Top Stories
ప్రధాన వార్తలు

బియ్యం బండి ఆగింది.. మీ రేషన్ మీరే తెచ్చుకోండి
సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్’ను చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్ డోర్ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్ అక్రమ రవాణాకు కేరాఫ్ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్ ప్రచారం సాగించారు. రేషన్ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్ డీలర్ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ చేరవేసింది. ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. రేషన్ పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్(అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. పేదల ఇంటికి రేషన్ వద్దు... మద్యం ముద్దుపేదల ఇంటికి రేషన్ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్‌ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.2027 వరకు ఒప్పందం గడువు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు. రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోముఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి. – రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాంఇంటి ముందుకే రేషన్ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది? – దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా గిరిజనులకు ఎంతోమేలు జరిగింది గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. –పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా మాగ్రామంలో రేషన్ షాపు లేదు మా గ్రామంలో రేషన్ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. – రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్ మండలం, కర్నూలు జిల్లా

హామీలు గాలికి.. కుట్రలు తెరపైకి..: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకపోగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని.. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెడ్‌బుక్ కుట్రలతో విధ్వంసం సృష్టిస్తున్నారని, బరితెగించి యథేచ్ఛగా కేసుల మీద కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనం అయ్యాయన్నారు. అయితే ఈ అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ శ్రేణులకు తేల్చి చెప్పారు. జైళ్లకు పంపినా సరే.. ‘చంద్రబాబూ.. నిన్ను ఎదుర్కొంటాం’ అని ధైర్యంగా, గట్టిగా నిలబడగలిగినప్పుడే రాష్ట్రంలో రాజకీయం చేయగలమని స్పష్టం చేశారు.ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ వన్ అని, వచ్చేది మన ప్రభుత్వమేనని, జగన్ 2.0లో కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత ⇒ ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నామో నా కంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడకూడదు. జైళ్లకు పంపినా, చంద్రబాబూ.. నిన్ను ఎదుర్కొంటాం అని గట్టిగా అంటేనే రాజకీయాల్లో ఉండగలం. రాజకీయాలు చేయగలం. అదే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఈరోజు రాజకీయాలు అలా తయారయ్యాయి. ⇒ మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏడాది తర్వాత కొంత వస్తుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు ఆయన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చాడు. జగన్ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా, ఇంకా మూడు ఎక్కువ ఇస్తానన్నాడు. కానీ, ఏదీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అందుకే ఆయన ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చింది.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క ఇంటికీ ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా.. పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారు? బాండ్లు అన్నాడు. ఇంకా ఏమేం చెప్పారు? ఇంటింటికీ వెళ్లి, చిన్న పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనబడితే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్ల యువకుడు కనబడితే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. ఆ మాటలు ఇంకా వారిని వెంటాడుతాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు సీఎం హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే, దాన్ని అమలు చేయని వ్యక్తి సీఎంగా ఉన్నాడు.వ్యవస్థలన్నీ నిర్వీర్యం ⇒ రాష్రంలో విద్యా రంగం నిర్వీర్యం అయింది. ఇంగ్లిష్ మీడియం లేదు. గోరుముద్ద నామమాత్రం అయింది. నాడు–నేడు లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. మనం అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చాం. ఇవాళ అది లేదు. నిరుపేదల ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని వదిలేసింది. ఆ బిల్లులు దాదాపు రూ.3,600 కోట్లు ఇవ్వడం లేదు. ఆరోగ్య ఆసరా అమలులోనే లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక పోవడంతో వైద్యానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ⇒ ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. దళారులు వచ్చారు. ఆర్బీకే వ్యవస్థను నాశనం చేశారు. ఉచిత ఇన్సూ్యరెన్స్ లేదు. పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు.మనం బాగు చేస్తే.. బాబు చెడగొడుతున్నాడు ⇒ మనం 17 మెడికల్ కాలేజీలు కడితే, ఈరోజు వాటిని అమ్మేస్తున్నారు. ఏదైనా జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంటే, అక్కడ అన్ని వైద్య సదుపాయాలు, ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నట్లు. దానివల్ల ఆ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను మోసం చేయలేవు.⇒ మనం మూలపేట (శ్రీకాకుళం జిల్లా)తోపాటు మూడు పోర్టులు కట్టడం మొదలు పెట్టాం. వాటిలో 30 శాతం పనులు పూర్తి చేస్తే, కమీషన్ల కోసం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు.⇒ ఉత్తరాంధ్రలో ట్రైబల్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజ్, ఐటీడీఏ పరిధిలో ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం మొదలు పెడితే, ఈ పెద్దమనిషి మొత్తం వదిలేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కోసం మనం భూసేకరణ చేశాం. 30 శాతం పనులు చేశాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ అభివృద్ధి అయినా జరిగింది అంటే కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే.⇒ చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఆయన ఎక్కడా మాట నిలబెట్టుకోలేదు. అలా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అందుకే తనను ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కుతున్నారు. నిలదీస్తున్న గొంతులను నలిపేస్తున్నారు.రాష్ట్రంలో తొలిసారిగా మాన్యుఫ్యాక్చర్ విట్నెస్ సృష్టిస్తుండటాన్ని చూస్తున్నాం. అంటే నేరంతో ఒక మనిషికి సంబంధం లేకపోయినా, వారికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకుని అప్రూవర్ అంటున్నారు. ఆయనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. ఆ మనిషితో, ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు. ఈ మనిషిని అరెస్టు చేస్తున్నారు. అలా ఒక మాన్యుఫ్యాక్చర్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు. చరిత్రలో గతంలో ఏనాడూ ఇలాంటివి జరగలేదు. ఒక తప్పుడు సంప్రదాయానికి ఈ పెద్దమనిషి చంద్రబాబు ఈరోజు బీజం వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాత కేసులు తిరగ తోడుతున్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థులు, చురుగ్గా పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులను ఇరికిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. - వైఎస్ జగన్‌మన ప్రభుత్వ హయాంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లగలిగాడు. మేనిఫెస్టో చూపి, జగన్ ఏం చేశాడో చూపి టిక్ పెట్టమని అడిగాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు ప్రతి ఇంటికీ వెళ్లి, ఎన్నికల ముందు ఏమేం చేశామో చెప్పాం. వాటిని చూపాం. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అయినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కారణం కేవలం 10 శాతం మంది వారి మాటలు నమ్మి, మనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. - వైఎస్ జగన్‌ఉధృతంగా పోరాడుదాం.. రాబోయేది మన ప్రభుత్వమే⇒ ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. మంగళగిరికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అలాగే సుధారాణిని నెలల తరబడి శ్రీకాకుళం నుంచి అన్ని స్టేషన్లు తిప్పారు. బెయిల్ రాకుండా చూశారు. మాజీ ఎమ్మెల్యే వంశీపై 11 కేసులు పెట్టారు. ఒకదాంట్లో బెయిల్ వస్తే.. మరో కేసు.. రెండు నెలలుగా జైల్లోనే ఉంచారు. ఒక దాని తర్వాత మరో కేసు పెడుతున్నారు.⇒ ఇంకొకరు మాజీ ఎంపీ నందిగం సురేష్. దళితుడు. నెలల తరబడి జైల్లో పెట్టారు. బెయిల్ మీద బయటకు వస్తే, మరో కేసులో ఇరికించి, జైలుకు పంపారు. వాళ్ల ఇంటి దగ్గరకొచ్చి ఒక మనిషి తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే, మరో కేసు పెట్టి, జైలుకు పంపారు.⇒ ఈ రోజు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెట్టారు. అది ఒక వృక్షమై, రెండింతలు పెరిగి, వాళ్లనే తన్నే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడుదాం. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇంకా చూస్తుండగానే మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. చీకటి తర్వాత వెలుగు తప్పదు. మనం తప్పకుండా గెలుస్తాం. అందుకే రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాడాలి. ఈలోగా గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్యమబాట పట్టి, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టాలి. అందుకే ఈ సమావేశాల నిర్వహణ. ఈ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలది చాలా గొప్ప పాత్ర.వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ వన్ ⇒ ప్రతి కార్యకర్తకు చెబుతున్నా. మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, వారి పేరు రాసుకోండి. అది ఏ బుక్ అయినా సరే. వారి పేరు మాత్రం కచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక, ఈరోజు మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్ అయినా, దేశం వదిలి పోయినా లాక్కొస్తాం. ఎవ్వరినీ వదిలి పెట్టం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తాం. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కొట్టించుకోండి. ఫరవాలేదు. నీ టైమ్ బాగుంది.. కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్ వస్తుంది. అప్పుడు మనం కొడతాం. ఇవాళ వారు నాటుతున్న విత్తనం రేపు రెండింతలు అవుతుంది.⇒ ఈరోజు నేను మీ అన్నగా, మీ బిడ్డగా ఒకటే చెబుతున్నా. జగన్ 2.0లో పరిస్థితి ఇలా ఉండదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రోజు కార్యకర్తల కష్టాలు చూశాను. స్వయంగా చెబుతున్నాను. గతంలో మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్. దాంతో మనం యుద్ధం చేశాం. అందువల్ల అనుకున్న మేరకు కార్యకర్తలకు చేయలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను. రేపు ఈ పరిస్థితి ఉండదు. వైఎస్సార్సీపీకి కార్యకర్తనే నంబర్ వన్.

