Coconut crop
-
వృధాగా తాగి పడేసిన కొబ్బరి బొండాలతో.. నెలకు 50 వేలు ఆదాయం
-
కుళ్లిన కొబ్బరికీ కోట్లు
కొబ్బరి కాయ కుళ్లిపోయింది కదాని పక్కన పాడేయకండి. ఎందుకంటే.. కుళ్లిన కాయలు సైతం రూ.కోట్లు కురిపిస్తాయట. కుళ్లిన కురిడీల నుంచి తీసే నూనెను సబ్బుల తయారీలో వినియోగిస్తుంటే.. కుళ్లిన కాయలను కాశీలో శవ దహనాలకు వినియోగిస్తున్నారట. ఒక్క ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే కుళ్లిపోయిన కొబ్బరి కాయలతో రూ.100 కోట్లకు పైగావ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయట. అక్షరాలా ఇది నిజమని చెబుతున్నారు ఇక్కడి కొబ్బరి వ్యాపారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల కల్పతరువు కొబ్బరి. ఇప్పటివరకు కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, తెలగపిండి, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పీచు, పీచులోంచి వచ్చే పౌడర్, కొబ్బరి తాడు, ఆకుల నుంచి ఈనెలు, కమ్మలు ద్వారానే డబ్బొస్తుందని అందరికీ తెలుసు. కుళ్లిపోయిన కొబ్బరి కాయలకు సైతం డిమాండ్ ఉందనే విషయం ఎందరికి తెలుసు. కుళ్లిన కొబ్బరితో ఏటా రూ.కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కొబ్బరి కాయల దింపు సమయంలోను, రాశుల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలను ఏరి పక్కన పడేస్తుంటారు. నాణ్యమైన కాయలను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఏరివేసే ప్రక్రియను నాడెం(నాణ్యత పరిశీలకులు) చేసేవారు నిర్వహిస్తారు. కొబ్బరి రాశుల నుంచి నూటికి 5 కొబ్బరి కాయలు కుళ్లిపోయినవి వస్తుంటాయి. వీటిని ఏరివేసి పక్కన పడేస్తుంటారు. వీటిని కూడా కొనుగోలు చేసే వ్యాపారులు ప్రత్యేకంగా ఉంటారు. వీరు ఒక్కో కాయకు రూపాయి లేదా రెండు రూపాయల చొప్పున (కుళ్లిన కొబ్బరి పరిమాణాన్ని బట్టి) కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కుళ్లిన కొబ్బరి కాయలను ప్రాసెసింగ్, రవాణా చార్జీలతో కలిపి ఉత్తరాదిలో ఒక్కో కాయ రూ.8 నుంచి రూ.10కి విక్రయిస్తున్నారు. వాటి నుంచి నూనె తీసి.. కుళ్లిన కొబ్బరి కాయల్లో వచ్చే కొబ్బరి గుజ్జును తీసి నాలుగైదు వారాలపాటు ఎండబెట్టి కొబ్బరి నూనె తీస్తారు. ఇలా తీసిన నూనె కోనసీమలోని అంబాజీపేట కేంద్రంగా వ్యాపారులు సేకరిస్తారు. ఇలా సేకరించిన కుళ్లిన కొబ్బరి నూనెను యానాం, తణుకు, విజయవాడ, పుణె, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సబ్బుల తయారీ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. టన్నుల కొద్దీ కుళ్లిన కొబ్బరి నూనె అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నూనె కిలో రూ.30 నుంచి రూ.40 చొప్పున అమ్ముడుపోతుంది. కుళ్లిన కొబ్బరి కాయల చిప్పలను పొడి చేసి దోమల నివారణకు వాడే కాయిల్స్‌లో వినియోగిస్తున్నారు. ఈ పౌడర్ తణుకు, విజయవాడ రవాణా చేస్తున్నారు. ఈ చిప్పలు టన్ను రూ.5 వేల ధర పలుకుతోంది. ఎగుమతికి సిద్ధమైన కుళ్లిన కొబ్బరి చిప్పలు శవ దహనాలకు కుళ్లిన కొబ్బరి కాయలు కాశీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో శవాల దహనానికి కుళ్లిన కొబ్బరి కాయలను ఎండబెట్టి వినియోగిస్తున్నారు. కుళ్లిన కొబ్బరి కాయలను నాణ్యమైన కొబ్బరి కాయల మాదిరిగా సంచులలో నింపి లారీల ద్వారా కాశీ, మధుర తదితర క్షేత్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కాశీ వంటి క్షేత్రాల్లో కొబ్బరి కాయలతో అంత్యక్రియలు నిర్వహిస్తే పుణ్యం వస్తుందని ఉత్తరాది రాష్ట్రాల వారి నమ్మకం. ఇందుకు నాణ్యమైన కొబ్బరి కాయలు వినియోగించాలంటే కాయ రూ.20 పైనే ఉంటుంది. అంత ధర భారమనే ఉద్దేశంతో కుళ్లిన కొబ్బరి కాయలను శవ దహనానికి వినియోగిస్తున్నారని గోదావరి జిల్లాల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతిచేసే వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి రోజుకు మూడు లారీలు (సుమారు లక్ష కాయలు) కాశీకి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతి అవుతున్నాయి. కార్తీక మాసంతో పాటు పూజల సమయాలలో హోమాల నిర్వహణ, మొక్కులు తీర్చుకునే క్రమంలో నదులలో వదిలేందుకు ఉత్తరాది భక్తులు ఈ కొబ్బరి కాయలను బస్తాల కొద్దీ కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇవి రెట్టింపు ధర పలుకుతున్నాయి. రూ.వంద కోట్ల వరకు లావాదేవీలు కుళ్లిన కొబ్బరి కాయలను ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ఆచంట, అంబాజీపేట, పాశర్లపూడి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు కేరళ, ఒడిశా, తమిళనాడు నుంచి కూడా కుళ్లిన కొబ్బరి కాయలను ఎగుమతి చేస్తుండటంతో పోటీ నెలకొంది. కుళ్లిన కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, చిప్పలు అన్నీ కలిపి ఉభయ గోదావరి జిల్లాల నుంచి జరిగే లావాదేవీలు ఏటా రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఉత్తరాదిలో మంచి గిరాకీ కుళ్లిన కొబ్బరి కాయల్ని చాలా కాలంగా ఎగుమతి చేస్తున్నాం. ఈ కొబ్బరికి ఉత్తరాదిలో మంచి గిరాకీ ఉంటుంది. ఆరేడు నెలల ముందుగానే ఆర్డర్లు బుక్ చేసుకుని కొనుగోలు చేస్తుంటారు. ఒబ్బిడి చేసిన కుళ్లిన కొబ్బరి కాయల నూనె, చిప్పలను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. సబ్బులు, దోమల కాయిల్స్ తయారీ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. శవ దహనాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. – దాసింశెట్టి రామారావు, పెదతిప్ప, వ్యాపారి -
