Dev Anand
-
నూరేళ్ల గురుదత్
‘నువ్వు కమ్యూనిస్టువా?’... ‘కాదు. కార్టూనిస్టుని’.... ‘నీకు మంచి జీవితం తెలియక ఈ దిక్కుమాలిన కొంపను ఇల్లు అనుకుంటున్నావు’... ‘దాన్దేముంది... మీకు ఫుట్‌పాత్‌ల మీద బతుకుతున్న లక్షల మంది గురించి తెలియదు. నేను వాళ్ల కంటే మెరుగే’... ‘నువ్వు నౌకరువి! గుర్తుంచుకో’... ‘నౌకర్నైతే? తల ఎత్తి మాట్లాడకూడదా?’... గురుదత్ సినిమాల్లోని డైలాగ్స్ ఇవి. దేశానికి స్వతంత్రం వచ్చి గొప్ప జీవితాన్ని వాగ్దానం చేశాక కూడా, ఎక్కడా ఆ వాగ్దానం నెరవేరే దారులు లేక, ఉద్యోగ ఉపాధులు లేక, పేదరికం పీడిస్తూ, మనుషుల్లో స్వార్థం, రాక్షసత్వం దద్దరిల్లుతున్న కాలంలో ‘ఇన్సాన్ కా నహీ కహీ నామ్ ఔర్ నిషాన్’ అనిపించిన ఒక భావుకుడు, దయార్ద్ర హృదయుడు, ఎదుటి వారి కళ్లల్లో నాలుగు కన్నీటి చుక్కలు చూడగానే సొమ్మసిల్లే దుర్బల మానసిక స్వరూపుడు గురుదత్ వచ్చి ఆడిన కళాత్మక నిష్ఠూరమే అతడి సినిమాలు. స్వతంత్రం వచ్చిన పదేళ్లకు ‘ప్యాసా’ తీసి ‘జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హై’ అని ప్రశ్నించాడు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక పాదధూళి దొరికితే కష్టాల నుంచి బయట పడదామనుకునే∙కోట్లాది నిరుపేదలను చూసి నేటికీ అనవలసిందే కదా– ‘దేశాన్ని చూసి గర్వపడే పెద్దలారా... మీరెక్కడ?’కలకత్తాలో బాల్యం గడిపిన గురుదత్ ఇంటెదురు ఖాళీ జాగాలో జరిగే తిరునాళ్లలోని పేద కళాకారుల ఆటపాటలతో స్ఫూర్తి పొందాడు. అతనూ డాన్స్ చేస్తే ఆ సుకుమార రూపం అద్భుతంగా మెలికలు తిరిగేది. డాన్స్ అతణ్ణి నాటి ప్రఖ్యాత డాన్సర్ ఉదయ్‌శంకర్ దగ్గరకు చేర్చింది. ఆ తర్వాత పూణేకు! అక్కడ ప్రభాత్ థియేటర్లో డాన్స్‌మాస్టర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అన్నింటికీ మించి దేవ్ ఆనంద్ స్నేహితుడిగా దారి మొదలెట్టాడు. బెంగాల్ పురోగామి ధోరణి, చదివిన పుస్తకాలతో ఏర్పరుచుకున్న బౌద్ధిక విమర్శ కళలో ఏం చెప్పాలో తెలిపాయి. అయితే సినిమా వ్యాపారకళ. వ్యాపారాన్నీ, కళనూ, ఆదర్శాన్నీ కలిపి నడిపించడం కష్టమైన పని. కాని ఆ పనిని గొప్పగా చేయగలిగిన జీనియస్ గురుదత్. అతనికి ముందు సినిమాల్లో డైలాగ్ ఉంది. గురుదత్ వచ్చి... ఆ డైలాగ్ చెప్పే సందర్భంలో తెర కవిత్వాన్ని చిందడం చూపగలిగాడు. అతనికి ముందు సినిమాల్లో వెలుతురూ చీకటీ ఉంది. గురుదత్ వచ్చి... వెలుగునీడల గాఢ పెనవేతను తెరపై నిలిపాడు. అతనికి ముందు సినిమాల్లో పాత్రలున్నాయి. గురుదత్ వచ్చి ఆ పాత్రల ప్రాంతం, మాట, నడత నిక్కచ్చి చేశాడు. ‘ఆర్ పార్’ (1954)తో ఈ ముద్ర మొదలైంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ (1955), ‘ప్యాసా’ (1957), ‘కాగజ్ కే ఫూల్’ (1959), ‘చౌద్వీ కా చాంద్’ (1960), ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ (1962)ల వరకూ ఇదే ధోరణి కొనసాగింది. గాయని షంషాద్ బేగం అంది– ‘ఏ సినిమా తీసినా నిజాయితీతో తీశాడు. తప్పుడుతనంతో ఒక్కటీ తీయలేదు’.‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో కవి పాత్రలో ఉన్న గురుదత్ పునరుత్థానం చెందుతాడు. సినిమాలో అతడు మరణించాడని జనం భావించాకే గుర్తింపు పొందుతాడు. నిజజీవితంలో కూడా అదే జరిగింది. పెద్ద హీరోల, దర్శకుల సినిమాల మధ్యలో... గురుదత్ జీవించి ఉండగా పేరు రాలేదు. మరణించాక కూడా రాలేదు. 1980లలో విదేశాలలో అతడి సినిమాలు ప్రదర్శింపబడి ప్రశంసలు దక్కాకే గురుదత్ పేరుకు ఉన్న మసి తొలిగింది. రాజ్‌కపూర్ ‘కాగజ్ కే ఫూల్’ చూసి ‘ఇది కాలం కంటే ముందే తీశాడు. రాబోయే తరాలే దీనిని పూజిస్తాయి’ అన్నాడు. అదే జరిగింది. నేడా సినిమా ప్రపంచంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా ఉంది.‘80 శాతం నటన నటీనటుల కళ్లతోనే పూర్తవుతుంది. మనం మనిషి కళ్లల్లో చూస్తాం. నటన కూడా అక్కడే తెలియాలి’ అనేవాడు గురుదత్. అతని సినిమాల్లో టైట్ క్లోజప్స్, కళ్లు చేసే అభినయం పాత్రలను ప్రేక్షకులతో కనెక్ట్ చేస్తాయి. తీయబోయే పాట ఎలా ఉంటుందో ముందే తెలుసు కనుక రికార్డింగ్ సమయంలో ఆశా భోంస్లే ఎదురుగా నిలబడి గురుదత్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే ఆమె వాటికి తగినట్టుగా ఒయ్యారాలు పోతూ పాడిందట. ‘భవరా బడా నాదాన్ హై’ వినండి తెలుస్తుంది. గురుదత్ మన తెలుగు వహీదా రెహమాన్‌ను స్టార్‌ని చేశాడు. బద్రుద్దీన్ అనే బస్ కండక్టర్ని జానీవాకర్ అనే స్టార్ కమెడియన్ని చేశాడు. ఎస్.డి.బర్మన్, ఓపి నయ్యర్లతో సాహిర్ లుధియాన్వీ, మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీలతో అత్యుత్తమమైన పాటలను ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి, రచయిత అబ్రార్ అల్వీల గొప్పతనం చాటాడు.వసంత కుమార్ పడుకోన్ అలియాస్ గురుదత్ జూలై 9, 1925న జన్మించి కేవలం 39 సంవత్సరాలు జీవించాడు. 14 ఏళ్ల కెరీర్లో గొప్ప గొప్ప క్లాసిక్స్ తీశాడు. గాయని గీతాదత్ను వివాహం చేసుకుని, వహీదా రెహమాన్ సాన్నిహిత్యం కోరి ఛిద్ర గృహజీవనం సాగించాడు. కాగితపు పూలకే అందలం దక్కే సంఘనీతికి కలత చెంది అర్ధంతరంగా జీవితం నుంచి నిష్క్రమించాడు. రేపటి నుంచి అతని శత జయంతి సంవత్సరం మొదలు. ‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో ‘మనిషి నుంచి మనిషితనాన్ని లాక్కునే సమాజం మీదే నా ఫిర్యాదు’ అంటాడు గురుదత్. ఆ ఫిర్యాదు అవసరం మరింతగా పెరిగిన రోజులివి. గురుదత్ను పునర్ దర్శించాల్సిన సందర్భం. అవును. మెడలో ముళ్లహారం పడినా ముందుకేగా నడక.హమ్నెతో జబ్ కలియా మాంగీ కాంటోంకా హార్ మిలాజానే ఓ కైసే లోగ్ థే జిన్ కే ప్యార్ కో ప్యార్ మిలా... -
దేవానంద్ పార్టీ ఎందుకు పతనమైంది?
