Convention Center
-
కన్వెన్షన్ సెంటర్ విత్ ఫైవ్ స్టార్ హోటల్!
సాక్షి, విశాఖపట్నం: సహజ అందాలతో అలరారే ఉత్తరాంధ్ర పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేందుకు సరికొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎల్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తుండగా.. ప్రపంచ పర్యాటక పటంలో టూరిజం రాజధానిగా భాసిల్లే విధంగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగా సాగరతీరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టార్హోటల్తో కూడిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించింది. రూ.96 కోట్లతో ఎండాడ సమీపంలో 2.33 ఎకరాల విస్తీర్ణంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాలను మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులకు రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా.. టూరిజం ప్రాజెక్టులకు కసరత్తు చేస్తున్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో జరిగిన పర్యాటక ఒప్పందాల్లో సింహభాగం ఇన్వెస్టర్లు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పర్యాటక అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. జీఐఎస్‌లో పర్యాటక రంగానికి సంబంధించి రూ.8,806 కోట్లతో 64 ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు రానున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఎండాడలో.. సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ఇందుకు కీలకంగా ఉన్న పర్యాటక రంగం ఉపాధి అవకాశాలకు, ఆర్థిక వ్యవస్థకు ఇంజన్‌లా వినియోగించుకోవాలని నిర్ణయించింది. అందుకే.. ప్రపంచస్థాయి లగ్జరీ రిసార్టులు, ఫైవ్‌స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే సాగరతీరంలో ఎండాడ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్(డీఎఫ్బీవోటీ) విధానంలో డెవలపర్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించింది. స్టార్ హోటల్‌తో కూడిన భారీ కన్వెన్షన్ సెంటర్ ఎండాడలోని సర్వే నంబర్ 106/1లో 1.78 ఎకరాలు, 106/4లో 0.55 ఎకరాలు మొత్తం 2.33 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రాబోతోంది. మొత్తం రూ.96.64 కోట్ల అంచనా వ్యయంతో పీపీపీ విధానంలో కింద కన్వెన్షన్ సెంటర్, పైన ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించనున్నారు. బిడ్డింగ్ ప్రాసెస్ మొదలు పెట్టిన 36 నెలల్లో పూర్తి చేయాలనే టార్గెట్‌తో ప్రాజెక్టును అప్పగించనున్నారు. 2020–25 టూరిజం పాలసీలో విధానాలను అనుసరిస్తూ.. 33 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా సదరు టెండర్లు దక్కించుకున్న సంస్థే చూసుకోవాలి. వార్షిక రెవెన్యూ షేర్ 8 శాతంగా నిర్ణయించారు. ఈ నెల 22న బిడ్స్ తెరవనున్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే.. విశాఖ పర్యాటకం మరింత వరల్డ్ క్లాస్‌గా మారబోతోంది. విశాఖ తీరానికి ఈ కన్వెన్షన్ సెంటర్ విత్ ఫైవ్‌స్టార్ హోటల్ ప్రాజెక్టు మరో మణిహారం కానుందని పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. -
మరో అద్భుతం ‘యశోభూమి’
ప్రాచీన కట్టడాలు, దర్శనీయ క్షేత్రాలకు నిలయమైన దేశ రాజధాని ఢిల్లీ కీర్తికిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. చూపు తిప్పుకోనివ్వని సుందరమైన, విశాలమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ) యశోభూమి ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పం మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో యశోభూమిని అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించింది. ప్రధాన ఆడిటోరియం, కన్వెన్షన్ హాళ్లు, బాల్రూమ్, మీటింగ్ రూమ్‌లతో యశోభూమి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలువనుంది. ఎనిమిది అంతస్తుల యశోభూమిలో మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్(ఎంఐసీఈ) సదుపాయాలన్నీ ఉన్నాయి. ఐఐసీసీ మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన స్వయంగా ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం ఇస్తారు. విశేషాలివీ.. 1. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు ఏరియా 8.9 లక్షల చదరపు మీటర్లు, బిల్ట్–అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్‌ను 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు. 2. మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్రూమ్, 13 మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి. 3. అన్ని గదుల్లో కలిపి ఏకకాలంలో 11,000 మంది ఆసీనులు కావొచ్చు. 4. 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంది. 5. అందమైన సీలింగ్‌తో ఆకట్టుకుంటున్న బాల్రూమ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా ఉంది. 6. అలాగే 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. 7. మీడియా రూమ్‌లు, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 8. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లున్నాయి. 9. సౌర విద్యుత్ కోసం రూప్‌టాప్ సోలార్ ప్యానళ్లు బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. 10. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరి్టఫికేషన్ పొందింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
APTA: అట్లాంటా వేదికగా సెప్టెంబర్ లో "ఆప్తా" కన్వెన్షన్..!