‘పశ్చిమ’లో కొబ్బరి.. తడబడి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి ఎగుమతులు పతనమవుతున్నాయి. మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో పంట అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు ఢీలా పడ్డాయి. దీంతోపాటు నాణ్యతపరంగా పొరుగు రాష్ట్రాల్లో పంట బాగుండటంతో మన మార్కెట్ డౌన్ అయ్యింది. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉండగా.. ప్రస్తుతం రోజుకు 30 లారీల కొబ్బరి ఎగుమతి చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో తమిళనాడు, కేరళ కొబ్బరి అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా నుంచి ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడి నుంచి తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున కొబ్బరికాయలు ఎగుమతి చేస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో ఏలూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం వద్ద రెడ్డిసీమ, కోరుమామిడి, చింతలపూడి, ద్వార కాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, మొగల్తూరు, పేరుపాలెం ప్రాంతాల్లో కొబ్బరి సాగు ఎక్కువగా ఉంది. సీజన్లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి చేస్తారు. శ్రావణమాసం సందర్భంగా కొద్దిరోజుల ముందు వరకూ ఎగుమతులు బాగున్నా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. లారీకి 30 వేల కాయల వరకు.. చిన్నలారీలో సుమారు 20 వేలు, పెద్ద లారీలో 30 వేల వరకు కాయలను లోడు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లా నుంచి సుమారు 30 లారీల పంట ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం పాత, కొత్త కాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. తమిళనాడులో కొబ్బరి కాయల ధర రూ.7 నుంచి రూ.8 వరకు ఉండటంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ ఎక్కడెక్కడంటే.. గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిసా, హర్యానా రాష్ట్రా ల్లో సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి కాయకు డిమాండ్ ఉంటుంది. జిల్లా నుంచి పీచు కాయ గుజరాత్‌కు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. బెల్ట్ ఫోర్ పట్టా రకాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌కు ఎగుమతి చేస్తుంటారు. కొబ్బరి ఎగుమతుల్లో రాష్ట్రంతో తమిళనాడు, కేరళ పోటీపడుతున్నాయి. లాక్డౌన్ సమయంలో ఆంధ్రా కొబ్బరి ఎగుమతి అధికంగా ఉండటంతో పాటు ధర రూ.15 వరకూ పలికింది. ఒక్కసారిగా తమిళనాడు, కేరళలో దిగుబడులు పెరగడంతో మన మార్కెట్లో ధరలు తగ్గాయి. పరిశోధనా కేంద్రాలు కీలకం పరిశోధనా కేంద్రాల సూచనలు ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో రైతులు కొబ్బరి సాగుచేస్తున్నారు. తద్వారా నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కోనసీమ జిల్లా అంబాజీపేటలో మినహా మరెక్కడా కొబ్బరి పరిశోధనా కేంద్రం లేకపోవడంతో రైతులకు సాగుపై సరైన అవగాహన లేకుండా పోయింది. విస్తీర్ణం తగ్గుతూ.. జిల్లాలో గతంలో సుమారు 60 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు చేసేవారు. ఆక్వా విస్తీర్ణం పెరుగుతుండటంతో ప్రస్తుతం సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. ఆక్వా చెరువు గట్ల వెంబడి ఉన్న కొబ్బరి చెట్లకు నల్లి తెగులు సోకడంతో ఆశించిన దిగుబడులు రావడం లేదు. కొబ్బరి కాయపై మచ్చలు ఏర్పడటం, కాయ పరిమాణం తగ్గడంతో రైతులు లాభాలను అందుకోలేకపోతున్నారు. పరిశోధనా కేంద్రం అవసరం తమిళనాడు, కేరళతో సంబంధం లేకుండా మన రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్ పెరగాలంటే ఇక్కడ పండించే కొబ్బరి కాయకు మచ్చ లేకుండా ఉండాలి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కొబ్బరి పరిశోధనా కేంద్రాలు ఉండాలి. వాటి ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే తమిళనాడు కొబ్బరి పంట అందుబాటులో ఉంటే మన పంటకు డిమాండ్ తగ్గుతుంది. – దేవరపు లక్ష్మీనారాయణ, పాలకొల్లు కొబ్బరి మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డిమాండ్ తగ్గింది శ్రావణమాసం పూర్తికావడంతో మహారాష్ట్రలో డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం శూన్యమాసం కావడం, తమిళనాడు, కేరళæ పంట అందు బాటులోకి రావడంతో మన మార్కెట్ పతనమవుతోంది. ఇటీవల జిల్లాలో వరదలు రావడంతో చెట్లు సుమారు 20 రోజులు నీటిలో ఉండటంతో కాయల్లో నాణ్యత తగ్గింది. డొక్క, పీచు ఇలా అన్ని రంగాల్లో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – మాటూరి వీర వెంకట నరసింహమూర్తి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కోకోనట్ కోప్రా మర్చంట్స్ అసోసియేషన్ సెక్రటరీ -
కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో తెల్లదోమ సమస్యకు ఇలా చెక్!!
దక్షిణాది రాష్ట్రాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలకు రూగోస్ వైట్ ఫ్లై (సల్ఫిలాకార తెల్లదోమ) గత కొన్నేళ్లుగా పెనుముప్పుగా మారింది. తోటల్లో ముందుగానే బదనికల (రెక్కల పురుగుల)ను వదలటం, తదితర పద్ధతుల్లో నియంత్రణకు ప్రభుత్వ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. తెల్లదోమ ఉధృతి ఏటా పెరుగుతూనే ఉంది. అయితే, రూగోస్ కన్నా ప్రమాదకరమైన తెల్లదోమ సంతతికి చెందిన బొండార్స్ నెస్ట్ ఫ్లై కూడా కొబ్బరి తోటలను ఆశిస్తోంది. తెల్లదోమ కన్నా ఇదే∙ఎక్కువ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీని ఉధృతి పైకి కనిపించదు కానీ నష్టం ఎక్కువే. 