developmemt works
-
అనంతపురం జిల్లాపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఫోకస్
-
మత ప్రాముఖ్య స్థలాలపై నిర్లక్ష్యం
డెహ్రాడూన్: మత ప్రాముఖ్యమున్న దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప ఇంకోటి కాదంటూ ఆక్షేపించారు. మహిమాన్విత పూజనీయ స్థానాల గత వైభవాన్ని తాము ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ అన్నారు. ‘‘కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేరమన్నట్టుగా మాట్లాడేంతగా కొందరిలో బానిస మనస్తత్వం వేళ్లూనుకుపోయింది. ఇతర దేశాల్లో ఉండే ఇలాంటి పూజనీయ స్థానాలను ప్రశంసించేదీ వాళ్లే. మన దేశంలో మాత్రం అలాంటి వాటిని చిన్నచూపు చూసేదీ వాళ్లే. నిజానికి మన ఘన వారసత్వం మనకెంతో గర్వకారణం. వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21వ శతాబ్దపు నయా భారత్‌కు పునాది వంటివి’’ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉత్తరాఖండ్ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్నాథ్, హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన ఆలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు మాత్రమే కాదు. వేలాది ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఘనమైన మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అవి మన జీవనాడులు’’ అని అభిప్రాయపడ్డారు. కేదార్‌నాథ్‌లో కొన్నేళ్లుగా చేపట్టిన పునర్నిర్మాణ పనుల వల్ల ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి వీలవుతోందని చెప్పారు. ‘‘కేదార్‌నాథ్‌కు గతంలో ఏటా మహా అయితే నాలుగైదు లక్షల మంది మాత్రం వచ్చేవాళ్లు. ఈ ఏడాది గత రికార్డులన్నింటినీ తుడిచిపెడుతూ ఇప్పటికే ఏకంగా 45 లక్షల మంది దర్శించుకున్నారు’’ అని అన్నారు. ఉపాధికీ మార్గాలు హిమాలయాల్లోని ఆలయాల అభివృద్ధి పనులు అక్కడికి యాత్రను సరళతరం చేయడమే గాక స్థానికులకు విరివిగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని మోదీ చెప్పారు. స్థానికంగా వర్తక, వాణిజ్యాలకు కూడా ఎంతగానో ఊతమిస్తున్నాయన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాల ఆలయాల సందర్శనకు వచ్చే పౌరులంతా తమ బడ్జెట్లో కనీసం 5 శాతం స్థానిక ఉత్పత్తులు కొనేందుకు వెచ్చించాలని కోరారు. ఈ చిన్న చర్య ఎంతోమంది స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘దట్టమైన మంచులో నెలకొన్న ప్రఖ్యాత హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే నిర్మాణం దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిక్కు సోదరుల వరప్రసాదం కానుంది. ఉత్తరాన మన దేశంలో చిట్టచివరి గ్రామం ‘మన’. కానీ నా వరకూ దేశంలో ప్రతి గ్రామమూ ప్రగతికి బాటలు పరిచే తొట్టతొలి గ్రామమే. పాతికేళ్ల క్రితం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ భేటీని కూడా నేను మన గ్రామంలోనే జరిపాను. కొండ సానువుల్లో కష్టతరమైన ప్రయాణం చేసి భేటీకి వచ్చేందుకు అప్పట్లో మావాళ్లు గొణుక్కున్నారు కూడా. కానీ పర్వత ప్రాంతీయులు కష్టజీవులు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. అభివృద్ధి వారికి అందని ద్రాక్ష కాకూడదు. మిగతా దేశవాసులకందే అన్ని సౌకర్యాలూ అందుకునే హక్కు వారికి ఉంది’’ అన్నారు. అంతకుముందు ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో మోదీ పూజలు జరిపారు. కేదార్‌నాథ్‌లో ఆది శంకరుల సమాధి స్థలిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి బద్రీనాథ్‌లో గడిపారు. ప్రధాని హోదాలో మోదీ కేదార్‌నాథ్‌ను దర్శించడం ఇది ఆరోసారి. కాగా బద్రీనాథ్‌కు రావడం రెండోసారి. రోప్‌వే ప్రాజెక్టుల విశేషాలు... కేదార్నాథ్ రోప్‌వే: రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం దాకా 9.7 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక గౌరీకుండ్ నుంచి ఆలయానికి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఎత్తైన హిమ సానువుల్లో అత్యంత కష్టతరంగా భావించే ఈ ప్రయాణానికి కనీసం 6 నుంచి 7 గంటలు పడుతోంది. హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే: గోవింద్ ఘాట్ నుంచి ఏడాది పొడవునా మంచుతో కూరుకుపోయి ఉండే హేమ్‌కుండ్ సాహిబ్ వెళ్లే దారి అత్యంత క్లిష్టమైనది. అందుకు కనీసం ఒక రోజుకు పైగా పడుతుంది. ఇప్పుడు వాటి మధ్య 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో ముగుస్తుంది. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ముఖద్వారంగా చెప్పే ఘంగారియాను కూడా రోప్‌వే అనుసంధానించనుంది. -
పోలవరంలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించి, అనంతరం పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం సీఎం జగన్ పోలవరం పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరారు. 2022 జూన్ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలి.. పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సీఎం జగన్ జరిపిన సమీక్షలో స్పిల్‌వే 42 గేట్లు అమర్చినట్టు తెలిపిన అధికారులు.. ఎగువ కాఫర్ డ్యాం పనులను పూర్తి చేశామని తెలిపారు. అదే సమయంలో దిగువ కాఫర్ డ్యాం పనుల పరిస్థితిని అధికారులు వివరించగా, 2022 జూన్ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలని, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు. 2023 ఖరీఫ్ సీజన్‌కల్లా ఈసీఆర్ఎఫ్ డ్యాం పూర్తి చేయాలని అధికారులతో సమీక్షలో సీఎం జగన్ స్పష్టం చేశారు. చదవండి: Polavaram: సిద్ధిస్తున్న సంకల్పం ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ సర్కారు నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం
సాక్షి, కడప : తనకు జన్మనిచ్చిన పులివెందుల ప్రజల రుణం తీర్చుకునే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేస్తున్న అడుగులు అక్కడి ప్రజలను ఆనంద సాగరంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా ఈనెల 23, 24, 25 తేదీలలో సీఎం పులివెందుల పర్యటనలో ఆ ప్రాంత ప్రగతి కోసం మరిన్ని అభివృద్ధి పనులకు పునాదిరాళ్లు వేశారు. గతేడాది ఇదే తేదీల్లో తొలి ఇన్స్టాల్మెంట్గా రూ. 1329 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆ పనులు పురోగతిలో ఉండగానే, తాజా పర్యటనలో రెండవ ఇన్స్టాల్మెంట్గా రూ. 5163.59 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం పులివెందుల వాసులను పులకింపజేసింది. పులివెందులకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేనిదని చెబుతూ... రాజన్న బిడ్డ సొంతగడ్డ ప్రజలు మరిచిపోలేని రీతిలో ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సంకల్పించడం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. (పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది: సీఎం జగన్) సీఎం చిత్తశుద్ధిని అక్కడి ప్రజానీకం కొనియాడుతోంది. మొత్తంగా మూడు రోజుల సీఎం పర్యటన విజయవంతమైంది. ఈనెల 23వ తేదీ తొలిరోజు మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో జిల్లాలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి 5.15 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుని ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజల వినతిపత్రాలను స్వీకరించారు. ముఖ్యమంత్రి వారికి తానున్నానంటూ భరోసా ఇచ్చారు. 6.20 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ అతిథి గృహానికి చేరుకుని అక్కడ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి ఆప్యాయత కురిపించారు. 24వ తేదీ రెండవరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి 2.00 గంటల ప్రాంతంలో రూ. 5163.59 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పురోగమనంలో పులివెందుల.. ప్రధానంగా పులివెందులలో రూ. 34.20 కోట్లతో 12 ఎకరాల్లో ఆర్టీసీ బస్టాండు, డిపోలతోపాటు రూ. 83.59 కోట్లతో ఏపీ ఇమ్రా, రూ. 70 కోట్లతో అపాచీ లెదర్ పార్కుతోపాటు రూ. 3015 కోట్లతో గండికోట, చిత్రావతి, పైడిపాలెం లిఫ్ట్, పులివెందులలో రూ. 1256 కోట్లతో 1.38 లక్షల ఎకరాలు మైక్రో ఇరిగేషన్ అభివృద్ధి, రూ. 14.5 కోట్లతో గండి దేవస్థానం అభివృద్ధి, రూ. 3.26 కోట్లతో పులివెందులలో ప్రముఖ దేవస్థానాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు రూ. 9.24 కోట్లతో 24 నూతన ఆలయాల నిర్మాణం, 23 దేవాలయాల పునర్నిర్మాణ పనులు, రూ. 36 కోట్లతో తొండూరులో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణం, రూ. 46.44 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణం, రూ. 184.61 కోట్లతో గ్రామాల అనుసంధానానికి 76 బీటీ రోడ్లు, రూ. 29.70 కోట్లతో 29 రోడ్ల మరమ్మతులు, రూ. 9.50 కోట్లతో కొత్తగా బీటీ రోడ్ల నిర్మాణం, రూ. 56.85 కోట్లతో దెబ్బతిన్న ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 11.05 కోట్లతో కుప్పం–కల్లూరిపల్లె రోడ్డు విస్తరణ పనులు, రూ. 5 కోట్లతో సురభి–కుప్పం రోడు వెడల్పు, రూ. 8 కోట్లతో మోపూరి దేవళాలకు రోడ్ల విస్తరణ, రూ. 7 కోట్లతో చిన్నరంగాపురం–నిడివెలగల రోడ్డు విస్తరణ, రూ. 8.90 కోట్లతో మోపూరి భైరవేశ్వరస్వామి దేవస్థానంలో మౌలిక వసతుల ఏర్పాటు, రూ. 5.60 కోట్లతో చిత్రావతి జలాశయం వద్ద టూరిజం అభివృద్ధి, రూ. 5 కోట్లతో పైడిపాలెం జలాశయం వద్ద టూరిజం అభివృద్ధి, రూ. 12.26 కోట్లతో పులివెందుల శిల్పారామం అభివృద్ధి, రూ. 7 కోట్లతో చక్రాయపేట, వేముల, లింగాల మండలాల్లోని పోలీసుస్టేషన్ భవనాల స్థానాల్లో మోడల్ పోలీసుస్టేషన్ భవనాల నిర్మాణం. ఆర్కే వ్యాలీలో నూతన పోలీసు స్టేషన్ భవనాల నిర్మాణం, రూ. 4 కోట్లతో నాగులగుట్టపల్లె గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాల నిర్మాణం, రూ. 200 కోట్లతో పాడాలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, సుందరీకరణ పనులు, రూ. 2.80 కోట్లతో మైత్రి లే అవుట్, పులివెందుల డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ పార్కు అభివృద్ధి, నియోజకవర్గంలో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం, రూ. 6.40 కోట్లతో చక్రాయపేట, నాగులగుట్టపల్లె గ్రామాల్లో పారిశుధ్య సౌకర్యాల అభివృద్ధి పనులు, రూ. 14 కోట్లతో సింహాద్రిపురంలో పారిశుధ్య సౌకర్యాల మెరుగుకు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి రూ. 5163.59 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పులివెందుల వాసులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. పులివెందులలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగకపోవడం బాధగా ఉంది అనంతరం సీఎం మాట్లాడుతూ క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు రెండూ ఒకేరోజు కలిసి రావడం శుభదినమన్నారు. ఇంత మంచిరోజున రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నా....మనసులో ఎక్కడో చిన్న బాధ ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నా పులివెందులలో మాత్రం కార్యక్రమం చేయలేకపోతున్నామన్నారు. ఏపీఐఐసీ భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే నష్టం జరుగుతుందని కొందరు కోర్టుకు వెళ్లారని, దీంతోనే ఇక్కడ కార్యక్రమం వాయిదా పడిందన్నారు. అనంతరం కడప విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తర్వాత 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు. చివరిరోజు ఇలా.. 25వ తేది మూడవరోజు ఉదయాన్నే పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును కట్ చేసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. -
వేగంగా అభివృద్ధి పనులు
అధికారులకు కలెక్టర్ ఆదేశం కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో నడుస్తున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో డివిజ¯ŒSలోని తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారికి అవి నిర్మించే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని అన్నారు. గతంలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగిస్తున్నదీ లేనిదీ గుర్తించి, వాడకంలో లేని మరుగుదొడ్లు వినియోగించేలా చైతన్యపరచాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకంలో 200 అడుగుల లోతు లోపు బోర్లు వేసేవారికి సౌర పంపుసెట్లు అందించాలన్నారు. డంపింగ్‌యార్డులు లేని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. పనులు పూర్తయిన వెంటనే సొమ్ము చెల్లిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న పనులకు ఇసుక కొరత ఉండదని, జిల్లాలోని ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుక సరఫరాకు అనుమతించామన్నారు. సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, గృహనిర్మాణ సంస్థ డీఈ సెల్వరాజ్, డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం రాజేశ్వరరావు, హౌసింగ్ ఈఈ శ్రీనివాసరావు, డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.వరప్రసాద్, జిల్లా సహకారాధికారిణి ప్రమీల, డివిజ¯ŒSలోని తహసీల్దార్లు, ఎండీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మండల ఇంజనీర్లు, ఏపీఎంలు పాల్గొన్నారు.