deekshas
-
భవాని దీక్షలు మొదటి రోజు: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
చంద్రబాబు దిక్ష ఒక దోంగ దిక్ష
-
చంద్రబాబు క్షమాపణ చెప్పేవరకు దీక్ష చేస్తాం
-
చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని
-
చంద్రబాబువి దొంగ దీక్షలు
-
స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్ష ఫ్రారంభం
-
రెండో రోజుకు చేరిన రాచమల్లు దీక్ష
-
పోలీసుల వలయంలో కర్నూలు
-
దీక్షలా హ..హ..హ..!
-
టీడీపీవన్ని ఓటు దీక్షలే : రాచమల్లు
వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు) : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 48 గంటల దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండో రోజు కొనసాగుతున్న రాచమల్లు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తుంది. ఈ సందర్భంగా రాచమల్లు స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసేవరకూ దీక్ష ఆగదన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి నాలుగేళ్లు మాట్లాడకుండా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు ఉక్కురాగం ఎత్తుకున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే టీడీపీ నేత సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తానంటున్నారని, టీడీపీవన్ని ఓట్ల కోసం చేసే దీక్షలేనని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరిగితే ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉపాధి లభిస్తుంది. అందుకే మొదట్నుంచి వైఎస్సార్సీపీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ నేతలకు వైఎస్సార్ జిల్లా ప్రజలపై ప్రేమ లేదు. అందుకే వారు జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో దీక్ష చేస్తున్నఎమ్మేల్యే రాచమల్లుకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేతలు, రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు కుంచెం వెంకట సుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. -
‘అబ్బా ! ఇది ఎంత బాగుందీ’
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక సాంకేతిక యుగానికి తగ్గట్లుగా మెరపు నిరాహార దీక్షలు వచ్చాయి. మన కాలానికి కనుగొన్న గొప్ప రాజకీయ సృజనాత్మకాయుధం ఇదే కావచ్చు. ఈ ఆయుధం వల్ల చూసే వారికి బాధ కలగదు. చేసే వారికి బాధ కలకదు. ఉదయం ప్రారంభమై సాయంత్రానికల్లా ముగిసే మెరపు నిరాహార దీక్షల వల్ల ప్రచారం లభించినా ప్రయోజనమే కదా! పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపచేసినందుకు నిరసనగా గురువారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఒక రోజు కాదు, ఒక పగలు నిరాహార దీక్షలు చేశారు. ‘అబ్బా ! ఇది ఎంత బాగుందీ. ఒక్కరోజు నిరాహార దీక్ష, అందులోనూ ఆయనకు వ్యతిరేకంగానే’ అంటూ మోదీ దీక్షపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. మొన్ననే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దేశంలో పెరిగిపోతున్న కుల, మత హింసాకాండకు వ్యతిరేకంగా పుష్టిగా టిఫిన్ చేసి సాయంత్రం వరకు మెరపు నిరాహార దీక్షలు చేశారు. వాస్తవానికి అన్నింటికీ తానే ఆద్యుడిని అని చెప్పుకునే నరేంద్ర మోదీకే ఈ మెరుపు నిరాహార దీక్షలు కనుగొన్న ఘనత కూడా దక్కుతుందని చెప్పవచ్చు. మోదీ 2011లో గుజరాత్లో హిందూ, ముస్లింల మధ్య ఐక్యత కోసం ‘సద్భావన’ నిరాహార దీక్ష చేశారు. ముందుగా ప్రకటించిన మూడు రోజుల నిరాహార దీక్షను ఆయన ముందుగానే ముగించారు. అదే సమయంలో అన్నా హజారే దేశంలో పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరాహార దీక్షను చేపట్టారు. ఆయన మూడు డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో 12 రోజుల తర్వాత ఆయన తన దీక్షను ముగించారు. 