పాక్ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్
ఇస్లామాబాద్: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అత్యున్నత మిలటరీ హోదా అయిన ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై చర్చించి, ఆమోదం తెలిపిందని పేర్కొంది.ఇటీవల భారత్‌తో తలెత్తిన సైనిక ఉద్రిక్తతల సమయంలో పాక్ బలగాలను విజయం దిశగా నడిపించిన మునీర్ పదోన్నతి పొందారని స్థానిక మీడియా తెలిపింది. ఈ విషయంలో ఆయన అద్వితీయమైన పాత్ర పోషించారని ప్రశంసించింది. యుద్ధంలో తమదే విజయమంటూ పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటుండగా, భారత్ మాత్రం సాక్ష్యాధారాలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై వాస్తవాలను వివరిస్తూ వస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ తిరుగులేని అధికారాలను చెలాయిస్తున్న మునీర్‌కు ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం తెల్సిందే. తాజాగా, ఆయనకు ప్రమోషన్ సైతం లభించడం గమనార్హం. Government of Pakistan has promoted Army Chief General Asim Munir to the rank of Field Marshal. ⭐⭐⭐⭐⭐ pic.twitter.com/NNrAM9Npzp— Ambassador Murad Baseer (@muradbaseer) May 20, 2025

ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆటలోనే కాదు.. పెద్దలను గౌరవించడంలోనూ ముందే ఉంటానని నిరూపించాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పాదాలకు నమస్కరించడం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సీజన్లో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ సీఎస్కేతో మంగళవారం తలపడింది.ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొంది.. విజయంతో ముగించింది. మరోవైపు.. ధోని జట్టుకిది పదో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.ఆయుశ్ మాత్రే (20 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (25 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్, యుద్వీర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి మెరిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (31 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. ఆరంభంలో కుదేలైనా... చెన్నై ఆరంభంలోనే కాన్వే (10), ఉర్విల్ పటేల్ (0) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే బౌండరీలతో అలరించాడు. పవర్‌ప్లేలో జట్టు పుంజుకుంటున్న తరుణంలో... ఆయుశ్ దూకుడుకు తుషార్ చెక్ పెట్టాడు. స్వల్ప వ్యవధిలో అశ్విన్ (13), జడేజా (1) వికెట్లను కోల్పోయిన చెన్నై 78/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రెవిస్, శివమ్ దూబే (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.వైభవ్ ధనాధన్లక్ష్య ఛేదనలో మొదట యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే దంచేశాడు. అతను అవుటైనప్పడు జట్టు స్కోరు 37/1. అందులో 36 జైస్వాల్‌వే! శాంసన్ వచ్చాకే వైభవ్ బ్యాట్‌కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడి 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే అశ్విన్ ఒకే ఓవర్లో శాంసన్, వైభవ్‌లను అవుట్ చేశాడు. పరాగ్ (3)ను నూర్ అహ్మద్ బౌల్తా కొట్టించాడు. అయితే చెన్నై పట్టుబిగించకుండా జురేల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయడంతో ఇంకా 2.5 ఓవర్లు మిగిలుండగానే రాజస్తాన్ గెలిచింది. మిస్టర్ కూల్ రియాక్షన్ ఇదీఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం చెన్నై- రాజస్తాన్ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, వైభవ్ మాత్రం ఇందుకు భిన్నంగా.. చెన్నై సారథి ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మిస్టర్ కూల్ కూడా వైభవ్ వెన్నుతట్టి బాగా ఆడావు అన్నట్లుగా ప్రశంసించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు చేదు అనుభవాలే మిగిలినా.. వైభవ్ రూపంలో ప్రతిభ గల ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ సాయంతో ఈ హర్యానా కుర్రాడు 252 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్‌లు 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 😊This is what #TATAIPL is all about 💛🩷#CSKvRR | @ChennaiIPL | @rajasthanroyals pic.twitter.com/hI9oHcHav1— IndianPremierLeague (@IPL) May 20, 2025

ముంబై, బెంగళూరులో భారీ వర్షాలు..
ముంబై/బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, బెంగళూరులో వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బెంగళూరులో దాదాపు 36 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సాధారణ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.ముంబై, పూణెతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఈదారుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రత్నగిరి జిల్లాలోని వెర్వాలి, విలావాడే రైల్వేస్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడడంతో కొంకణ్ రైల్వే మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. Thankyou @mybmc for this wonderful treatment! #MumbaiRains #WeatherAlert Location: Andheri E, Near Subway pic.twitter.com/JRur1BRPPR— Bhairavi Wamorkar (@Bhaiiravii) May 20, 2025అలాగే కోస్తా కొంకణ్-గోవా మార్గంలో భారీ బండరాయి పడడంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలను కలిపే 741 కిలోమీటర్ల మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. జల్వాయు కాంప్లెక్స్ సమీపంలో చెట్లు కూలిపోయాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది. మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.Pre-monsoon and Mumbai is already drowning. All of Modi’s grand claims to make it a high-tech city are floating in floodwater. Any responsible Prime Minister would’ve resigned seeing this state but here, not even a single tweet for Mumbaikars’ safety#Mumbai#MumbaiRains pic.twitter.com/x6bSfufPBx— Pritesh Shah (@priteshshah_) May 20, 2025మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు నగరంలోని మాన్యత టెక్ పార్క్, సిల్క్ బోర్డ్ జంక్షన్లలో వంటి ప్రాంతాల్లో మోకాలి లోతు వరద నిలిచిపోయింది. వాహనాలు మొరాయించడంతో వాహన దారుల అవస్థలు వర్ణనాతీతం. వర్షం సంబంధిత ప్రమాద ఘటనల్లో మరణాల సంఖ్య అయిదుకు చేరింది. సాయి లేఔట్లోకి భారీగా వరద చేరడంతో చిన్నపాటి దీవిని తలపిస్తోంది. నివాసాల్లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి నీరు చేరడంతో అందులోని వారు బయటకు రాలేక, లోపల ఉండలేక అవస్థలు పడుతున్నారు. ఆ లేఔట్‌లోని కనీసం 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరికి అధికార యంత్రాంగం ఆహారం, నీరు సరఫరా చేసింది. వరదతో నిండిన హెన్నూర్ అనాథాశ్రమంలోని వారిని కూడా కాపాడారు. ఇలా ఉండగా, కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలోని ఏడు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. INCKarnataka promised: Brand BengaluruWhat @INCKarnataka delivered:Beach Bengaluru#CongressFailsKarnataka #BangaloreRains pic.twitter.com/YJrlbrJEM1— Naveen Kamadolli (@NaveenKamadolli) May 19, 2025 Why companies are building in Bangalore when taxes are not used in Infrastructure.It's time to rethink#BangaloreRains pic.twitter.com/4qWNnz1BlA— Anshul Garg (@AnshulGarg1986) May 20, 2025

‘స్వర్ణదేవాలయంలో వైమానిక రక్షణ తుపాకులు మోహరించలేదు’
అమృత్సర్: ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వర్ణ దేవాలయం(Golden Temple) ప్రాంగణంలో ఎటువంటి వైమానిక రక్షణ తుపాకులు, ఇతర వైమానిక రక్షణ వనరులను మోహరించలేదని సైన్యం స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న డ్రోన్, క్షిపణి ముప్పును ఎదుర్కొనేందుకు స్వర్ణ దేవాలయం నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలో వైమానిక రక్షణ తుపాకులను మోహరించేందుకు అనుమతిచ్చారనే వార్తల నేపథ్యంలో సైన్యం ఈ ప్రకటన చేసింది.స్వర్ణ దేవాలయంలో ఏడీ (వాయు రక్షణ) తుపాకుల మోహరింపునకు సంబంధించి పలు రకాలుగా వార్తలు వస్తున్నాయని, ఇది నిజం కాదని, ఆలయ ప్రాంగణంలో ఏడీ తుపాకులు, మరే ఇతర ఏడీ వనరులను మోహరించలేదని ఆర్మీ(Army) ఒక ప్రకటనలో తెలిపింది. దీనికిముందు ఇలాంటి వార్తలను తోసిపుచ్చుతూ, ఆలయ అదనపు ప్రధాన పూజారి మీడియాతో మాట్లాడుతూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) భారత సైన్యానికి వైమానిక రక్షణ తుపాకులను మోహరించడానికి అనుమతి ఇవ్వలేదన్నారు.భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన దరిమిలా బ్లాక్అవుట్ సమయంలో లైట్లు ఆపివేయడంపై మాత్రమే అధికారులు తమను సంప్రదించారని ఎస్జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి తెలిపారు. హర్మందర్ సాహిబ్‌లో వాయు రక్షణ తుపాకుల మోహరింపునకు సంబంధించి ఏ ఆర్మీ అధికారి నుండి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని ధామి పేర్కొన్నారు. ఇదేవిధంగా హర్మందర్ సాహిబ్ అధికారి గ్రంథి గియాని రఘ్బీర్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, ఆలయంలో తుపాకీల మోహరింపునకు సంబంధించి తనతో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: Covid-19 Returns: 257 కేసులు.. ఇద్దరు మృతి

ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా!
చండీగఢ్/న్యూఢిల్లీ: ఇండియన్ అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)(33)ను వాడుకుందా? నిజమేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ హ్యాండ్లర్ అలీ హసన్‌తో వాట్సాప్‌లో జ్యోతి చేసిన చాటింగ్‌లను వెలికి తీశారు. ఇద్దరి మధ్య కోడ్ భాషలో ఈ చాటింగ్‌లు జరిగాయి. ఒక చాటింగ్‌ను పరిశీలిస్తే.. భారత అండర్‌కవర్ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి అలీ హసన్ ఆమెను ప్రశ్నించాడు.భారత్–పాక్ సరిహద్దు అయిన అటారీ బోర్డర్‌ను సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్ ఉన్న అండర్‌కవర్ ఏజెంట్లను చూశావా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. ప్రోటో కాల్ అందుకున్నవారే అండర్ కవర్ ఏజెంట్లు కావొ చ్చు అని అలీ హసన్ చెప్పగా, అలాంటి వారిని తాను చూడలేదని పేర్కొంది. భారత నిఘా ఏజెంట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికి జ్యోతిని అస్త్రంగా ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్ఐ కోసమే పని చేస్తున్నట్లు ఆమెకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌కు సంబంధించిన భారీ గూఢచార ముఠాలో ఆమె ఒక కీలక సభ్యురాలని నిర్ధారణకు వచ్చారు. జ్యోతి తొలిసారిగా 2023లో బైశాఖి పండుగ సమయంలో పాకిస్తాన్లో పర్యటించింది. ఈ సరిహద్దులు ఇంకా ఎన్నాళ్లో.. జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. ఆమె తన ఆలోచనలు, పర్యటనల గురించి ఇందులో రాసుకుంది. పాకిస్తాన్ ప్రస్తావన సైతం ఉంది. డైరీలో 11 పేజీల్లో రాయగా.. 8 పేజీల్లో సాధారణ అంశాలు, 3 పేజీల్లో పాకిస్తాన్ గురించి హిందీ, ఇంగ్లిష్ భాషలో రాతలు కనిపిస్తున్నాయి. ‘‘పాకిస్తాన్ ప్రజల ఆదరణ, వారి అతిథి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్లో భారతదేశ హిందువుల పర్యటనలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌లోని తమ పూరీ్వకుల గ్రామాలను హిందువులు సందర్శించాలి.అక్కడి హిందూ ఆలయాలు, గురుద్వారాలకు సులువుగా వెళ్లొచ్చే పరిస్థితులు రావాలి. 1947లో దేశ విభజన తర్వాత విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుంది. పాకిస్తాన్లో పది రోజుల పర్యటన పూర్తి చేసుకొని ఈ రోజే ఇండియాకు తిరిగొచ్చా. రెండు దేశాల మధ్య ఈ సరిహద్దులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. బాధపడే హృదయాలకు ఉపశమనం కలగాలి. మనమంతా ఒకే దేశం, ఒకే నేలకు చెందినవాళ్లం’’ అని జ్యోతి తన డైరీలో రాసుకుంది. మరోవైపు ఆమె కశీ్మర్ పర్యటనల వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.అర్ధరాత్రి పొద్దుపోయే దాకా పనిచేయడం ఆమెకు అలవాటు అని గుర్తించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వీడియోలను ఎడిటింగ్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేదని చెప్పారు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి మరోచోటుకి వెళ్లినట్లు గుర్తించారు. జ్యోతి వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. తన బిడ్డ సంగతి తనకు తెలియదని, దీనిపై తనను ఏమీ ప్రశ్నించవద్దని జ్యోతి తండ్రి స్పష్టం చేశారు. నిందితురాలిపై ప్రశ్నల వర్షంయూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం రాబట్టానికి భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆమె పాకిస్తాన్, చైనాతోపాటు ఇతర దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 16న ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో గత రెండు వారాల్లో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఆదాయానికి, ఖర్చులకు పొంతనేదీ?ఇదిలా ఉండగా, నిందితురాలు జ్యోతి మల్హోత్రా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరిని కలిసిందీ పూర్తి వివరాలు తెలిస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తామని, దానివల్ల దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారానే తనకు ఆదాయం వస్తోందని నిందితురాలు చెబుతుండగా, అధికారులు విశ్వసించడం లేదు. ఆమెకు వచ్చిన ఆదాయానికి, విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులకు పొంతన లేదని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివరాలు కూపీ లాగుతున్నారు.జ్యోతి ల్యాప్‌టాప్‌పై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని అధికారులు చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య నాలుగు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేసే ఓ అధికారిని తరచుగా కలిసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. సోషల్ మీడియా ద్వారా జనంలో గుర్తింపు పొందినవారిని నియమించుకొని, దేశ రహస్యాలు కొల్లగొట్టడం ఆధునిక యుద్ధరీతిలో ఒక భాగంగా మారిందని తెలిపారు.

అతని కాలి బూట్లకు ముద్దు పెట్టిన హీరో అజిత్.. వీడియో వైరల్
సినిమా హీరోలను దేవుడిలా అభిమానులు పూజిస్తారు. మరి ఆ హీరోలే మరోకరిని తమ జీవితానికి ఆదర్శంగా తీసుకుంటే అతనెంత గొప్పవాడై ఉంటాడో అని ఆలోచిస్తాం. సరిగ్గా అలాంటి సన్నివేశమే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లైఫ్‌లో ఒకటి ఉంది. అజిత్ తాజాగా తన అభిమాన కార్ రేసర్‌కు నివాళులు అర్పించారు. ఆయనపై తన అభిమానం ఏపాటిదో వీడియోతో చూపాడు. దానిని చూసిన అజిత్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అజిత్ తాజాగా ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ అయర్టన్ సెన్నాకు నివాళులర్పించారు. ఇటలీ పార్క్‌లో ఉన్న ఆయన విగ్రహం పాదాలకు ముద్దు పెట్టి తన అభిమానం ఎలాంటిదో చూపాడు. అయర్టన్ సెన్నా విగ్రహాన్ని కొంత సమయం పాటు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. బ్రెజిల్ దేశానికి చెందిన అయర్టన్ సెన్నా మూడు సార్లు(1988,1990,1991) ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌గా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. వరుసగా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సెట్ చేశాడు. 1994 కార్ రేసింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు.అజిత్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ రేసర్‌గానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. షూటింగ్స్‌లకు కాస్త విరామం దొరికితే చాలు రేసింగ్ బైక్స్, కార్లలో చక్కర్లు కొడుతుంటారు. అంతర్జాతీయ కార్ రేసింగ్లలో కూడా ఆయన పాల్గొని సత్తా చాటారు. ఆపై తన రేసింగ్ టీమ్‌ను కూడా కొద్దిరోజుల క్రితమే ఆయన ప్రకటించారు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో టీమ్‌ను ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing)

ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ
దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల తిరిగి జోరందుకోవడంతో మరోసారి ప్రైమరీ మార్కెట్లకు జోష్ వస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలిగా ఏథర్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించగా.. సుమారు 10 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌వైపు సాగుతున్నాయి. బొరానా వీవ్స్, బెల్రైజ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ బాటలో మరో 7 కంపెనీలు సన్నాహాలు ప్రారంభించనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ.3,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఇవన్నీ 2024 అక్టోబర్– 2025 జనవరి మధ్య కాలంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..హెచ్డీఎఫ్సీ క్రెడిలాగతంలో హెచ్డీఎఫ్సీ క్రెడిలాగా కార్యకలాపాలు నిర్వహించిన క్రెడిలా ఫైనాన్షియల్ సరీ్వసెస్ కాన్ఫిడెన్షియల్(గోప్యత) పద్ధతిలో ప్రాస్పెక్టస్‌ను డిసెంబర్లో దాఖలు చేసింది. అంటే ప్రాస్పెక్టస్ వివరాలు గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. కంపెనీ ప్రధానంగా విద్యాసంబంధ రుణాలను అందిస్తోంది.శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీబాలీవుడ్ స్టార్స్‌తోపాటు.. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు పెట్టుబడులున్న శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీ ఐపీవో ద్వారా రూ. 792 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. ఐపీవో నిధుల ద్వారా అనుబంధ సంస్థలు రిచ్‌ఫీల్ రియల్టీ, ధ్యాన్ ప్రాజెక్ట్స్, త్రిక్షా రియల్టీలో పెట్టుబడులు సమకూర్చనుంది. మరికొన్ని నిధులను నిర్మాణంలో ఉన్న అమల్ఫి, ఆర్కేడియన్, వరుణ్ ప్రాజెక్టులపై వెచ్చించనుంది.యూరో ప్రతీక్వాల్ ప్యానల్ డెకొరేటివ్ పరిశ్రమలో కార్యకలాపాలు విస్తరించిన యూరో ప్రతీక్ ఐపీవో ద్వారా రూ. 730 కోట్లు అందుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో కొంతమేర విక్రయానికి ఉంచనున్నారు. మైనింగ్, లాజిస్టిక్స్ నాగ్‌పూర్ కంపెనీ కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, మెషీనరీ కొనుగోలు తదితరాలకు వినియోగించనుంది.జారో ఇన్స్టిట్యూట్ఐపీవోలో భాగంగా జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 570 కోట్లు అందుకోవాలని చూస్తోంది. నిధులను బ్రాండ్ పటిష్టత, ప్రకటనలు, రుణ చెల్లింపులు తదితరాలకు వెచి్చంచనుంది. జెన్సన్స్ ఇండస్ట్రీస్ఐపీవోలో భాగంగా జెన్సన్స్ ఇండస్ట్రీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్ మరో 94.61 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలు.. తదితరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లుజెమ్ ఆరోమాటిక్స్స్పెషాలిటీ ఇన్‌గ్రెడియంట్స్ తయారీ ముంబై కంపెనీ జెమ్ ఆరోమాటిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 89.24 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.

ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.నవమి రా.10.41 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శతభిషం ప.2.52 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.8.59 నుండి 10.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.22 వరకు,అమృత ఘడియలు: ఉ.7.50 నుండి 9.24 వరకు.సూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.22రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.వృషభం.... సోదరులతో సఖ్యత. నిరుద్యోగులకు శుభవార్తలు.. కార్యజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.మిథునం..... రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కర్కాటకం... మిత్రులతో కలహాలు. అనారోగ్యం. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు.సింహం.... ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం.. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.కన్య... కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.తుల... ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.వృశ్చికం... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు..... నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మకరం... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కుంభం... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక.వస్తులాభాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.మీనం.... వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
ఒకరి ‘దూరం’.. ఇద్దరినీ ‘చేరువ’ చేసింది
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
అతని కాలి బూట్లకు ముద్దు పెట్టిన హీరో అజిత్.. వీడియో వైరల్
ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ
జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన వివరాలు
దానశీలురు ఈ కార్పొరేట్లు
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
శంషాబాద్‌లో విమానానికి తప్పిన ప్రమాదం
ముంబై, బెంగళూరులో భారీ వర్షాలు..
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
సారూ.. మా ఊరు పేరు మార్చండి
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
'భగవంత్ కేసరి' రీమేక్.. ఆ ఒక్క సీన్ కోసం పట్టుబట్టిన విజయ్
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
భారత్ అడుగుజాడల్లో...
ఒకరి ‘దూరం’.. ఇద్దరినీ ‘చేరువ’ చేసింది
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
అతని కాలి బూట్లకు ముద్దు పెట్టిన హీరో అజిత్.. వీడియో వైరల్
ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ
జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన వివరాలు
దానశీలురు ఈ కార్పొరేట్లు
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
శంషాబాద్‌లో విమానానికి తప్పిన ప్రమాదం
ముంబై, బెంగళూరులో భారీ వర్షాలు..
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
సారూ.. మా ఊరు పేరు మార్చండి
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
'భగవంత్ కేసరి' రీమేక్.. ఆ ఒక్క సీన్ కోసం పట్టుబట్టిన విజయ్
భారత్ అడుగుజాడల్లో...
లేఆఫ్ తప్పు తెలిసొచ్చిందీ కంపెనీకి...
సినిమా

మంచు మనోజ్ బర్త్ డే స్పెషల్.. భైరవం సాంగ్ రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మే 30న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇవాళ మంజు మనోజ్ పుట్టినరోజు కావడంతో భైరవం టీమ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. థీమ్ ఆఫ్ గజపతి పేరుతో పవర్ఫుల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు పూర్ణాచారి చల్లూరి లిరిక్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల, క్రాంతి కిరణ్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో అజయ్ రాజా, రవీంద్ర శరత్, సంపత్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మగధీర సినిమా చూశాకే హీరోయిన్ అవ్వాలనుకున్నా: ఆదితి శంకర్
కోలీవుడ్ బ్యూటీ ఆదితి శంకర్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. భైరవం మూవీతో టాలీవుడ్ సినీ ప్రియులను మెప్పించనుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో ఆదితితో పాటు ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇటీవల ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆదితి శంకర్ తన స్టెప్పులతో వేదికపై అలరించింది. ఈ ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం భైరవం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ముద్దుగుమ్మ. టాలీవుడ్ సినిమాల్లో మొదట థియేటర్లో చూసిన మూవీ మగధీర అని తెలిపింది. ఈ సినిమా చూశాకా గూస్బంప్స్ వచ్చేలా ఉందని తన ఆనందం వ్యక్తం చేసింది. మగధీర మూవీ చూశాకే హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యానని ఆదితి శంకర్ తెలిపింది.(ఇది చదవండి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్!)కాగా.. అంతకు ముందు హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. #Magadheera సినిమా చూసాక హీరోయిన్ అవ్వాలని అనుకున్న - #AditiShankarWatch Full Interview 👉 https://t.co/eTxTPMH8Yi#RamCharan #Bhairavam #TeluguFilmNagar pic.twitter.com/PLJHDz465S— Telugu FilmNagar (@telugufilmnagar) May 20, 2025

తమ్ముడి బర్త్ డే.. వెరైటీగా విషెస్ చెప్పిన మంచు లక్ష్మీ!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌తో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయనకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా ఇప్పటి వరకు మంచు విష్ణు కానీ, మోహన్ బాబు కానీ మనోజ్‌కు విష్ చేయలేదు.కానీ మంచు మనోజ్ అంటే అక్క మంచు లక్ష్మీకి విపరీతమైన ప్రేమ. గతంలో తానే పక్కనుండి మనోజ్- మౌనికల పెళ్లిని జరిపించింది. ఇవాళ తమ్ముడి పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. భైరవం మూవీలోని ధమ్ ధమారే అంటూ సాగే పాటకు పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ.. అందరికంటే కాస్తా వెరైటీగా విష్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ కావడంతో సూపర్బ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో చూసిన మంచు మనోజ్ ఫుల్ ఖుషీ అయ్యారు. లవ్ సింబల్స్‌తో వీడియోకు రిప్లై కూడా ఇచ్చారు. థ్యాంక్యూ యూ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. కాగా.. మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ ఈనెల 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

మలయాళ సూపర్ స్టార్ బర్త్ డే.. జాక్ ఫ్రూట్‌తో ప్రేమ చాటుకున్న అభిమాని!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఓ అభిమాని ఆయనపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. ఈనెల 21న మోహన్ లాల్ పుట్టినరోజు కావడంతో ఒక రోజు ముందుగానే ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. జాక్ ఫ్రూట్స్‌తో ఆయన చిత్రపటాన్ని రూపొందించాడు.జాక్ ఫ్రూట్ భాగాలను ఉపయోగించి డా విన్సీ సురేశ్ అనే ఆర్టిస్ట్ మోహన్ లాల్ చిత్రపటాన్ని రూపొందించాడు. దాదాపు 65 రకాల జాక్ ఫ్రూట్లతో ఈ చిత్రపటాన్ని తయారు చేశారు. ఆకుపచ్చ, పసుపు, నారింజ షేడ్స్ లో జాక్ ఫ్రూట్ ఆకులతో మోహన్ లాల్ ఫోటోను అలంకరించారు. ఈ చిత్రపటాన్ని త్రిస్సూర్ వేలూర్‌లోని ఆయుర్ జాక్ ఫ్రూట్ ఫామ్‌లో రూపొందించారు. దాదాపు ఎనిమిది అడుగుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తుతో ఈ చిత్రపటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని కోసం దాదాపు ఐదు గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ ఏడాది మోహన్ లాల్ ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మోహన్ లాల్, శోభన జంటగా తుడురుమ్ అనే మూవీ కూడా విడుదలైంది. ఈ సినిమాకు సైతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్
న్యూఢిల్లీ: ఐపీఎల్ 18వ సీజన్ తుదిపోరుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రెండో క్వాలిఫయర్ పోరు కూడా అహ్మదాబాద్‌లోనే (జూన్ 1న) జరుగుతుంది. నిజానికి ఈ రెండు మ్యాచ్‌లు గత విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ కావడంతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగాలి. అయితే భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలతో లీగ్‌ను వారం వాయిదా వేశారు. సవరించిన షెడ్యూల్ సమయంలో కోల్‌కతా, హైదరాబాద్‌లో వర్షాలు ఉంటాయనే సమాచారంతో ఈ రెండు నగరాల్లో జరగాల్సిన ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌లను అహ్మదాబాద్, ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్) తరలించారు. 2022, 2023 ఐపీఎల్ ఫైనల్స్ అహ్మదాబాద్‌లోనే జరిగాయి. ఇక ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్‌లో నిర్వహిస్తారు. ఈ నెల 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్ మ్యాచ్ ముల్లాన్‌పూర్‌లో జరుగుతాయి. దీంతో ఈ సీజన్లో కోహ్లి మ్యాచ్‌ను క్వాలిఫయర్ రూపంలో అయినా హైదరాబాద్‌లో చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రొటేషన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం మ్యాచ్‌కు ఈసారి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ ఆరంభం నుంచి అదరగొట్టడంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దీంతో టాప్–2 జట్ల మధ్య తొలి క్వాలిఫయర్... 3–4వ స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్... ఈ రెండింటిలో ఏదైనా ఒక మ్యాచ్‌లోనైనా కోహ్లి మెరుపులు చూడాలనుకున్న హైదరాబాద్ ప్రేక్షకులు ఇప్పుడు మరో సీజన్ దాకా నిరీక్షించక తప్పదు. ఈ నెల 23న బెంగళూరు, సన్రైజర్స్ల మధ్య బెంగళూరు వేదికగా జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ను లక్నోకు మార్చారు. 23న బెంగళూరులో భారీ వర్ష సూచన ఉండటంతో మ్యాచ్‌ను లక్నోకు తరలించినట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఐపీఎల్ పునఃప్రారంభమైన 17న బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య మ్యాచ్ వర్షార్పణమైంది. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’షెడ్యూల్మే 29 క్వాలిఫయర్–1 ముల్లాన్‌పూర్ మే 30 ఎలిమినేటర్ ముల్లాన్‌పూర్ జూన్ 1 క్వాలిఫయర్–2 అహ్మదాబాద్ జూన్ 3 ఫైనల్ అహ్మదాబాద్

సుమిత్ నగాల్ శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. పారిస్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 170వ ర్యాంకర్ సుమిత్ 6–1, 6–1తో ప్రపంచ 141వ ర్యాంకర్ మిచెల్ క్రుగెర్ (అమెరికా)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్ నెగ్గిన మొత్తం 59 పాయింట్లలో 22 విన్నర్స్ ఉన్నాయి. 14 అనవసర తప్పిదాలు చేసిన సుమిత్ నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు గెలిచాడు. రెండో రౌండ్లో ప్రపంచ 225వ ర్యాంకర్ జురిజ్ రొడియోనోవ్ (ఆ్రస్టియా)తో సుమిత్ తలపడతాడు. 27 ఏళ్ల సుమిత్ తన కెరీర్లో ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మూడుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో ఒక్కోసారి, యూఎస్ ఓపెన్‌లో మూడుసార్లు అతను మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డాడు. 2020 యూఎస్ ఓపెన్‌లో, 2024 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరడం సుమిత్ గ్రాండ్‌స్లామ్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.