సినీతారలు రాజకీయాల్లోనూ తళుక్కుమని మెరుస్తుంటారు. ఈ కోవలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటుడు దేవానంద్ కూడా వస్తారు. ఆయన ఎంతో ఉత్సాహంతో రాజకీయాల్లో కాలుమోపారు. అధికారికంగా పార్టీని స్థాపించి, ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. అవి 1975.. ఎమర్జెన్సీ రోజులు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి దేశం మొత్తం ఉలిక్కిపడింది. దీనిలో సినిమా ప్రపంచానికీ మినహాయింపేమీ లేదు. 1977లో ఎమర్జెన్సీ తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దింపేందుకు సినీ తారలు ఏకమై జాతీయ పార్టీని స్థాపించాలనుకున్నారు. పార్టీ అధ్యక్షునిగా నటుడు దేవానంద్‌ను ఎన్నుకున్నారు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయి, ఎన్నికలు ప్రకటన వచ్చినప్పుడు బాలీవుడ్ నటులు రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 4న ముంబైలోని తాజ్ మహల్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘నేషనల్ పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు దేవానంద్ ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయం ముంబై పరేల్‌లోని వి శాంతారామ్ రాజ్‌కమల్ స్టూడియోలో ఏర్పాటుచేశారు. దేవానంద్, అతని సోదరుడు విజయ్ ఆనంద్, నిర్మాత,దర్శకుడు వి. శాంతారామ్, జీపీ సిప్పీ, శ్రీరామ్ బోహ్రా, ఐఎస్ జోహార్, రామానంద్ సాగర్, ఆత్మారామ్, శత్రుఘ్న సిన్హా, ధర్మేంద్ర, హేమా మాలిని, సంజీవ్ కుమార్ తదితులు పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేవారు. వీరంతా దేవానంద్‌కు అండగా నిలిచారు. సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారి పార్టీ కావడంతో పెద్ద ఎత్తున జనం పార్టీలో చేరారు. దీంతో జనతా ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌లో ఆందోళన చెలరేగింది. ‘నేషనల్ పార్టీ’ ముంబైలోని శివాజీ పార్క్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభ విజయవంతమైంది. అదే సమయంలో ప్రముఖ నటుడు ఐఎస్ జోహార్ తాను జనతా ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి రాజ్ నారాయణ్‌పై ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిస్తానని సవాల్ చేశారు. అతని ప్రకటనపై ఆగ్రహించిన రాజ్ నారాయణ్ జోహార్ ఇకపై ఇలాంటి చేష్టలను మానుకోకపోతే, చేతులు కాళ్లు విరగ్గొడతానని జోహార్‌ను హెచ్చరించారట. దీనికితోడు ‘నేషనల్ పార్టీ’కి వస్తున్న ఆదరణకు అడ్డుకట్ట వేయకపోతే తమ మనుగడకు ఇబ్బంది ఏర్పడుతుందని భావించిన జనతా ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. పలువురు నటులను తమవైపు తిప్పుకున్నారట. దీంతో ‘నేషనల్ పార్టీ’లో అంతవరకూ చురుగ్గా ఉన్న సినీ కళాకారులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వైదొలగారట. చివరికి దేవానంద్ ఒంటరిగా మిగిలిపోయారట. అటువంటి పరిస్థితిలో ఆయన ‘నేషనల్ పార్టీ’ని ముందుకు తీసుకువెళ్లలేకపోయాట. -
రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?
బాలీవుడ్ అలనాటి మేటి హీరో, దివంగత దేవానంద్కుచెందిన లగ్జరీ బంగ్లాను విక్రయించినట్టు మీడియాలో వార్తలుగుప్పుమన్నాయి. దేవానంద్ డ్రీమ్ హౌస్ ముంబైలోని జుహూ బంగ్లాని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి భారీ మొత్తానికి రూ .400 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. దాని స్థానంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించబడుతుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఈ రూమర్లపై దేవానంద్ మేనల్లుడు,నిర్మాత కేతన్ ఆనంద్ తాజాగా స్పందించారు. అలాంటి ఉద్దేశమేదీ లేదని, అవన్నీ తప్పుడు వార్తలని ఆయన ఖండించారు. దీనికి సంబంధించి దేవానంద్ కుమార్తె దేవీనా, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ధృవీకరించుకున్నట్టు వెల్లడించారు. దాదాపు 40ఏళ్లపాటు దేవానంద్ తన భార్య కల్పనా కార్తీక్, పిల్లలు సునీల్ ఆనంద్ , దేవినా ఆనంద్‌లతో కలిసి గడిపారు. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్) అలాంటి ఇల్లును విక్రయించారని, డీల్ కూడా పూర్తయి పేపర్ వర్క్ జరుగుతోందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ బంగ్లాను చూసుకోడానికి ఎవరూ లేని కారణంగా ముఖ్యంగా కొడుకు సునీల్ అమెరికాలోనూ, కూతురు దేవినా, తల్లి కల్పనాతో కలిసి ఊటీలో ఉంటోంది. అందుకే దీన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దాదాపు అదే కారణంతో మహారాష్ట్రలోని పన్వెల్‌లో కొంత ఆస్తిని కూడా విక్రయించారని కథనాలొచ్చాయి. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) ఈ ప్రాంతంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీల బంగ్లాలు ఉన్న ప్రధాన ప్రదేశం కాబట్టి అంత దర పలికిందనీ, ఈప్లేస్లో 22 అంతస్తుల భారీ టవర్‌ను నిర్మించనున్నారని కూడా అంచనావేశారు. అంతేకాదు 10 సంవత్సరాల క్రితం ఆనంద్ స్టూడియో అమ్మినప్పుడు, ఆ డబ్బుతో మూడు అపార్ట్మెంట్లు కొని, ఒకటి సునీల్‌కు, మరొకటి దేవీనాక, మూడోది అతని భార్య కల్పనకు ఇచ్చారనీ జుహు బిల్డింగ్ అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును కూడా అలాగే పంచుకుంటారనేది కథనం. -
ఆ హీరోతో డేటింగ్ చేస్తోందని బాధపడ్డ మరో హీరో.. హర్టయిన నటి!
ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయే పాటల్లో దమ్మారో దమ్ సాంగ్ ఒకటి. ఈ పాటను ఆస్వాదించినవాళ్లంతా జీనత్ కాన్ను అంత ఈజీగా మర్చిపోలేరు. బాలీవుడ్ తారే అయినా అన్ని భాషల ప్రేక్షకులు ఆమెను ఆరాధించారు. కెరీర్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమయంలో హీరో రాజ్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తోందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అప్పటికి జీనత్‌ను మరో హీరో దేవ్ ఆనంద్ ప్రేమిస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపోయాడు. తన ఆటోబయోగ్రఫీలో మాత్రం... తాను ప్రేమిస్తున్న జీనత్ మరొకరితో ప్రేమలో ఉందన్న వార్తలు బాధించాయని రాసుకొచ్చాడు. తాజాగా ఈ వ్యవహారం గురించి ఓపెన్ అయింది జీనత్. పబ్లిక్‌గానే కంగ్రాచ్యులేషన్స్ చెప్పా 'నా కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో గోల్డెన్ త్రయం నడుస్తోంది. దేవ్ సాబ్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ హిందీ సినిమాకు తలమానికంగా నిలిచారు. ఈ క్రమంలో 1973లో రాజ్ కపూర్ డైరెక్షన్లో వచ్చిన బాబీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా అవార్డులు సైతం గెల్చుకుంది. పబ్లిక్‌గానే అతడికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను. వకీల్ బాబు, గోపీచంద్ జసూస్ సినిమాల్లో అతడితోపాటు నటించాను. అతడి డైరెక్షన్లో సినిమా చేయాలనుండేది. తీరా ఆ అవకాశం వచ్చేసరికి నేను సత్యం శివం సుందరం సినిమా ఒప్పుకోవడంతో దాన్ని తిరస్కరించక తప్పలేదు. తర్వాత రాజ్ కపూర్ సినిమాల్లోనూ నటించాను. కానీ మా మధ్య ఉన్న సాన్నిత్యాన్ని దేవ్ సాబ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. అబద్ధాన్ని ప్రచారం చేశాడు 2007లో వచ్చిన ఆయన ఆటోబయోగ్రఫీ రొమాన్సింగ్ విత్ లైఫ్ పుస్తకంలో దేవ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ రాజ్‌కు నాకు మధ్య బంధం చిక్కపడటం చూసి తన మనసు ముక్కలైందని రాసుకున్నాడు. అది చూశాక నాకు విపరీతమైన కోపం వచ్చింది. దేవ్ నన్ను ప్రేమిస్తున్న విషయమే నాకు తెలియదు, ఆయనను గురువుగా ఆరాధించాను, ఎంతో అభిమానించాను. కానీ తను ఓ అబద్ధాన్ని నమ్మి నాపైనే దుష్ప్రచారం చేశాడు. చాలా బాధేసింది. ఆ పుస్తకం పబ్లిష్ అయ్యాక నా ఫోన్ రింగవుతూనే ఉంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని నా స్నేహితులు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఎంతో అవమానకరంగా భావించిన ఈ విషయం గురించి ఇన్నేళ్లుగా మాట్లాడలేకపోయాను. ఇన్నాళ్లకు దీనిపై క్లారిటీ ఇవ్వాలనిపించింది. దేవ్ ఆనంద్ అరుదైన ప్రతిభ కలవాడు. ఆయన్ను ఎవరైనా అవమానిస్తే నేను సహించలేను' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది జీనత్. సంజయ్ఖాన్తో ప్రేమ పెళ్లి, హింసతో బ్రేకప్ జర్నలిస్టు, మోడల్‌గా ఉన్న జీనత్ అమాన్ 1970లో హల్చల్తో నటిగా పరిచయమైంది. హరే రామ హరే కృష్ణతో స్టార్డమ్ తెచ్చుకుంది. కుర్రకారంతా ఆమెను ఆరాధించింది. ప్రముఖ హీరో ఫిరోజ్ ఖాన్ తమ్ముడు, హీరో సంజయ్ ఖాన్‌ను ఆమె అందం కలవరపెట్టింది. అటు జీనత్కూ సంజయ్ అంటే ఇష్టం మొదలైంది. ఇద్దరూ అబ్దుల్లా సినిమాలో జంటగా నటించారు. ఈ క్రమంలో వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే సంజయ్‌కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. పైగా అతడు ముక్కోపి! ఓసారి పార్టీలో అందరి ముందే దవడ ఎముక విరిగేలా జీనత్‌కు కొట్టాడట సంజయ్. ఆ సంఘటనతో సంజయ్ జీవితంలో నుంచి తప్పించుకుంది. జీనత్. మూడేళ్ల వారి ప్రేమ హింసాత్మకంగా ముగిసింది. ఆ తర్వాత 1985లో మజర్ ఖాన్‌ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కుటుంబంతో సంతోషంగా జీవనం సాగిస్తుందనుకున్న సమయంలో 1998లో మజర్ కన్నుమూశాడు. సింగిల్ పేరెంట్‌గానే పిల్లలను పెద్ద చేసింది జీనత్. View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) చదవండి: కమెడియన్ యోగిబాబు సరసన మరోసారి నయనతార -
