Cuttack ODI
-
కటక్ వన్డేలో ఫ్లడ్ లైట్ల సమస్య.. బీసీసీఐపై ఎదురుదాడికి దిగిన పాక్ అభిమానులు
భారత్, ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫ్లడ్ లైట్లు మొరాయించిన విషయం తెలిసిందే. ఛేదనలో భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లడ్ లైట్ ఆగిపోయాయి. ఊహించని ఈ పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్లు విస్మయానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్లు ఆటగాళ్లను మైదానాన్ని వీడాల్సిందిగా కోరారు. ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. మైదాన సిబ్బంది వెంటనే స్పందించడంతో ఫ్లడ్ లైట్లు మళ్లీ ఆన్ అయ్యాయి. తదనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగింది.కాగా, ఈ ఉదంతం జరగడానికి ఒక్క రోజు ముందు ఇదే ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్ మూడో బంతిని కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. అయితే రచిన్ బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతని నుదిటిపై తాకింది. బంతి బలంగా తాకడంతో రచిన్‌కు తీవ్ర రక్తస్రావమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన రచిన్‌ను వెంటనే అస్పత్రికి తరలించారు.ఫ్లడ్ లైట్ల కారణంగా రచిన్‌కు తీవ్రమైన గాయమైన నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు పాక్ క్రికెట్ బోర్డును ఏకి పారేశారు. చెత్త లైటింగ్ కారణంగా ఈ ఘోరం జరిగిందని దుయ్యబట్టారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేది పెట్టుకుని ఇంత నాసిరకమైన ఏర్పాట్లు ఏంటని మండిపడ్డారు. ఇలాంటి మైదానానికి ఓకే చెప్పినందుకు ముందుగా ఐసీసీని నిందించాలని అంన్నారు. తక్షణమే గడాఫీ స్టేడియానికి మరమ్మత్తులు చేయాలని సూచించారు. లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను పాక్ నుంచి దుబాయ్‌కు మార్చాలని కోరారు.భారత అభిమానుల ఘాటైన విమర్శల అనంతరం కటక్ ఉదంతాన్ని బూచిగా చూపెడుతూ పాక్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు ఎక్కు పెట్టారు. బీసీసీఐకు ఫ్లడ్ లైట్లు అవసరమైతే పాక్ క్రికెట్ బోర్డు సరఫరా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మమ్మల్ని నిందించే ముందు మీ విషయాన్ని సరి చూసుకోండని హితవు పలుకుతున్నారు. రచిన్ ఉదంతంపై భారత అభిమానులు స్పందించినందుకు బీసీసీఐపై ఎదురుదాడికి దిగుతున్నారు. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: జడేజా
కటక్: వెస్టిండీస్‌తో చివరి వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కొన్నాళ్ల క్రితం వరకు జడేజా టెస్టులకే పరిమితమయ్యాడు. అయితే పునరాగమనంలో లభించిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అతను ఇప్పుడు వన్డేల్లోనూ ప్రధాన ఆటగాడిగా మారాడు. మూడో వన్డేలో జడేజా 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. కటక్ ప్రదర్శనపై అతను మాట్లాడుతూ... ‘నేనేమిటో ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏం ఆడగలనో నాకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ సత్తా చాటగలనని ఈ మ్యాచ్‌తో చూపించాను. ఈ ఏడాది నేను ఎక్కువగా వన్డేలు ఆడలేదు. అయితే కీలక దశలో సిరీస్ విజయానికి అవసరమైన రీతిలో నా అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించాను’ అని వ్యాఖ్యానించాడు. టీమిండియా ఈ ఏడాది 28 వన్డేలు ఆడగా అందులో 15 మ్యాచ్‌లలో జడేజా ఉన్నాడు. మరోవైపు జడేజా ప్రదర్శన పట్ల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. జడేజా బ్యాటింగ్ ఎంతో మెరుగుపడటం సానుకూలాంశమని అతను అన్నాడు. -
విజయంతో వీడ్కోలు చెబుతారా!
