Deepak jayakumar
-
సోదరుడిపై దీప సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసత్వ పోరు మరో మలుపు తిరిగింది. జయ వారసురాలిని తానేనని ప్రకటించుకున్న ఆమె మేనకోడలు దీపా కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన సొంత సోదరుడు దీపక్ జయకుమార్‌పై విరుచుకుపడ్డారు. దీపక్.. శశికళ వర్గంతో చేతులు కలిపి తనను మోసం చేశాడని పేర్కొన్నారు. ‘దీపక్ తెల్లవారుజామున 5.30 గంటలకు నాకు ఫోన్ చేసి పోయెస్ గార్డెన్‌కు రమ్మని చెప్పాడు. మీరు నన్ను లోపలికి అనుమతించడం లేద’ని పోలీసులతో దీప వాగ్వాదానికి దిగారు. జయ నివాసంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన మద్దతుదారులతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని అన్నారు. పోయెస్ గార్డెన్ వస్తువులు మాయమవుతున్నాయని ఆరోపించారు. తనను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. కాగా, జయలలిత ఆస్తులను తనకు, తన సోదరికి సమానంగా రాసిచ్చారని గతంలో దీపక్ కుమార్ తెలిపారు. జయ ఆస్తులు తమిద్దరికీ చెందుతాయని అన్నారు. మరోవైపు ఈ వివాదంపై మంత్రి డి. జయకుమార్ స్పందించారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. -
జయ మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు
-
జయ మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు
చెన్నై: జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్.. శశికళ వర్గంపై సంచలన ఆరోపణలు చేశారు. శశికళ బంధువు, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న దినకరన్ పెద్ద మోసగాడని చెప్పారు. జయలలితకు శశికళ స్నేహితురాలు మాత్రమేనని, రాజకీయ వారసురాలు కాదని అన్నారు. సాక్షి ప్రతినిధితో దీపక్ మాట్లాడుతూ.. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నడిపించే అధికారం శశికళ వర్గానికి లేదని చెప్పారు. జయకు నిజమైన రాజకీయ వారసులు పన్నీరు సెల్వం, మధుసూదనన్ మాత్రమేనని అన్నారు. జయలలిత ఎప్పుడూ వారసురాలను రాజకీయాల్లోకి తీసుకురాలేదని, ఆమెకు వారసత్వ రాజకీయాలు ఇష్టంలేదని చెప్పారు. జయ ఫొటోతో ప్రచారం చేసుకునే అర్హత దినకరన్‌కు లేదని పేర్కొన్నారు. అధికారం చేపట్టాలని భావిస్తున్న దినకరన్ కలలు కల్లలవుతాయని చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అమ్మ విశ్వాసపాత్రులు గెలుస్తారని దీపక్ ధీమా వ్యక్తం చేశారు. -
అన్నాడీఎంకేలో దీపక్ రచ్చ
-
దీపా యూ టర్న్?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు వ్యతిరేకంగా స్పందిస్తే, మేనకోడలు దీపా మాజీ సీఎం పన్నీరు సెల్వంకు షాక్ ఇచ్చేలా సిద్ధం అవుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గురువారం చోటు చేసుకున్నాయి. ఇక, శుక్రవారం దీపా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారో అన్న ఎదురుచూపులు పెరిగాయి. దివంగత సీఎం జయలలిత రాజకీయ వారసురాలు తానేనని ఆమె మేన కోడలు దీపా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకేలోని కింది స్థాయి కేడర్ ఆమె ఇంటి ముందు వాలిపోయారు. ఈ సమయంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం పెదవి విప్పడంతో దీపా ఇంటి ముందుకు కేడర్ రాక తగ్గిందని చెప్పవచ్చు. పన్నీరు శిబిరం వైపుగా కేడర్ పరుగులు తీయడంతో తాను సైతం అని దీపా స్పందించారు. పన్నీరు శిబిరానికి తన మద్దతు ప్రకటించారు. ఆ తదుపరి ఎన్నడూ ఆ శిబిరం వైపుగా ఆమె వెళ్ల లేదు. తమను కలుపుకొని వెళ్లడం లేదంటూ దీపా మద్దతుదారులు పన్నీరు శిబిరంపై విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శికి వ్యతిరేకంగా ఆ శిబిరంలో ఉన్న జయలలిత మేనల్లుడు దీపక్ పెదవి విప్పి సంచలనం సృష్టించారు. అదే సమయంలో పన్నీరు శిబిరానికి షాక్ ఇచ్చే రీతిలో దీపా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు దీపా ఇంటి పరిసరాల్లో తాజాగా చోటు చేసుకోవడం గమనార్హం. పన్నీరు శిబిరంలోకి చేరిన దీపా, హఠాత్తుగా యూటర్న్ తీసుకునేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. దీపా