వైభవ్ వీర విహారం.. సీఎస్కేపై రాజస్తాన్ ఘన విజయం
ఐపీఎల్-2025 సీజన్‌ను రాజస్తాన్ ఘన విజయంతో ముగించింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.రాజస్తాన్ బ్యాటర్లలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్(41), ధ్రువ్ జురెల్(31 నాటౌట్), జైశ్వాల్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్కే బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్, నూర్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.సీఎస్కే బ్యాటర్లలో ఆయూష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబే(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. దేశ్‌పాండే, హసరంగా తలా వికెట్ సాధించారు. కాగా ఇరు జట్లు కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించాయి.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్!?
ఐపీఎల్-2025లో బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా కీలక పోరులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ ప్లే ఆశలను పదిలం చేసుకుంటుంది. నాలుగో స్ధానం కోసం ముంబై, ఢిల్లీ జట్లు పోటీపడుతున్నాయి.ఇక ఈ కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బంతి రాహుల్ మోకాలికి బలంగా తాకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో అతడు ప్రాక్టీస్ మధ్యలోనే నెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ ఆడే అనుమానమే. ఇప్పటికే మిచెల్ స్టార్క్ సేవలను కోల్పోయిన ఢిల్లీకి.. రాహుల్ కూడా దూరమైతే గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కాగా ఈ ఏడాది సీజన్లో రాహుల్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో మెరిశాడు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్, దుష్మంత చమీరా, సెడికుల్లా అటల్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్, త్రిష్వానా విజయ్ నాయర్ కుమార్, అజయ్ జాదవ్ మండల్, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా, మన్వంత్ కుమార్
బిజినెస్

'ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి': ఎంపీ ట్వీట్
బెంగళూరులో ఆదివారం (మే 18) ఉదయం 8:30 గంటల నుంచి సోమవారం (మే 19) ఉదయం 8:30 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 105.5 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రయాణం ఇబ్బందిగా మారింది, ఆఫీసులకు వెళ్లలేక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో బెంగళూరులోని అన్ని కంపెనీలు రెండు రోజులు వర్క్ ఫ్రమ్ సదుపాయం అందించాలని బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ట్వీట్ చేశారు.భారీ వర్షాల కారణంగా.. కాగ్నిజెంట్ కంపెనీ ఈరోజు (మే 20) తన ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ.. బెంగళూరులో 40,000 మంది ఉద్యోగులను నియమించింది.ఇన్ఫోసిస్ ఇప్పటికే మూడు రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అనుసరిస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టెక్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ వర్షం కారణంగా, సిల్క్ బోర్డ్.. రూపేన అగ్రహార మధ్య హోసూర్ రోడ్డును బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు.All companies in Bengaluru, including Infosys, must declare two days of work from home due to rains.— P C Mohan (@PCMohanMP) May 19, 2025

మార్కెట్లోకి హోండా ‘రెబల్ 500’: బుకింగ్‌లు ప్రారంభం
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) ‘హోండా రెబల్ 500’ పేరుతో కొత్త మోటార్ సైకిల్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ.5.12 లక్షలు (ఎక్స్–షోరూమ్)గా ఉంది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూన్ నుంచి మొదలవుతాయి.గురుగ్రామ్, ముంబై, బెంగళూరులోని ఎంపిక చేసిన బిగ్‌వింగ్ డీలర్íÙప్లో బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ జూన్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. 471 సీసీ లిక్విడ్–కూల్డ్, 4–స్ట్రోక్, 8–వాల్వ్, ప్యారలల్ ట్విన్–సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన రెబల్ 500ను భారత్‌కు తీసుకురావడం సంతోషంగా ఉందని కంపెనీ ఎండీ, సీఈఓ సత్సుము ఒటానీ తెలిపారు.

మొబైల్ ఫోన్ హ్యాక్: రూ.11.55 కోట్లు మాయం
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అమాయక ప్రజలు మాత్రమే కాకుండా.. కొన్ని సంస్థలు కూడా వీరి మాయలో పడిపోతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించిన ఒక పెద్ద ఆన్లైన్ మోసం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో మోసగాళ్ళు ఒక కస్టమర్ మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఏకంగా రూ. 11.55 కోట్లు విత్‌డ్రా చేశారు.మోసగాళ్ళు ఒక కస్టమర్‌ను మోసగించి మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకునేలా చేశారు. దీని ద్వారా చంబా జిల్లాలోని బ్యాంక్ హల్టి బ్రాంచ్‌కు లింక్ అయిన అతని బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ లభించింది. అంతే కాకుండా బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి NEFT, RTGS లావాదేవీల ద్వారా 20 ఖాతాలకు డబ్బును బదిలీ చేశారు.ఈ స్కాముకు సంబంధించిన లావాదేవీలు మే 11, 12 తేదీలలో జరిగాయి కానీ, మే 13 సెలవు దినం కావడంతో, బ్యాంకు అధికారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లావాదేవీ నివేదిక అందిన తర్వాత మే 14న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే సిమ్లా సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..స్కామ్ బయటపడిన వెంటనే.. బ్యాంక్ అధికారులు సంబంధిత ఖాతాలను స్తంభింపజేశారు. దీనిపై లోతైన దర్యాప్తు నిర్వహించడానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) బృందం సిమ్లాకు చేరుకోనుంది. హ్యాకర్లు ఎలా ప్రవేశించారు, బ్యాంక్ వ్యవస్థలకు ఇతర భద్రతా బలహీనతలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేయనున్నారు.డిజిటల్ బ్యాంకింగ్ మోసాలను నివారించడానికి RBI మార్గదర్శకాలు➤మీ లాగిన్ వివరాలు, పిన్, ఓటీపీ లేదా కార్డడుల సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.➤అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని ఫైల్‌లను డౌన్లోడ్ చేయడం మానుకోవాలి.➤యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి.➤బ్యాంకులకు సంబంధించిన ఏవైనా వివరాలు కావాలనుకుంటే.. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారిక వెబ్సైట్లను సందర్శించాలి.

లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 886.65 పాయింట్లు లేదా 1.08 శాతం నష్టంతో.. 81,172.77 వద్ద, నిఫ్టీ 270.85 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 24,674.60 వద్ద నిలిచాయి.ఆల్కలీ మెటల్స్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, కాప్స్టన్ సర్వీసెస్, హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, HLE గ్లాస్‌కోట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గణేష్ బెంజోప్లాస్ట్, క్వెస్ కార్ప్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, డీఓఎంఎస్ ఇండస్ట్రీస్, కొచ్చిన్ షిప్‌యార్డ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).
ఫ్యామిలీ

Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు కేన్సర్ తీవ్రతరమైన స్థాయిలో ఉందని ఆయన కార్యాలయం వెల్లడించింది. వైద్య పరీక్షల్లో బైడెన్‌కు తీవ్రమైన ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎముకలకు వ్యాపించిందని చెబుతున్నారు. 82 ఏళ్ల బైడెన్ గత కొన్ని రోజులుగా మూత్ర విసర్జన సంబంధిత సమస్యలతో బాధపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా..ఈ విషయం వెల్లడైందని వైద్యులు చెబుతున్నారు. చెప్పాలంటే బైడెన్ సివియర్ కేన్సర్ స్టేజ్‌తో పోరాడుతున్నారు. త్రీవతరమైన దశలో ఉన్న ఈ కేన్సర్‌ని నిర్వహించడం సులభమేనని త్వరితగతిని ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకుంటారని బైడెన్ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే ఈ కేన్సర్ ఏవిధంగా ప్రాణాంతకంగా మారుతుందా..? ఆ కేన్సర్ కణాలు ఎముకలకు వ్యాపించడం అంటే..ప్రోస్టేట్ కేన్సర్(Prostate cancer)ని వైద్యులు మొదటగా ఏ స్థాయిలో ఉందో నిర్థారిస్తారు. ఇక్కడ బైడెన్‌కు 9 స్కోరుతో అత్యంత తీవ్ర స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉందని వెల్లడైంది. పైగా ఆ కేన్సర్ ఎముకల వరకు వ్యాపించిందని తెలిపారు. అదెలా జరుగుతుందంటే..ప్రోస్టేట్ కేన్సర్ పురుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా నెమ్మదిగా పెరుతుంది. ఒక్కోసారి శరీరంలోని ఇతర భాగాలకు అంటే..ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అంటే ఇక్కడ వెన్నెముక, తుంటి, పెల్విస్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుందట. ఈ దశని క్రిటికల్ స్టేజ్‌గా పేర్కొన్నారు వైద్యులు. దీనివల్ల రోగికి తీవ్రమైన నొప్పి, వెన్నుపాము కుదింపు, చలశీలతకు సంబంధించిన సమస్యలు ఉత్ఫన్నమవుతాయిని చెబుతున్నారు. అంతేగాదు ప్రోస్టేట్ కేన్సర్ ఎముక నిర్మాణాన్ని ప్రేరేపిస్తుందట. ఎముకను పెళుసుగా మార్చి విరిగిపోయేలా చేస్తుందట. అందువల్ల ఆయా బాధితులకు రాత్రిపూట ఎముక సంబంధిత నొప్పులు తీవ్రతరమవుతాయట. అందులోనూ 80 ఏళ్లు పైబడిన వారిలో, ఎముకలకు వ్యాపించే ప్రోస్టేట్ కేన్సర్ అనేది అత్యంత ప్రాణాంతకమైదిగా పేర్కొన్నారు నిపుణులు. ముందస్తుగా ఎలా గుర్తించాలంటే..బాడీ వెనుక లేదా తుంటిలో నిరంతర ఎముక నొప్పి. నాడీ సంబంధిత సమస్యలను అలక్ష్యం చేయకూడదు. బయాప్సీ ఫలితాల ఆధారంగా ప్రోస్టేట్ కేన్సర్ స్టేజ్‌ని నిర్థారిస్తారు.చికిత్స: హార్మోన్ థెరపీ, రేడియేషన్, కీమోథెరపీ, ఎముకలను లక్ష్యంగా చేసుకునే శస్త్రచికిత్సలతో నయం చేస్తారు. ఇంత ప్రాణాంతక స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నప్పుడూ..పూర్తినివారణ సాధ్యం కాదని చెబుతున్నారు నిపుణులు. కేవలం దాన్ని నిర్వహించగలం.. అంతే అన్నారు. ఇక్కడ రోగి జీవన నాణ్యత మెరుగుపరిచేలా చికిత్స అందిస్తారు. కేవలం ఆయా బాధితులు మూత్ర సంబంధిత సమస్యలకు, ఎముకల బలం కోసం విటమిన్ డి స్లపిమెంట్స్ వంటి వాటితో చికిత్స అందించి పరిస్థితి మెరుగుపడేలా చేయగలరే తప్ప పూర్తి స్థాయిలో ఈ సమస్య నుంచి బయటపడటం జరగదని తెలిపారు. అలాగే కొన్ని రకాల కేన్సర్లను మొదటి స్టేజ్‌లో ఉంటేనే పూర్తి స్థాయిలో నివారించడం సాధ్యపడుతుందని నొక్కి చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..! )

మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఫ్యాషన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో మన ఫ్యాషన్ స్టైల్ ఫ్యాషన్ ప్రియులనుంచి సామాన్యులదాకా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెట్ గాలా, కేన్స్ లాంటి ప్రతిష్టాత్మక వేదికలు, ఐకానిక్ ప్రపంచ వేదికలపై మన భారతీయ నటీమణులు, సెలబ్రిటీలు భారత సంప్రదాయ ఫ్యాషన్ శైలిని ప్రదర్శిస్తున్నారు. రెడ్ కార్పెట్ దేశీ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తారలు మాత్రమే కాదు..వివిధ స్థాయిలలో భారతీయ వారసత్వాన్ని ప్రభావితం చేస్తున్న సామాన్యులకు కూడా కొదవేమీ లేదు. తాజా వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ మెట్రోలో లెహంగాలు, అనార్కలి లేదా చీరలు ధరించి రీల్స్ చేసే అమ్మాయిలను చూసి ఉంటారు. కానీ విదేశాల్లో మెట్రోలో చీర లేదా మన సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులను చూడటం చాలా అరుదు. తాజా ప్యారిస్‌లోని మెట్రోలో ఒక లెహంగాలో అందంగా మెరిసిన యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో నివ్య సందడి చేస్తోంది. ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!భారతీయ సంతతికి చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ నివ్య ప్యారిస్‌లోని స్థానిక రైలులో అందమైన లెహెంగాలో ప్రయాణించడమే కాదు, చక్కటి హావభావాలను ఆకట్టుకుంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న తన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తెగ మురిసి పోతున్నారు. నివ్య బ్రైట్ నారింజ రంగు భారీ లెహంగాలో మెరిసింది. క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లెహెంగాకు స్లీవ్‌లెస్ చోలి సెట్, ఇతర నగలతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కూల్...కూల్‌గా గాగుల్స్ పెట్టుకుని మరింత స్టైల్‌గా కనిపించింది. గత ఏడాది నవంబరులో షేర్ చేసిన ఈ వీడియో ఏకంగా 10 లక్షలకు పైగా వ్యూస్, వేల కామెంట్లను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by MAKEUP & HAIR ARTIST PARIS (@tanzeela.beauty) యూరప్‌లో భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తూ, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిన నివ్యను నెటిజన్లు ప్రశంసించారు. చాలా అందంగాఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌లోని మెట్రోలో బంగారు నగలతో ప్రయాణిస్తున్నారా? సేఫ్టీ ఫస్ట్. ఇవి కాస్ట్యూమ్ ఆభరణాలు అయితే మంచిది. అవి మీ అమ్మగారి ఆభరణాలు కాకూడదని అనుకుంటున్నా అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇదే లెహంగాలో ఆకట్టుకున్న వీడియో కూడా ఆకర్షణీయంగా నిలిచింది. చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు View this post on Instagram A post shared by Nivya | Fashion & Lifestyle (@boho_gram)p>

చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..!
చిన్న వయసులోనే యాసిడ్ దాడికి గురైన కఫీకి భవిష్యత్ మసక మసకగా కూడా కనిపించలేదు. అంతా అంధకారమే! భయానకమైన నిస్సహాయతలో నుంచి కూడా అప్పుడప్పుడూ అభయమిచ్చే శక్తి ఏదో పుట్టుకువచ్చి....‘అదిగో నీ భవిష్యత్’ అని చూపుతుంది. కఫీ విషయంలోనూ అలాగే జరిగింది. ఛండీఘడ్కు చెందిన కఫీ 2023లో క్లాస్ 10 సీబీఎస్ఈ పరీక్షల్లో 95.2 శాతం మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది. తాజాగా... క్లాస్ 12 సిబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో 95.6 శాతం మార్కులు సాధించి తిరిగి వార్తల్లోకి వచ్చింది. తన విజయాన్ని కుటుంబ సభ్యులకు అంకితం చేసిన కఫీ... ‘తల్లిదండ్రులు నా బలం. స్ఫూర్తి. వారు నా కోసం ఎంతో త్యాగం చేశారు. వారి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలు మన భవిష్యత్తును నిర్ణయించలేవు. మన కష్టమే మన భవిష్యత్తు’ అంటుంది కఫీ.కఫీ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, హోలి పండగ రోజు ముగ్గురు వ్యక్తులు రంగు చల్లినట్లు తనపై యాసిడ్ చల్లారు. వారి రాక్షసానందానికి ఆ చిన్నారి కంటి చూపు దెబ్బతిన్నది. కఫీకి తిరిగి చూపు తెప్పించడానికి తల్లిదండ్రులు ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేశారు.‘నా లక్ష్యం ఐఏఎస్’ అని ఆత్మవిశ్వాసం నిండిన స్వరంతో చెబుతోంది కఫీ. (చదవండి: 'చూపే బంగారం'..! అంధత్వ సమస్యలకు చెక్‌పెడదాం ఇలా..)

నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!
మానసిక పరిణితి లేని ఆడపిల్ల నీహారిక కంటిపాపలా చూసుకున్న తల్లిదండ్రులు ఆనందాన్నీ, అవసరాలను వదులుకున్నారు బిడ్డ కోసం టీచరుగా మారిందా తల్లి ఇష్టమైన సైక్లింగ్‌లోనూ శిక్షణనిచ్చింది స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గేలా చూశారుఇప్పుడా బిడ్డలాంటి మరికొందరికోసం ఏకంగా అలాంటి పాఠశాలనే నడుపుతోందా తల్లితెనాలి: ‘‘అది 2019 సంవత్సరం మార్చి నెల. 14–21 తేదీల్లో దుబాయ్‌లో స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్. 25 గేమ్స్‌లో 170 పైగా దేశాలకు చెందిన ఏడు వేల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 280 మంది వివిధ పోటీల్లో తలపడ్డారు. ఇందులో సైక్లింగ్‌లో 16 మంది పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ యువతి ఆ పోటీలో పాల్గొంది. ఆ పోటీల్లో యువతి 500 మీటర్లు, కిలోమీటరు పోటీలు రెండింటిలోనూ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాలను కైవసం చేసుకుంది. రెండు కి.మీ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. ఆ యువతే 2018లో రాంచీలో నిర్వహించిన జాతీయ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో కిలోమీటరు సైక్లింగ్‌లో బంగారు పతకం, రెండు కి.మీ విభాగంలో రజత పతకం గెలిచి, స్పెషల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.’’మానసిక పరిపక్వత లేదని సమాజం ఈసడించింది. తనపై డబ్బు ఖర్చుచేసినా, శ్రమ వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం లేదు... తిండి, బట్ట ఇస్తే సరిపోతుందని తలిదండ్రులకు జాగ్రత్తలు చెప్పింది. అయితే సమాజం మాటవిని ఆ పాపను తల్లిదండ్రులు వదిలేయలేదు. తనకోసం తమ ఆనందాల్నీ, అవసరాలనూ వదులుకున్నారు. మానసిక వికలాంగురాలైన తమ కూతురు నీహారికను తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలలో చదివిస్తూ తనకెంతో ఇష్టమైన సైక్లింగ్‌లో శిక్షణనిస్తూ వచ్చిందా తల్లి భార్గవి. తద్ఫలితమే.. నీహారిక సాధించిన విజయాలు. భార్గవి సొంతూరు చినపరిమి భార్గవి సొంతూరు తెనాలి సమీపంలోని చినపరిమి. భర్త ఆర్మీ ఉద్యోగి ముక్కామల శివరామకృష్ణ. 2001లో తొలి కాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఏడాదిన్నర వచ్చినా నడక రాకపోవటంతో అనుమానం వేసింది. ఉద్యోగరీత్యా అప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఉన్నారు. ‘ఒకసారి న్యూమోనియాకు ఇచ్చిన మందు ఓవర్‌డోస్ అయి, నాలుగురోజులు పాప కోమాలో ఉంది... తెలివొచ్చేసరికి మాటలు బాగా తగ్గిపోయాయి..చెప్పిందీ అర్థం చేసుకోవటం తగ్గింది. డ్రమ్స్ మోగినా, బాణసంచా పేలుళ్లు విన్నా, భయంతో వణికేది...పెరిగేకొద్దీ ఆ భయం ఎక్కువైంది’ అని భార్గవి గుర్తుచేసుకున్నారు. అయిదో ఏడు వచ్చేసరికి ఆగ్రాకు వెళ్లారు. అక్కడి డాక్టర్లు ‘ఇంటలెక్చువల్ డిసేబిలిటీ’ అన్నారు. ‘పిల్లలతో విపరీతంగా ప్రవర్తించేది అప్పుడే... డ్రమ్స్, బాణసంచా మోతకు భయపడిపోయేది. ఎవరినీ దగ్గరకు రానిచ్చేదికాదు...తనొక్కతే ఏదొక వస్తువుతో ఆడుకుంటూ ఉండేది...ఆ క్రమంలో సైకిల్ తనను బాగా ఆకర్షించింది...చిన్న సైకిల్ నడిపేది. పాడైపోతే కొత్తది కొనేదాకా ఊరుకునేది కాదు...ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాను’ అన్నారు భార్గవి. అప్పటికి తనకు మరో బాబు కలిగాడు. కుమార్తె కోసం త్యాగాలు.. పాప ఆరోగ్యం కారణంగా హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో చేరి్పంచారు. కొడుక్కి హోం వర్క్ చేయించేటపుడు, నీహారికను దగ్గరుంచారు. స్పీచ్ థెరపీనీ ఇప్పించారు. 2013లో విజయవాడకు వచ్చేశారు. 2013 నవంబరులో ఇలాంటి పిల్లల కోసం ఓపెన్ ఛాంపియన్íÙప్ పోటీలు జరుగుతాయని తెలుసుకున్నారు. 2014లో పార్టిసిపేట్ చేసేలా చూశారు. ప్రతిరోజూ తెల్లవారు జామున 4 గంటలకు పాపను నిద్రలేపటం, హైవేపై 10 కి.మీ ప్రాక్టీస్ చేయించి, ఇంటికి తీసుకొచ్చేవారు. తర్వాత ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’కు తీసుకెళ్తారు. నీహారిక కోసం తనుకూడా అదే స్కూలులో ఉద్యోగం చేశారు భార్గవి. శివరామకృష్ణ కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.మరెన్నో విజయాలు.. 2014లో భోపాల్‌లో జరిగిన ఓపెన్ ఛాంపియ్షిప్లోనూ కి.మీ, 2 కి.మీ విభాగాల సైక్లింగ్‌లో బంగారుపతకం, రజత పతకాన్ని నీహారిక సాధించింది. ఈ విజయంతో 2015లో లాస్‌ఎంజెల్స్‌లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌కు ఎంపికైనా, అనివార్య కారణాలతో సైక్లింగ్‌లో పాల్గొనేందుకు వీల్లేకపోయింది. యూనిఫైడ్ వాలీబాల్ గేమ్‌లో భారత జట్టుకు ఆడి, కాంస్య పతక సాధనకు తోడ్పడింది. రెండు స్పెషల్ ఒలింపిక్స్‌లో ఆడి పతకాలను సాధించటం నిస్పందేహంగా నీహారిక ఘనతే. ఇందుకు పునాది, పట్టుదల, తపన ఆమె తల్లి భార్గవిది. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదనేందుకు నిదర్శనమే వీరి విజయం.విభిన్న ప్రతిభావంతులకు తల్లిలా.. తన బిడ్డ నీహారిక లాంటి మరికొందరి కోసం ఇప్పుడా తల్లి ఏకంగా స్కూలునే నడుపుతోంది. 2020లో ప్రజ్ఞ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టరు చేశారు. 2022 నుంచి ఆ సొసైటీ తరఫున సాయి అంకుర్ స్పెషల్ స్కూల్‌ను ఆరంభించారు. 2019లో స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకాల సాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్‌మనీతో మొదలుపెట్టిన స్కూలుకు ఇప్పుడు సొంత డబ్బులు పడుతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల మద్దతు తోడవుతోంది. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం, అవసరాలను తీర్చుకోవటం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా శిక్షణనివ్వటం తమ ఆశయమని చెప్పారు భార్గవి. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులోని ‘సాయి అంకుర్ స్పెషల్ స్కూల్’ ఇప్పుడు భార్గవి ప్రపంచం. 24 ఏళ్ల కుమార్తె నీహారికతో సహా పదిహేనుమంది విభిన్న ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడ పిల్లలకు రకరకాల యాక్టివిటీస్, ఆటలతో బోధన ఉంటుంది. రోజువారీ స్కూలుకు వెళుతూ రెమిడియల్ క్లాసుకు వచ్చేవారూ ఉన్నారని భార్గవి చెప్పారు. తనతోపాటు అక్కడ ముగ్గురు టీచర్లు, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. పాప కోసం ‘ఆటిజమ్ రీసెర్చ్ అండ్ మల్టీ డిసిప్లిన్ స్కూలు’ టీచరుగా పనిచేసిన భార్గవి, ఇప్పుడు ఏకంగా అలాంటి స్కూలునే నడుపుతూ ఎందరికో తల్లిలా మారింది.
ఫొటోలు
అంతర్జాతీయం

మాజీ ప్రధానిగా నటనకు ప్రశంసలు, హత్యాయత్నం కేసులో అందాల నటి
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్‌కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్‌కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి. నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్‌గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది. ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!

అగ్నిపర్వతం బద్దలు.. అధికారుల్లో టెన్షన్.. కారణం ఇదే..
పడాంగ్: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం ధాటికి దాదాపు ఆరు కిలోమీటర్ల ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసి పడింది. దీంతో, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకిలో ఉన్న అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఈ సందర్భంగా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అధిపతి ముహమ్మద్ వాఫిద్ పేర్కొన్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రాంతాలకు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అన్నారు.ఇదే సమయంలో అగ్నిపర్వతం నుంచి దాదాపు 6 కి.మీ ఎత్తుకు మందంపాటి బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.VIDEO: Indonesia's Mount Lewotobi Laki-Laki -- located on the tourist island of Flores -- erupts again, spewing thick ash up to 6,000 meters above its peak. pic.twitter.com/1afAM1qe3K— AFP News Agency (@AFP) May 18, 2025

బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్.. స్పందించిన ట్రంప్, కమలాహారిస్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తాజాగా ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఆయనకు జరిపిన ఆరోగ్య పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధరణ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల బైడెన్‌కు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో, పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబసభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ స్పందించారు. బైడెన్ క్యాన్సర్ అనే విషయం తనను కలచి వేసిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ పోరాట యోధుడని పేర్కొన్న ఆమె.. ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.Doug and I are saddened to learn of President Biden’s prostate cancer diagnosis. We are keeping him, Dr. Biden, and their entire family in our hearts and prayers during this time. Joe is a fighter — and I know he will face this challenge with the same strength, resilience, and… pic.twitter.com/gG5nB0GMPp— Kamala Harris (@KamalaHarris) May 18, 2025మరోవైపు.. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్.. ‘జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడం దురదృష్టకరం. ఈ విషయం తెలిసి నేను, మెలానియా చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. "Melania and I are saddened to hear about @JoeBiden’s recent medical diagnosis. We extend our warmest and best wishes to Jill and the family, and we wish Joe a fast and successful recovery." –President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/6HjermTGK7— The White House (@WhiteHouse) May 18, 2025

ఎవరెస్ట్‌పైకి 19వసారి!
కఠ్మాండు: ప్రఖ్యాత బ్రిటిష్ పర్వతారోహకుడు కెంటన్ కూల్ (51) సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను రికార్డు స్థాయిలో 19వ సారి అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి షెర్పాయేతరుడిగా నిలిచారు. ఈ విషయంలో కూల్ తన రికార్డును తానే అధిగమించడం విశేషం. మౌంటెయిన్ గైడ్ అయిన కూల్ ఇతర అధిరోహకులతో కలిసి ఆదివారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన 2004లో తొలిసారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అప్పటినుంచి 2014, 2015, 2020ల్లో మినహా ఏటా ఎవరెస్ట్ ఎక్కుతూ వస్తున్నారు. మంచు చరియలు విరిగిపడటం వల్ల 2014లో, భూకంపంతో 2015లో, కరోనా కారణంగా 2020లో ఎవరెస్ట్ యాత్ర జరగలేదు. ఎవరెస్ట్‌ను అత్యధిక పర్యాయాలు అధిరోహించిన రికార్డు మాత్రం నేపాలీ షెర్పాలదే. షెర్పా గైడ్ కమి రిటా అత్యధికంగా 30సార్లు ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన మరోసారి శిఖరాన్ని చేరుకునే ప్రయత్నంలోనే ఉండటం విశేషం!
జాతీయం