30% వరకు పంట నష్టం తొలుత కొబ్బరి, ఆయిల్ పామ్‌కు పరిమితమైన తెల్లదోమ.. తరువాత అరటి, పనస, జామ వంటి చెట్లను మాత్రమే కాకుండా నర్సరీలలోని అలంకరణ మొక్కలను సైతం ఆశిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం కొంత తగ్గుతున్నా అక్టోబరు నుంచి దీని ఉధృతి పెరుగుతుంది. జూన్ నెలాకరు వరకు తోటలకు నష్టం ఎక్కుగా ఉంటుంది. తెల్లదోమ వల్ల గడచిన మూడేళ్లలో కొబ్బరిలో సుమారు 30 శాతం దిగుబడి కోల్పోయినట్టు అంచనా. కాయ సైజు కూడా తగ్గింది. తెల్లదోమ ఆశించిన ఆయిల్ పామ్, అరటి, పనస తదితర చెట్లు బలహీనపడుతున్నాయి. దిగుబడిలో తగ్గుదల కనిపిస్తున్నది. వర్షాకాలంలో తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. అందుకని, దీని వల్ల పెద్దగా నష్టం లేదని కొందరు రైతులు ఉదాసీనంగా ఉంటున్నారు. కానీ వాస్తవంగా రూగోస్ తెల్లదోమ సోకితే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. చదవండి: మార్నింగ్ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరాలైంది!! బదనికలతో సమవర్థవంతంగా కట్టడి అంబాజీపేటలోని డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానంలో తెల్లదోమపై పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెల్లదోమ నివారణకు వేపనూనె, గంజి ద్రావణం పిచికారీ చేయడం, పసుపురంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికన్నా సూడోమల్లాడ ఆస్టార్ (డ్రై కోక్రై సా) అనే రకం బదనికలు సమర్ధవంతంగా తెల్లదోమను నివారిస్తున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ బదనికలకు తెల్లదోమ ఒక్కటే మంచి ఆహారమని గుర్తించారు. ఈ బదనికల గుడ్లను తీసుకువెళ్లి తోటల్లో చెట్లపై అక్కడక్కడా పిన్ చేస్తే తెల్లదోమ అదుపులో ఉంటున్నదని శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం బయోల్యాబ్‌లో బదనికలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏటా 45 లక్షల వరకు బదనికలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్ రైతులే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళలకు చెందిన యూనివర్శిటీలు, ఉద్యాన, వ్యవసాయ శాఖలు, రైతులు తీసుకెళ్తున్నారు. కావాలని అడిగిన వారందరికీ బదనికలను ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. డిమాండ్ అధికంగా ఉండడాన్ని గుర్తించి తాడేపల్లిగూడెం వద్ద వెంకట్రామన్నగూడెంలోని డా. వైఎస్సార్ విశ్వవిద్యాలయం ఆవరణలో, శ్రీకాకుళం జిల్లా సోంపేట లోనూ ఈ ఏడాది నుంచి బదనికల ఉత్పత్తిని ప్రారంభించటం విశేషం. చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! బదనికల ఉత్పత్తిపై పలు సంస్థలతో ఎంవోయూలు తెల్లదోమ నియంత్రణకు ప్రభుత్వం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయి. బదనికలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వీటిని ఇప్పటి వరకు ఉద్యాన విశ్వవిద్యాలయమే ఉత్పత్తి చేస్తున్నది. బదనికలను మరింత విస్తృతంగా రైతులందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా కూడా ఉత్పత్తి చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఆయా సంస్థలతో ఉద్యాన విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందాలు (ఎంవోయు)లు సైతం చేసుకుంది. బదనికలు విస్తృతంగా రైతులకు అందించాలని వర్సిటీ భావించింది. బదనికలను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, సహకార సంఘాలకు, పదవీ విరమణ చేసిన శాస్త్రవేత్తలకు, ప్రైవేటు సంస్థలకూ అందిస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలతో వర్శిటీ ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థల నుంచి కూడా రైతులు బదనికలను పొంది, సకాలంలో తోటల్లో వదిలితే తెల్లదోమ నియంత్రణ సాధ్యమవుతుంది. ప.గో. జిల్లాకు చెందిన గోద్రేజ్ కంపెనీ, గోపాలపురానికి చెందిన ఎస్ఎస్డీ ఎంటర్ప్రైౖజెస్, తాడేపల్లిగూడెం సమీపంలోని త్రిబుల్ ఎక్స్ కంపెనీ, తమిళనాడుకు చెందిన బాలాజీ నిమ్మ, క్రిష్టా బయాక్స్, ఎకో కేర్ ఎంవోయు చేసుకున్నారు. అలాగే, తూ. గో. జిల్లా అంబాజీపేటలోని గోదావరి ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ ట్రేడింగ్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (గిఫ్ట్), దేవగుప్తం ప్రాధమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం కూడా ఎంవోయులు చేసుకొని, లాబ్‌లు ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైతే రైతులకు బదనికలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. బదనికల ఉత్పత్తికి బయోల్యాబ్ నెలకొల్పిన దేశంలోనే తొలి రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ‘గిఫ్ట్’ అరుదైన ఘనత సాధించనుంది. ఉద్యాన శాఖ సహకారంతో డిసెంబరు మొదటి వారం నుంచి బదనికలను ఉత్పత్తి చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని ‘గిఫ్ట్’ చైర్మన్ కొవ్వూరి త్రినాద్రెడ్డి (94402 04323) అన్నారు. తెల్లదోమ నివారణకు కోనసీమ రైతులకు నాణ్యమైన వేప నూనె, జీవన ఎరువులు, బదనికలతోపాటు హిస్సారియా కల్చర్‌నూ అందిస్తామన్నారు. ఆధృతిని బట్టి బదనికలు వదలాలి సూడోమల్లాడ ఆస్టార్ (డ్రై కోక్రై సా) అనే రకం బదనికల (రెక్కల పురుగుల) గుడ్లను రూగోస్ తెల్లదోమ సోకిన కొబ్బరి, పామాయిల్ చెట్ల ఆకులపై రైతులు పిన్ చేసుకోవాలి. ఆ గుడ్ల లో నుంచి వెలువడే బదనికలు తెల్లదోమ గుడ్లను తింటూ ఉధృతిని అరికడతాయి. తోటల్లో తెల్లదోమ ఉధృతిని బట్టి చెట్ల ఆకులపై బదనికల గుడ్లను పెట్టుకోవాలి. ఆకుకు ఐదు నుంచి పది రూగోస్ తెల్లదోమ వలయాలు ఉంటే రెండు గ్లుడ్లు చాలు. పది హేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ రకం బదనికలు బొప్పాయి, మందార చెట్టు మీద ఆశించే రసం పీల్చే పురుగులు పేనుబంక, పిండినల్లిని కూడా తింటున్నాయి. పాలీహౌస్‌లలో కూడా ఇవి సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వెయ్యి గుడ్లను రూ.150కు పరిశోధనా స్థానం రైతులకు అందజేస్తుంది. – డాక్టర్ ఎన్.బి.వి.చలపతిరావు, ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర నిపుణులు, డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట 08856244436/243711 -
నారికేళం.. యూరప్ పయనం!
