువ జామున అక్కడికి ఈ బాబా రాగానే, ఢిల్లీ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరు పరిచి, అనంతరం చెన్నైకి తరలించే ఏర్పాట్లు చేశారు. ముమ్మరంగా తనిఖీలు.. ఉండగా, కేలంబాక్కంలోని బాబుకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్లో సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఏడు మందితో కూడిన బృందం సోదాలు నిర్వహించింది. 73 మంది టీచర్లు పని చేస్తున్నట్లు గుర్తించారు. వారిలో పలు కేసులను ఎదుర్కొంటున్న భారతి, దీపా అనే టీచర్ల వివరాలను సేకరించారు. బాబా లీలకు సంబంధించిన అనేక వీడియోలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు బయట పడినట్లు సమాచారం. ఈ పాఠశాలలను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవాలని పిల్లల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మాజీ మంత్రికి నో బెయిల్.. నటి చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రి మణికంఠన్‌పై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు పీఏ, గన్‌మెన్‌గా వ్యవహరించిన వారందరిని పోలీసులు ఇప్పటికే విచారించారు. ఆయన అరెస్ట్‌కు దాదాపు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మణి కంఠన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, బెయిల్ ఇస్తే, సాక్షుల్ని, ఫిర్యాదుదారులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బాబ్జీ మదన్ కోసం వేట.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ జైళ్లో ఉన్న అథ్లెటిక్ అకాడమి శిక్షకుడు నాగరాజన్ మీద విదేశాల్లోని ఇద్దరు తమిళనాడు క్రీడాకారిణులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేశారు. అలాగే లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జూడో అకాడమి మాస్టర్ ఏబీన్ రాజ్‌కు చెన్నై కోర్టు బెయిల్ నిరాకరించింది. దానితో పాటు యూట్యూబ్ ద్వారా మహిళలను అసభ్య పదజాలాలతో దూషించడం, ఆన్లైన్ ద్వారా నగదు వసూళ్లలో ఉన్న టాక్సిక్ మదన్ ఛానల్ నిర్వాహకుడు బాబ్జి మదన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన తండ్రి, భార్య కృతికనును బుధవారం విచారించారు. కృతికను అరెస్ట్ చేశారు. చదవండి: కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం -
అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలి : వైఎస్సార్సీపీ
-
అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలి : వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు శుక్రవారం మంగళగిరిలోని సీబీసీఐడీ అడిషనల్ డీజీ అమిత్‌గర్గ్‌ను కలిసి వినతి పత్రం అందేజేశారు. అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలో సీఐడీ అనుసరిస్తున్న వైఖరిలో అనేక అనుమానాలున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. సీబీసీఐడీ తన నివేదికలో బాధితుల సంఖ్య 19.50 లక్షలు అని చెప్పిందని, ప్రభుత్వ సలహాదారుడు కుటుంబరావు మాత్రం ఈ సంఖ్యను 10 లక్షల లోపే ఉంటుందని ప్రకటించారన్నారు. కోర్టుకు చూపించని ఆస్తులను ప్రభుత్వం తీసుకొని, బాధితులకు రూ.300 కోట్లు ఇస్తుందని కుటుంబరావు ప్రకటించారని తెలిపారు. సీబీసీఐడీ దర్యాప్తులో కోర్ట్‌కు చూపిన ఆస్తులు ఎన్ని, చూపని ఆస్తులు ఎన్నో బహిర్గతం చేయాలని, అగ్రిగోల్డ్ యాజమాన్యంకు బినామీగా ఉన్న 156 కంపెనీల ఆస్తులపై వివరణ ఇవ్వాలన్నారు. చెక్ పవర్ ఉన్న డైరెక్టర్లను కేసుల్లో ఎందుకు పెట్టలేదో స్పష్టం చేయాలన్నారు. -
విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో పోలీసుల తంటాలు
టీనగర్: తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక పోలీసు అధికారులు తంటాలు పడుతున్నారు. సేలం జిల్లా ఓమలూర్‌కు చెందిన ఇంజినీర్ గోకుల్‌రాజ్ గతేడాది జూన్ నెలలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ(29) విచారణ చేపట్టిన రెండు నెలల్లోనే తన కార్యాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుపై ఆరంభంలో తిరుచెంగోడు పోలీసులు, తర్వాత సీబీసీఐడీ పోలీసులు విచారణ జరిపారు. దీనిపై విష్ణుప్రియ తండ్రి రవి సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టింది. ఇలాఉండగా సీబీఐ అధికారుల ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు ఇవ్వలేక తంటాలు పడుతున్నట్లు సమాచారం. వారంరోజుల్లో సీబీఐ అధికారులు నామక్కల్‌లో బసచేసి విచారణ జరపనున్నందున జిల్లాలోని పోలీసు అధికారుల్లో గుబులు రేగింది. -
నేడు యువరాజ్ లొంగుబాటు
కనిపిస్తే కాల్పులు, పీటీ వారెంట్ ప్రభావం నామక్కల్ సీబీసీఐడీ కార్యాలయానికి యువరాజ్ ధ్రువీకరించిన న్యాయవాది చెన్నై, సాక్షి ప్రతినిధి: ఇంజనీర్ గోకుల్‌రాజ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా అజ్ఞాతంలో ఉన్న యువరాజ్ ఆదివారం సీబీసీఐడీ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయన న్యాయవాది శనివారం ప్రకటించారు. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజనీర్ గోకుల్‌రాజ్ జూన్ 23వ తేదీన హత్యకు గురికాగా, ఈ కేసులో ఇప్పటికి 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన ముద్దాయి యువరాజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యువరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గోకుల్‌రాజ్ హత్యకేసును విచారిస్తున్న నామక్కల్ జిల్లా తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ (27) గత నెల 18వ తేదీన ఆత్మహత్య చేసుకోవడం ఇంజనీర్ హత్య కేసును తీవ్రతరం చేసింది. డీఎస్పీ విష్ణుప్రియ హత్యకేసు విచారణలో ఉన్న పోలీసుల చర్యలను నిరసిస్తూ అజ్ఞాతం నుంచే యువరాజ్ వాట్సాప్ ద్వారా ఆడియో మెసేజ్‌లు పంపేవాడు. దీంతో ఒక హత్యకేసు, మరో ఆత్మహత్యకేసు వెనకాల యువరాజ్ పాత్రపై పోలీసులకున్న అనుమానాలు బలపడ్డాయి. దీంతో యువరాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసుశాఖ సీబీసీఐడీ అధికారులకు ఆదేశాలు జారీచేయగా, నామక్కల్ మొదటి మెజిస్ట్రేట్ నేరవిభాగ కోర్టు న్యాయమూర్తి మలర్మతి యువరాజ్ అరెస్ట్ కోసం 5వ తేదీన పీటీ వారంట్ జారీచేశారు. పీటీ వారెంట్ జారీ అయినందున యువరాజ్ తప్పనిసరిగా కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. లేకుంటే పరారీలో ఉన్న నిందితుడిగా అతనిపై అధికారిక ముద్రపడుతుంది. అంతేగాక అతని ఆస్తిపాస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసే అవకాశం ఉంది. యువరాజ్ తన రక్షణ కోసం మారణాయుధాలను ఉంచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అవసరమైతే యువరాజ్‌పై కాల్పులు జరిపైనా ప్రాణాలతో పట్టుకుని అరెస్ట్ చేయాలని 5వ తేదీన ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా యువరాజ్ న్యాయవాది అముదరసు శనివారం మీడియాతో మాట్లాడుతూ యువరాజ్ ఇంటి నుంచి సెల్‌ఫోన్, సీసీ టీవీ కెమెరా, హార్డ్‌డిస్క్, సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈనెల 11 వ తేదీ ఉదయం 10 గంటలకు నామక్కల్ సేలం రోడ్డులోని సీబీసీఐడీ కార్యాలయంలో విచారణ అధికారుల ముందు యువరాజ్ లొంగిపోతాడని చెప్పారు. -
రాజా అరెస్ట్?
సాక్షి, చెన్నై : మాజీ సీఎం, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సోదరుడు ఓ.రాజాను సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. చెన్నైలోని ఓ హోటల్లో ఉన్న ఆయన్ను తమ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నట్టు సమాచారం. మాజీ సీఎం పన్నీరు సెల్వం సోదరుడు రాజాపై పలు ఆరోపణలు బయలు దేరిన విషయం తెలిసిందే. తన అన్న పన్నీరు సీఎంగా ఉన్న సమయంలో రాజా ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడినట్టు తెలిసింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వచ్చిన ఫిర్యాదులతో రాజా, పన్నీరు సెల్వం బంధువులు ఇద్దరి పదవులు ఊడినట్టుగా బుధవారం సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పన్నీరు సోదరుడు రాజాను సీబీసీఐడీ పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్టు గురువారం సంకేతాలు వెలువడ్డాయి. పెరియకుళం కైలాశనాథ ఆలయ పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసుతో పాటుగా, ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన వ్యవహారాలు, మరి కొన్ని ఘటనలనకు సంబంధించి రాజా ను విచారించే పనిలో సీబీసీఐడీ ఉన్నట్టు సమాచారం. తన పదవికి రాజీనామా చేసిన మరుక్షణం రాజా అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా అన్నాడీఎంకే వర్గాలు పేర్కొం టూ వచ్చాయి. చెన్నైలో తిష్టవేసిన రాజా పోయెస్ గార్డెన్లో తమ అధినేత్రిని కలుసుకుని తాన నిజాయితీ నిరూపించుకునే వ్యూ హంతో ఉన్నట్టుగా పేర్కొంటున్నారు. ఇందుకోసం పోయెస్ గార్డెన్ సమీపంలోని ఓ హోటల్లో బస చేసి ఉన్న రాజను సీబీ సీఐడీ వర్గాలు అదుపులోకి తీసుకున్నట్టు, రహస్య ప్రదేశంలో ఉం చి విచారణ జరుపుతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజా అరెస్టు సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు తమిళ మీడియా యత్నించినా ఫలితం శూన్యం.అదే, సమయంలో గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంటి వద్దకు మీడియా పరుగులు తీయగా, ఇక్కడెవ్వరూ లేరని సమాచారం ఇవ్వడం గమనించాల్సిందే. రాజాను అదుపులోకి తీసుకున్న సీబీసీఐడీ వర్గాలు విచారణానంతరం అధికారికంగా అరెస్టును చూపించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం బయలు దేరి ఉండడం గమనార్హం. -
నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్
టీనగర్, న్యూస్‌లైన్: రైలులో 9 లక్షల నకిలీ కరెన్సీనోట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ బెంగాల్ నుంచి రైలు ద్వారా చెన్నైకు నకిలీ కరెన్సీ నోట్లు తరలిస్తున్నట్లు సీబీసీఐడీ పోలీసులకు సమాచారం అందింది. పోలీసు సూపరింటెండెంట్ పెరుమాల్ పర్యవేక్షణలో డీఎస్పీ రత్నమణి ఆధ్వర్యంలో చెన్నైకు వచ్చే రైళ్లు, రైల్వే స్టేషన్లలో సీబీసీఐడీ పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రైలు నుంచి దిగిన సాహుల్ వ్యాసర్పాడిలోని రఫిక్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. పోలీసులు అతన్ని వెంబడించి విచారణ చేపట్టగా వెస్ట్ బెంగాల్ నుంచి సాహుల్ నకిలీ కరెన్సీ నోట్లను రైలులో తరలించినట్లు తెలిసింది. రఫిక్ ఆదేశాలతో నకిలీ కరెన్సీ నోట్లను అక్కడ నుంచి సాహుల్ తీసుకువచ్చినట్లు తెలిసింది. వారి వద్ద నుంచి *500, *1000 నకిలీ కరెన్సీ నోట్లు తొమ్మిది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రఫిక్, సాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రఫిక్ ఇది వరకే నకిలీ కరెన్సీనోట్ల కేసులో అరెస్టు అయ్యారు. వెస్ట్ బెంగాల్లో ఎవరి వద్ద నుంచి రఫిక్ నకిలీ కరెన్సీ నోట్లను తీసుకువచ్చారనే విషయంపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ తీవ్రవాది జాకీర్ హుసేన్తో ఇతనికి సంబంధాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరు పరిచి జైలులో నిర్బంధించారు. రఫీక్‌ను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు పోలీ సులు నిర్ణయించారు. -
పేలుళ్ల విచారణ వేగవంతం
* ఊహా చిత్రాలు సిద్ధం * జాతీయ భద్రతా దళాల రాక * బెంగళూరు, పాట్నాలకు సీబీసీఐడీ * నకిలీ చిరునామాతో రిజర్వేషన్లు చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలులో పేలుళ్ల ఘటన దోషులను పట్టుకునేందుకు విచారణను వేగవంతం చేశారు. సీబీసీఐడీ పోలీసులు బెంగళూరు, పాట్నాలకు బయలుదేరి వెళ్లారు. కేంద్రం నుంచి జాతీయ భద్రతా దళం కూడా శుక్రవారం చెన్నైకి చేరుకుంది. రైలులోని రెండు బోగీల్లో జరిగిన పేలుళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన స్వాతి (24) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృత్యువాతపడగా, 14 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. సంఘటన జరిగిన గురువారం నుంచే విచారణ ప్రారంభమైంది. ఈ పేలుళ్ల కుట్రను ఛేదించేందుకు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకు ఏర్పాటైన సీబీసీఐడీ విచారణ బృందం రెండుగా ఏర్పడి బెంగళూరు, పాట్నాలకు శుక్రవారం వెళ్లింది. సంఘటన జరిగి 24 గంటలు దాటినా ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఇది తమ చర్య అని చాటుకోలేదు. అయితే ఐఎస్ఐ, ఇండియన్ ముజాహిద్దీన్, అల్ ఉమా సహా పలు తీవ్రవాద సంస్థల పనేనని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. పేలుళ్లు జరిగిన సమయంలో విధుల్లో ఉన్న రైల్వే కార్మికులను, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ప్రయాణికులను విచారిస్తున్నారు. పాట్నాలో మోడీ ఎన్నికల సభ నిర్వహించినపుడు పేలిన బాంబులు, బోగీల్లో పేలిన బాంబులు ఒకే రకమని గుర్తించారు. ఈ కారణంగానే ఒక విచారణ బృందం పాట్నాకు వెళ్లింది. ప్రైవేటు ట్రావెల్స్ ఏజన్సీల ద్వారా నకిలీ అడ్రసుతో తత్కాల్ టికెట్ రిజర్వు చేసుకున్న వారికోసం గాలిస్తున్నారు. రాష్ట్రం నుంచి తత్కాల్ రిజర్వేషన్ చేసుకున్నవారి వివరాలు సేకరించేందుకు రిజర్వేషన్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో అనేక ప్రైవేటు ట్రావెల్స్ వారు తాళాలు వేసి పారిపోయారు. బాంబులు పేలిన బోగీలో రిజర్వేషన్ చేసుకున్న ఒక వ్యక్తి ఎస్-6లో ప్రయాణం చేశాడు. అతని ఫోన్ నెంబరు కూడా తప్పుగా ఉండడంతో అతన్ని కూడా అనుమానిస్తున్నారు. పేలుళ్లు జరిగిన రైలులో చెన్నై వరకు ప్రయాణించిన వారి ఇళ్లకు వె ళ్లి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం చెన్నైకి చేరుకున్న జాతీయ భద్రత దళం అధికారులు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని, బోగీలను తనిఖీ చేశారు. సెంట్రల్ స్టేషన్, 9వ నెంబరు ప్లాట్‌ఫాంలోని సుమారు 80 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. విచారణకు ఇబ్బందులు తలెత్తకుండా 9వ నెంబరు ఫ్లాట్‌ఫాంకు సీల్‌వేసి సాయుధ పోలీసులతో బందోబస్తు పెట్టారు. పేలుళ్లు జరిగిన బోగీల్లోని ప్రయాణికుల సహకారంతో కంప్యూటర్ ద్వారా నిందితుల ఊహాచిత్రాలను సిద్ధం చేసినట్లు తెలిసింది.