cut off dates
-
ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?
లిక్విడ్ ఫండ్‌లో ఉన్న నా పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించినట్టయితే, అదే రోజు ఎన్ఏవీ వర్తిస్తుందా? – అజయ్ కుమార్ఏ తరహా మ్యూచువల్ ఫండ్(Mutual Funds)లో పెట్టుబడులు ఉన్నాయి..ఏ సమయంలో అభ్యర్థన (కొనుగోలు/విక్రయం) పంపించారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు లిక్విడ్ ఫండ్ పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించేందుకు ఆర్డర్ చేశారని అనుకుందాం. లిక్విడ్ ఫండ్స్‌కు కటాఫ్ సమయం మధ్యాహ్నం 3 గంటలు. మీ అభ్యర్థన ఈ సమయానికి ముందే చేశారు కనుక, విక్రయించిన యూనిట్లకు శుక్రవారం నాటి ఎన్ఏవీ వర్తిస్తుంది. ఇలా విక్రయించిన పెట్టుబడులు బ్యాంక్ అకౌంట్(Bank Account)లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? అన్నది తెలుసుకుందాం. ఈ విషయంలోనూ ఏ ఫండ్‌లో పెట్టుబడులు విక్రయించారన్నది కీలకం అవుతుంది. లిక్విడ్ ఫండ్, ఓవర్‌నైట్ ఫండ్‌లో పెట్టుబడులను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు ఒక పనిదినం పడుతుంది. ఇతర డెట్ ఫండ్స్ అయితే, రెండు రోజుల సమయం తీసుకుంటుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు వెనక్కి వచ్చేందుకు మూడు పనిదినాలు పడుతుంది. టీప్లస్ రూపంలో ఈ విషయాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు తెలియజేస్తాయి.ఉదాహరణకు సోమవారం నాడు ఈక్విటీ ఫండ్స్(Equity Funds)లో పెట్టుబడులు విక్రయించారని అనుకుంటే, ఈ మొత్తం గురువారం నాడు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. రియలైజింగ్ మనీ అంటే.. ఇన్వెస్టర్ కొనుగోలు ఆర్డర్‌కు సంబంధించిన మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థ (AMC) అందుకోవడం. బ్యాంక్ నుంచి పంపించారనుకుంటే ఆ మొత్తం ఏఎంసీ చేరేందుకు కొన్ని గంటలు లేదా రోజు సమయం తీసుకోవచ్చు. కొనుగోలు ఏ రోజు చేశారన్న దానితో సంబంధం లేకుండా, ఏఎంసీకి ఆ మొత్తం అందిన రోజు ఎన్ఏవీనే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడులను కటాఫ్ సమయం 3 గంటలు దాటిన తర్వాత విక్రయించారని అనుకుంటే, అప్పుడు తర్వాతి రోజు ఎన్ఏవీ పెట్టుబడులకు వర్తిస్తుంది. ఎందుకంటే తర్వాతి రోజునే ఫండ్స్ సంస్థలు ఆ మేరకు విక్రయాలు చేస్తాయి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..నాకు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడులు ఉన్నాయి. వాటిని ఇటీవలే విక్రయించి అదే పథకం డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేశాను. కనుక లాభాలపై నేను పన్ను చెల్లించాలా? లేక భవిష్యత్తులో పెట్టుబడులు విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తుందా? – రాజన్ పీ.ఏఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్ నుంచి మరో ప్లాన్‌లోకి మారినప్పుడు, అది రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్ అయినా సరే దాన్ని పెట్టుబడి ఉపసంహరణగానే చూస్తారు. ఆదాయపన్ను చట్టం కింద పెట్టుబడుల విక్రయమే అవుతుంది. దీనర్థం.. మూలధన లాభాలపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మరో ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, భవిష్యత్తులో విక్రయించినట్టయితే.. హోల్డింగ్ పీరియడ్ (ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారు), వచ్చిన మూలధన లాభాల ఆధారంగా తిరిగి అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడి నుంచి విక్రయం మధ్య కాలానికి పన్ను వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వాల్యూ రీసెర్చ్ -
కట్ ఆఫ్ డేట్ మార్చండి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గడచిన పదేళ్ల కాలంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తేదీని కట్ ఆఫ్ డేట్‌గా మారిస్తే వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేÔశాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళుతున్నారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి మృతదేహాలు తీసుకురావడానికి కూడా వారి కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొన్నాయి. అప్పు చేసి గల్ఫ్ వెళ్లిన వ్యక్తి చనిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబభారం మోయలేక కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి కట్ ఆఫ్ డేట్‌ను మార్చాలని పలువురు కోరుతున్నారు. ఎడారి దేశాల్లో తెలం‘గానం’గల్ఫ్ దేశాల్లో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమానికి జైకొట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్ఫ్‌లో బతుకుదెరువుకు వెళ్లి రకరకాల కారణాలతో ఇబ్బందులు పడిన వారికి ప్రభుత్వం సాయం అందించాలనే డిమాండ్ ఉంది. అందుకోసం అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేరళ పాలసీని అమలు చేస్తామని ప్రకటించినా, ఆచరణకు నోచుకోలేదు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందించేందుకు విధివిధానాలను ఇటీవల వెల్లడించింది. అయితే కట్ ఆఫ్ డేట్ తో చాలా కుటుంబాలకు నిరాశే ఎదురైంది. గడచిన పది నెలల కాలంలో తెలంగాణకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో దాదాపు 160 మంది చనిపోయినట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.