Development plans
-
ట్రిపుల్ ఐటీకి మహర్దశ
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే ఆంధ్రకేసరి ప్రకాశం విశ్వవిద్యాలయానికి డీపీఆర్ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ట్రిపుల్ ఐటీల విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు ఒంగోలులోని ట్రిపుల్ ఐటీలో బోధన, భోదనేతర సిబ్బంది నియామకానికి సెప్టెంబర్ 31న ఉన్నత విద్యాశాఖ జీవో నంబర్ 30ని విడుదల చేసింది. దీనికి అనుగుణంగా త్వరలో నోటిఫికేషన్‌ను కూడా వెలువరించనున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిప్యుటేషన్ మీద కొందరు, కాంట్రాక్టు ప్రాతిపదికన కొందరు విధులు నిర్వహిస్తున్నారు. టీచింగ్‌లో ప్రొఫెసర్, అసోషియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. విద్యారంగ పటిష్టతకు చర్యలు.. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ కేసీ రెడ్డి బాధ్యతలు చేపట్టాక, రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటీల ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక దివంగత ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో, పేదల ఉన్నత సాంకేతిక విద్యకు అవకాశాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల మీద గత ప్రభుత్వం శీతకన్ను వేసింది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం పేద వర్గాల ఉన్నత విద్య పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ కోట్లాది రూపాయలు కేటాయిస్తూ విద్యారంగాన్ని పటిష్టం చేస్తోంది. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో మొత్తం ఆరువేల మంది విద్యార్థులు ఉండాల్సివుంది. అయితే గత కొన్నేళ్లుగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ తరగతులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నుంచి ఒంగోలులో తరగతులు ప్రారంభించగా, మొదటి సంవత్సర విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. రెండో సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు విద్యార్థులకు ఇడుపులపాయలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 30ని అనుసరించి పోస్టులకు నోటిఫికేషన్ వేసి భర్తీ చేసే క్రమంలో పూర్తి స్థాయిలో ఒంగోలులో తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు అధికారులకు సూచనలు చేశారు. అడ్మిషన్లపై కసరత్తు.. ఈ ఏడాది 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత ఆధారంగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పిస్తారు. జీపీఏ మెరిట్ ఆధారంగా గతంలో ప్రవేశాలు నిర్వహించేవారు. ఈ ఏడాది కోవిడ్–19 నేపథ్యంలో అందరికీ ఉత్తీర్ణ ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. మార్కులు ఇవ్వనందున ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించే పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒంగోలు ట్రిపుల్ ఐటీ పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సొంత భవనాల నిర్మాణం.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, విద్యాశాఖమంత్రి డాక్టర్ సురేష్‌లు ట్రిపుల్ ఐటీల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రకాశం ట్రిపుల్ ఐటీకి స్థలం కూడా మంజూరు చేశారు. త్వరలో నిర్మాణాలు కూడా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్ వెలువరించనున్నారు. ఓ రకంగా ట్రిపుల్ ఐటీ ఈ ప్రాంత విద్యార్థులకు ఒక వరం. మన ప్రాంత విద్యావంతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేందుకు ట్రిపుల్ ఐటీ తోడ్పాటుగా ఉంటుంది. మన ప్రాంత విద్యార్థులు ట్రిపుల్ ఐటీ విద్యను సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్ డైరెక్టర్, ఒంగోలు ట్రిపుల్ ఐటీ -
హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా విస్తరిస్తున్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సరికొత్త ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇప్పటికే కోర్ సిటీ, శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్ రూపొందించిన హెచ్ఎండీఏ... భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తోంది. మాస్టర్ ప్లాన్‌తో పాటు జోనల్, ఏరియా, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లను ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా రూపొందించేందుకు ఎంప్యానల్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ల కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పిలిచారు. ఇదీ ప్లాన్... ఇప్పటికే ఏకీకృత మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పటికీ హెచ్ఎండీఏ పరిధిలోని ఏదైనా ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందితే.. ఆ ప్రాంతంలో జనాభాకు తగినట్టుగా రహదారులు, భూ వినియోగం, పరిశ్రమలు ఇలా అవసరమైనవి ఎక్కడ? ఎలా? ఉండాలనే దానిపై ఎంప్యానల్మెంట్ సంస్థలు అప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించి హెచ్ఎండీఏకు ఇస్తాయి. ఈ విధంగానే ఏరియా డెవలప్మెంట్ అంటే చిన్నచిన్న ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్లాన్లు రెడీ చేస్తాయి. ఇంకో ముఖ్యమైన అంశమేమిటంటే నగరంలోని ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్‌గా వాహన రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్‌లు నిత్యకృత్యమవుతాయి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేసేందుకు రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్‌ను కూడా ఇవి హెచ్ఎండీఏ అధికారుల ఆలోచనలకు అనుగుణంగా తయారు చేస్తాయి. తుది మెరుగులు... 2041 నాటికి పెరగనున్న జనాభా, భూవినియోగం, రోడ్డు రవాణా వ్యవస్థ, నీటి వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార–వాణిజ్య రంగాలకు భూకేటాయింపులు వంటి వాటికి కచ్చితమైన పరిమితులతో ఏకీకృత మాస్టర్‌ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా), హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (హడా), సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ(సీడీఏ), పాత ఎంసీహెచ్, హుడా విస్తరిత ప్రాంతాలకు చెందిన మాస్టర్ప్లాన్లు కలిపిన ఏకీకృత మాస్టర్‌ప్లాన్–2041ను ప్రస్తుతం ఆస్కీ పూర్తిస్థాయిలో రూపొందిస్తోంది. -
370పై అంత ప్రేమ ఎందుకు?
బల్లబ్‌గఢ్(హరియాణా): ఆర్టికల్ 370 అంటే ఎందుకు తమకంత ప్రేమో కాంగ్రెస్ పార్టీ జమ్మూకశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు వివరించాలని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370పై వారికున్న ప్రేమ కారణంగానే వేలాది మంది జవాన్లు సరిహద్దుల్లో ప్రా ణాలు కోల్పోయారన్నారు. హరియాణాలో సోమ వారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. అధికారంలోకి వస్తే తాము రద్దు చేసిన ఆర్టికల్ 370ని మళ్లీ అమల్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చే ధైర్యం ఉందా? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌ను హింస నుంచి తప్పించి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని హరియాణా ప్రజలతో పాటు దేశమంతా కోరుకుంటోందని ఎన్నికల ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు విఫలయత్నం చేశాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు వంటి కఠిన నిర్ణయాల గురించి గత ప్రభుత్వాలు కనీసం ఆలోచించలేదని, హరియాణా ఓటర్లు సహా దేశ ప్రజలంతా తమకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వడం వల్లనే ఆ నిర్ణయం తీసుకోగలిగామని మోదీ వివరించారు. ఈ నిర్ణయం వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతిన్న కొందరు మాత్రం వీధుల్లోకి ఎక్కి నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. చచ్చిన ఎలుకను పట్టారు సోనిపట్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని చచ్చిన ఎలుక అంటూ పోలుస్తూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఖర్ఖోడాలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ స్థానంలో బయటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నుకోలేకపోయింది. గాంధీ కుటుంబంలోని సోనియానే మళ్లీ ఎన్నుకుంది. ఇదంతా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. అది కూడా చచ్చిన ఎలుక’అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.1.25 లక్షల కోట్ల మేర ఓటర్లకు తాయిలాలు ప్రకటించడంపై ఆయన.. ప్రభుత్వ ఖజానా ఏమైనా వాళ్ల బాబు సొమ్మనుకుంటున్నారా? అని మండిపడ్డారు. -