అమలాపురం: ఆంధ్రా నుంచి కొబ్బరి దిగుమతి చేసుకునేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలైన యునైటెడ్ కింగ్డమ్ (యూకే), బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ ఆసక్తి చూపుతున్నాయి. మన రాష్ట్రంలోని కొబ్బరి రైతులు, ఎగుమతిదారులతో చర్చలు జరిపేందుకు యూరోపియన్ వ్యాపారులు సిద్ధమయ్యారు. విశాఖ కేంద్రంగా డిసెంబర్లో ఓ సదస్సు నిర్వహించనున్నారు. అన్నీ అనుకూలిస్తే.. మన రాష్ట్రం నుంచి కొబ్బరితోపాటు కోకో, అరటి, మిరియాల ఎగుమతులకూ మార్గం సుగమం కానుంది. కొబ్బరి ముక్క, నీరు, నూనె, కొబ్బరి పాలు, ఇతర ఉత్పత్తులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ కారణంగా యూరప్ వాసుల ఆహారంలో కొబ్బరి వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే మలేషియా, థాయ్‌లాండ్, మన దేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి యూరప్‌కు కొబ్బరి ఎగుమతి అవుతోంది. అవసరాలకు తగినట్టు దిగుమతులు లేకపోవడంతో ఆంధ్రా నుంచి కూడా దిగుమతి చేసుకోవాలని అక్కడి వ్యాపారులు నిర్ణయించారు. డిసెంబర్లో సదస్సు యూరోపియన్ దేశాలకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)తో పాటు కొందరు దిగుమతిదారులు మన రాష్ట్రంలోని కొబ్బరి వ్యాపారులు, రైతులతో ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిపారు. గడచిన సెప్టెంబర్‌లోనే ఇక్కడి రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యాపారులతో యూరోపియన్ యూనియన్ దిగుమతిదారులు సదస్సు నిర్వహించాలని యోచించారు. కానీ.. కరోనా ఉధృతి వల్ల వాయిదా పడింది. వచ్చే డిసెంబర్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. చర్చలు ఫలించి కొబ్బరి ఎగుమతులు ప్రారంభమైతే అరటి, కోకో, మిరియం వంటి ఎగుమతులు కూడా పెరుగుతాయి. కాగా, తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లికి చెందిన ఆదర్శ కొబ్బరి రైతు విళ్ల దొరబాబును యూరోపియన్ యూనియన్ దిగుమతిదారులు ఏపీలో తమ ప్రతినిధిగా ఎంపిక చేసుకున్నారు. -
ఉద్దానం పెద్ద కొడుకు
సాక్షి, ఇచ్ఛాపురం: ఒకటా రెండా వందల ఏళ్లుగా ఉద్దానం కడుపు నింపుతోంది. రాకాసి గాలులకు ఎన్నిసార్లు తలలు తెగి పడినా మళ్లీ తన వాళ్ల కోసం నిటారుగా నిలబడింది. కమ్మ నుంచి కాయ వరకు, వేరు నుంచి పువ్వు వరకు అన్నింటినీ రైతు కోసమే ధారబోసింది. రహస్యం తెలుసుకుని మసలుకున్న వాడి పాలిట కల్ప తరువుగా నిలిచింది. అందుకే దేవుడంతటి వాడే దాసోహమైపోయాడు. మానవమాత్రుడేపాటి. కొబ్బరి అందరికీ ఓ పంట. కానీ ఉద్దానానికి మాత్రం ఆత్మబంధువు. ఇక్కడి వారికి అది కేవలం చెట్టు కాదు.. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకు. ఉద్దానం పల్లెలు పచ్చగా ఉన్నాయంటే అది కొబ్బరి చలవే. రేపు (సెప్టెంబర్ 2) అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం. ఈ సందర్భంగా నారికేళం చేసే మేలు గురించి తెలుసుకుందాం. దాని మహత్తును గమనించి తరిద్దాం. పల్లె పచ్చగా.. రాష్ట్రంలో రెండో కోనసీమగా ఉద్దానం పేరు పొందింది. విస్తారంగా పరచుకున్న కొబ్బరి తోటలు ఈ ప్రాంతాన్ని పచ్చగా చూస్తున్నాయి. జిల్లాలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాలతో పాటు వజ్రపుకొత్తూరు, మందస, పలాస, రణస్థలం, లావేరు మండలాల్లో 17,540 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. జిల్లాలో వేల మంది రైతులు, వ్యాపారులు, కార్మికులకు ప్రత్యక్షంగా, అంతకు రెండు రెట్లు మందికి పరోక్షంగా బతుకునిస్తోంది. కొబ్బరి వల్ల రైతులు ఉత్పత్తుల తయారీ, అంతర పంటల పెంపకానికి కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), క్వాయర్ అభివృద్ధి బోర్డు, రాష్ట్ర ఉద్యానవన శాఖ పలు రాయితీలు అందిస్తున్నాయి. 106 రకాలు చేయవచ్చు.. కొబ్బరి నుంచి 106 రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రతినిధులు చెబుతున్నారు. రైతులు కనీసం 16 రకాల ఉత్పత్తులను సొంతంగా తయారు చేసుకోవచ్చంటున్నారు. జిల్లాలో సుమారు 50 వేల మంది రైతులు, 50 వేల మంది వ్యాపారులు, కార్మికులు, కూలీలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. కొబ్బరిపై ఇంత మంది జీవనోపాధి పొందుతున్న నేపథ్యంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై డీసీఎంఎస్ దృష్టి సారించింది. జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో కేంద్ర ఆత్మ నిర్భర్ స్కీమ్ ద్వారా జిల్లాలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటుకు సుమారు రూ.350 కోట్లు ప్రతిపాదించారు. అందులో కేవలం కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం కొబ్బరిని పండించే ఏడు మండలాల్లో కొబ్బరి పరిశ్రమను నెలకొల్పేందుకు సుమారు రూ.200 కోట్లతో ప్రాజెక్ట్ తయారు చేశారు. త్వరలో కార్యరూపం దాల్చనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎండు కొబ్బరి: వంటలకు ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా కేకులు, కొబ్బరి నూనె తయారీతో పాటు బయోడీజిల్ తయారీకి సైతం దీన్ని వాడుతుంటారు. కొబ్బరి చిప్స్: అందరూ ఇష్టపడే పొటాటో చిప్స్లానే కొబ్బరి నుంచి చిప్స్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు. ఇదింకా కాస్త ఫేమస్ కావాల్సి ఉంది. కొబ్బరి పాలు: వంటలతో పాటు టీ, కాఫీలను కూడా తయారు చేయవచ్చు. కొబ్బరి పాలు శీతలీకరణలో మిల్లింగ్ చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేస్తారు. కొబ్బరి క్రీమ్: దీన్ని కేకులు, వివిధ రకాల వంట తయారీకి వినియోగిస్తారు. కొబ్బరి తురుము: పంటలతో పాటు కొబ్బరి రకాల పచ్చళ్లలో దీన్ని అధికంగా వాడుతుంటారు. బేకరీల్లో బ్రెడ్లు, బన్స్‌తో తయారు చేసే రకరకాల ఆహారాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. కేరళలో కొత్తగా కోకోనట్ కురికురీ స్వీట్, హాట్ రకాల్లో తయారీకి కొబ్బరి తరుములు అధికంగా వినియోగిస్తున్నారు. కోకో పికిల్: కొబ్బరితో తయారయ్యే పచ్చళ్లు, ఇవి కాకుండా కోకోనట్ క్రిస్పీ, కొబ్బరి డెసికేటెడ్ పౌడర్, కోకోనట్ క్యాండీ, కోకో మిల్క్ పౌడర్, కోకో సిరప్‌లను తయారు చేసి మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది. కొబ్బరి డొక్క: కొబ్బరిలో అత్యంత విలువైనది దీని నుంచి వచ్చే పీచు. పట్టుకు జాతీయ, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి డొక్కల నుంచి పీచు తయారు చేసే పరిశ్రమలు ఉన్నప్పటికీ పీచు నుంచి తాళ్లు, మ్యా ట్లు, ఫైబర్ మ్యాట్లు, కాయర్ జియోటెక్స్, గార్డెన్ ఆర్టికల్స్ (కుండీలు) తయారు చేసే పరిశ్రమలు లేకపోవడం మనకు కాస్త వెలితి. గతంలో కవిటి మండలం బొరివంక, మాణిక్యపురం, రాజపురంలో కంచిలి మండలం తలతంపర, సోంపేట మండలం బారువ గ్రామాల్లో క్వాయర్ ఉత్పత్తులు చేసే పరిశ్రమలు ఉండేవి. అవి ఇప్పుడు మూతపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. కంచిలి మండలం కొక్కిలి పుట్టుగ, మజ్జిపుట్టుగ, నాథపుట్టుగ, చంద్రుపుట్టుగ తదితర గ్రామాల్లో బెంతు ఒరియా తెగకు చెందిన కూలీలు చిన్పపాటి చక్రాలతో కొబ్బరి తాళ్లు అల్లుతుంటారు. ప్రస్తుతం కొబ్బరి పొట్టుకు సైతం మంచి డిమాండ్ పెరిగింది. నీటి నిల్వను ఎక్కువ కాలం ఉంచేందుకు వ్యవసాయంలో దీన్ని అధికంగా వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనె: ఎండు కొబ్బరిని తరుమును వినియోగించి నూనె తయారు చేస్తారు. ఉద్దానం ప్రాంతాలలో ఎండు కొబ్బరి ముక్కల నుంచి నూనె తయారు చేసే మిల్లులు చాలా ఉన్నాయి. దీనిలో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అత్యంత విశిష్టమైంది. దీన్ని ఆహారంగా తీసుకుంటే మనిషిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎయిడ్స్ వంటి వ్యాధి గ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది. అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఉంది. అన్నీ విలువైనవే.. కొబ్బరి కాయ మాత్రమే కాదు చెట్టులో అన్ని భాగాలు విలువైనవే. కొబ్బరిలో బీ6, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి శక్తినిచ్చే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వందశాతం ఆరోగ్యానికి ఉపయోగకరం. ముఖ్యంగా గుండె పనితీరును ఎంతగానో మెరుగు పరుస్తుంది. ఇక కొబ్బరి కమ్మ పశువుల ఆహారంగానూ, ఇళ్ల పైకప్పుగానూ, శుభకార్యాల సందర్భంలో పచ్చని పందిరిగా ఉపయోగపడుతుంది. ఇక కొబ్బరి ఈనెలలను పరిశీలిస్తే దీన్ని ఒక కుటీర పరిశ్రమగా చెప్పవచ్చు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని కొబ్బరి పంట పండిస్తున్న పల్లెల్లో ఈనెపుల్లల అమ్మకం ఒక ప్రధాన పరిశ్రమ. ఎండు,పచ్చి రకాలుగా వీటిని విక్రయిస్తారు. ఎండు ఈనెలు కమ్మల నుంచి తొలగించి కొంతకాలం ఎండలో ఆరగట్టి వీటిని కట్టలుగా కట్టి ప్రధానంగా ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఎండు ఈనెలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. అదేవిధంగా పచ్చి ఈనెలు ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిని ప్రధానంగా పైకప్పులకు ఊటబావుల్లో నీటి నిల్వ కోసం, అగ్గిపుల్లల తయారీ, ఐస్‌క్రీమ్ తయారీలో వినియోగిస్తున్నారు. చెట్టులోని భాగం బల్లలుగా ఇంటి కలపగా నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. ఇలా కొబ్బరిలో ప్రతి భాగమూ ఉపయోగమే. ప్రభుత్వ సాయం ఇలా.. ఉద్దానం కొబ్బరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా సాయపడుతున్నాయి. కొబ్బరి అభివృద్ధి బోర్డు(సీడీబీ), రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నడిచే ఉద్యానవన శాఖల సంయుక్త సహకారంతో ఎన్నో పథకాలు కొబ్బరిరైతులకు అందిస్తున్నాయి. కొబ్బరి రైతులకు వడ్డీ లేని రుణం లక్ష వరకు కాగా పంట రుణంగా(క్రాప్ లోన్) గరిష్టంగా రూ.1.60లక్ష స్వల్పవడ్డీకే అందిస్తున్నారు. దీంతో పాటు కిసాన్ గోల్డ్ కార్డ్ పేరిట కొబ్బరితోటల అభివృద్ధి పథకం కింద పెద్ద రుణాన్ని కూడా అందజేస్తున్నారు. డీసీసీబీ ద్వారా షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ రుణాల పేరిట భారీ మొత్తంలో రుణాలు కల్పిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత పంటల బీమా పథకం అమలుచేశారు. దీనికింద కేంద్రప్రభుత్వం 50శాతం ప్రీమియం చెల్లిస్తే, రాష్ట్రప్రభుత్వం మిగిలిన 50 శాతం ప్రీమి యం చెల్లించేవిధంగా దీన్ని ఉచిత పంటల బీమా పథకంగా కొబ్బరికి అనువర్తింపజేస్తున్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ సౌ కర్యం 90 శాతం రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం సింహభాగం నిధులు మంజూరు చేస్తోంది. దీని కోసం రైతులకు వ్యవసాయ విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకున్న వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అందిస్తోంది. కొబ్బరి పునరుద్ధరణ పథకం, విస్తీర్ణ అభివృద్ధి పథకం వంటివి మేలు చేస్తున్నాయి. కొబ్బరి కల్లు (కల్పరసం): కొబ్బరి దశదిశ మార్చేది ఇదే. అతి విలువైన ఉత్పత్తి కొబ్బరి కల్లు (కల్పరసం)ను పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని రకాల పద్ధతులు వినియోగించి ఉత్పత్తి చేస్తారు. ఇలా చేయడం వల్ల కల్లు పులిసిపోకుండా (ఫెర్మంటేషన్ అవకుండా) ఉంటుంది. ఇది పూర్తిగా ఆరోగ్యకరమైన పానీయం. కొబ్బరి పరిశ్రమలు నెలకొల్పుతాం కేవలం కొబ్బరిపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవించే కుటుంబాలు జిల్లాలో వేలాదిగా ఉన్నా యి. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ముందుగా నష్టపోయేది కొబ్బరి రైతులే. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుల కృషితో ఇక్కడి సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి క్షేత్రాన్ని నెలకొల్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. విలువ ఆధారిత ఉత్పత్తులపై డీసీఎంఎస్ దృష్టి సారించింది. కేంద్ర ఆత్మ నిర్భర్ స్కీమ్ ద్వారా కొబ్బరి రైతుల కలలను సాకారం కానున్నాయి. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు నెలకొల్పేందుకు సుమారు రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పరిశ్రమను నెలకొల్పుతాం. – పిరియా సాయిరాజు, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, శ్రీకాకుళం -
కొబ్బరి పీచు భూవస్త్రం
మన ఆకలి తీర్చుతున్న ఆహారంలో 95% వరకు భూమాతే మనకు అందిస్తుంది. అందువల్ల భూమి పైపొర మట్టి మనకే కాదు జంతుజాలం మొత్తానికీ ప్రాణప్రదమైనది. భూమి పైమట్టి సారవంతమైనదే కాకుండా ఎంతో విలువైనది కూడా. కాబట్టి, మనకు మాదిరిగానే భూమికి కూడా ఆచ్ఛాదనగా వస్త్రం కప్పి పరిరక్షించుకోవాల్సిన ప్రాణావసరం మనది. మట్టి ఎండకు ఎండి నిర్జీవమైపోకుండా.. గాలికి, వర్షపు నీటి తాకిడికి కొట్టుకుపోకుండా రక్షించుకోవడానికి కొబ్బరి పీచుతో చేసిన చాపలు భేషుగ్గా పనిచేస్తున్నాయి. ఈ కొబ్బరి చాపలనే కాయర్ బోర్డు ‘భూవస్త్రం’ అని పిలుస్తోంది. ఇరవయ్యేళ్లుగా కేరళ తదితర రాష్ట్రాల్లో పీచు పరిశ్రమదారులు ‘భూవస్త్రాల’ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, మన దేశంలో వాడకం తక్కువే. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కొబ్బరి పీచు భూవస్త్రాన్ని పంటలకు మల్చింగ్ షీట్‌గా, కాల్వలు, చెరువులు, నదుల గట్లకు రక్షణ కవచంగా కూడా వాడుకోవచ్చు. భూమిని కాపాడటమే కాకుండా ఐదారేళ్లలో భూమిలో కలిసిపోయి సారవంతం చేస్తుంది. కూరగాయ పంటల్లో ఆచ్ఛాదన పంట పొలాల్లో, చెట్లు, మొక్కల పెంపకంలో భూమికి ఆచ్ఛాదన కల్పించడానికి మల్చింగ్ షీట్లుగా ప్లాస్టిక్‌కు బదులుగా కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయని కాయిర్ బోర్డు రాజమండ్రి విభాగం అధిపతిగా ఇటీవలే రిటైరైన మేడిగ రామచంద్రరావు ‘సాక్షి’తో చెప్పారు. ఈ షీట్ మొక్కల చుట్టూ పరిస్తే ఎండ, వానల నుంచి భూమిని కాపాడటమే కాకుండా కలుపు మొలవకుండా అడ్డుకుంటుందన్నారు. కలుపు మందుల పిచికారీ అవసరం లేదు. కలుపు తీత ఖర్చులు ఉండవు. నాగాలాండ్‌లో పైనాపిల్ పంటను విస్తారంగా సాగు చేసే రైతులు భూవస్త్రాలతో మల్చింగ్ చేస్తున్నారని ఆయన వివరించారు. అరటి, వంగ, టమాటా, బెండ తదితర పంటలకు బాగా మల్చింగ్ బాగా ఉపయోగపడుతుందన్నారు. కొబ్బరి భూవస్త్రాలు 600 జి.ఎస్.ఎం.(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) నుంచి 2,000 జి.ఎస్.ఎం. మందం వరకు దొరుకుతాయి. మల్చింగ్ షీట్‌గా 600 జి.ఎస్.ఎం.(సుమారు పావు అంగుళం) మందం ఉండే భూవస్త్రం సరిపోతుంది. ఇది భూమిపై పరిచిన ఐదారు సంవత్సరాలలో చీకి భూమిలో కలిసిపోతుందని రామచంద్రరావు (92477 98246) చెప్పారు. భూవస్త్రాల మన్నిక ఎంత? కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు పర్యావరణ హితమైనవి. వీటిని వినియోగించుకుంటే కాలువలు, చెరువులు, నదుల గట్లు, ఏటవాలు ప్రాంతాల్లో నుంచి గాలికి, వర్షానికి మట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. రోడ్ల నిర్మాణంలోనూ ఉపయోగపడుతుంది. చెరువులు, సరస్సుల గట్లు, నదుల వరద కట్టల నవీకరణ పనుల్లో భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఇంతకీ వీటి మన్నిక, పటుత్వం ఎంత? ఐదారేళ్ల వరకూ మన్నుతాయని నిపుణులు చెబుతున్నారు. ‘కొబ్బరి పీచు పటుత్వం చాలా ఎక్కువ. ఇందులో లిగ్నన్ ఎక్కువ మోతాదులో ఉండటమే ఇందుకు కారణం. టేకు, ఇరుగుడు చావ కలపలో కన్నా కొబ్బరి పీచులోనే లిగ్నన్ ఎక్కువగా ఉందని కోయంబత్తూరులోని జాతీయ కాయిర్ పరిశోధన, యాజమాన్య సంస్థ (ఎన్.సి.ఆర్.ఎం.ఐ.) డైరెక్టర్ కె.ఆర్. అనిల్ అంటున్నారు. అంతేకాదు, నీటిని సంగ్రహించే సామర్థ్యం, అతినీల లోహిత(యు.వి.) కిరణాలను తట్టుకునే శక్తి కూడా ఎక్కువే, వేసిన తర్వాత ఐదారేళ్ల వరకు మన్నుతాయని అంటున్నారాయన. 90% తేమ, 30 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలో కూడా దీర్ఘకాలంపాటు భూవస్త్రం పటిష్టంగా నిలిచినట్లు ‘జెర్మన్ బున్‌దేసంత్ ఫర్ మెటీరియల్ టెస్టింగ్ ఆన్ నేచురల్ ఫైబర్స్’ తెలిపింది. పత్తి ఉత్పత్తుల కన్నా 15 రెట్లు, జనపనార ఉత్పత్తుల కన్నా 7 రెట్లు ఎక్కువ రెట్లు మన్నిక కొబ్బరి పీచు భూవస్త్రాలకు ఉందని తెలిపింది. వరద నీటిలో 4 వేల గంటలు మునిగి ఉన్న తర్వాత కూడా ఇవి చెక్కుచెదరలేదని సంస్థ తెలిపింది. భూవస్త్రాల ధర ఎంత ఉంటుంది? కొబ్బరి కాయ మన ఆహార, ఆధ్యాత్మిక సంస్కృతిలో పెద్ద పీట ఉంది. కొబ్బరి పంట నుంచి కొబ్బరి కాయ ప్రధాన ఉత్పత్తి. కాయను ఒలిస్తే వచ్చే డొక్కల నుంచి పీచును వేరు చేస్తారు. ఈ క్రమంలో పొట్టు వస్తుంది. కొబ్బరి పొట్టును స్వల్ప ప్రక్రియ ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈనెలతో చాపలను లేదా మాట్స్ను తయారు చేస్తారు. ఇవే భూవస్త్రాలు (కాయిర్ జియో టెక్స్టైల్స్). వీటిని మీటరు పన్నాతో సుమారు 50 మీటర్ల పొడవున తయారు చేస్తారు. భూవస్త్రాలు రెండు రకాలు.. చేనేత వస్త్రం మాదిరిగా కొన్ని దశల్లో నేసేవి (వోవన్), ఒక యంత్రంతో సులువుగా అల్లిక చేసేవి (నాన్ వోవన్). నాన్ వోవన్ భూవస్త్రాల ధర చదరపు మీటరుకు రూ. 50–60 ఉంటే, వోవన్ భూవస్త్రాల ధర నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూవస్త్రాల ఉత్పత్తిలోకి తొలి ఎఫ్.పి.ఓ. కోనసీమ కొబ్బరి రైతులతో ఏర్పాటైన కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ(ఎఫ్.పి.ఓ.) త్వరలో భూవస్త్రాలు సహా వివిధ కొబ్బరి ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నది. విశేషమేమిటంటే దేశంలోనే ఈ పని చేయబోతున్న తొలి ఎఫ్.పి.ఓ. ఇది. తూ.గో. జిల్లా అయినవోలు మండలం నేదునూరులో ఈ యూనిట్ ఏర్పాటవుతోంది. ప్రాజెక్టు విలువ రూ. 341.38 లక్షలు. కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూ. 313.94 లక్షలు గ్రాంటుగా ఇస్తోంది. రైతుల వాటా రూ. 27.44 లక్షలు. రోడ్ల మన్నిక పెరుగుతుంది కొబ్బరి పీచు భూవస్త్రాలను మట్టి, తారు రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. గ్రావెల్, ఎర్రమట్టికి అడుగున భూవస్త్రాలను పరుస్తారు. భూవస్త్రం వాడటం వల్ల రోడ్ల మన్నిక 20–40% పెరిగినట్లు రుజువైందని కాయిర్ బోర్డు మాజీ అధికారి రామచంద్రరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ రోడ్ల నిర్మాణంలో ఇప్పటికే వాడుతున్నట్లు చెప్పారు. ప.గో. జిల్లాలో చించినాడ బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు నిర్మాణంలో వాడామని, 20 ఏళ్లయినా చెక్కుచెదరలేదన్నారు. కొబ్బరి పీచు భూవస్త్రాలను ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో ఉపయోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఏపీలో 164 కి.మీ., తెలంగాణలో 121 కి.మీ. మేరకు రోడ్ల నిర్మాణంలో భూవస్త్రాలను వాడేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి కూడా. ఇవి మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయని, బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కృష్ణా, గోదావరి డెల్టాలో కాలువ గట్లు జారిపోతూ ఉంటే ఏటా బాగు చేస్తూ ఉంటారు. ఈ గట్లను భూవస్త్రాలతో కప్పి, వాటిపై మొక్కలను పెంచితే గట్లు బాగా గట్టిపడతాయి. ఐదారేళ్ల వరకు చెక్కుచెదరవు. రైలు పట్టాలకు ఇరువైపులా మట్టికట్టలను కూడా ఇలాగే పటిష్టం చేసుకోవచ్చని రామచంద్రరావు సూచిస్తున్నారు. భూవస్త్రం పరచి, ఆ పైన రోడ్డు వేస్తున్న దృశ్యం -
ఒడిదుడుకుల్లో కొబ్బరి సాగు
పశ్చిమగోదావరి, నరసాపురం: జిల్లా పేరు చెబితే వరి తరువాత గుర్తుకు వచ్చేది కొబ్బరి. దేశంలో కేరళ తరువాత ఎక్కువగా కొబ్బరి ఎగుమతులు చేసేది మన రాష్ట్రమే. అందులో ఉభయగోదావరి జిల్లాలదే అగ్రస్థానం. ఇందులో మన జిల్లా స్థానం ప్రత్యేకమైనది. ప్రస్తుతం కొబ్బరి సాగు ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. బయట మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ.15 నుంచి రూ.20 వరకు కాయ ధర పలుకుతుండగా.. రైతుకు మాత్రం రూ.3 నుంచి రూ.5 వరకూ మాత్రమే దక్కుతోంది. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రైతుకు మరో అర్ధరూపాయో, రూపాయో అదనంగా దక్కడం గగనం. కేవలం రైతులే కాకుండా కొబ్బరి దింపు, వలుపు, లారీలు, ట్రాక్టర్లలోకి లోడు చేయడం, దించడం ఇలా.. జిల్లాలో కొబ్బరి పరిశ్రమపై ఆధాపరడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇంకోవైపు జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం ఏటా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆక్వా సాగు పెరగడం ఇందుకు కారణంగా కానిపిస్తోంది. గడిచిన దశాబ్దం కాలంగా కొబ్బరితోటలు విపరీతంగా రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో కొబ్బరిసాగు, పరిశ్రమ కూడా సంక్షోభంలోకి వెళుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. డిమాండ్ ఉన్నా.. రైతుకు లాభం లేదు జిల్లాలో పాలకొల్లు కేంద్రంగా కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి విస్తృతంగా అవుతున్నాయి. రోజుకు 50 లారీలకు తక్కువ కాకుండా ప్రతిరోజూ ఎగుమతి జరుగుతోంది. ఈ లెక్కన జిల్లా నుంచి రోజుకు రూ.1 కోటి నుంచి రూ.1.50 కోట్ల వరకూ జార్ఖండ్, హర్యానా, ఛత్తీస్గడ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోంది. ఉత్తర భారతదేశంలోని 14 రాష్ట్రాలకు ఇక్కడ నుంచే కొబ్బరి ఎగుమతులు జరుగుతాయి. కోఫ్రా (పైచెక్క తొలగించిన కురిడి), ఇడిబుల్ కోఫ్రా (ఆయిల్‌కు వినియోగించే విధంగా ముక్కలు చేసినవి), కోఫ్రా స్లైస్ (తరుము) రింగ్స్ అండ్ స్లైసెస్ (కురిడికాయను చిన్నచిన్న ముక్కలుగా చేసినవి) మాత్రం విదేశాలకు ఎగుమతి అవుతాయి. కొబ్బరికి ఇంత డిమాండ్ ఉంది. అయితే కొబ్బరి రైతులకు డిమాండ్‌కు అనుగుణంగా ధర దక్కడంలేదు. గుంటూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో కాయ ధర రూ.25 నుంచి రూ.30 ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ ధర పలుకుతోంది. ఇక్కడి రైతుకు మాత్రం రూ.5, లేదంటే మరో రెండు, మూడు రూపాయలు మాత్రమే దక్కుతుంది. దీంతో రైతులు చాలాకాలంగా దారుణంగా నష్టపోతున్నారు. తగ్గుతున్న విస్తీర్ణం జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం దారుణంగా తగ్గిపోతోంది. ఆక్వా సాగు పెరగడంతో భూములు చెరువులుగా మారడం ఒక కారణమైతే, కొత్తగా కొబ్బరిసాగుకు రైతులు మొగ్గు చూపకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో 22 మండలాలల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాలల్లో ఎక్కువగా ఉంది. కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, పెదవేగి, ద్వారాకాతిరుమల, జంగారెడ్డిగూడెం, భీమడోలు, నల్లజర్ల మండలాల్లో కూడా చెట్లను పెంచుతున్నారు. డెల్టాలో చేను గట్ల మధ్య ఎక్కువగా పెంచుతుండగా, మెట్టలో తోటల పెంపకం కొంచెం ఎక్కువే. పదేళ్ల క్రితం జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరితోటలు ఉండగా, ప్రస్తుతం 98 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో పదేళ్లలో 20 వేల ఎకరాల్లో చెట్లు మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొబ్బరి ఎగుమతులకు సంబంధించి ఒలుపు, లోడింగ్, ట్రాన్స్‌ఫోర్ట్, వ్యాపారం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ రంగంపై జిల్లాలో 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొబ్బరి సాగులో సంక్షోభం తలెత్తితే వీరందరకీ గడ్డు పరిస్థితి తప్పదు. -
కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం
సాక్షి, తూర్పుగోదావరి: కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రపప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం కాకినాడ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో పాలన చేస్తున్నామని, అందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్ పేరు పెడుతున్నామని అన్నారు. రైతులకు ఉపయోగపడే మొక్కలను అటవీశాఖ ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో.. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు పది లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కురసాల తెలిపారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు వ్యవసాయ, ఉద్యానవన, అటవీశాఖలు సమన్వయం కావాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక ఆయా శాఖలు రైతులకు మొక్కల పెంపకంపై అవగాహన కలిపించాలని అధికారులకు సూచించారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
అమలాపురం టౌన్/అంబాజీపేట: కోట్లాది రూపాయల లావాదేవీలతో ఒకప్పుడు అంబాజీపేట కొబ్బరి మార్కెట్ దేశంలో మంచి పేరుగడించింది. కేరళలోని అలెప్పీ మార్కెట్ తర్వాత స్థానం దీనిదే. 20 ఏళ్ల క్రితం ఇక్కడ 107 కొత్త కొబ్బరి దుకాణాలు ఉండేవి. 2వేల మందికి పైగా కొబ్బరి కార్మికులు ఇక్కడ ఉపాధి పొందేవారు. కొబ్బరి ఉత్పత్తుల్లో తమిళనాడు రాష్ట్రం దూసుకురావడం, కర్ణాటకకు సైతం కొబ్బరి పంట విస్తరించడంతో ఈ మార్కెట్ ఘన కీర్తి కరుగుతూ వచ్చింది. నేడు ఇక్కడ కొత్త కొబ్బరి దుకాణాలు 20 మాత్రమే ఉన్నాయి. వీటిని నమ్ముకుని జీవించే కొబ్బరి కార్మికులు పని దొరకని అభద్రతా భావం అలుముకుంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్... కొత్త కొబ్బరి కార్మికుల జీవన íస్థితుగతులపై అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలేనికి చెందిన సూర్యమణి పరిశీలన చేసి ఆ వివరాలను సేకరించింది. కొబ్బరి కార్మికుల శ్రమైక జీవనంలోకి తొంగి చూసి వారి మనోభావాలను, అభిప్రాయాలను సేకరించింది. భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెసర్ డాక్టర్ గోకరకొండ నాగేంద్ర సూచనలతో ఆమె ఈ ప్రాజెక్ట్ చేపట్టంది. సూర్యమణి తన 45 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కళాశాలకు సమర్పించింది. ఆమె పరిశీలనలో వెల్లడైన వివరాలు.. రెండు దశాబ్దాల కిందటి అంబాజీపే కొబ్బరి మార్కెట్లోని 107 కొత్త కొబ్బరి దుకాణాల్లో దుకాణానికి సగటున 20 మంది కొత్త కొబ్బరి కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం 20 దుకాణాలకు తగ్గిపోవడంతో కొందరు సంప్రదాయంగా తమకు తెలిసిన ఈ వృత్తిలోనే కష్టమైనా...నష్టమైనా ఉండిపోయారు. మరికొందరు చేతి నిండా పనులు లేక తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ కొబ్బరి కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు ఇతర వృత్తుల్లో ఉపాధి వెతుక్కున్నారు. ప్రస్తుతం ఉన్న 20 దుకాణాల్లో దాదాపు 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారికి వచ్చే వేతనాలతో కుటుంబ పోషణ సాఫీగానే సాగిపోతున్నా ఇళ్లలో ఏవైనా శుభకార్యక్రమాలు జరిగినా, దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలైనా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ 20 ఏళ్ల క్రితం వరకూ దేశంలో కీలక స్థానంలో ఉండేది. కేరళలోని అలెప్పీ మార్కెట్ తర్వాతి స్థానం ఈ మార్కెట్‌దే. అయితే అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇది నేల చూపు చూసింది. ఆ ఘనకీర్తి మసకబారింది. దీనిపై ఆధారపడిన కార్మికులు గత్యంతరం లేక వలసబాట పట్టారు. -
వరి మునిగి..కొబ్బరి ఒరిగి..
అమలాపురం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపానుకు వరి పంట నష్టపోయిన రైతులు కొంతమంది అయితే.. కొబ్బరి పంట నష్టపోయింది మరికొందరు. కాని తీర ప్రాంత మండలాల్లో వందల మంది రైతులు అటు వరి, ఇటు కొబ్బరి పంటలు సైతం ఒకేసారి దెబ్బతినడంతో రెండువిధాల నష్టపోయి లబోదిబోమంటున్నారు. జిల్లాలో కోనసీమతోపాటు తీర ప్రాంత మండల్లాలో వరి రైతులు తమ పొలాల వద్ద ఉండే కమతాలు, నూర్పిడులు చేసే కళ్లాలు, చేలగట్ల మీద కొబ్బరి చెట్లను పెంచుకుంటారు. ఇలా పెంచిన చెట్ల నుంచి వచ్చే ఆదాయం రైతులకు ‘వేడి నీళ్లకు చన్నీళ్లుగా’ ఉండేది. ఎకరా కొబ్బరి తోటలో 60 నుంచి 80 చెట్లు వేయగా, ఎకరా వరి చేను చుట్టూ సుమారు 40 నుంచి 50 చెట్ల వరకూ వేస్తూంటారు. తోటల్లో మాదిరిగా ఎనిమిది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల పొడవుకు ఒకటి చొప్పున కాకుండా గట్ల మీద చెట్లు పక్కపక్కనే వేస్తూంటారు. కొబ్బరి తోటలు తక్కువగా ఉండే తీర ప్రాంత మండలాల్లోని వరి పొలాల్లో తప్పనిసరిగా గట్ల మీద చెట్లు పెంచుతూంటారు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న తాళ్లరేవు, కాకినాడ రూరల్, కరప, పిఠాపురం, గొల్లప్రోలు, తుని, తొండంగి, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి, అమలాపురం మండలాల్లో వరి చేల చుట్టూ కొబ్బరి చెట్లను పెంచుతూంటారు. సుమారు 1.20 లక్షల ఎకరాల వరి చేల చుట్టూ, కమతాల చుట్టూ కొబ్బరి సాగు చేస్తున్నారని అంచనా. ఎకరాకు 40 నుంచి 50కి తక్కువ కాకుండా చెట్లు ఉండే అవకాశమున్నందున రైతుకు సాలీనా మూడు వేలకు తక్కువ కాకుండా కొబ్బరి కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరికాయ సగటున రూ.4 ధర కడితే రైతుకు ఏడాదికి రూ.12 వేల వరకూ వచ్చేది. వరి రైతులకు ఇది అదనపు ఆదాయంగా ఉండేది. గడచిన ఐదేళ్ల కాలంలో నాలుగుసార్లు ఖరీఫ్ దెబ్బతిన్నా రైతులకు కొబ్బరిపై వచ్చే ఆదాయంతో కనీసం ఇల్లు గడిచేది. ఖరీఫ్ నష్టం రబీలో పూడ్చగా, మూడో పంట అపరాలు లేకపోవడంతో రైతులకు కొబ్బరి ఆదాయమే మిగిలేది. కౌలుదారులకు కొబ్బరి ఆదాయం చేయూతనిస్తుంది. హెలెన్ తుపానువల్ల గట్ల మీద చెట్లకు ఎక్కువ నష్టం వాటిల్లింది. తోటలతో పోల్చుకుంటే గట్ల మీద చెట్లే ఎక్కువగా దెబ్బతిన్నాయి. తోటల్లో చెట్లు గుబురుగా ఉండడం వల్ల గాలుల తీవ్రత నేరుగా పడని కారణంగా నష్టం తక్కువగా ఉంది. పొలాల గట్ల మీద చెట్లకు పెనుగాలులు నేరుగా తగలడంతో ఎక్కువ చెట్లు విరిగిపోయాయి. పైగా తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీరప్రాంత మండలాల్లో పెద్ద సంఖ్యలో గట్ల మీద పెంచిన చెట్లకు ఎక్కువ నష్టం వాటిల్లింది. తీరాన్ని ఆనుకుని చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులు సైతం కొబ్బరి చెట్లను ఎక్కువగా పెంచుతుంటారు. ఇటువంటిచోట్ల కూడా చెట్లు పడిపోయాయి. కొబ్బరి తోటల్లో ఎకరాకు మూడు చెట్ల వరకూ పడిపోగా, పొలంగట్ల మీద ఎకరాకు ఐదు చెట్లు పడిపోయినట్టు అంచనా. జిల్లాలో తుపాను ప్రభావంతో 80 వేల కొబ్బరి చెట్లు పడిపోయాయని అంచనా కాగా, దీనిలో 50 వేల వరకూ చెట్లు గట్లు, కళ్లాల్లోవి కావడం గమనార్హం. పెనుగాలులకు కొబ్బరి చెట్లు మొవ్వులు విరగడం, ఆకులు, పిందెలు, బొండాలు రాలిపోవడం వల్ల దిగుబడిపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కురిసిన భారీ వర్షాలకు అటు వరి పంట మొత్తం పోగా, ఇటు కొబ్బరి చెట్లు నేలకొరిగి వచ్చే అదనపు ఆదాయం కూడా పోవడంతో తీర ప్రాంత మండలాల రైతులు రెండు విధాలుగా నష్టపోయినట్టయింది.