భారత జట్టు ఈ ఏడాది 27 వన్డేలు ఆడితే 18 గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌లలో ఓడగా, మరొకటి రద్దయింది. ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ వరకు చేరిన టీమిండియా... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను వారి సొంతగడ్డపైనే ఓడించి మూడు సిరీస్ విజయాలు సాధించింది. అయితే స్వదేశంలో మాత్రం ఆసీస్ చేతిలో సిరీస్ చేజార్చుకున్న మన టీమ్ ఇప్పుడు ఏడాది చివరి సిరీస్ చివరి మ్యాచ్ పోరుకు సన్నద్ధమైంది. గత మ్యాచ్ తరహాలోనే వెస్టిండీస్‌ను చిత్తు చేసి 2019ని ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది. ఐదేళ్ల తర్వాత ఇటీవలే అఫ్గానిస్తాన్‌పై తొలి ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన విండీస్ కూడా మరో గెలుపుతో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కటక్: భారత్, వెస్టిండీస్ పోరు చివరి ఘట్టానికి చేరింది. టి20 సిరీస్‌ను భారత్ గెలుచుకున్న అనంతరం జరిగిన రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరొకటి నెగ్గి సమ ఉజ్జీగా నిలిచాయి. ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో నేడు భారత్, విండీస్ తలపడనున్నాయి. బలాబలాలపరంగా ఇప్పటికీ భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... ఈ పర్యటనలో ప్రత్యర్థి ఆటను చూస్తే వారిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. కోహ్లి సేన తమ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్‌ను ఖాతాలో వేసుకుంటుందా అనేది ఆసక్తికరం. బౌలింగ్‌లో సమస్య! గాయం కారణంగా దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన నవదీప్ సైనీ ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ఒత్తిడితో నిండిన చివరి పోరులో అతడికి అవకాశం ఇస్తే ఏమాత్రం ప్రభావం చూపగలడనేది కీలకం. మరో పేసర్ శార్దుల్ కూడా అంతంత మాత్రంగానే బౌలింగ్ చేస్తున్నాడు. దాంతో సీనియర్ షమీపై భారం మరింత పెరిగింది. వైజాగ్ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ మరోసారి కీలకం కానున్నాడు. అయితే భారత్ అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగుతుందా చూడాలి. అదే జరిగితే శార్దుల్ స్థానంలో చహల్‌కు అవకాశం దక్కవచ్చు. కోహ్లిలాంటి స్టార్ ‘సున్నా’ చుట్టిన తర్వాత కూడా జట్టు 387 పరుగులు సాధించిందంటే టీమిండియా బ్యాటింగ్ సామర్థ్యం ఏమిటో అంచనా వేయవచ్చు. ఓపెనర్లు రోహిత్, రాహుల్ తిరుగులేని బ్యాటింగ్ మరోసారి భారత్‌కు శుభారంభం అందిస్తే ప్రత్యరి్థకి కష్టాలు తప్పవు. రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు బంతులు ఎదుర్కొని కోహ్లి నాలుగు పరుగులు మాత్రమే చేయడం ఆశ్చర్యకరం! అయితే అతని స్థాయికి తర్వాతి మ్యాచ్‌లోనే పరుగుల వరద పారించడం పెద్ద కష్టం కాదు. బరాబతి స్టేడియంలో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 3, 22, 1, 8 పరుగులు మాత్రమే చేసిన కోహ్లికి ఇప్పుడు దానిని కూడా సవరించే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లు అయ్యర్, పంత్ జంటగా చెలరేగిపోవడం శుభ పరిణామం. ఆ తర్వాత బ్యాటింగ్‌లో జాదవ్, జడేజా కూడా తమ వంతు పాత్ర పోషించగలరు. మొత్తంగా బౌలింగ్ కాస్త బలహీనపడిన కారణంగా భారత బ్యాటింగ్ బలగం తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా ఆడితే గెలుపు ఖాయం. మార్పుల్లేకుండానే... విశాఖ వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడంలో విండీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా కాట్రెల్‌ను కోలుకోలేని విధంగా మనోళ్లు దెబ్బ కొట్టారు. అయితే ఐపీఎల్లో భారీ మొత్తానికి అమ్ముడై ఉత్సాహంగా ఉన్న కాట్రెల్ మళ్లీ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అతనికి జోసెఫ్, హోల్డర్ అండగా నిలవడం ముఖ్యం. స్పిన్నర్ ఖారీ పైర్ భారీ స్కోర్లు నమోదైన గత మ్యాచ్‌లో మెరుగైన గణాంకాలే నమోదు చేశాడు కాబట్టి ఈసారి కూడా అతని నుంచి పొదుపైన బౌలింగ్‌ను విండీస్ ఆశిస్తోంది. బ్యాటింగ్‌లో హోప్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్ లూయిస్ కూడా చెలరేగిపోగలడు. రెండో వన్డేలో అనూహ్యంగా రనౌట్ కాకుండా ఉంటే హెట్‌మైర్ కూడా మ్యాచ్‌ను శాసించేవాడు. తాజాగా ఐపీఎల్ వేలం తర్వాత అతని ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపైంది. హెట్మైర్ను భారత్ నిలువరించలేకపోతే కష్టం. పూరన్ బ్యాటింగ్ మెరుపులు కూడా గత మ్యాచ్‌లో కనిపించాయి. అయితే కెప్టెన్ పొలార్డ్ మాత్రం చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు. కెపె్టన్ కావడంతో పాటు విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా తనకున్న