నాలుగేసి పంచాయతీలకు ‘ఒకే ఒక్కడు’
* రాష్ట్రంలో మూడు వేలకు పైగా కార్యదర్శుల పోస్టులు ఖాళీ * ఇన్చార్జి అధికారులతో కుంటుపడుతున్న గ్రామాల అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పరిపాలన కుంటుపడుతోంది. అభివృద్ధి ప్రణాళికలు అటకెక్కుతున్నాయి. గ్రామాభివృద్ధి పనుల గురించి ఒకప్పుడు గ్రామ సర్పంచ్ చుట్టూ ఆ గ్రామానికి చెందిన అధికారులు (కార్యదర్శి, వీఆర్వో..తదితరులు) తిరిగేవారు. అయితే.. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. గ్రామ కార్యదర్శి ఎక్కడున్నాడోనని సర్పంచులు వెదుక్కొని ఫైళ్లపై సంతకాల కోసం వారి వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 8,685 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 3,600 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఆయా గ్రామాలకు పక్కన ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. దీంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శి కనిష్టంగా నాలుగేసి గ్రామాలకు, గరిష్టంగా ఏడు గ్రామాలకు పనిచేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో గ్రామ పంచాయతీలను కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన గ్రామజ్యోతి పథకం అమలుపైనా ఈ ప్రభావం పడుతోంది. ఏరోజు ఎక్కడుంటారో తెలియదు.. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏ రోజు ఏగ్రామంలో ఉంటారో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి ఉంది. వారంలో ఏడు రోజులకు గాను ఒక్కోరోజు ఒకో గ్రామంలో పనిచేయాల్సి వస్తోంది. ఒకేరోజు ఆయా గ్రామాల సర్పంచులు సమావేశాలు ఏర్పాటు చేసిన పక్షంలో ఏగ్రామానికి వెళ్లాలో అర్థం కాక పంచాయతీ కార్యదర్శులకు కూడా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అంతేకాక. ఉన్నతాధికారులు పిలిచిన పక్షంలో మండల కేంద్రానికో, డివిజన్, జిల్లా కేంద్రాలకో పరుగులు పెట్టాల్సి వస్తోంది. పలు గ్రామాలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం, పంచాయతీ కార్యదర్శులకు ఎటువంటి అలవెన్స్ ఇవ్వడం లేదు. కనీసం టీఏ, డీఏలను కూడా సర్కారు ఇవ్వడం లేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతుల్లోనూ ప్రతిష్టంభన పంచాయతీరాజ్ విభాగంలో నాలుగు స్థాయి ల్లో(గ్రేడ్ 1,2,3,4) పంచాయతీ కార్యదర్శులుం టారు. ఆయా గ్రామ పంచాయతీల ఆదాయా న్ని బట్టి గ్రేడ్లవారీగా కార్యదర్శులను ప్రభుత్వం నియమిస్తోంది. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు ఎక్స్టెన్షన్ అధికారులు(ఈవో పీఆర్డీ)గా పదోన్నతులు ఇచ్చే విషయంలో ఎంతోకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. 20 ఏళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతులు లేకపోవడంతో ఈవోపీఆర్డీలకూ పదోన్నతులు లభించడం లేదు. ఫలితంగా అన్ని స్థాయిల్లోనూ పంచాయతీ కార్యదర్శులకు కూడా పదోన్నతులు అందని ద్రాక్షగా మారా యి. గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు ఈవోపీఆర్డీలుగా పదోన్నతులను కల్పిస్తే మరిన్ని పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇటీవల సర్పంచులు కొందరు.. ఆ విభాగం డెరైక్టర్‌కు విజ్ఞప్తి చేయగా, కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం ఆర్థిక భారంగా చూస్తోందని చెప్పినట్లు తెలిసింది. గ్రామజ్యోతి పైనా ప్రభావం! గ్రామాభివృద్ధి ప్రణాళికలను పంచాయతీ స్థాయిలోనే రూపొందించడం, గ్రామా ల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని సర్కారు ప్రారంభించింది. ఆయా రంగాల్లో సమగ్రమైన అభివృద్ధిని సాధించేం దుకు అవసరమైన ప్రణాళికలను గ్రామస్థాయిలోనే రూపొందించాల్సి ఉంది. ఈ ప్రక్రియంతా పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంది. అయితే కార్యదర్శుల కొరత కారణంగా అభివృద్ధి కమిటీల సమావేశాలు జరగడం లేదు. ఒకవేళ జరిగి నా ప్రణాళికలను ప్రభుత్వానికి పంపడంలోనూ విపరీతమైన జాప్యం జరుగుతోంది. -
ప్రజెంటేషన్ రెడీ!
- జల విధానం తుది కసరత్తు ముగించిన సీఎం - నీటి పారుదల శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష - తెలుగులో నోట్ సిద్ధం చేయాలని సూచన - జిల్లాలవారీగా త్వరలో ఆయకట్టు, అభివృద్ధి ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కు మేరకు వాటాలను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించుకునేలా జలవిధానం ఎలా ఉండాలన్న దానిపై కసరత్తు ముగిసింది. అసెంబ్లీలో ప్రకటించనున్న జలవిధానం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఆదివారం నీటి పారుదల శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుది రూపునిచ్చారు. ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావుతో పాటు, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, అన్ని ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు. రాష్ట్ర పరీవాహక పరిధిలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం చేసుకునేలా సమగ్ర అభివృద్ధి పథకాలను పొందుపరుస్తూ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేశారు. అందరూ చదువుకునేలా ఈ వివరాలను తెలుగులోనూ పొందుపరుస్తూ నోట్ తయారు చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. సాగునీటి ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రాథమ్యాలు, వాతావరణ పరిస్థితులు, సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి మళ్లింపు, తదనుగుణంగా బ్యారేజీల నిర్మాణం తదితరాలపై చర్చించారు. దీనిపై పార్టీల్లో ఉన్న అపోహలను జలవిధానం ద్వారా తొలగిద్దామని, సమగ్ర కార్యాచరణ ప్రకటించి రైతులకు, ప్రజలకు భరోసా ఇద్దామని సీఎం పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆ మూడే కీలకం ముఖ్యంగా మూడు ప్రధాన ప్రాజెక్టులపై సీఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పలు మార్పులు జరుగుతున్న ప్రాణహిత-చేవెళ్ల పథకంపై స్పష్టత, కొత్తగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ప్రాముఖ్యతలపై అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టత ఇవ్వదలచారని అధికార వర్గాల సమాచారం. వీటిలో ప్రాణహిత తుది డిజైన్‌పై ఇంకా సందిగ్ధత వీడలేదు. ప్రాణహిత, ఇంద్రావతిల్లో లభ్యతగా ఉన్న 600 టీఎంసీల నీటిని వాడకంలోకి తె స్తామంటున్నా ప్రతిపాదిత ప్రాణహిత ప్రాజెక్టుకు అవసరమైన 160 టీఎంసీలను మేడిగడ్డ నుంచి తీసుకుంటారా, లేక ఇచ్ఛంపల్లి వద్ద మరో బ్యారేజీ ద్వారానా అన్నదానిపై ప్రభుత్వపరంగా స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 నాటికి 60 శాతం నిర్మాణం పూర్తవాలంటే ఈ ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులెలా ఉండాలి, కాళేశ్వరం కార్పోరేషన్ ఏర్పాటు ద్వారా నిధుల సమీకరణ ఎలా అనే అంశాలపై దృష్టి పెట్టారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల తాగు, సాగు అవసరాలు తీర్చడం, వాటికోసం చేపట్టిన భూ సేకరణ, పునరవాసం, టెండర్ల ప్రక్రియలపై లోతుగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులకు ఏటా ఎంత ఖర్చు చేస్తారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారన్న అంశాలను అసెంబ్లీలో సీఎం వివరించే అవకాశముంది. చెరువుల పునరుద్ధరణతో 2.2 టీఎంసీల నిల్వ కరువును ఎదుర్కొనేందుకు నీటి పారుదల శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ కూడా సీఎం వద్ద చర్చ జరిగింది. చిన్న నీటి వనరుల పునరుద్ధరణపై అధికారులు ప్రత్యేకంగా నోట్ తయారు చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లారంటున్నారు. మిషన్ కాకతీయ ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యం కాగా 8,215 చెరువులకు రూ.2,586 కోట్లతో ఈ ఏడాది పాలనా అనుమతులిచ్చినట్టు అందులో పేర్కొన్నారు. 7,015 చెరువుల పనులు ఆరంభించామని, రూ.522.16 కోట్ల పనులు పూర్తయ్యాయని, వీటిలో రూ.345 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని వివరించారు. 6.25 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని పొలాలకు తరలించారని, తద్వారా 2.2 టీఎంసీల నీటి నిల్వకు ఆస్కారం ఏర్పడిందని, భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడిందని సీఎంకు వివరించారు. -
పైలట్ మండలంగా లావేరు
లావేరు: గ్రామ పంచాయతీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు చేపట్టడం కోసం లావేరును జిల్లాలో పైలట్ మండలంగా ఎంపిక చేసినట్టు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి శివరాంనాయికర్ తెలిపారు. ఎస్.కె.పల్లి గ్రామంలో గురువారం పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు చేపట్టడం కోసం మండల అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లావేరును పైలట్ మండలంగా ఎంపిక చేసినందున 26 పంచాయతీల పరిధిలోని గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. పతీ పంచాయతీలో పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు ఉన్నదీ లేనిదీ, బ్యాంకు అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, పంటలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఏఏ పంటలు పండిస్తున్నారు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, మాతాశిశు మరణాలు, పింఛన్‌దారులు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. ఈ నెల 12 వతేదీలోగా పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ సుజాత, ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్, తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, జడ్పీటీసీ సభ్యుడు పిన్నింటి మధుబాబు, వ్యవసాయాదికారి శ్రీనివాసరావు, మండల గణాంక అధికారి శ్రీనివాసరావు, ఎంఈవో గవరయ్య, ఏపీ వో దాసునాయుడు, సర్పంచ్ మీసాల రామినాయుడు పాల్గొన్నారు. -
‘ప్రణాళిక’కు కసరత్తు
కలెక్టరేట్/మందమర్రి రూరల్ : ప్రజల అవసరాలు, వసతులు, వనరులను దృష్టిలో పెట్టుకుని గ్రామ, మండల, పట్టణ, జిల్లాస్థాయి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ప్రణాళికల ఆధారంగా నిధులు కేటాయిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ప్రణాళిక వ్యూహరచన ప్రతిష్టాత్మకంగా జరిగేందుకు మండలస్థాయి అధికారులతోపాటు జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో ఉన్నతాధికారులను ప్రత్యేక ప్రణాళిక అధికారులుగా నియమించారు. దీంతో ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నిండుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 7న హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన ప్రణాళిక’పై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గ్రామ, వార్డుల్లో ప్రణాళిక తయారీకి నమూనా రూపొందించి దాని ఆధారంగా గ్రామ, వార్డు అభివృద్ధితోపాటు వనరులు, ప్రజావసరాలకు అవసరమగు అంశాలు అందులో పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రణాళిక తయారీ కార్యక్రమం జిల్లాలో ఆరు రోజులపాటు జరగనుంది. కాగాా, శనివారం తలమడుగు మండ లం రుయ్యాడి గ్రామంలో మంత్రి జోగు రామన్న ‘మన ఊరు-మన ప్రణాళిక ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజలతో సమావేశం కానున్నారు. సమావేశానికి కలెక్టర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. ఇది