cysts
-
చిక్కే....‘సిస్ట్’ర్స్... జాగ్రత్త!
మహిళల్లో సాధారణంగా గర్భసంచి పక్కనే ఉండే ఓవరీస్‌లో లేదా వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాల్లో... రకరకాల సిస్ట్లు కనిపిస్తుంటాయి. సిస్ట్ అంటే నీరు లేదా నీటి వంటి ద్రవపదార్థంతో నిండి ఉన్న సంచి అని అర్థం. మహిళల్లో ఇలా సిస్ట్లు కనిపించడం మామూలే. సాధారణంగా కనిపించే కొన్ని రకాల సిస్ట్ల గురించి ప్రాథమిక అవగాహన కోసం... ఈ కథనం. ఫాలిక్యులర్ సిస్ట్: అండం విడుదల సమయంలో కనపించే సిస్ట్ ఇది. పీరియడ్స్ తరువాత ఐదు లేదా ఆరు రోజుల నుంచి క్రమంగా సైజ్ పెరుగుతూ ΄ోతుంది. సాధారణంగా 2 నుంచి 2.2 సెం.మీ. సైజ్‌కు చేరాక... మహిళల్లో అండం విడుదల జరిగాక కనుమరుగవుతుంది. కార్పస్ ల్యుటియల్ సిస్ట్: అండం విడుదలైన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే... ఆ పిండాన్ని స΄ోర్టు చేయడానికి ఏర్పడే సిస్ట్ ఇది. సాధారణంగా ఈ సిస్ట్లు వాటంతట అవే కనుమరుగవుతాయి.ఎండోమెట్రియల్ సిస్ట్: రక్తంతో నిండి ఉండే ఈ సిస్ట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో కనపడుతుంది. ఈ సిస్ట్లు తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఇవి క్రమంగా పెద్దదై కొన్నిసార్లు పలిగి΄ోయే అవకాశం ఉన్నందున ఇటువంటి సిస్ట్‌లను ఇంజక్షన్ ద్వారా తాత్కాలికంగా పెరగకుండా చేయడంగానీ లేదా సర్జరీ ద్వారా తీసేవేయడం కానీ చేస్తుంటారు. ఇలా చేయాల్సిన అవసరమూ ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ సిస్ట్: ఓవరీస్‌లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ట్యూబ్‌తో కలిసి ట్యూబో–ఒవేరియన్ సిస్ట్ల పెల్విస్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా ఇది కనిపిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ : సాధారణంగా ప్రతినెలా 20 నుంచి 30 ఫాలికల్స్ ఓవరీస్‌లో పెరగడం ప్రారంభిస్తాయి. వీటన్నింటిలో అత్యంత అనువుగా ఉన్న ఫాలికల్ మాత్రమే అండంగా మారుతుంది. అది... మిగిలిన వాటికన్నా మరింత వేగంగా పెరిగి... పీరియడ్స్ వచ్చిన 12–16 రోజుల మధ్యలో విడుదల అవుతుంది. ఇక మిగిలిన ఫాలికల్స్ అన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. కాని ఊబకాయం, హార్మోన్ల అసమతౌల్యత ఉన్న మహిళల్లో ఆ ఫాలికల్స్ అన్నీ ఒకే సైజ్ వరకు పెరుగుతాయిగానీ, ఏ ఒక్కటీ అండంగా మారదు. అలా పెరిగిపోయిన ఈ సిస్ట్ల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాక΄ోవడం, బరువు మరింతగా పెరగడం, అవాంఛిత రోమాలు రావడం జరగవచ్చు. స్కానింగ్ చేసి చూసినప్పుడు ఈ ఫాలికల్స్ అన్నీ చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనపడతాయి. వీటినే డాక్టర్లు పాలిసిస్టిక్ ఓవరీస్’గా చెబుతారు. ఈ సమస్యను మందులతో, జీవనశైలి మార్పులతో తగ్గించడం సాధ్యమవుతుంది. సీరస్ లేదా మ్యూసినస్ సిస్ట్ : ఇవి కూడా ఓవరీస్‌లో సాధారణంగా కనిపించే సిస్ట్లే. నలభై ఏళ్లకు పైబడినవారిలో కనిపిస్తుంది. సైజును బట్టి చికిత్స నిర్ణయిస్తారు.చాలావరకు వాటంతట అవి తగ్గిపోయేవే... ఇన్ని రకాల సిస్ట్లు ఉన్నా ఫాలిక్యులార్, కార్పస్ ల్యుటియల్, చిన్న సైజ్‌లో ఉన్న సీరస్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సమయాలలో 6 సెం.మీ సైజ్ కన్నా ఎక్కువగా ఉంటే సిస్ట్లు లేదా నీరులాంటి పదార్థంతోపాటు గట్టిగా ఉన్న సిస్ట్లు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ల వంటికి మాత్రమే శస్త్రచికిత్స అవసరమ వుతుంది.శస్త్రచికిత్స అవసరమయ్యేవి... కొన్ని సిస్ట్లు మెలిక తిరిగి అంటే టార్షన్కు గురై పేషెంట్‌కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలను తెచ్చిపెట్టినప్పుడు ఆపరేషన్ తప్పని సరి. చివరగా... మహిళలు తామ ఓవరాల్ ఆరోగ్యం కోసం సరైన ఆహారం, ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గడం చాలా మంచిది. దీనివల్ల ఇతరత్రా అనేక సమస్యలతో పాటు కొంతవరకు సిస్ట్లు కూడా నివారితమయ్యే అవకాశం ఉంది. - డా. స్వాతి హెచ్వికన్సల్టెంట్, అబ్‌స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