విధివిధానాలు ఇలా...ప్రభుత్వం ఈ నెల 7న జారీ చేసిన జీవో 216 ప్రకారం.. చనిపోయిన వ్యక్తి తాలూకు భార్య, పిల్ల లు లేదా తల్లిదండ్రులు మృతుడి డెత్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు క్యాన్సల్ రిపోర్టు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలతో నేరుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకో వాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తు, సరి్టఫికెట్లను పరిశీలించిన తర్వాత ఆర్థిక సాయం మంజూరవుతుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఓమన్, కత్తర్, సౌదీ అరేబీయా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు వెళ్లి చనిపోయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 తర్వాత చనిపోయిన వారు మాత్రమే అర్హులని ఆ జీఓలో స్పష్టంగా పేర్కొన్నారు. -
ఓటరు నమోదుకు ఏడాదిలో 4 కటాఫ్ తేదీలు
న్యూఢిల్లీ: కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల చట్టంలో సవరణలు చేయనుంది. దీనివల్ల దేశంలో జరిగే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగపడే ఉమ్మడి ఓటరు జాబితా రూపకల్పనకు వీలవుతుంది. యువజన ఓటర్లు మరింత మందిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి కూడా ఈ ప్రయత్నం తోడ్పడుతుందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుతం జనవరి ఒకటో తేదీన, అంతకంటే ముందు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఆ ఏడాది తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఆ ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే, జనవరి 2 జన్మించినా వారు మళ్లీ ఏడాదిదాకా ఆగాల్సిందే. అందుకే, ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను జత చేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14(బి)ని సవరించాలని యోచిస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. సంవత్సరంలో.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లను కటాఫ్ తేదీలుగా మార్చే ప్రతిపాదనలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని కేంద్రం తెలిపింది. -
అధికారుల సిఫారసు ఏడాదికే!
రైతు రుణ మాఫీకి మూడు కటాఫ్ తేదీలు.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆర్థికశాఖ వర్గాలు అన్నింట్లోనూ ఏడాది కాలపరిమితితోనే తెలంగాణ సర్కారుకు నివేదిక సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల మాఫీపై రాష్ర్ట ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో పరిమితుల విధింపు ప్రకటనలు వివాదాస్పదమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై రైతాంగంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు రూపొందిస్తున్న నివేదికలు మళ్లీ సందేహాలకు తావిస్తున్నాయి. బ్యాంకర్లు అందించిన సమాచారం ఆధారంగా మూడు అప్షన్లతో కూడిన కటాఫ్ తేదీలతో ఆర్థిక శాఖ వర్గాలు తాజాగా నివేదిక రూపొందించాయి. దీన్ని బట్టి చూస్తే ఎటుతిరిగి ఏడాది కాలపరిమితి విధిస్తూ.. ఆలోగా తీసుకున్న బంగారం రుణాల మాఫీకే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం. అందులోనే 2013-14లో నవీకరించుకున్న రుణాలు, పాత బకాయిలు కూడా కలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు ఆప్షన్లలో ఏదో ఒక కటాఫ్‌ను ప్రభుత్వం నిర్ధారించాల్సి ఉంది. రైతులు తీసుకున్న పంట రుణాలతోపాటు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలను కూడా రద్దు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే అధికారులు కూడా జాబితా సిద్ధం చేశారు. పంట రుణాలు, బంగారం తాకట్టు రుణాలు, లక్ష రూపాయల్లోపు పాత రుణాలు, అంతకు మించిన రుణాలవారీగా వివరాలను క్రోఢీకరించి నివేదిక రూపొందించారు. వడ్డీతో కలిపి లక్ష వరకు రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తామని.. అంతకుమించి రుణమొత్తం ఉంటే రూ. లక్షపోగా మిగిలినది మొత్తాన్ని సంబంధిత రైతులే చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా, తాజాగా అధికారులు తేల్చిన లెక్కల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2014 మార్చి 31 వరకు రూ. 17,756.88 కోట్ల పంట రుణాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 15,809.61 కోట్ల రుణాల మాఫీకి అర్హత ఉందని పేర్కొన్నారు. ఇక 2013 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ వరకు తీసుకున్న రుణాలు రూ.18,509.48 కోట్లుగా తేలింది. ఇందులో మాఫీకి అర్హమైన రుణాలు రూ.16,417.19 కోట్లుగా అధికారులు తేల్చారు. అలాగే గతేడాది జూన్ ఒకటి నుంచి ఈ సంవత్సరం మే 31 వరకు చూసుకుంటే మొత్తం బకాయిలు రూ.17,783 కోట్లు కాగా.. రూ. 15,628.31 కోట్లు మాఫీ చేయడానికి అర్హమైనవిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.