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) 15 ఏళ్ల జాతీయ కన్వెన్షన్.. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో.. సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు వరకు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొట్టే ఉదయ భాస్కర్, ఏ. బాబి ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు ప్రసంగించారు. ఆప్తా ఏర్పడి 15 ఏళ్ల అయిందని సుమారు పదివేల మంది కి పైగా స్కాలర్ షిప్ లు అందిస్తున్నదని నిర్వాహకులు తెలియజేశారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బు కోలా ఉదయభాస్కర్ కొట్టి, విజయ్ గుడిసె, గోపాల్ గుడిపాటి, అడ్డా బాబి తదితరులు ప్రసంగించారు. ఈ సంవత్సరానికి ఆప్తా కన్వెన్షన్ కు సుమారు 7000 మంది సభ్యులు హాజరవుతారని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కమ్యూనిటీ లీడర్లకు, పాఠశాలలకు, దాతలకు, వ్యాపారవేత్తలకు, ఇతర వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసినట్టు వివరించారు. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ సంస్థ చదువు, సేవే పరమార్థంగా పనిచేస్తుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నట్టుగా వివరించారు. అమెరికాకు వచ్చే వేలాదిమంది విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ సేవలు విద్య ఉపాధి సౌకర్యాలను కూడా కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆప్తా కన్వెన్షన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులందరూ తరలి రావాల్సిందిగా కోరారు. తెలుగు సంఘాలు ఎన్ని ఉంటే అంత మేలు జరుగుతుందని అమెరికాలో ఎవరికీ పోటీ కాదని అందరం కలిసి మెలిసే పని చేస్తామని వారు చెప్పారు. ప్రశ్నించుకుంటాం తప్ప ఒకరికి ఒకరు పోటీ కాదని తెలిపారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి తమ సదస్సు ఉద్దేశాలను వివరిస్తున్నట్టు తెలిపారు. తెలుగు అంటే రెండు రాష్ట్రాలే కాదని ఐదు రాష్ట్రాలకు పైగా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని.. అమెరికాలోని సేవ కార్యక్రమాలను ఈ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నట్టుగా తెలిపారు. సదస్సు కర్తవ్యాన్ని మర్చిపోకుండా సుమారు 500 మంది వాలంటీర్లు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. (చదవండి: పెన్సిల్వేనియాలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు) -
ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ
సాక్షి, తూర్పుగోదావరి: గత ఏడాది వ్యవధిలో 77 వేల కేసులు తగ్గించామని, రాష్ట్రంలో పోలీసు శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన రాజమండ్రిలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళా పోలీసులతో చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ‘‘శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని అని, ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతామని డీజీపీ ప్రశ్నించారు. నిర్దేశించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించాం. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: ఏపీ సర్కార్‌పై ఐరాస శాశ్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ బృందం ప్రశంసలు -
రాజధానిలో చదరపు మీటర్‌కు లీజు రూపాయే!