పేరవై వర్గాలు ఏకంగా పన్నీరు శిబిరం మీద విమర్శలు గుప్పించే పనిలో పడ్డ నేపథ్యంలో గురువారం టీనగర్లో కొత్త జెండాలు ప్రత్యక్షం అయ్యాయి. దీపా ఇంటి పరిసరాల్లో ఈ జెండాలు హోరెత్తడంతో పన్నీరుతో కలిసి అడుగులు వేయకుండా, మేనత్త చరిష్మాతో ఒంటరిగానే ముందుకు సాగేందుకు ఆమె నిర్ణయించారా అన్న ప్రశ్న బయలు దేరింది. అన్నాడీఎంకే జెండా తరహాలో నలుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతో మధ్యలో జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై చిత్ర పటాలను ఆ జెండాల్లో పొందు పరచడంతో దీపా కొత్త పార్టీ ప్రకటిస్తారా అన్న చర్చ ఊపందుకుంది. పన్నీరు నేతృత్వంలో శుక్రవారం ఆర్కేనగర్ వేదికగా జరగనున్న సభకు దీపా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు ఆ పేరవై వర్గాలు వ్యాఖ్యానిస్తుండడం ఉత్కంఠకు దారి తీసింది. జయలలిత జయంతి సందర్భంగా జరగనున్న ఈ సభలో దీపా కూడా కనిపిస్తారన్న ఆశతో పన్నీరు శిబిరం ఉన్నా, ఆమె హాజరయ్యేది అనుమానమేనని పేరవై వర్గాలు పేర్కొంటుండడం గమనించాల్సిన విషయం. ఉదయాన్నే మేనత్త జయలలిత సమాధి వద్ద నివాళులర్పించినానంతరం ఇంటి వద్దకు చేరుకునే దీపా, మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు పేరవై వర్గాలు పేర్కొంటుండడంతో అందరిచూపు టీనగర్ వైపుగా మరలింది. మేనత్త జయంతి సందర్భంగా దీపా ఏ ప్రకటన చేస్తారో అన్న ఎదురుచూపులు పెరిగాయి. పన్నీరు శిబిరం మాత్రం దీపా తమ సభకు తప్పకుండా హాజరవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. -
అన్నాడీఎంకేలో దీపక్ రచ్చ
► జయకు నేను, నా సోదరి మాత్రమే వారసులం ► జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ సాక్షి, చెన్నై: తమిళనాట అధికార అన్నాడీఎంకేలో జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ గురువారం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా దీపక్ గళం విప్పారు. తాను, తన సోదరి దీపా జయకుమార్ మాత్రమే జయలలితకు వారసులమని, పోయెస్ గార్డెన్ ఇంటిపై తామిద్దరికి అన్ని హక్కులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ అంత్యక్రియల సమయంలో ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. శశికళతో కలసి జయలలిత అంత్యక్రియలు పూర్తిచేశారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. దీపక్ మాత్రం శశికళ వెన్నంటే ఉన్నారు. అన్ని విషయాల్లో చిన్నమ్మకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చిన ఆయన గురువారం ఒక్కసారిగా ఆక్రోశం వెళ్లగక్కారు. శశికళ సోదరి వనిత మణి కుమారుడు టీటీవీ దినకరన్ డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం ఇందుకు కారణం. ఓ మీడియా సంస్థతో దీపక్ ఫోన్ లో మాట్లాడారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వంకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. తన మేనత్త మరణంపై న్యాయ విచారణకు జరిపించాలని డిమాండ్ చేశారు. ‘పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ,, సీఎంగా పళనిస్వామి కొనసాగాలి. ఉప ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్‌సెల్వంకు అప్పగించాలి’’ అని దీపక్ అన్నారు. జయ లేక ఒంటరిగా..: శశికళ జయలలిత లేని లోటుతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శశికళ ఓ సందేశం పంపించారు. ప్రతి ఏడాదీ జయలలిత జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకునేవారమని, కానీ ఈ ఏడాది ఇలాంటి పరిస్థితి వస్తుందని భావించలేదన్నారు. అమ్మ మన మధ్య లేకపోవడం తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందన్నారు. గత 33 ఏళ్లుగా అమ్మతో పాటు పుట్టినరోజు వేడుకల్లో తానూ పాల్గొన్నానని చెప్పారు. ఆమె జ్ఞాపకాలతో ఈ ఏడాది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని పేర్కొన్నారు. తన ఆలోచనలు జయ చుట్టూనే తిరుగుతున్నాయన్నారు. అమ్మ జయంతి సందర్భంగా జరిపే కార్యక్రమాలు ఆమె పేరు నిలబెట్టేలా ఉండాలని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు.