లావేరు: గ్రామ పంచాయతీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు చేపట్టడం కోసం లావేరును జిల్లాలో పైలట్ మండలంగా ఎంపిక చేసినట్టు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి శివరాంనాయికర్ తెలిపారు. ఎస్.కె.పల్లి గ్రామంలో గురువారం పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు చేపట్టడం కోసం మండల అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లావేరును పైలట్ మండలంగా ఎంపిక చేసినందున 26 పంచాయతీల పరిధిలోని గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కోరారు.
పతీ పంచాయతీలో పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు ఉన్నదీ లేనిదీ, బ్యాంకు అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, పంటలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఏఏ పంటలు పండిస్తున్నారు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, మాతాశిశు మరణాలు, పింఛన్‌దారులు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. ఈ నెల 12 వతేదీలోగా పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏపీడీ సుజాత, ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్, తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, జడ్పీటీసీ సభ్యుడు పిన్నింటి మధుబాబు, వ్యవసాయాదికారి శ్రీనివాసరావు, మండల గణాంక అధికారి శ్రీనివాసరావు, ఎంఈవో గవరయ్య, ఏపీ వో దాసునాయుడు, సర్పంచ్ మీసాల రామినాయుడు పాల్గొన్నారు.
పైలట్ మండలంగా లావేరు
Published Fri, Sep 5 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement
Advertisement