సాక్షి, అమరావతి: రాజధానిలో రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల జోన్లలో కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా మెగా కన్వెన్షన్ కేంద్రాలు, స్టార్ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, వినోద (ఎంటర్టైన్మెంట్) సముదాయాల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటివరకు శాశ్వత సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క ఇటుక కూడా వేయని చంద్రబాబు సర్కారు ధనిక వర్గాలకు అవసరమైన లగ్జరీ నిర్మాణాలకు మాత్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రాజధానిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం డెవలపర్‌కు లీజు కింద అత్యంత చౌకగా భూమిని కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి దశలో 20 ఎకరాలను లీజుకివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకుగాను చదరపు మీటరుకు ఏడాదికి రూపాయి చొప్పున లీజును నిర్ణయించింది. అంతేకాదు.. తర్వాత రెండో దశలో మరో 22 ఎకరాలను కట్టబెట్టేందుకు కూడా సమాయత్తమైంది. భారీ రాయితీలు.. మెగా కన్వెన్షన్ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం గతంలోనే దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో టెండర్ ప్రక్రియను కేవలం సింగిల్ స్టేజ్‌లో పూర్తి చేయడంతోపాటు భారీ రాయితీతో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల సమీపంలో మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెవలపర్‌కు 20 ఎకరాలను తొలిదశలో కేటాయించాలని నిర్ణయించింది. ఆ మేరకు 20 ఎకరాలను తొలుత 33 ఏళ్లపాటు లీజుకిస్తుంది. ఇందుకోసం ఏడాదికి చదరపు మీటరుకు కేవలం రూపాయి చొప్పున లీజు చెల్లిస్తే చాలు. ఆ తరువాత మరో 33 ఏళ్లపాటు లీజు పొడిగిస్తారు. ఇందుకోసం డెవలపర్ స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. లీజుపై ఇస్తున్నప్పటికీ ఫ్రీ హోల్డ్ (లీజుదారుకే సర్వహక్కులు) హక్కులను డెవలపర్‌కు కల్పిస్తారు. పీపీపీ విధానంలో డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. రాజధానిలో 20 ఎకరాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్‌తోపాటు ఎగ్జిబిషన్ సెంటర్, 5 స్టార్ హోటల్‌తోపాటు రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. తొలిదశలో కేటాయించే 20 ఎకరాల్లో కట్టే మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి రూ.535 కోట్ల వ్యయమవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. ఇందులో కనీసం రెండు లక్షల చదరపు అడుగుల్లో వాణిజ్య నిర్మాణాలు వస్తాయని, దీని ద్వారా డెవలపర్‌కు వచ్చే ఆదాయంలో రెండు శాతం సీఆర్డీఏకు ఇవ్వాలని నిబంధన విధించారు. డెవలపర్ ఒప్పందం చేసుకున్న 24 నెలల్లోగా తొలి దశ మెగా కన్వెన్షన్ కేంద్రం పనులను పూర్తి చేయాల్సి ఉంటుందని సీఆర్డీఏ పేర్కొంది. రెండో దశలో మరో 22 ఎకరాలు... రెండో దశలో ఇదే డెవలపర్‌కు మరో 22 ఎకరాలను ఫ్రీ హోల్డ్ (లీజుదారుకే సర్వహక్కులు) విధానంలో ఇస్తారు. ఈ 22 ఎకరాల్లో రిటైల్, వాణిజ్యం, ఎంటర్టైన్మెంట్ రెసిడెన్షియల్‌తోపాటు 3 స్టార్ హోటల్ నిర్మాణాలను డెవలపర్ చేపట్టనున్నారు. ఇందులో తొలిదశలో పది ఎకరాల్లో చేపట్టే నిర్మాణ ప్రాంతంలో పది శాతం నిర్మాణ ప్రాంతాన్ని, రెండో దశలో ఐదు ఎకరాల్లో చేపట్టే నిర్మాణ ప్రాంతంలో 20 శాతం నిర్మాణ ప్రాంతాన్ని, మూడో దశలో ఐదు ఎకరాల్లో చేపట్టే నిర్మాణ ప్రాంతంలో 10 శాతం నిర్మాణ ప్రాంతాన్ని సీఆర్డీఏకు తిరిగి ఇచ్చేయాలనే నిబంధన విధించారు. మిగతా నిర్మాణ ప్రాంతం అంతా డెవలపర్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఈ విధానం వల్ల సీఆర్డీఏకు ఎటువంటి ఆర్థిక భారం పడదని, పైగా తొలిదశలోని 20 ఎకరాల్లో నిర్మాణాల ద్వారా డెవలపర్‌కు వచ్చే ఆదాయంలో రెండు శాతం సీఆర్డీఏకు వస్తుందంటూ తాజా నిర్ణయాన్ని సమర్థించుకోవడం గమనార్హం. ఎకరానికి ఏడాదికి లీజు రూ.4046 మాత్రమే! తొలి దశలో కేటాయించే 20 ఎకరాల్ని చదరపు మీటరుకు ఏడాదికి రూపాయి లీజు చొప్పున కేటాయిస్తారు. ఒక ఎకరానికి 4,046 చదరపు మీటర్లు. ఆ ప్రకారం.. ఎకరానికి ఏడాదికి కేవలం రూ.4,046 లీజు అవుతుంది. సీఆర్డీఏ పెట్టుబడి లేనందున చౌకగా భూమిని కేటాయించనున్నట్లు అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం. భూమి ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పిస్తున్నందున డెవలపర్ ఇదే భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునే వీలుంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కఠిన నిర్ణయాలుంటాయ్!
