Devotees Pushkarni
-
వణికిన రాజమండ్రి
కంబాలచెరువు/రాజమండ్రి క్రైం : తొలిరోజు జరిగిన అపశృతి స్మృతుల్లో పచ్చిగా ఉండగానే.. పుష్కరపర్వంలో తొమ్మిదోరోజైన బుధవారం జరిగిన దుర్ఘటన పుష్కరకేంద్రం రాజమండ్రిని.. తుపానులో చిగురాకులా వణికించింది. యూత్రికులను భయ విహ్వలుల్ని చేసింది. ఆదిలోనే 29 మందిని బలిగొన్న పుష్కరఘాట్ తొక్కిసలాట విషాదం పుండులా సలుపుతున్నా.. గోదారమ్మపై అపారమైన భక్తిప్రపత్తులతో, పన్నెండేళ్లకోసారి వచ్చే పండుగ అన్న భావనతో రాజమండ్రి ఘాట్లకు భక్తులు ఇన్నిరోజులుగా పోటెత్తుతూనే ఉన్నారు. వారిని భీతావహులను చేస్తూ బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో గోకవరం బస్టాండ్ సమీపంలోని జగదాంబ హోటల్లో పేలుడు సంభవించింది. అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరపై సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిమంది తిలకిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందిద. క్షణాల్లో పొగ, మంటలు వ్యాపించడంతో వేలాదిమంది ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి గుంటూరుకు చెందిన 70 ఏళ్ల వృద్దురాలు శారదాంబకు తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన హోటల్ ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లోని కిళ్లీ దుకాణం యజమాని గొర్రెల సుబ్రహ్మణ్యం, ప్రేమ్‌కుమార్‌లకు స్వల్పగాయాలయ్యాయి. అదే కాంప్లెక్స్‌లో పుష్కరాల సందర్భంగా చీపుర్లు, బ్లీచింగ్ నిల్వ ఉంచడంతో మంటలు మరింత పెరిగాయి. సంఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచిశకటాలు క్షణాల్లో వచ్చి మంటలను ఆర్పాయి. ఈ ఘటనలో మున్సిపల్ కాంప్లెక్స్‌ను ఆనుకుని ఉన్న కిళ్లీదుకాణం సగంపైగా ధ్వంసంకాగా, లక్ష రూపాయలపైగా నగదు అగ్నికి ఆహుతైంది. అక్కడే ఉన్న ఐదు వాహనాలు పూర్తిగా, మూడు మోటారుసైకిళ్లు పాక్షికంగా అగ్నికి ఆహుతయ్యాయి. అప్పటికే అధికసంఖ్యలో అక్కడున్న పోలీసులు ప్రజలను దూరంగా పంపించి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతం అంతా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. దీనిలో నష్టపోయిన దుకాణదారులకు, వాహనదారులకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా దుర్ఘటన వివరాల సేకరణకు వచ్చిన మీడియాతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారికి, మీడియా వారికి మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో వచ్చిన హోం మంత్రి చినరాజప్ప పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీడియా వారికి నచ్చజెప్పారు. మళ్లీ సీఎం కోసమే జనాన్ని నిలిపేశారు.. సీఎం చంద్రబాబు క్యాబినెట్ సమావేశం కోసం నగరానికి వచ్చిన మంత్రులతో కలిసి గోదావరి హారతిని తిలకించేందుకు పుష్కర్‌ఘాట్‌లో ఉన్న సమయంలోనే అక్కడకు సమీపంలోనే ఈ పేలుడు సంభవించింది. అంతకు ముందే పోలీసులు పుష్కరఘాట్‌కు వెళ్లకుండా జనాలను పోలీసులు ఎక్కడిక్కడే నిలిపివేశారు. పేలుడు జరిగిన చోట ఆ సమయంలో భారీ సంఖ్యలో జనం ఉండడానికి, అనేక వాహనాలు నిలిచిపోవడానికి అదీ ఓ కారణం. క్షతగాత్రులకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ విస్ఫోటంలో గాయపడి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగర్ పాలక సంస్థలో ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్రసేవాదళ్ ప్రధాన కార్యదర్శి సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా జక్కంపూడి మాట్లాడుతూ ఈ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. నగరంలోనే ఉన్న ముఖ్యమంత్రి నగర భద్రతను గాలికొదిలేసి సొంతప్రచారం కోసం జనాన్ని ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదన్నారు. నా ఆటో కాలిపోరుుంది పుష్కరాలకు వచ్చిన వారిని నా ఆటోలో అంబేద్కర్ విగ్రహం జంక్షన్ సమీపంలో దించి డబ్బులు తీసుకుంటున్నాను. ఇంతలో ఒక్కసారిగా నా ఆటోవైపు విపరీతమైన పొగ కమ్మి, పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి. నేను, ఆటోలో ఉన్న ప్రయాణికులు ఆటోను వదిలి పరుగు తీశాము. నా ఆటో పూర్తిగా కాలిపోయింది. - నటిగట్ల నాగరాజు, ఆటోడ్రైవర్, ప్రత్యక్షసాక్షి మంటలు క్షణంలో వ్యాపించాయి సంఘటన సమయంలో నేను అక్కడే నిల్చుని ఉన్నాను. మున్సిపల్ కాంప్లెక్స్‌లోంచి భారీ పేలుడుతో కూడిన మంటలు వచ్చాయి. అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి కొందరికి గాయాలయ్యాయి. మంటల తాకిడికి విద్యుత్ వైర్లు కరిగి తెగిపోయూయి. మున్సిపల్ కాంప్లెక్స్‌లో చీపుర్లు, ఇతర సామగ్రి నిల్వ ఉంచడంతో మంటలు మరింత పెరిగాయి. - ఎంజీకే రాజు, ప్రత్యక్షసాక్షి దేవుడే కాపాడాడు.. దుకాణం అంతా కస్టమర్లతో రద్దీగా ఉంది. వచ్చిన వారికి దుకాణంలో సామాన్లు ఇస్తుండగా ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చి మంటలు చెలరేగారుు. నాపై కొన్ని వస్తువులు వచ్చి పడ్డాయి. దీంతో దుకాణంలోంచి బయటకు పారిపోయి వచ్చాం. ఆ దేవుడే నా ప్రాణాలను కాపాడాడు. - గొర్రెల సుబ్రహ్మణ్యం, గాయపడ్డ కిళ్లీ దుకాణం యజమాని -
పుష్కర స్నానాలు@ 66.50 లక్షలు
సాక్షి, కొవ్వూరు : గడచిన ఆరు రోజుల్లో జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 66.50 లక్షలుగా అధికార యంత్రాంగం గణించింది. ఇదిలావుండగా ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 17,46,217 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఘాట్లలో 9,36,292 మంది, నరసాపురం డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో 4,59,925 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఘాట్లలో 3.50 లక్షల మంది స్నానాలు ఆచరించారు. అత్యధికంగా గోష్పాద క్షేత్రంలో 2.72లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. గోష్పాద క్షేత్రం లోని గాయత్రి ధ్యానమందిరంలో కంచి ఉపపీఠాధిపతి విజయేంద్ర సరస్వతిస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు కసరత్తు ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో మొబైల్, స్టేషనరీ టీమ్‌లను ఏర్పాటు చేసి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను గుండుగొలను, నల్లజర్ల, కొయ్యలగూడెం, దేవరపల్లి మీదుగా వివిధ ఘాట్లకు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కొవ్వూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ముందస్తుగానే కసరత్తు చేసి తాళ్లపూడి జంక్షన్ సమీపంలో ట్రాఫిక్‌ను పోలవరం, పట్టిసీమకు మళ్లించారు. దాదాపు 50వేల మంది యాత్రికులను ఇతర ఘాట్లకు దారి మళ్లించారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లాలో నిరంతర నిఘా కొనసాగించడానికి 142 సీసీ కెమెరాలు , 25 మోనిటరింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో 16 వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. -
భక్తులకు సరిపడా బస్సులు : ఆర్టీసీ ఎండీ
తొర్రూరు : పుష్కర భక్తులకు ప్రతీ డిపో నుంచి సరిపడా బస్సు సర్వీసులు న డిపిస్తున్నామని ఆర్టీసీ ఎండీ జీబీ రమణారావు తె లిపారు. శనివారం తొర్రూరు డిపోలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇ ప్పటికే 2,341 బస్సు ద్వారా సుమారు 3.65 లక్షల మంది భక్తులను పుష్కరాలకు తరలించామన్నారు. ప్రధానంగా భద్రాచలానికి 808, కాళేశ్వరానికి 542, ధర్మపురికి 422 బస్సులు నడిపిస్తున్నామన్నారు. పు ష్కర స్నానాలు ఆచరించిన 2.58లక్షల మందిని 1.422 బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఈనెల 25వ తేదీ వరకు బస్సులను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈసందర్భంగా కా ర్మిక సంఘాల నాయకులు ఎండీ రమణా రావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
పుష్కర భక్తులకు కష్టాలు తీరాయి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పుష్కరాలకు వ చ్చే భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘పుష్కర భక్తులకు పుట్టెడు కష్టాలు’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన వార్తకు జిల్లా పాలనా యంత్రాంగం వెంటనే స్పందించింది. జిల్లాలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద భక్తులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా స్నానమాచరించేలా చర్యలకు ఉపక్రమించింది. గోదావరి ప్రధాన పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. తొలిరోజుతో పోలిస్తే బుధవారం పుష్కరాలకు వచ్చిన భక్తులకు వసతి, సౌకర్యాలు మెరుగయ్యా యి. కాళేశ్వరంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎమ్మెల్యే పుట్ట మధు భక్తులెదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో పార్కింగ్ స్థలం నుచి భక్తులు రెండు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లడం సరికాదని భావించిన అధికారులు పుష్కర ఘాట్ల వరకు ఆటోల్లో వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచారు. పోలీస్ యంత్రాంగం అత్యుత్సాహాన్ని తగ్గించిన పరిస్థితి కని పించింది. డీఐజీ మల్లారెడ్డి ఎప్పటికప్పుడు పోలీసులతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ఆలయం లో క్యూలైన్ల వద్ద చలువ పం దిళ్లు లేకపోవడంతో ఎండ, ఉక్కపోతకు భక్తులు అల్లాడిపోయిన విషయం తెలిసిం దే. బుధవారం ఆలయ సి బ్బంది చలువ పందిళ్లు వేశా రు. సత్వర దర్శనం కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. గురువారం అమావాస్య సందర్భంగా పిండప్రదానాలు అధికంగా ఉంటాయని భావించిన దేవాదా య శాఖ అధికారులు అం దుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఐదు ప్రదేశాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చే శారు. బుధవారం 1155 మందికి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఐదుగురు భక్తులకు అత్యవసర సేవలందించేందుకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సేవల కోసం రెండు అంబులెన్సులను ఉంచా రు. పేషెంట్ల సౌకర్యార్ధం పది బెడ్లను ఏర్పాటు చేశారు. 22 మంది వైద్య నిపుణులు, 111 మంది పారామెడికల్ సిబ్బంది 24 గంటలపాటు వైద్య సేవలందిస్తున్నారు. వృద్ధు లు, వికలాంగులను స్నానఘాట్ల వద్దకు తీసుకెళ్లేందుకు వలంటీర్లు ఉత్సాహంగా ముందుకొచ్చారు. మంథని పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సౌర్యార్ధం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఫ్లాంట్ కు విద్యుత్ కనెక్ష న్ ఇచ్చారు. భక్తులు స్నానమాచరించేందకు ఇబ్బందుల్లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ప్రత్యేక చర్యలు ధర్మపురిలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం అక్కడే మకాం వేసి అధికారులకు ఆదేశాలిచ్చారు. పుష్కర ఘాట్లకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్కింగ్ స్థలం నుంచి భక్తులు కాలినడక రావడంవల్ల ఇబ్బందులుండటంతో బుధవారం పరిమిత సంఖ్యలో బస్సులు, ఆటోలు ఘాట్ల సమీపం వరకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి వసతి విషయంలో ఎండోమెంట్ అధికారులు అంతగా స్పందించన దాఖలాలు లేవు. తాగునీటి కోసం ధర్మపురి పుణ్యక్షేత్రంలో బుధవారం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘాట్ల వద్ద బురదనీరు పేరుకుపోయి ఉంది. ధర్మపురి వీఐపీ ఘాట్లలో మహిళలకు బట్టలు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన గదులకు తలుపులు సరిగా అమర్చలేదు. గోదావరిలో పురోహితులు అనుకున్న సంఖ్యలో లేకపోవడంతో చిన్నపిల్లలు బ్రహ్మణులుగా రావడం కనిపించింది. గోదావరిఖని విషయానికొస్తే గురువారం బురదనీటి నివారణకు ఇసుక బస్తాలు వేశారు. ఇసుక వారధుల నుంచి గోదావరిలోకి వెళ్లి భక్తులు మంచినీటిలో సాన్నాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. కోటిలింగాలలో మాత్రం ఎప్పటిలాగే భక్తులు ఇరుకు పుష్కరఘాట్‌లో స్నానాలు చేసి ఇబ్బందులు పడ్డారు.