2006లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మమతా బెనర్జీ కూడా సింగూర్ ల్యాండ్ వివాదంపై ఏకంగా 26 రోజులు నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష అనేది దేశ స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులపై మహాత్మా గాంధీ ప్రయోగించిన ఆయుధంగా పేర్కొనవచ్చు. నిష్టాగరిష్టంగా నిరాహార దీక్ష చేయడం వల్ల ఆత్మ శుద్ధితోపాటు పర శుద్ధి కలుగుతుందని గాంధీ విశ్వసించేవారు. ఆత్మవికాసంతోపాటు పరులు లేదా వ్యతిరేకులు భయపడి పోతారని భావించేవారు. స్వాతంత్య్ర పోరాటంలో సత్యాగ్రహం పేరిట నిరాహార దీక్ష నిర్ణయాత్మక పాత్ర పోషించింది. నాటి నుంచి నేటి వరకు ఇది సామాజిక సంస్థలకు ప్రధాన ఆయుధంగా ఉంటూ రాగా, ఇటీవలి కాలంలో రాజకీయ ఆయుధంగా కూడా మారింది. ఏదేమైనా ఆశించిన లక్ష్యం కొంత మేరకైనా నెరవేరే వరకు ఈ రాజకీయ దీక్షలు కొనసాగేవి. ప్రస్తుతం ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. -
పీపీ నియామకంలో అలసత్వం
శిరోముండనం కేసులో అడుగడుగునా నిందితులకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం 37వ రోజుకు చేరుకున్న దళితులు నిరాహార దీక్షలు ఒక రోజు దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ బోస్ రామచంద్రపురం రూరల్ : శిరోముండనం కేసులో ప్రభుత్వ తీరును నిరసిస్తు సంఘటన జరిగిన వెంకటాయపాలెంలో దళిత సంఘాల నేతృత్వంలో చేస్తున్న దీక్షలు శుక్రవారం నాటికి 37రోజుకు చేరుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ దళితులకు మద్దతుగా వెంకటాయపాలెంలో గురువారం జరిగిన ఒక రోజు దీక్షలో పాల్గొన్నారు. శిరోమండనం కేసులో వెంటనే పీపీని నియమించి బాధితులకు న్యాయం చేయాలని వారు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విచారణ నుæ అడ్డుకోవడమే లక్ష్యంగా.. మండలంలోని వెంకటాయపాలెంలోని సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో చంద్రబాబు ప్రభుత్వం అప్పుడూ, ఇప్పుడూ కొమ్ముకాçస్తూనే ఉంది. 20 ఏళ్లుగా కేసు విచారణకు రాకుండా అడ్డుకుంటూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నది. దీనిని నిరసిస్తూ దళిత సంఘాలు 37 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. 1996 డిసెంబర్ 29న వెంకటాయపాలెంలో ముగ్గురు దళిత యువకులకు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శిరోముండనం చేయించారన్న ఆరోపణతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక కోర్టులో ఈకేసు నడుస్తుండగా 1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పుట్టు్టస్వామి కమిష¯ŒSను ఏర్పాటు చేసి, ఆ నివేదిక మేరకు మేరకు శిరోముండనం కేసును ఎత్తివేస్తూ జీవోను జారీ చేసింది. బాధితులు మళ్లీ తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించగా అది విచారణకు రాకుండా ఎన్నో అడ్డంకులు కల్పిస్తున్నారు. 20 ఏళ్లపాటు స్టేలను తీసుకువస్తూ సాగదీశారు. 1997 నుంచి ఇప్పటివరకు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమితులైన ముగ్గురు మారిపోయారు. అయితే మొదటి ఇద్దరిలో ఒకరు స్వచ్చందంగా కేసు నుంచి తప్పుకోగా మరొకరు రాజీనామా చేశారు. తాజాగా విశాఖపట్నం స్పెషల్ కోర్టులో మరో రెండు రోజుల్లో కేసు విచారణకు వస్తుందనగా సెప్టెంబర్ 23న పీపీ జవహర్ ఆలీని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనంతటికీ కారణం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వమే. ఇదే విషయాన్ని దళిత సంఘాలూ ఆరోపిస్తున్నాయి. -
జగన్‌కు మద్ధతుగా బిసి సంఘాల దీక్షలు
-
జగన్ దీక్షకు మద్దతుగా భీమునిపట్నంలో దీక్షలు