న్యూఢిల్లీ: జాతీయ ప్రయోజనాల రీత్యా కఠిన నిర్ణయాలు కొనసాగుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2022 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపై 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో తయారీ, వ్యవసాయ రంగాల వాటా చెరో ట్రిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మోదీ గురువారం ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ)కు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. ఈ సెంటర్ భవిష్యత్‌లో పరిశ్రమలు, స్టార్టప్‌లకు కేంద్రంగా నిలుస్తుందని, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, రిటైల్ రంగాల్లో ఉద్యోగ కల్పన శరవేగంగా పెరుగుతున్న దృష్ట్యా వృద్ధిరేటు 8 శాతం దాటుతుందని పేర్కొన్నారు. దేశ సూక్ష్మ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. మేకిన్ ఇండియా, జీఎస్టీ తదితర సంస్కరణలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు అవసరమా?.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోందని మోదీ అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, భవిష్యత్తులోనూ అలాంటి చర్యలు కొనసాగుతాయన్నారు. మన ఆర్థిక వ్యవస్థ దశాబ్ద కాలంలో 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీనాన్ని ప్రస్తావిస్తూ..డజన్ల కొద్దీ ప్రభుత్వ బ్యాంకుల అవసరం ఏముందని ప్రశ్నించారు. బ్యాంకుల విలీనంపై చాలా ఏళ్లుగా చర్చ నడుస్తున్నా తమ ప్రభుత్వ హయాంలోనే ఈ దిశగా ముందడుగు పడిందని తెలిపారు. మేకిన్ ఇండియా పథకంతో భారత్ మొబైల్ పరిశ్రమకు కేంద్రంగా మారిందని, 4–5 లక్షల మంది యువతకు ఉపాధి దొరకడంతో పాటు రూ.3 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక నిల్వలు ఆదా అయ్యాయని తెలిపారు. సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహించడానికి జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 221.37 ఎకరాల విస్తీర్ణంలో ఐఐసీసీని రూ.25,703 కోట్లతో నిర్మించనున్నారు. 11 వేల మంది కూర్చునే సామర్థ్యం గల కన్వెన్షన్, ఎగ్జిబిషన్, స్టార్ హోటళ్లు తదితర వాణిజ్య కేంద్రాలకు ఇందులో చోటు కల్పించనున్నారు. మోదీని కలసిన ఆశా కార్యకర్తలు.. దేశం నలుమూలల నుంచి వచ్చిన 90 మంది ఆశా కార్యకర్తలతో మోదీ ముచ్చటించారు. తమ గౌరవ వేతనాలు పెంచడంతో పాటు ఉచిత బీమా సదుపాయం కల్పించినందుకు వారు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను జరిపిన సంభాషణను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆశా కార్యకర్తల సేవలు, అంకితభావాన్ని కొనియాడిన మోదీ..కాలా అజార్ వ్యాధి నిర్మూలనకు వారు చేసిన కృషిని బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రశంసించిందని అన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఇతర ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించారు. మెట్రోలో మోదీ.. కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఢిల్లీలోని ధౌలాకువాన్ నుంచి ద్వారకా వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణం సుమారు 18 నిమిషాలు సాగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రయాణికులు మోదీతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. కార్యక్రమం ముగిసిన తరువాత మోదీ మళ్లీ మెట్రో రైలులోనే తిరుగు ప్రయాణమయ్యారు. ప్రముఖుల రాకపోకలతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మోదీ తరచూ మెట్రోరైలు సేవలను వినియోగించుకుంటున్నారు. -