కొందరికి ఇలాగ కూడా సాయం చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : కొందరికి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా మేలు జరుగుతుందో తెలియదు, ఊహించలేము కూడా. ఇంగ్లండ్‌లోని ‘నెట్వర్క్ టెన్’ టీవీలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అంటాయినెట్ లత్తాఫ్ను అనూహ్యంగా అలాంటి మేలే జరిగింది. గత శుక్రవారం ఆమె టీవీలో ఏదో కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆమె గొంతు వద్ద తిత్తిలాగా ఉబ్బుగా కనిపించింది. దీన్ని గమనించిన వెండీ మాక్కాయ్ అనే ప్రేక్షకుడు వెంటనే ఆమెకు ఓ సందేశం పింపించారు. ‘మీ గొంతు కింద తిత్తిలాగా కనిపిస్తోంది. వెంటనే వైద్యుడికి చూపించండి, లేకపోతే ప్రమాదం’ ఆ సందేశం సారాంశం. లత్తాఫ్, తమ వంశంలో ‘థైరాడ్ క్యాన్సర్’ ఉండడంతో ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించారు. మూడు రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్లు చేసి వైద్యులు ఆమెకు ‘థైరోగ్లాసల్ డక్ట్ సిస్ట్’ ఉన్నట్లు ధ్రువీకరించారు. స్వర పేటికపై నుండే థైరాడ్ గ్రంధిలో అదనపు కణాలు పెరిగి రావడం వల్ల ఈ తిత్తి ఏర్పడుతుందని, అది క్రమంగా పెరగడం వల్ల శ్వాస సరిగ్గా ఆడదని, సరిగ్గా తినదీయదని, మాటలు సరిగ్గా రావని వైద్యులు చెప్పారు. వారి సలహా మేరకు లత్తాఫ్కు ఆమె శస్త్ర చికిత్స చేసి ఆ తిత్తిని తీసివేశారు. ఇద్దరు పిల్లలు భర్త ఉన్న ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ‘నా పట్ల శ్రద్ధ చూపించి నా జబ్బును ముందుగా కనుక్కొని సకాలంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు’ అంటూ విక్టోరియా ప్రాంతంలో నివసిస్తున్న వెండీకి ఆమె సందేశం పంపించారు. ‘మీరు వైద్యులా, ఎలా కనిపెట్టారు?’ సోషల్ మీడియా వెండీపై ప్రశ్నలు, ప్రశంసలు కురిపించింది. ‘అబ్బే! నేను డాక్టర్‌ను కాను, నా స్నేహితుల్లో ఒకరికి ఇలాగే ఉంది. అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని గ్రహించి స్పందించానంతే!’ వెండీ తెలిపారు. -
సిస్ట్లు క్యాన్సర్‌గా మారవు
నా వయసు 38 ఏళ్లు. పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. పిల్లలు లేరు. స్కానింగ్ తీయించాం. నా ఓవరీలలో సిస్ట్ ఉందని తేలింది. ఈ సిస్ట్ భవిష్యత్తులో క్యాన్సర్‌గా పరిణమిస్తుందేమోనని ఆందోళనగా ఉంది. నాకు సలహా ఇవ్వండి. - ఒక సోదరి, హెదరాబాద్ ఓవేరియన్ సిస్ట్ (అండాశయాల్లో నీటితిత్తులు) చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇది చాలా సాధారణ సమస్య. ఈ నీటితిత్తులు క్యాన్సర్ కణాలుగా మారవు. మీ వయసులో ఉన్న వాళ్లలో చాలామందిలో అవి కొద్దికాలం తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీలా ఒవేరియన్ సిస్ట్స్ ఉన్న మహిళలు మా డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఏ తరహాకు చెందినవో గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా వాటి పరిమాణం, సంఖ్య, వాటిలోకి జరిగే రక్తసరఫరా వంటి అంశాలను తెలుసుకుంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇతర పరీక్షలనూ చేయిస్తాం. కుటుంబ చరిత్రను అడిగి తెలుసుకుంటాం. అయితే కుటుంబ చరిత్రలో క్యాన్సర్లు వచ్చిన దాఖలాలు ఉన్నవారికి మరికొన్ని అదనపు పరీక్షలు సైతం చేయించాల్సి ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్లుగానే చాలా సందర్భాల్లో ఒవేరియన్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే వాటి పరిమాణం పెరుగుపోతున్నా లేదా ట్విస్ట్ అవుతున్నా, అవి చీరుకుపోయి రక్తస్రావం అవుతున్నా, వాటి వల్ల నొప్పి కలుగుతుంటే మాత్రం వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సైతం లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా చాలా మందికి సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా సిస్ట్లు రావడం అన్నది ఎండోమెట్రియాసిస్ కారణంగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు రుతుస్రావం, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకిగా ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే మీకు ఇంకా గర్భధారణ జరగకపోవడానికి ఏయే అంశాలు కారణమో పూర్తిగా తెలుసుకోవాలి. దాంతోపాటు మీలో వచ్చే సిస్ట్లు ఏ తరహాకు చెందినవి అని తెలుసుకోవడం కూడా అవసరం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు సాధ్యమైనంత త్వరగా వైద్య నిపుణులను కలవండి.