DCP sumati
-
పక్కా ప్లాన్.. సినిమా తరహా చోరి
సాక్షి, హైదరాబాద్ : ఆ ఏరియాలోకి ఓ కుటుంబం కొత్తగా వచ్చి నివాసం ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆ ఏరియాలోని ఒక వ్యక్తితో స్నేహం చేస్తారు. అతని ద్వారా ఆ ఏరియా వివరాలు అన్నీ తెలుసుకుంటారు. ఇంట్లో నుంచి అంతా వెళ్లిపోయాక.. ప్లాన్ ప్రకారం ఈ గ్యాంగ్ఇంట్లోకి చొరబడుతుంది. ఒకరేమో చెత్త కుండి వద్ద పిచ్చొడిలా కూర్చొని అందరిని గమనిస్తాడు. ఎవరైనా అటువైపు వస్తే సిగ్నల్ ఇస్తాడు. అంతే వారు పారిపోతారు. ఇదంతా వింటుంటే ఓ సినిమాలోని చోరీలా ఉంది కదూ..! కానీ ఇది నగరంలో వాస్తవంగా దొంగతనం తీరు. మంగళవారం నార్త్ జోన్ పోలీసులు చోరి ముఠాను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా దొంగతనం చేసిన తీరును పై విధంగా వివరించారని చెప్పారు. ఇలా చోరీలు చేసిన సొమ్ముతో నెరెట్మెట్లో సింగిల్ బెడ్రూమ్ను కూడా కొనుగోలు చేశారు. ఈ విషయంపపై సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ..గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మహమ్మద్ సద్దాం అలీ, దంపతులు అన్వర్ అలీ, సలిమాతో పాటు మొత్తం 12 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 5కేజీ బంగారం, 12 కేజీల సిల్వర్, ఏడు లక్షల నగదు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని తెలిపారు. డీసీపీ సుమతి మీడియాతో మాట్లాడుతూ.. ఈ చోరిల్లో మహిళలే కీ రోల్ పోషించారన్నారు. ముఠాలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులే ఉన్నారని తెలిపారు. వీరిపై 34కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. సాక్ష్యాలు దొరకుండా సీసీ టీవీ కెమెరాల కేబుల్స్ కట్ చేసి చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుల ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కేసును ఛేదించినట్లు డీసీపీ సుమతి పేర్కొన్నారు. -
ప్లాన్ ప్రకారమే కార్తీక్ దాడి : డీసీపీ సుమతి
సాక్షి, హైదరాబాద్ : సంధ్యారాణి హత్యకేసులో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి కేసు వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఘటన దురదృష్టకరమని ...పథకం ప్రకారమే కార్తీక్...సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో అన్ని వివరాలు సేకరించామని, కార్తీక్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఏడాది కాలంగా కార్తీక్...సంధ్యారాణిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సంధ్యారాణి అందంగా ఉండటమే కాకుండా, చక్కగా చదువుకుంది. అయితే కార్తీక్ మాత్రం ఏడో తరగతి ఫెయిల్ కావడమే కాకుండా ఆవారాగా తిరుగుతున్నాడు. దీంతో ఆమె అతడిని కాదనుకుంది. అంతేకాకుండా కార్తీక్ వేధింపుల విషయాన్ని సంధ్యారాణి తాను పని చేస్తున్న లక్కీ ట్రేడర్స్ యజమాని దృష్టికి తీసుకు వెళ్లింది. యజమాని కూడా అతడిని మందలించాడు. కార్తీక్...సంధ్యకు ఉద్యోగం చూపించినా, ఆమె స్వశక్తితోనే అక్కడ రాణిస్తోంది. అయితే సంధ్యారాణి తనను దూరం పెట్టడాన్ని సహించలేని కార్తీక్ ఈ వికృత చర్యకు పాల్పడ్డాడు. 64 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంధ్యారాణి ఈ రోజు ఉదయం మృతి చెందింది. నిందితుడు కార్తీక్‌పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశాం.’ అని తెలిపారు. మరోవైపు సంధ్యారాణి మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అందచేశారు. ఆమె మృతదేహాన్ని లాలాపేటకు తరలించారు. -
పథకం ప్రకారమే కార్తీక్...సంధ్యారాణిపై దాడి
-
వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్ట వేద్దాం
కంటోన్మెంట్: వైట్ కాలర్ నేరాల అదుపునకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని నార్త్‌జోన్ డీసీపీ సుమతి పోలీసులను ఆదేశించారు. నార్త్‌జోన్ పరిధిలోని అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసుల రివ్యూ నిమిత్తం శనివారం సాయంత్రం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో నార్త్‌జోన్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కొన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో వైట్ కాలర్ నేరాలు తగ్గడం లేదన్నారు. ముఖ్యంగా చిలకలగూడ, మార్కెట్ పరిధిలో అధికంగా నమోదవుతున్న వైట్ కాలర్ నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత ఏసీపీలు గంగాధర్, శ్రీనివాసరావులను ఆదేశించారు. ఈ మేరకు త్వరలో విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని సూచించారు. ఇక జోన్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న నేరాలకు సంబంధించి వీలైనంత త్వరగా చార్జ్షీట్లు వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జనవరి నెలలో నమోదైన 345 కేసులకు గానూ 26కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిపై కూడా చర్యలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బేగంపేట, మహంకాళి, గోపాలపురం ఏసీపీలు, వివిధ పోలీసుస్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.