‘సాక్షి’ ప్రాపర్టీ షో ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహానగరంలో సొంతింటి ఎంపిక అంత సులువేమీ కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉండాలి. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకోవాలంటే కొనుగోలుదారులు చెమటోడ్చాల్సిందే! కానీ కొనుగోలుదారులు ఒకే వేదికపై ఇవన్నీ పొందటానికి ‘సాక్షి ప్రాపర్టీ షో’ ఆరంభమైంది. శనివారం మాదాపూర్ హైటెక్స్ దగ్గర్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మెగా ప్రదర్శన మొదలైంది. ఉదయం 10 గంటలకు ప్రాపర్టీ షో ప్రారంభమైనప్పటికీ.. మధ్యాహ్నం ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా సందర్శకులతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. నగరానికి చెందిన 32 నిర్మాణ సంస్థలు, 70కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌ల వివరాలను సందర్శకులకు వివరించాయి. ఆదివారం రాత్రి వరకూ ఈ షో కొనసాగనుంది. ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ, ‘‘గతంలో హెచ్ఎండీఏ పరిధిలో నెలకు 20 లేఅవుట్ల వరకూ అనుమతులిచ్చే వాళ్లం. ఇప్పుడవి 100 దాటేస్తున్నాయి. హైదరాబాద్‌లో రియల్ బూమ్ మొదలైందనడానికి ఇదో ఉదాహరణ’’అని అన్నారు. గతేడాదితో పోలిస్తే దేశం లోని ఇతర నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైల్లో ధరలు పడిపోతుంటే నగరంలో మాత్రం 34% వృద్ధి నమోదైందన్నారు. నగరంలో మెట్రో, ఓఆర్‌ఆర్‌లకు తోడు ఎస్ఆర్డీపీ, ఫ్లైఓవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. క్రెడాయ్ జనరల్ సెక్రటరీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ల్యాండ్, కార్మికులు, సిమెం ట్, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయ ని, దీంతో స్థిరాస్తి ధరలు కూడా 20–40% వరకూ పెరిగాయన్నారు. ఇంకా రేట్లు తగ్గుతాయని చూడటం సరికాదని, ప్రాపర్టీ ఎంపికకు సరైన సమయమిదేనని అన్నారు. కార్యక్రమంలో సాక్షి అడ్వరై్టజ్‌మెంట్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి, జీఎం కె.రమణకుమార్ పాల్గొన్నారు. సరైన సమయంలో ప్రాపర్టీ షో ప్రభుత్వ సానుకూల నిర్ణయాలతో నగరంలో రియల్ బూమ్ మొదలైందని, ఈ సమయంలో ఒకే చోట నగరంలోని అన్ని రకాల ప్రాపర్టీలను ప్రదర్శించడం సరైన నిర్ణయమని ‘సాక్షి’ప్రాపర్టీ షో ప్రధాన స్పాన్సర్ అపర్ణా కన్స్ట్రక్షన్స్, రాంకీ గ్రూప్ అభినందించాయి. అపర్ణా కన్స్ట్రక్షన్స్ బ్రాండ్ ప్రమోషన్ మేనేజర్ శ్రీనివాస్ దివాకర్ల మాట్లాడుతూ.. ప్రధాన నగరంతోపాటు శివారుల్లోనూ రియల్ వ్యాపారం జోరందుకుందని.. అందుకే ఎంపిక చేసిన ప్రాంతాల్లో అపర్ణా ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోందని తెలిపారు. రాంకీ ప్రతినిధి ఎస్.శరత్‌బాబు మాట్లాడుతూ.. రెండేళ్లుగా నగరంలో ఆఫీసు, కమర్షియల్ లావాదేవీలు పెరిగాయని, దీంతో వచ్చే రెండేళ్లూ నివాస సముదాయాలకు డిమాండ్ పెరగడం ఖాయమన్నారు. -
ఆ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయడం సిగ్గుచేటు
-
కన్వెన్షన్ సెంటర్ గా ‘కళాభారతి’
♦ సాంస్కృతిక కార్యక్రమాలు ♦ సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఉండాలి ♦ అధికారులకు సీఎం ఆదేశం ♦ ముఖ్యమంత్రి, సీఎస్, స్పీకర్, మండలి చైర్మన్లకు కొత్త నివాసాలు ♦ ఐఏఎస్ అధికారులకు అధునాతన క్వార్టర్ల నిర్మాణం ♦ డిజైన్ల ఖరారుకు సీఎస్ సారథ్యంలో ఆరుగురితో కమిటీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారిన హైదరాబాద్‌లో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ప్రతిరోజు ఎన్నో సమావేశాలు జరుగుతున్నాయని, అందుకు తగ్గట్లుగా హెచ్ఐసీసీ తరహాలో మరో పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో కళాభారతి కల్చరల్ సెంటర్‌ను నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సభలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు అనుగుణంగా ఈ కళాభారతి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కళాభారతిని కన్వెన్షన్ సెంటర్ కమ్ కల్చరల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలన్నారు. వరుసగా జరుగుతున్న బడ్జెట్ సమీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆర్అండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టనున్న పలు కొత్త నిర్మాణాల అంశం చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు అధికారిక నివాసాలు నిర్మించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు కూడా అధునాతన క్వార్టర్లు కట్టాలని అధికారులకు చెప్పారు. ఈ నిర్మాణాలకు స్థలం, డిజైన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ప్రకటించారు. సీఎస్‌తోపాటు ఆర్అండ్బీ కార్యదర్శి, సీఎంవో ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఐఅండ్‌పీఆర్ కార్యదర్శి, ఆర్‌అండ్‌బీకి చెందిన ఇద్దరు ఈఎన్సీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సీఎం కొత్త అధికారిక నివాసం నిర్మాణానికి సంబంధించి గ తేడాది నుంచి ఆర్అండ్బీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న సీఎం నివాసం వెనుక ఉన్న పాత ఐఏఎస్ క్వార్టర్లను కూల్చివేసి, అదే స్థలంలో కొత్త నివాసం నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. -
అమాత్యులే అతిథులు
మంత్రుల నివాసాలుగా అతిథిగృహాలు సబ్‌కలెక్టర్ కార్యాలయం, బరంపార్కులో సమావేశ మందిరాలు ఇప్పటికే పరిశీలించిన మంత్రులు అధికారుల కోసం అద్దె భవనాలు అన్వేషణ ఇక ప్రభుత్వ భవనాల్లోనే సమావేశాలు ఇన్నాళ్లూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లలో నిర్వహించిన ప్రభుత్వ అధికారిక సమావేశాలకు బ్రేక్ పడనుంది. ఇకపై ప్రభుత్వ భవనాలైన సబ్‌కలెక్టర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోని ఒకటి రెండు అంతస్తులు, బరంపార్కులోని స్థలాలను సమావేశాలకు వినియోగిస్తారు. వివిధ శాఖలకు చెందిన కార్యాలయంలోని మీటింగ్ హాళ్లనే ఆయా మంత్రులు వినియోగించుకుంటారు. విజయవాడ : కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అతిథి గృహాలు అమాత్యుల నివాసాలుగా మారనున్నాయి. కొంతమంది మంత్రులు ఇప్పటికే తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు నివసించేందుకు మాత్రం అనువైన భవనాలు దొరకలేదు. ఈ నేపథ్యంలో అతిథిగృహాల(గెస్ట్‌హౌస్)కు కొద్దిపాటి మరమ్మతులు చేసి మంత్రులకు నివాసాలుగా కేటాయించాలని నిర్ణయించి నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ప్రకటించారు. బరంపార్కును పరిశీలించిన మంత్రులు మున్సిపల్‌మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్దిరోజులుగా మంత్రులకు అవసరమైన నివాసాల కోసం అన్వేషణ సాగిస్తున్న విషయం విదితమే. వారు ఇటీవీల విడివిడిగా బరంపార్కులోని రూమ్‌లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అతిథిగృహాల సమచారం తెప్పించుకుని పరిశీలించారు. ఆర్అండ్బీ అతిథి గృహాన్ని మంత్రుల నివాసాలకు తగినట్లుగా మరమ్మతులు చేపట్టారు. మిగిలిన అతిథిగృహాలను కూడా సాధ్యమైనంత త్వరలో అమాత్యుల నివాసాలుగా మార్చనున్నారు. అధికారుల కోసం ప్రయివేటు భవనాలు ప్రభుత్వ కార్యాలయాలకు, కార్యదర్శి హోదా అధికారులకు అద్దె భవనాలు ఇవ్వనున్నారు. నగరంలో ఆకర్షణీయంగా, అందంగా ఉన్న ఇళ్ల కోసం ఇప్పటికే అధికారులు గాలిస్తున్నారు. భవనాలను అద్దెకు ఇచ్చే ఆలోచన ఉన్న వారు సబ్ కలెక్టర్ నాగలక్ష్మిని సంప్రదిస్తే అద్దె గురించి చర్చిస్తారు. ప్రభుత్యోగులకు హడ్కో ఇళ్లు హైదరాబాద్ నుంచి తరలి వచ్చే ఉద్యోగుల కోసం హడ్కో 10 వేల ఇళ్లను రాజధాని ప్రాంతంలో నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ ఇళ్లు తీసుకున్న ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్‌ను నేరుగా ఆ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. హడ్కో నిర్ణయించిన వార్షిక లీజుకు, ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్సుకు ఏదైనా వ్యత్యాసం ఉంటే, దాన్ని ప్రభుత్వం భరిస్తుంది. రెండు మూడు నెలలల్లో ప్రభుత్యోగులందరినీ విజయవాడ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తుచేస్తోంది. ఇందుకోసం ఒక అధికార కమిటీ కూడా వేస్తోంది. ఉద్యోగులను ఒప్పించి ఇక్కడకు తీసుకువచ్చే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తుంది.