‘గైడ్’ సినిమాను తలపించే ప్రేమ కథ.. ఫ్రెంచ్ అమ్మాయి మనసు దోచిన బిహారీ
ఢిల్లీ చూడటానికి వచ్చింది పారిస్ నుంచి ఆమె. అతడు గైడ్. అతడు కబుర్లు చెప్పి తిప్పాడు. ఆమె పదే పదే నవ్వింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆమె అతణ్ణి గైడ్ నుంచి బిజినెస్‌మేన్‌గా మార్చడానికి పారిస్ పిలిపించింది. ఎదిగేలా చేసింది. ఆరేళ్ల తర్వాత ఇదిగో ఇలా బిహార్‌కు వచ్చి మరీ వివాహం చేసుకుంది. ఒక కుతూహలం రేపే రాకుమారి తోటరాముడు కథ. గైడ్ సినిమాలో దేవ్ఆనంద్ కథ. ఈ ప్రేమకథ వింటే పాత తరం వారికి ‘గైడ్’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆర్.కె.నారాయణ్ రాసిన నవల ఆధారంగా దేవ్ ఆనంద్, వహీదా రహెమాన్ నటించిన ‘గైడ్’ సినిమాకు ఈ ప్రేమ కథ కొంతమేర పోలి ఉంది. ‘గైడ్’లో ఉదయ్‌పూర్ దగ్గర గైడ్‌గా పని చేస్తున్న దేవ్ ఆనంద్‌ను ఆ ప్రాంతాన్ని చూడటానికి వచ్చిన వహీదా ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కథలో కూడా భారత్‌ను చూడటానికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన యువతి ఢిల్లీలో గైడ్‌గా పని చేస్తున్న కుర్రాణ్ణి ప్రేమించింది. అయితే మనదేశంలో కొన్నిసార్లు కనిపించే కుల, మత, జాతి అడ్డంకులు ఈ ప్రేమకథలో రాలేదు. ప్రేమ ఫలించింది. మొన్నటి ఆదివారం వీరి పెళ్లి జరగగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం పారిస్ నుంచి మేరీ లోరి హెరెల్ అనే యువతి ఇండియా చూడటానికి ఢిల్లీ వచ్చింది. అక్కడ బిహార్‌లోని బేగుసరాయి జిల్లాకు చెందిన రాకేష్ గైడ్‌గా పని చేస్తున్నాడు. మేరీకి ఢిల్లీ చూపించే బాధ్యత వృత్తిలో భాగంగా అతనిపై పడింది. చురుగ్గా ఉంటూ విసుగు చూపించకుండా నవ్విస్తూ ఢిల్లీలో రెండు మూడు రోజుల పాటు గైడ్‌గా వ్యవహరించిన రాకే మేరీకి నచ్చాడు. నిజానికి పారిస్‌లో మేరీ టెక్స్టైల్ రంగంలో ఉంది. వ్యాపారవేత్త. రాకుమారి కిందే లెక్క. రాకేష్ బేగుసరాయ్‌లో ఒక దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకు పుట్టిన కుర్రవాడు. ఒక దేశం కాదు. ఒక భాష కాదు. ఒక సంస్కృతి కాదు. అయినా సరే ‘మనిషి మంచివాడు... ఈమె హృదయం మంచిది’ అని స్త్రీ, పురుషులకు అనిపించడానికి అవి అడ్డు నిలవలేకపోయాయి. వారు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అసలైన ప్రేమ ఆ తర్వాత మొదలైంది. ఫోన్ ప్రేమ టూరిస్ట్‌లు టూర్ ముగిసిన వెంటనే గైడ్లను మర్చిపోతారు. వారికి చూసిన ప్రాంతాలు గుర్తుంటాయి కాని చూపించిన మనుషులు గుర్తుండరు. కాని భారత్ చూసి పారిస్ వెళ్లిపోయిన మేరీ రాకేష్‌కు తరచూ ఫోన్ చేసేది. రాకేష్ కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడేవారు. సరిగ్గా మూడు నెలలు గడిచాక ఇద్దరికీ అర్థమైంది తాము ప్రేమలో ఉన్నామని. ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు. కాని ప్రపంచాన్ని చూసిన మేరీకి రాకేష్ చేస్తున్న ఉద్యోగం, పని భవిష్యత్తులో ముందుకు పోవడానికి సహకరించవని మేరీకి అర్థమైంది. ‘నువు పారిస్ వచ్చి ఏదైనా మంచి పని చేయి’ అంది. ‘నాకు ఎవరు ఇస్తారు పని’ అన్నాడు రాకేష్. ‘నా వ్యాపారంలోనే పార్టనర్‌గా మారు’ అంది మేరీ. అంతే కాదు వీసా, టికెట్ రెండూ పంపింది. మూడేళ్ల క్రితం రాకేష్ పారిస్ వెళ్లాడు. అంతవరకూ మధ్యలో సంవత్సరానికి ఒకటి రెండుసార్లు మేరీ ఇండియా వచ్చి రాకేష్‌ను కలిసి వెళ్లేది. అప్పటికి వారిది ప్రేమే తప్ప పెళ్లి ఆలోచన లేదు. తండ్రి పాదాలకు నమస్కరిస్తున్న నూతన వధువు ప్రేమతో పని చేస్తుంటే పారిస్ వెళ్లిన రాకేష్ మేరీ వ్యాపారంలో పార్టనర్‌గా మారి పని చేయడం మొదలెట్టాడు. ఢిల్లీలో చూసిన రాకేష్‌లో ఏమాత్రం మార్పు లేదని అతను తన పనిని మనసు పెట్టి చేస్తాడని, జీవితం పట్ల, మనుషుల పట్ల అతనికి విశ్వాసం ఉందని మేరీ అర్థం చేసుకుంది. జీవితాంతం అతనితో కలిసి జీవించవచ్చని మరో మూడేళ్లకు ఆమె నిర్థారణ చేసుకుంది ‘మనం పెళ్లి చేసుకుందాం’ అంది. సరే చేసుకుందాం అని రాకేష్ అంటే ‘ఇక్కడ కాదు... ఇండియాలో. మీ పద్ధతిలో. మీ తల్లిదండ్రుల సమక్షంలో’ అని చెప్పింది. రాకేష్ పారిస్ నుంచి తల్లిదండ్రులతో బంధువులతో మాట్లాడారు. ‘నువ్వు చేసుకుంటే మేము అడ్డు చెప్పేదేముంది’ అన్నారు వారు. రాకేష్‌ను మూడేళ్లుగా చూస్తున్నారు కనుక మేరీ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లి ఖాయమైంది. నవంబర్ 19, ఆదివారం రాత్రి, బేగుసరాయ్‌లో పెళ్లి. వియ్యంకులయ్యారు రాకేష్ తండ్రి రామచంద్ర షా, మేరీ తండ్రి వేస్ హెరెల్ వియ్యంకులయ్యారు. పారిస్ నుంచి తల్లిదండ్రులతో బేగుసరాయ్ వచ్చిన మేరీ వధువుగా మారి రాకేష్‌ను పతిగా పొందింది. దానికి ముందు వియ్యంకులు ‘జప్మాలా’ అనే తంతులో పాల్గొన్నారు. బాలీవుడ్, భోజ్‌పురి పాటలకు నృత్యాలు చేశారు. విదేశీ అమ్మాయిని మన ఊరి కుర్రాడు పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త విని ఊరి జనాలు విరగపడ్డారు. పెళ్లి బాగా జరిగింది. మరి కొన్ని రోజుల్లో ఆ జంట పారిస్‌కు వెళ్లనుంది. కొన్ని ప్రేమకథలు కలతను కలిగిస్తాయి. కొన్ని సంతోషాన్నిస్తాయి. ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో అందరికీ నచ్చింది. మేరీ, రాకేష్‌లను అందరూ అభినందిస్తున్నారు. ప్రేమ పండించుకున్న అదృష్టవంతులు వీరు. త్వరలో ఇదంతా సినిమాగా వచ్చినా ఆశ్చర్యం లేదు. -
ఆయనే లోకం!
దేవుని సాక్షిగా ముడిపడిన ఆ బంధం.. చెరిగిపోని జ్ఞాపకాలకు వేదికగా నిలిచింది. సుఖ దుఃఖాలను కలిసి పంచుకుని.. కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచారు. చేతిలో చెయ్యేసి.. అడుగులో అడుగేసి.. సాగించిన వీరి పయనం ‘కడదాకా’ కలిసే సాగింది. అనారోగ్యం ఆయన ఊపిరి తీస్తే.. భర్త లేని లోకం శూన్యమని ఆమె కూడా తనువు చాలించింది. 24 గంటల వ్యవధిలో భార్యాభర్తల మరణంతో ఉయ్యాలవాడ మూగబోయింది. ఉయ్యాలవాడ(ఓర్వకల్లు): ఊరంతా కన్నీటి సంద్రమైంది. గంటల వ్యవధిలో దంపతుల హఠాన్మరణం అందరినీ కదిలించింది. అయ్యో.. అని బాధపడుతూనే, చావు కూడా విడదీయలేని ఆ బంధం ఎన్నెన్ని జన్మలదోనని కీర్తించారు. ఈ ఘటన మండల పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం దేవానందం(78), శివమ్మ(75) దంపతులకు కూలీ పనులే ఆధారం. ఇరువురు సంతానం కాగా.. రెక్కలు ముక్కలు చేసుకుని ఇద్దరినీ ఓ ఇంటి వాళ్లను చేశారు. పెద్ద కొడుకు ఏసయ్య స్వగ్రామంలోనే కూలీ పనులు చేస్తుండగా.. చిన్న కొడుకు దానమయ్య కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇక శేష జీవితం సంతోషంగా గడిపే క్రమంలో చిన్న కుమారుని వద్దే ఉండిపోయారు. నాలుగు రోజుల క్రితం దేవానందం స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. కోలుకోలేక సోమవారం ఆసుపత్రిలోనే తుదిశ్వాస వదిలాడు. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు చివరి చూపునకు వస్తున్న తరుణంలో మంగళవారం ఉదయం శివమ్మ కూడా భర్తనే అనుసరించింది. ఆయన మృతదేహం వద్దే ప్రాణం విడవటం చూసి స్థానికుల హృదయం బరువెక్కింది. ఈ విషాదం తెలిసి గ్రామస్తులంతా ఆ ఇంటి వద్ద చేరి కన్నీళ్లతో నివాళులర్పించారు. మధ్యాహ్నానికి కుటుంబ సభ్యులు, స్థానిక సీఎస్ఐ పెద్దల ఆధ్వర్యంలో క్రైస్తవ మత సాంప్రదాయంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
నిద్రపోనివ్వని స్వరం...
సందర్భం: కిశోర్ కుమార్ జయంతి ప్రముఖ రచయిత ఆర్.కె. నారాయణ్ రాసిన ‘ది గైడ్’ నవలను దేవానంద్ ‘గైడ్’ పేరుతో సినిమాగా తీశారు. అందులో ‘గాతారహే... మేరా దిల్... తూహీ మేరీ... మంజిల్’ పాట వినగానే నాకు మతిపోయింది. ఎంతంటే కిశోర్ కుమార్ కథాకమామీషు తెలుసుకునేంత వరకూ.... ఆ స్వరం నన్ను నిద్రపోనివ్వలేదు. సినీ ప్రపంచంలో కొన్ని కాంబినేషన్లుంటాయి. రాజ్ కపూర్-ముఖేశ్, షమ్మీకపూర్-రఫీ, ధర్మేంద్ర-మహేంద్ర కపూర్. అయితే అన్ని కాంబినేషన్లూ అన్నిసార్లూ అద్భుతాల్ని సృష్టించలేవు. కాంబినేషన్ల పరిధి దాటి ఆకాశపు అంచుల్ని తాకిన గళాల్లో రఫీకీ-కిశోర్‌కీ పోలికలున్నాయి. రఫీ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడు. కిశోర్ అసలు సంగీత సాధనే చెయ్యలేదు. ఎవరి దగ్గరా కుదురుగా నేర్చుకోలేదు. కిశోర్‌కి తెలిసింది ఒక్కటే... పాటను చిత్తశుద్ధితో పాడడం, పాటకు ప్రాణం పోయడం.హిందీ చలనచిత్రసీమలో 24 శాఖల గురించీ అద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరూ అని ప్రశ్నిస్తే, వెంటనే వచ్చే మొదటి జవాబు కిశోర్ కుమార్ గంగూలీ అని. కిశోర్ నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు, రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, స్క్రిప్ట్ రైటర్ కూడా. విషాదాన్ని పలికించడంలో కిశోర్‌ని మించినవారు లేరంటారు. అది వాస్తవం కూడా. కిశోర్ తన స్వీయ దర్శకత్వంలో పాడిన, ‘కోయీ లౌటారే మేరే బీతే హుయె దిన్..’ పాట వింటే కళ్లలోంచి జలజలా అశ్రువులు రాలతాయి. ఆ సినిమా పేరు ‘దూర్ గగన్ కీ ఛావోం మే’. ‘ఝుమ్రూ’ సినిమాలో ‘కోయీ హమ్ దమ్... నా రహా... కోటీ సహారా... నా రహా...’ పాట వింటుంటే గుండె మౌనంతో నిండిపోతుంది. మళ్లీ అదే కిశోర్‌దా ‘ఏజో, ముహిచ్చిత్ హై’ అని పాట ఎత్తుకుంటే జనాలు వెర్రెత్తిపోరూ..! కిశోర్ పాడిన ‘మేరే సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ తూ...’ పాట దేశాన్ని మత్తులో ముంచేసింది. ‘రూప్ తేరా మస్తానా’ ఓ సునామీ. ‘మేరే సావ్ునేవాలీ ఖిడ్కీ మే’ (పడోసన్), ‘ఏకో చతుర్ నార్ బడీ హోషియార్’ పాటల్ని కిశోర్ అభినయిస్తూ పాడుతుంటే ప్రేక్షకులు మరో లోకంలో అడుగెట్టి అటు చెవుల తుప్పూ, ఇటు మనసుల తుప్పూ వదిలించుకున్నారన్నది ముమ్మాటికీ నిజం. కాంబినేషన్‌కి అతీతంగా ఎదిగిన అత్యంత సహజ గాయకుడు కిశోర్. ఆయనగొంతు మీద ఎస్.డి. బర్మన్కి కొండంత నమ్మకం. ఏదో ఓనాడు కిశోర్ అన్ని రికార్డుల్నీ బ్రేక్ చేస్తాడని ఆయనకి తెలుసు. అందుకే తన రెగ్యులర్ కంపెనీ ‘నవ్‌కేతన్’లోనే కాక తను సంగీత దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ ఒక్క పాటైనా ఇచ్చేవారు. మొదట్లో కిశోర్ ఎక్కువగా పాడింది దేవ్ సాబ్‌కి. ఇక ఎస్.డి. బర్మన్, కిశోర్‌ల కాంబినేషన్ ఎన్ని అద్భుత గీతాలు సృష్టించిందంటే, ఆ పాటలు అమరత్వాన్ని పొందేంత. ఇక, కిశోర్ - రాజేష్ ఖన్నాల కాంబినేషన్ తుపాను సృష్టించింది. ‘ఏ షామ్ మస్తానీ మద్‌హోష్ కీయేజా’ పాట యువతని వెర్రెక్కించింది. ‘జిందగీ ఏక్ సఫర్ హై సూరానా’ (అందాజ్)... ఇలా అన్నీ అద్భుతాలే!అప్పటి వరకూ ఉత్తర హిందుస్థాన్‌లో ఎక్కడ, ఎప్పుడు పెళ్లి జరిగినా ‘రాజాకీ ఆయీ హై బరాత్.... రంగేలీ హోగీ రాత్’ (తెలుగులో ‘పందిట్లో పెళ్లవుతున్నదీ... కనువిందవుతున్నదీ’) పాట వినిపించేది. ‘సచ్చాఝాటా’ సినిమా విడుదలయ్యాక ‘మేరీ ప్యారీ బెహనియా బనేగీ దుల్హనియా’ పాట ఒక ట్రెడిషన్‌గా, ‘బారాతీ’ పాటగా మారింది. ప్రతి అన్నా తమ్ముడూ తన సోదరి పెళ్లిలో ఈ పాటే పాడుకున్నారు. అది ‘బేండ్ బాజా’ సాంగ్‌గా ఎంత ప్రసిద్ధి చెందిందంటే, పెళ్లి వాళ్లు, బేండ్ వాళ్ళను ముందే అడిగేవారట, ఆ పాట వాయించడం వాళ్లకు ‘వచ్చా, రాదా’ అని. కిశోర్ జీవితం ఓ సాగే ప్రవాహం లాంటిది. ఓ కల లాంటిది. కిశోర్ ఎవరికీ అర్థం కాడు. అర్థమయ్యేలా ఏనాడూ ప్రవర్తించలేదు. కొన్ని రహస్యంగా తన మనసులోనే సృష్టించుకున్నాడు. కిశోర్‌లోని అసలు వ్యక్తిని అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి అశోక్ కుమార్... అంటే కిశోర్ పెద్దన్న. ఆయన కిశోర్‌ని తమ్ముడిలా చూడలా... ఒక ‘బిడ్డ’లా అందునా ‘పసిబిడ్డ’లా చూశాడు. అందుకే కిశోర్ ఎంత అల్లరి చేసినా చిరునవ్వుతో భరించేవాడు. ఆయనకి తెలుసు... కిశోర్ లొంగేది ఒక్క ‘ప్రేమ’కి మాత్రమేనని! ఆ ప్రేమ నిజ జీవితంలో దొరికిందో లేదో కిశోర్కే తెలియాలి. కిశోర్ తన గళంతో ఓ ప్రభంజాన్ని సృష్టించాడు. తన అల్లరి చేష్టలతో అందరికీ ప్రియమయ్యాడు. కిశోర్ గురించి లతా అన్నది ‘‘నేను థియేటర్‌కి పాడటానికి వెళ్లగానే కిశోర్ దా ఏదో ఓ అల్లరి చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడని తెలుసు... అందుకే అనేదాన్ని ‘పెహలేగానా... బాద్ మే హస్నా’ (ముందు పాట... తర్వాతే అల్లరి) అని. హిందీ చలనచిత్రసీమలో ‘సంగీత విభజన’ చెయ్యాలంటే, ఒకే ఒక్క విధంగా చెయ్యాలి. ‘కిశోర్‌కు ముందు - కిశోర్‌కి తరువాతా’ అని. కిశోర్‌కు ముందు రఫీ లాంటి చరిత్ర సృష్టించిన గాయకులున్నారు. మరి, కిశోర్ తరవాత? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. దీనికి జవాబు బహుశా కొన్ని దశాబ్దాల తరవాత దొరకొచ్చు... దొరక్కపోనూవచ్చు. సినీ సంగీతానికీ, గీతానికీ సహజత్వాన్ని అద్దిన అమరశిల్పి కిశోర్! - భువనచంద్ర (సినీ గీత రచయిత)