ఉద్దేశం.. స్థానిక వనరులు, వసతులు, ప్రజావసరాలు కేంద్రంగా తెలంగాణ దృక్పథం ప్రతిబింబించేలా భౌతిక ఆర్థిక పరిస్థితులు పరిగణంలోకి తీసుకుని ప్రణాళికను తయారు చేయడం. ప్రాధాన్యత అంశాలు వ్యవసాయం, అనుబంధ రంగాలు, తాగునీరు, చిన్న నీటి వనరులు తెలంగాణకు హరిత హారం-అడవుల పెంపకం, స్మృతి వనాలు, పారిశుధ్యం, డంపింగ్ యార్డ్లు, విద్య, వైద్యం, పరిశ్రమలు, షెడ్యూల్ కులాల సంక్షేమం కోరకు భూమి కొనుగోలు, ఉమ్మడి స్మశాన వాటికల ఏర్పాటు. ప్రణాళికల రూపకల్పనకు ముందు కసరత్తు గ్రామ స్థితిగతులపై విశ్లేషణ, మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగమయ్యే అన్ని అంశాలు పరిగణంలోకి తీసుకోవాలి. సామాజిక, ఆర్థిక, మౌలిక వసతుల లభ్యత, వాటి వృద్ధిపై దృష్టి సారించాలి. ఉత్పత్తి ఉత్పదక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వివిధ రకమైన వనరుల కేటాయింపులకు అంచనాలు వేయాలి. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల మధ్య సమన్వయం పాటించాలి. మండల స్థాయిలో ప్రణాళికలు గ్రామస్థాయి ప్రణాళికలు ఆధారంగా చేసుకుని మండల స్థాయి అవసరాలు అందులో పొందుపర్చి మండల స్థాయి ప్రణాళికలు నపొందుపర్చాలి. ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారుల భాగస్వామ్యంతో తయారు చేసిన ప్రణాళికను మండల పరిషత్ ఆమోదంతో జిల్లాకు పంపాలి. జిల్లాస్థాయి ప్రణాళికలు మండల స్థాయి ప్రణాళికను ఆధారం చేసుకుని జిల్లాస్థాయి అవసరాలను పొందుపర్చి ప్రణాళిక తయారు చేయాలి. ఈ ప్రణాళికను జిల్లా పరిషత్ అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు అమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించవలసి ఉంటుంది. గ్రామప్రణాళిక తయారి ‘మన ఊరు.. మన ప్రణాళిక’ రూపకల్పనకు గ్రామ పంచాయతిని ప్రాథమిక యూనిట్‌గా తీసుకుంటారు. ప్రణాళిక రూపకల్పనకు ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. గ్రామ ప్రణాళిక తయారులో ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల భాగాస్వామ్యంతో గ్రామ స్థాయిలో ఉండే అధికారులతో గ్రామ ప్రణాళికను తయారు చేస్తారు. గ్రామ ప్రణాళికలో ముఖ్య అంశాలు.. సహజ మనవ వనరుల గుర్తింపు, మౌలిక వసతుల లభ్యత, ఆవశ్యకత గుర్తించుట, వ్యవస్థాగత ఏర్పాట్లు భవిష్యత్ లక్ష్యసాధనకు పత్రాన్ని రూపొందించడం. ఐదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడంతోపాటు తక్షణ అవసరాల నిమిత్తం, వార్షిక ప్రణాళిక రూపకల్పన గ్రామ ప్రణాళికను గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించే సభలో ఆమోదించాలి. సిబ్బంది నియామకం ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వారితోపాటు ఐకేపీ అధికారి ఇతర గ్రామ స్థాయి అధికారులలో ఒకరిని సహాయకులుగా తీసుకోవాలి. అలాగే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. జిల్లా స్థాయిలో ప్రణాళికల తయారికి ప్రాధన్యత అంశాల శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సాంకేతిక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సాంకేతిక విభాగం అధికారులు గ్రామ స్థాయి నుంచి అధికారులను, ప్రజా ప్రతినిధులను సమన్వయ పరుస్తూ ప్రణాళికలు రూపొందించాలి. శిక్షణా తరగతులు ప్రణాళిక రూపకల్పనపై శిక్షణ ఇచ్చే నిమిత్తం రిసోర్స్ పర్సన్ళ్ల ఎంపిక జిల్లా, మండల స్థాయిలో జరుగాలి. జిల్లా రిసోర్స్ పర్సన్ మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తారు. అలాగే మండల రిసోర్స్ పర్సన్ గ్రామ ప్రణాళిక తయారీలో పాలు పంచుకోని సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.