గుర్తింపును బట్టి ఒక్కటైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని వెస్టిండీస్ కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌లోనైనా పొలార్డ్ ప్రభావం చూపగలడా అనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెపె్టన్), రోహిత్, రాహుల్, అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, షమీ, కుల్దీప్, సైనీ, శార్దుల్/చహల్. వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), హోప్, లూయిస్, హెట్‌మైర్, పూరన్, ఛేజ్, హోల్డర్, కీమో పాల్, జోసెఫ్, పైర్, కాట్రెల్, పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన వికెట్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఈ మైదానంలో వన్డే జరిగి మూడేళ్లయింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాటి మ్యాచ్‌లో ఏకంగా 747 పరుగులు నమోదయ్యాయి. మంచు ప్రభావం కూడా ఉంది కాబట్టి మరోసారి టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపడం ఖాయం. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు. -
ఇంగ్లండ్ కు మరో ఎదురుదెబ్బ
కోల్‌కతా: భారత్‌తో మూడో వన్డేకు ముందు ఇంగ్లండ్ కు ఎదురు దెబ్బ తగిలింది. చేతి గాయం కారణంగా ఓపెనర్ అలెక్స్ హేల్స్ మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. కటక్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ హేల్స్ గాయపడ్డాడు. ఆదివారం ఇక్కడ జరగనున్న మూడో వన్డేకు హేల్స్ అందుబాటులో ఉండడని టీం మేనేజ్మెంట్ తెలిపింది. రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేందర్‌సింగ్ ధోని క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతని చేతికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా హేల్స్ శనివారం ఉదయం ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాడు. ఆదివారం జరగనున్న మూడో వన్డేలో హేల్స్ స్థానంలో జాసన్ రాయ్‌తో కలిసి సామ్ బిల్లింగ్స్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వికెట్ కీపర్ జాని బెయిర్‌స్టో కూడా అందుబాటులో ఉన్నాడు. వీరిద్దరిలో ఎవరికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాల్సిందే. -
యువీ, ధోనీ సెంచరీల సీక్రెట్ ఇదే..
-
యువీ, ధోనీ సెంచరీల సీక్రెట్ ఇదే..
కటక్: టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. కీలక సమయంలో సెంచరీ చేసి జట్టుకు విజయాన్నందించడంతో పాటు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతంలో విలువైన భాగస్వామ్యాల్ని నెలకొల్పి, ఎన్నోసార్లు జట్టును గెలిపించిన వెటరన్స్ యువీ, ధోనీలు కటక్ వన్డేలో మరోసారి చెలరేగి సూపర్ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో ఆడుతున్న సమయంలో ధోనీ తనలో ఆత్మవిశ్వాసం నింపాడని, సెంచరీ చేయడానికి ఎంతో ఉపయోగపడిందని యువీ అన్నాడు. ‘ధోనీకి, నాకు మధ్య మంచి అవగాహన ఉంది. కటక్ మ్యాచ్‌లో ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఆడాం. తొలుత 50 పరుగుల భాగస్వామ్యం చేయాలని అనుకున్నాం. ఇది సాధించాక 100 పరుగుల భాగస్వామ్యంపై దృష్టిసారించాం. ఆ తర్వాతే అదే జోరు కొనసాగిస్తూ సెంచరీలు చేశాం. గతంలో మేం ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాం. మా ఇద్దరిలో ఆత్మవిశ్వాసం ఉంది. కటక్ వన్డేలో నేను బౌండరీలు సాధించడాన్ని గమనించిన ధోనీ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఇది బాగా పనిచేసింది. ధోనీ నన్ను ప్రోత్సహిస్తూ ఆత్మవిశ్వాసం కలిగించాడు’ అని యువీ చెప్పాడు. యువీ (150) ఆరేళ్ల తర్వాత, ధోనీ (134) నాలుగేళ్ల తర్వాత సెంచరీలు చేశారు. వన్డేల్లో యువీకిదే అత్యధిక స్కోరు. యువీ చివరిసారిగా 2011 వన్డే ప్రపంచ కప్‌లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత కేన్సర్ బారినపడిన యువీ జట్టుకు దూరమయ్యాడు. కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాక జట్టులోకి పునరాగమనం చేశాడు. అయితే మునుపటిలా ఆడలేకపోయిన యువీ జట్టుకు కొన్నాళ్లు దూరమయ్యాడు. అనూహ్యంగా మళ్లీ జట్టులోకి వచ్చిన యువీ కటక్‌లో అద్భుతం చేశాడు. -
ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో గాయపడిన పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి వచ్చాడు. రెండు, మూడో వన్డేల కోసం బిన్నీని తీసుకున్నట్టు బీసీసీఐ తెలిపింది. కటక్ వన్డేలో ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తొలి బంతి వేయగానే ఆరోన్ కండరాల నొప్పితో మైదానం వీడాడు. ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌పై బిన్నీ తన చివరి వ న్డే ఆడాడు. గురువారం రెండు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది.