ఢిల్లీ ఐఐటీలో స్కూల్ ఆఫ్ డిజైన్!
న్యూఢిల్లీ: సృజనాత్మకత కలిగిన విద్యార్థుల కోసం ఢిల్లీ ఐఐటీలో త్వరలోనే స్కూల్ ఆఫ్ డిజైన్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఐఐటీ సెనేట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ దీనిపై చర్చించే అవకాశం ఉంది. స్కూల్ ఆఫ్ డిజైన్‌లో నాలుగేళ్ల బీడీఈఎస్ (బ్యాచిలర్ ఆఫ్ డిజైన్), రెండేళ్ల ఎండీఈఎస్ (మాస్టర్ ఆఫ్ డిజైన్) కోర్సులు అందుబాటులో ఉండనున్నాయి.
బీడీఈఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం దేశంలో ఇప్పటికే ప్రత్యేకంగా ఓ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుండగా, స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఉండే సీట్లనూ ఇదే పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.