పుష్కర భక్తులకు కష్టాలు తీరాయి | There will be not more problems to Devotees Pushkarni | Sakshi
Sakshi News home page

పుష్కర భక్తులకు కష్టాలు తీరాయి

Published Thu, Jul 16 2015 4:29 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

There will be not more problems to Devotees Pushkarni

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పుష్కరాలకు వ చ్చే భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘పుష్కర భక్తులకు పుట్టెడు కష్టాలు’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన వార్తకు జిల్లా పాలనా యంత్రాంగం వెంటనే స్పందించింది. జిల్లాలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్ద భక్తులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా స్నానమాచరించేలా చర్యలకు ఉపక్రమించింది. గోదావరి ప్రధాన పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. తొలిరోజుతో పోలిస్తే బుధవారం పుష్కరాలకు వచ్చిన భక్తులకు వసతి, సౌకర్యాలు మెరుగయ్యా యి.

కాళేశ్వరంలో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎమ్మెల్యే పుట్ట మధు భక్తులెదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో పార్కింగ్ స్థలం నుచి భక్తులు రెండు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లడం సరికాదని భావించిన అధికారులు పుష్కర ఘాట్ల వరకు ఆటోల్లో వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచారు. పోలీస్ యంత్రాంగం అత్యుత్సాహాన్ని తగ్గించిన పరిస్థితి కని పించింది. డీఐజీ మల్లారెడ్డి ఎప్పటికప్పుడు పోలీసులతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

కాళేశ్వరం ఆలయం లో క్యూలైన్ల వద్ద చలువ పం దిళ్లు లేకపోవడంతో ఎండ, ఉక్కపోతకు భక్తులు అల్లాడిపోయిన విషయం తెలిసిం దే. బుధవారం ఆలయ సి బ్బంది చలువ పందిళ్లు వేశా రు. సత్వర దర్శనం కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. గురువారం అమావాస్య సందర్భంగా పిండప్రదానాలు అధికంగా ఉంటాయని భావించిన దేవాదా య శాఖ అధికారులు అం దుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఐదు ప్రదేశాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చే శారు. బుధవారం 1155 మందికి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఐదుగురు భక్తులకు అత్యవసర సేవలందించేందుకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సేవల కోసం రెండు అంబులెన్సులను ఉంచా రు. పేషెంట్ల సౌకర్యార్ధం పది బెడ్లను ఏర్పాటు చేశారు. 22 మంది వైద్య నిపుణులు, 111 మంది పారామెడికల్ సిబ్బంది 24 గంటలపాటు వైద్య సేవలందిస్తున్నారు. వృద్ధు లు, వికలాంగులను స్నానఘాట్ల వద్దకు తీసుకెళ్లేందుకు వలంటీర్లు ఉత్సాహంగా ముందుకొచ్చారు. మంథని పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సౌర్యార్ధం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఫ్లాంట్ కు విద్యుత్ కనెక్ష న్ ఇచ్చారు. భక్తులు స్నానమాచరించేందకు ఇబ్బందుల్లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

 కలెక్టర్ ప్రత్యేక చర్యలు
 ధర్మపురిలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ నీతూప్రసాద్ బుధవారం అక్కడే మకాం వేసి అధికారులకు ఆదేశాలిచ్చారు. పుష్కర ఘాట్లకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్కింగ్ స్థలం నుంచి భక్తులు కాలినడక రావడంవల్ల ఇబ్బందులుండటంతో బుధవారం పరిమిత సంఖ్యలో బస్సులు, ఆటోలు ఘాట్ల సమీపం వరకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. తాగునీటి వసతి విషయంలో ఎండోమెంట్ అధికారులు అంతగా స్పందించన దాఖలాలు లేవు. తాగునీటి కోసం ధర్మపురి పుణ్యక్షేత్రంలో బుధవారం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘాట్ల వద్ద బురదనీరు పేరుకుపోయి ఉంది.

ధర్మపురి వీఐపీ ఘాట్లలో మహిళలకు బట్టలు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన గదులకు తలుపులు సరిగా అమర్చలేదు. గోదావరిలో పురోహితులు అనుకున్న సంఖ్యలో లేకపోవడంతో చిన్నపిల్లలు బ్రహ్మణులుగా రావడం కనిపించింది. గోదావరిఖని విషయానికొస్తే గురువారం బురదనీటి నివారణకు ఇసుక బస్తాలు వేశారు. ఇసుక వారధుల నుంచి గోదావరిలోకి వెళ్లి భక్తులు మంచినీటిలో సాన్నాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. కోటిలింగాలలో మాత్రం ఎప్పటిలాగే భక్తులు ఇరుకు పుష్కరఘాట్‌లో స్నానాలు చేసి ఇబ్బందులు పడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement