compulsory education act
-
ఆ చట్టం ఇక అమలు చేయరా?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం 2010లో తీసుకొచ్చిన ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఇప్పటికీ రాష్ట్రంలో అమలు కాకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చట్టం వచ్చి పదేళ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఈ చట్టాన్ని అమలు చేయాలంటూ 2010లో దాఖలైన పిటిషన్లకు ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేస్తామంటూ ఇప్పటికే అనేకసార్లు సమయం తీసుకున్నారని, ఇదే చివరి అవకాశమని, సెప్టెంబర్ 4లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చే యాలని ఆదేశించింది. ‘ఉచిత నిర్బంధ విద్యా హక్కు’ అమలుకు నోచుకోవడం లేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్. చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని, ఈ చట్టం అమలుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించి.. తర్వాత 60 శాతం నిధులను కేంద్రం నుంచి తీసుకునే అవకాశం ఉందని పిటిషనర్లు నివేదించారు. ఈ చట్టంలోని అనేక అంశాలకు సంబంధించి విచారణలో ఉన్న 10 పిటిషన్లకు కలిపి సమగ్రంగా కౌంటర్ దాఖలు చేస్తామని, ఇందుకు 8 వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ కోరారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం.. ఇప్పటికే పిటిషన్లు దాఖలై పదేళ్లు దాటుతోందని, ఇంకా కౌంటర్ దాఖలుకు సమయం కోరడం ఏంటని ప్రశ్నించింది. తదుపరి విచారణను 4కు వాయిదా వేసింది. 10 లక్షల మందికి ప్రయోజనం చేకూరేది.. ‘‘2010లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని ప్రైవేటు స్కూళ్లను ఆదేశిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 44 జారీ చేసింది. ఈ చట్టం సమర్థంగా అమలై ఉంటే ఇరు రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల మంది నిరుపేదలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చదువుకునే అవకాశం లభించేంది. 16 రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా 29.25 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఈ చట్టం అమలును సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. చట్టం అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లయినా పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ చట్టాన్ని అమలు చేస్తే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ప్రభుత్వం వెచ్చించే డబ్బులో 60 శాతం కేంద్రం వెంటనే చెల్లిస్తుంది’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
1, 2 తరగతులకు నో హోంవర్క్
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 1, 2 తరగతులు చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే హోంవర్క్ బాధ తప్పనుంది. ఆ తరగతుల విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వకుండా పాఠశాలలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ‘నో హోంవర్క్’ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం వెల్లడించారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం–2009కు అనుగుణంగా ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని, ఇది ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 1, 2 తరగతుల విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించడంతోపాటు వారికి ఎలాంటి హోంవర్క్ ఇవ్వకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీచేయాల్సిందిగా మద్రాసు హైకోర్టు గత నెల 30న కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే ఈ తరగతుల విద్యార్థులకు భాష, గణితం తప్ప మరే ఇతర సబ్జెక్టు బోధించకుండా అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లెర్న్ విత్ ఫన్ అనే విధానాన్ని తాను విశ్వసిస్తానని ఆయన చెప్పారు. -
ప్రభుత్వ పాఠశాలలపై ప్రైవేటు పిడుగు
► విద్యార్థుల సంఖ్య 19 ఉంటే పాఠశాల రద్దు! ► మూతబడ్డ స్కూళ్ల స్థలాలు, భవనాలు కెన్యా సంస్థకు! ► వేసవిలో రేషన్లైజేషన్ అమలుకు ఆదేశాలు ► గతేడాది 114 పాఠశాలల మూసివేత ► ఈ ఏడాది మరో 200 పాఠశాలల రద్దు! ► నిర్బంధ విద్యా చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు ముదినేపల్లి రూరల్/మచిలీపట్నం : రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. మూతబడిన పాఠశాలల భవనాలు, స్థలాలను కెన్యాకు చెందిన బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి వేసవిలో రేషనలైజేషన్‌ను అమలు చేసేందుకు నివేదికలు తయారు చేయాలని సూచించినట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్యపై స్పష్టత లేదు... ప్రభుత్వ పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలుకు సిద్ధమైన ప్రభుత్వం పాటించాల్సిన ప్రమాణాల విషయంలో మాత్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. పాఠశాలలో పది మంది లోపు విద్యార్థులు ఉంటే మూసివేస్తామని ఒకసారి, 19 మంది ఉన్నా మూసివేస్తామని మరోసారి ఆదేశాలు జారీ చేయటంపై గందరగోళం వ్యక్తమవుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది, ఉన్నత పాఠశాలల్లో 75 మంది కన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే వాటిని మూసివేస్తారని ఉపాధ్యాయ సంఘ నేతలు చెబుతున్నారు. వేసవిలో పాఠశాలల్లో రేషనలైజేషన్ చేపడితే ప్రాధమికోన్నత పాఠశాలల్లో 6,7 తరగతుల్లో 35 మంది కన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే సంబందిత పాఠశాలలను మూసివేసే అవకాశం ఉంది. ఉన్నత పాఠశాలల్లో 75 మంది కన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే ఈ పాఠశాలలను మూసివేస్తారని ఉపాధ్యాయ సంఘం నాయకులు చెబుతున్నారు. పేద విద్యార్థులు విద్యకు దూరం... ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. గ్రామంలో 15 మంది విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలను మూసివేసి సమీప గ్రామంలోని పాఠశాలలో కలిపితే ఆ విద్యార్థుల్లో కనీసం ఐదారుగురైనా బడి మానేస్తారని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 114 పాఠశాలల మూత గత ఏడాది నవంబరులో రేషనలైజేషన్ ప్రక్రియను ప్రాథమిక పాఠశాల్లో అమలు చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 114 పాఠశాలలను గుర్తించి వాటిని సమీప గ్రామాల్లోని మోడల్ పాఠశాలల్లో కలిపారు. అప్పట్లో డీఈవోగా పనిచేసిన కె.నాగేశ్వరరావు జిల్లాలో 19 పాఠశాలలే మూతపడతాయని ప్రభుత్వానికి నివేదిక అందించారు. అనంతరం ఆ సంఖ్యను 114కు పెంచారు. వివాదం నెలకొనడంతో విచారణ జరిపి డీఈవో నాగేశ్వరరావును అప్పట్లో సస్పెండ్ చేశారు. ఈ వేసవిలో చేపట్టే రేషనలైజేషన్‌లో మరో 200 పాఠశాలల వరకు మూతబడే అవకాశముందని తెలుస్తోంది. ఆధార్ నిలిపివేత... ప్రభుత్వం విద్యార్థులకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేసింది. దీని ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణ ంగా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. గత విద్యా సంవత్సరం ముగిం పు రోజున ఉన్న ఆధార్ సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేపట్టారు. అయితే కొంతకాలంగా పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించి ఆధార్ సీడింగ్ నిలిపివేశారు. దీనివల్ల విద్యార్థుల సంఖ్యలో స్పష్టత ఉండదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తాం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుపరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం ఆ యోచన విరమించుకోవాలి. పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు. - బేతాళ రాజేంద్రప్రసాద్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు విద్యార్థులు చదువుకు దూరమవుతారు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేస్తే డ్రాపవుట్లు పెరుగుతాయి. ఇది నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే. పేద విద్యార్థులకు విద్య దూరమవుతుంది. - ఆగొల్లు హరికృష్ణ, ఉపాధ్యాయ సంఘ నాయకుడు -
విద్యా చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు చట్టమొచ్చి ఆరేళ్లు కావొస్తున్నా పట్టించుకోరా? ప్రైైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశం కనిపిస్తోందని వ్యాఖ్య పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సర్కారుకు ఆదేశం హైదరాబాద్: నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిబంధన రాష్ట్రంలో అమలుకాకపోతుండటంపై తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. విద్యా హక్కు చట్టం వచ్చి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులు రిజర్వేషన్లు పొందలేకపోతున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరును చూస్తుంటే ప్రైవేటు విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో బలహీనవర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్లను అమలుచేసేందుకు ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నారు.. ఇకపై ఏం చేయనున్నారు... తదితర వివరాలను ఓ అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకున్న తీవ్రత దృష్ట్యా ఇందులో వాదనలు వినిపించాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని కోరింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బలహీనవర్గాల విద్యార్థులకు చట్ట ప్రకా రం 25శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేటు విద్యా సంస్థలను ఆదేశించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్ (కోవా), మరో రెండు సంస్థలు దాఖలుచేసిన వ్యాజ్యం (పిల్)పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘2009లో నిర్బంధ విద్యాహక్కు చట్టం వచ్చింది. మనం ఇప్పుడు 2015లో ఉన్నాం. చట్టం వచ్చి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ అమలుకావడం లేదంటే అది నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ తీరు ఏ మాత్రం హర్షణీయం కాదు. ప్రభుత్వ తీరు చూస్తోంటే ప్రైవేటు విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్నట్లుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది వాణిరెడ్డి స్పందిస్తూ, విద్యా హక్కు చట్టం అమలుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని, చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘అసలు కమిటీ ఎందుకు? చట్టం అమలుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఎక్కడుంది? అయినా కమిటీ ఏం చేస్తుంది? అసలు బలహీనవర్గాలకు 25 శాతం రిజర్వేషన్లు ఉన్నాయన్న సంగతైనా మీకు తెలుసా’ అని ప్రశ్నించింది. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, ఆరేళ్లలో చేయని వాళ్లు ఏడాదిలో చేస్తారని ప్రశ్నించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. -
సవరణకు ఆమోదం
నిర్భంద విద్యా హక్కు చట్టం బిల్లులో మాతృభాషలో విద్యనభ్యసించే వెసులుబాటు పదో తరగతి వరకు కన్నడం తప్పనిసరి బెంగళూరు : నిర్భంద విద్యా హక్కు చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన ‘ఉచిత, నిర్భంద విద్యా హక్కు (సవరణ)-2015’ బిల్లుకు విధానసభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు తమ మాతృభాషలో లేదా కన్నడ భాషలో విద్యనభ్యసించేందుకు ఈ బిల్లు వెసులుబాటు కల్పించనుంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కన్నడ భాషను తప్పనిసరిగా ఒక భాషగా నేర్చుకునేందుకు గాను రూపొందించిన ‘కన్నడ భాషా శిక్షణ బిల్లు-2015’కు సైతం విధానసభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ ఈ బిల్లును విధానసభలో ప్రవేశపెట్టి, బిల్లులోని ముఖ్యాంశాలను సభకు వివరించారు. ఈ బిల్లులపై సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఈ రెండు బిల్లులకు విధానసభ ఆమోదం తెలిపింది. కాగా, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన చట్టసభల సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా మంత్రులు చెప్పిన సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి... యశస్విని పథకానికి సంబంధించి లబ్దిదారులు చెల్లించాల్సిన వార్షిక కంతును తగ్గించే దిశగా పరిశీలన జరుపుతున్నట్లు రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ విధానపరిషత్‌కు తెలియజేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో పరిషత్ సభ్యుడు మహంతేష్ కవటగి అడిగిన ప్రశ్నకు మహదేవ ప్రసాద్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం సాధారణ వర్గానికి చెందిన లబ్దిదారులు రూ.710, ఎస్సీ-ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ.510ని వార్షిక కంతుగా చెల్లిస్తున్నారని ఈ మొత్తాన్ని మరింత తగ్గించే దిశగా ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. మార్కెట్లో టొమాటో ధర పతనమైన సందర్భాల్లో రైతులను ఆదుకునేందుకు గాను కనీస మద్దతు ధర చెల్లించి టొమాటోను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ విధానపరిషత్‌లో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పరిషత్ సభ్యుడు రామచంద్ర గౌడ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేసవి డిమాండ్ దృష్ట్యా కర్బుజాలను రసాయన ఇంజక్షన్లు ఇస్తున్నారన్న ఆరోపణలు రుజువు కాలేదని రాష్ట్ర మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో కోటా శ్రీనివాస పూజారి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్పకు బదులుగా కృష్ణబైరేగౌడ సమాధానమిచ్చారు. తర్బూజాలకు రంగు కల్పించేందుకు గాను రసాయన ఇంజక్షన్లు ఇస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కొన్ని దుకాణాల నుంచి తర్బూజా శాంపిల్లను సేకరించి పూణెలోని ప్రయోగాలయానికి పంపామని చెప్పారు. పరీక్షల అనంతరం కర్బూజాల్లోకి రసాయనాన్ని ఇంజక్ట్ చేసినా అది కేవలం మూడు సెంటీమీటర్ల వరకే వెళుతుంది కాబట్టి ఆరోగ్యంపై దుష్ర్పభావాలు ఉండబోవని తేలిందని చెప్పారు. 2014-15 ఆర్థిక ఏడాదిలో రుణాల రీఫండ్ అధికంగా ఉన్న కారణంగా ప్రస్తుతం రైతులకు రుణాలను మాఫీ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ విధానపరిషత్‌లో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో పరిషత్ సభ్యుడు శివానంద కౌజలగి అడిగిన ప్రశ్నకు మహదేవ ప్రసాద్ సమాధానమిచ్చారు. బీఎంటీసీలో జరిగే అక్రమాల నిరోధంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే దిశగా బీఎంటీసీలో ఈ-టికెట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పరిషత్‌లో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పరిషత్ సభ్యుడు కోటా శ్రీనివాస్ పూజారి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ డిసెంబర్ ఆఖరులోగా బీఎంటీసీలో ఈ-టికెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. -
బడికెళ్లని బాల్యం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: బడి ఈడు పిల్లలు పాఠశాలలకు వెళ్ళకుండా ఎక్కడ ఏపనిలో ఉన్నా వారిని బాలకార్మికులుగా పరిగణించాలని నిర్బంధ విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోంది. ప్రతియేటా జూన్‌లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి, విద్యా పక్షోత్సవాలు, వారోత్సవాల పేరుతో హడావుడి చేస్తుండటం మినహా తల్లిదండ్రులకు ఉపాధి చూపి తద్వారా బాలకార్మికులను పాఠశాలలకు పంపాలనే కనీస బాధ్యతను విస్మరిస్తోంది. జిల్లాలో ఆరు నుంచి 14 ఏళ్ళలోపు వయసు కలిగిన బడిఈడు బాలలు 2,598 మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతున్నారని తెలుస్తోంది. గ్రామాల్లో పనులు లేక ఉపాధిని వెతుక్కుంటూ పేద కుటుంబాలు పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్న కారణంగా వారి పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. మరి కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మరణించడంతో కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి రావడం వల్ల చిన్నారులు బడికివెళ్లలేక పోతున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో విధంగా జిల్లాలో మండలాల వారీగా ఎంఈవోలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సేకరించిన వివరాల ప్రకారం 2,598 మంది బాలలు బడికి దూరంగా మగ్గుతున్నారని తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో పాఠశాలలు తెరిచే సమయానికి జిల్లాలో 2881 మంది బాలలు బడికి దూరంగా ఉన్నట్టు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) లెక్క తేల్చింది. అనంతరం నిర్వహించిన విద్యా పక్షోత్సవాల్లో వారిలో 2362 మందిని పాఠశాలల్లో చేర్పించామని అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు వెయ్యి మంది బాలికలను కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో చేర్పించగా, మిగిలిన వారిని సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించారు. అయితే తాజా లెక్కల ప్రకారం బడి ఈడు పిల్లలు 2,598 మంది ఉన్నారు. వీరిలో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా ఉన్నారు. ఉదాహరణకు అత్యధికంగా బొల్లాపల్లిలో 154 మంది, చిలకలూరిపేటలో 142, రాజుపాలెంలో 134, నరసరావుపేటలో 132 ఉండగా, అత్యల్పంగా మాచర్లలో ఎనిమిది మంది, వట్టిచెరుకూరులో ఆరుగురు, తుళ్ళూరు, గురజాల, వేమూరులో నలుగురేసి చొప్పున ఉన్నారని ఆర్వీఎం లెక్కలు చెబుతున్నాయి. అమ్మానాన్మలతో పాటే కూలిపనులకు.. అమ్మానాన్నలిద్ధరూ కూలిపనులకు వెళతున్నారు. వారితో పాటే నేనూ బేల్దారి పనికి వెళుతున్నా. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే పాఠశాలకు వెళ్ళడం లేదు. చిన్నప్పుడు ఒకటో తరగతి చదివినా ఇంట్లో సరిగా లేక మరలా స్కూల్ మానేశా. ఇప్పుడు మళ్ళీ చదవాలని లేదు. - యు. శ్రీను, గుంటూరు పనికి వెళుతున్నా.. నాన్న ఆటోడ్రైవర్ అమ్మ ఇం ట్లోనే ఉంటుంది. నాన్న ఒక్క డి వల్ల ఇల్లు గడవదని, నేనూ పని కి వెళుతున్నా. తమ్ముడిని చదువుకోమని హాస్టల్‌కు పంపాం. - టి. ప్రదీప్, గుంటూరు