Covid-19 Returns: 257 కేసులు.. ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: కోవిడ్-19 మరోమారు విజృంభిస్తోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19(COVID-19) కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ తదితర దేశాలలో కరోనా కేసులు(Corona cases) అంతకంతకూ పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ ఉప-వేరియంట్లయిన జేఎన్-1, ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 కేసుల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 57 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. వీటిలోని అధికశాతం తేలికపాటివిగా, ఆసుపత్రి సంరక్షణ అవసరం లేనివిగా ఉన్నాయి.ప్రభుత్వం అందించిన డేటాలోని వివరాల ప్రకారం మే 12 తరువాత కేరళలో అత్యధిక సంఖ్యలో మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. అలాగే కర్ణాటకలో ఎనిమిది, గుజరాత్లో ఆరు, ఢిల్లీలో మూడు, హర్యానా, రాజస్థాన్, సిక్కింలలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. కాగా మహారాష్ట్ర(Maharashtra)లోని ముంబైలో గల కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆస్పత్రిలో కోవిడ్-19తో ఇద్దరు మృతిచెందారు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ ఇద్దరు రోగులకు తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు.వీరిలో ఒకరు నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతిన్న 14 ఏళ్ల బాలుడని, మరొకరు 54 ఏళ్ల క్యాన్సర్ రోగి అని వైద్యులు తెలిపారు. కాగా దేశ జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గిన కారణంగా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజృంభిస్తున్న జేఎన్ వేరియంట్ లక్షణాలు ఒమిక్రాన్ తరహాలోనే ఉన్నాయని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.జేఎన్-1 వేరియంట్ లక్షణాలుగొంతు నొప్పిజ్వరంముక్కు కారడంపొడి దగ్గుతలనొప్పిఅలసటరుచి లేదా వాసన కోల్పోవడంతాజాగా కరోనా బారిన పడిన బాధితులలో కొందరు తాము తీవ్రమైన అలసటను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వర్షాకాలం(Rainy season) వచ్చే ముందు సంభవించే వ్యాధులు ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఫ్లూ తరహా లక్షణాలను ఎదుర్కొంటున్న వారు జనసమూహాలకు దూరంగా ఉండాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.ఇది కూడా చదవండి: బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే..

NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు
చండీఘడ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లు వినియోగించినట్లు తేలింది. ఎన్ఐఏ విచారణలో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్‌గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే? ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేదని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం,ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాన్ దార్‌తో సన్నిహితంగా ఉండడంతో మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.గూఢచర్యం కేసులో ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్లో పర్యటన, ఐఎస్ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది.

ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..
పూణే: ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్(Scientist Jayant Vishnu Narlikar) మహారాష్ట్రలోని పూణేలో నేడు (మే 20) కన్నుమూశారు. భారతదేశంలో ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంలో నార్లికర్ గణనీయమైన పాత్ర పోషించారు. విశ్వోద్భవ శాస్త్రం, బిగ్ బ్యాంగ్‌కు ప్రత్యామ్నాయ సిద్ధాంతాల రూపకల్పనలో నార్లికర్ విశేష కృషి చేశారు. పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(Inter-University Center for Astronomy and Astrophysics) (ఐయూసీఏఏ) వ్యవస్థాపక డైరెక్టర్‌గా పేరొందారు. 1938, జూలై 19న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ ఆయన ఫ్రెడ్ హోయిల్‌తో కలిసి హోయ్ల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ విశ్వోద్భవ నమూనాలను సవాలు చేసింది.తన శాస్త్రీయ రచనలతో పాటు నార్లికర్ పలు సంక్లిష్టమైన శాస్త్రీయ భావనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆయన మరాఠీలో సైన్స్ ఫిక్షన్ కూడా రాశారు. నార్లికర్ రచనలు కొత్త తరాల పరిశోధకులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో నార్లికర్ చేసిన కృషిగా గాను ఆయన పద్మభూషణ్ (1965), పద్మవిభూషణ్ (2004), మహారాష్ట్ర భూషణ్ (2010) తదితర ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1980ల చివరలో ఆయన ప్రముఖ టీవీ షో ‘కాస్మోస్: ఎ పర్సనల్ వాయేజ్’లో కనిపించారు. ఇది ఖగోళ భౌతిక శాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపును మరోమారు గుర్తు చేసింది.ఇది కూడా చదవండి: World Bee Day... అప్పుడు మనిషి జీవితం నాలుగేళ్లే!

Meghalaya: మూక దాడి.. 15 ట్రక్కులు ధ్వంసం
లుమ్ష్నాంగ్: మేఘాలయలోని లుమ్ష్నాంగ్లో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం రాత్రి ఒక సిమెంట్ కంపెనీ ట్రక్కు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సిమెంట్ కంపెనీ పరిసరాలను ఆక్రమించి, సుమారు 15 ట్రక్కులను ధ్వంసం చేసి, వాటికి నిప్పు పెట్టారు.వివరాల్లోకి వెళితే ఈ ఘటన జైంటియా హిల్స్ జిల్లాలోని వహియాజెర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి ఎన్‌హెచ్-6పై జరిగింది. తొలుత ఒక సిమెంట్ కంపెనీ ట్రక్కు ఒక పికప్ వాహనాన్ని ఢీకొంది. ఈ దరిమిలా ఆగ్రహించిన పికప్ వాహనం డ్రైవర్.. సిమెంట్ ట్రక్కు డ్రైవర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సిమెంట్ ట్రక్కు డ్రైవర్ వేగంగా డ్రైవ్ చేస్తూ, పికప్ వాహనం డ్రైవర్‌ను ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సిమెంట్ ట్రక్కు డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు ఆయుధాలు చేతపట్టి సిమెంట్ కంపెనీ పరిసరాలను ఆక్రమించారు. సెంట్రీ పోస్ట్‌తో పాటు సీసీటీవీ వ్యవస్థలను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. అంతటితో ఆగక 15 ట్రక్కులు తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు. జైంటియా హిల్స్ జిల్లా పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. సిమెంట్ ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హింసాత్మక ఉదంతానికి సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఘటన నేపధ్యంలో లుమ్ష్నాంగ్ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇది కూడా చదవండి: గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
ఎన్ఆర్ఐ

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్‌రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్‌నేత్రాలయ ప్రకటించింది.

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.
క్రైమ్

స్పా ముసుగులో వ్యభిచారం
కర్ణాటక: మండ్య నగరంలోని బెంగళూరు -మైసూరు జాతీయ రహదారిలో క్లౌడ్ -11 పేరుతో నిర్వహిస్తున్న యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పాపై ఒడనాడు సంస్థ సిబ్బంది, పోలీసులు సం యుక్తంగా దాడి చేశారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి సెలూన్ యజమాని ఎలిజబెతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలకు విముక్తి కల్పించారు.ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వారిని వ్యభిచారం ఊబిలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఈ స్పా సమీపంలోనే విద్యా సంస్థలు ఉన్నాయి. స్పాలో చీకటి వ్యవహారాలు జరుగుతున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతో ఒడనాడు సంస్థకు చెందిన స్వాన్లి పరశురామ్, సీఐ నవీన్ లు పోలీసులతో కలిసి దాడి చేశారు.

వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
గుంటూరు: ఈ ఏడాది ఫిబ్రవరిలో నా భర్త సాయిబాబు బల్బు బిగిస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు చేయి మణికట్టు వద్ద విరిగింది. స్థానిక కొత్తపేటలోని హాస్పిటల్‌కు తీసుకెళితే సర్జరీ చేశారు. చేసిన మరుసటి రోజే ఆయనకు కుడివైపు పక్షవాతం వచ్చింది. కనీసం ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయకపోగా హడావుడిగా మమ్మల్ని బయటకు పంపేశారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబాన్ని నడిపించే నా భర్త అచేతనంగా పడి ఉండడానికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. మెడికల్ వెరిఫికేషన్ పెట్టించాలని మనవి.–జక్కంపూడి శ్రీవల్లి, గుంటూరునా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు

నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్‌కుమార్ మేనకూరు సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్‌కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్‌కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్‌కుమార్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు.. మా కళ్లెదుటే అమ్మ చనిపోయింది’ అంటూ ఆ చిన్నారి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని తన తల్లిని చంపిన వైనాన్ని పోలీసులకు వివరించిన తీరు స్థానికులను కలచివేసింది. కన్న బిడ్డల ఎదుటే అతి కిరాతకంగా భార్యను కడతేర్చిన ఘటనపై పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య వీణమ్మ(28)ను భర్త రాపూరు శ్రీనివాసులు హత్య చేసిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి తుపాకులు పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలికి అఖిల(7), బత్తెయ్య(4), ఆదెయ్య(3) చిన్నారులున్నారు. శనివారం రాత్రి భర్త శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి భార్య వీణమ్మతో గొడవపడ్డాడు. ఆపై బండరాయితో తలపై మోది చంపేశాడు. తర్వాత పాము కాటు వేయడంతో వీణమ్మ మృతి చెందిందని నమ్మబలికాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పెంచలమ్మ ఆదివారం ఉదయం బిక్కుబిక్కుమంటూ ఏడ్చుతున్న వీణమ్మ పిల్లల్ని అక్కున చేర్చుకుంది.పోలీసుల ఔదార్యం విచారణ అనంతరం వీణమ్మ మృతదేహానికి సోమవారం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుటంబ సభ్యులు నిరుపేద గిరిజనులు కావండతో వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. వీణమ్మ మృతదేహాన్ని సైతం తీసుకెళ్లందుకు వారి వద్ద నగదు లేక పోవడంతో పోలీసులే నాయుడుపేటలో వీణమ్మకు అంత్యక్రియలు జరిపించారు. పరారీలో ఉన్న ఆమె భర్త శ్రీనివాసులును త్వరలో పట్టుకుంటామని తెలిపారు.