Dimonitaijesan
-
వృద్ధి పరుగే ప్రధాన లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు) తాలూకు ప్రభావం ఆర్థిక రంగంపై లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎదురైన ప్రశ్నలకు ఆమె స్పందించారు. తయారీ రంగంలో కొంత క్షీణత ఉందని, అయితే, ఇది నోట్ల రద్దు వల్ల కాదన్నారు. ప్రభుత్వ ఎజెండాలో ఆర్థిక వృద్ధి ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందని చెప్పారు. జీడీపీ వృద్ధి పెంపు కోసం ఎన్నో రంగాల్లో సంస్కరణలను చేపట్టడం జరుగుతోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మోస్తరుగా ఉండడానికి వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాణిజ్యం, హోటల్, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో వృద్ధి తక్కువగా ఉండడమేనని చెప్పారు. ‘‘ముఖ్యంగా కొన్ని రంగాల్లో తక్కువ వృద్ధి ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో ఈ పరిస్థితి నెలకొంది’’ అని మంత్రి వివరించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోయిందని, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలను కూడా అమల్లో పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో సభ్యుని ఆందోళనను అర్థం చేసుకోగలనన్నారు. అయినా కానీ, ఇప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నట్టు చెప్పారు. అమెరికా వృద్ధి రేటు 2016–2019 మధ్య 1.6 శాతం నుంచి 2.3 శాతం మధ్య ఉంటే, చైనా వృద్ధి 6.7 శాతం నుంచి 6.3 శాతానికి పడిపోయిందని, కానీ, దేశ వృద్ధి రేటు 7 శాతానికి పైనే ఉన్నట్టు చెప్పారు. రైతులందరికీ ఆదాయం... కిసాన్ సమ్మాన్ యోజన, పెన్షన్ యోజన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోదీ సర్కారు రెండో విడత పాలనలో చేపట్టిన కీలక సంస్కరణ... పీఎం కిసాన్ యోజన కింద రైతులందరికీ రూ.6,000 చొప్పున ఆదాయం అందించనున్నట్టు చెప్పారు. గతంలో ఇది రెండు హెక్టార్ల రైతులకే పరిమితం చేశారు. దీనికి తోడు చిన్న, సన్నకారు రైతులు, చిన్న వర్తకులకు స్వచ్ఛంద పెన్షన్ పథకాన్ని కూడా తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వృద్ధి విషయమై మరింత దృష్టి పెట్టేందుకు ప్రధాని అద్యక్షతన ఐదుగురు సభ్యులతో పెట్టుబడులు, వృద్ధిపై కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీఎస్టీ, ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం సహా పూర్వపు ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణలను కూడా మంత్రి గుర్తు చేశారు. నోట్ల రద్దుతో సానుకూల ఫలితాలు రూ.500, రూ.1,000 నోట్ల డీమోనిటైజేషన్ వల్ల సానుకూల ఫలితాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. అక్రమ ధనం ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధుల సాయంగా వెళ్లేదని, నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదుల వద్ద ఉన్న డబ్బంతా పనికిరాకుండా పోయిందన్నారు. అలాగే, డిజిటల్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. బ్యాంకు మోసాలు తగ్గాయి బ్యాంకుల్లో రూ.లక్ష., అంతకుమించిన మోసాలు 2018–19లో 6,735 తగ్గినట్టు మంత్రి చెప్పారు. ఈ మోసాల వల్ల పడిన ప్రభావం రూ.2,836 కోట్లుగా ఉంటుందన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2017–18లో 9,866 మోసం కేసులు (రూ.4,228 కోట్లు) నమోదైనట్టు తెలిపారు. -
ప్రధాని క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లలో 99.3 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని కాంగ్రెస్ అవకాశంగా మలుచుకుని కేంద్రంపై విమర్శలకు దిగింది. డీమోనిటైజేషన్ కోసం దేశం ఎంతో మూల్యం చెల్లించిందని, ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రూ.3 లక్షల కోట్ల మేర అక్రమ నగదు వ్యవస్థలోకి వస్తుందని 2017 స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారని, అబద్ధం చెప్పినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఇతిహాస లెక్కల ఆధారంగా మోదీ సృష్టించిన విపత్తు డీమోనిటైజేషన్ అని ఆర్బీఐ నివేదిక మరోసారి నిరూపించిందన్నారు. మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం సైతం స్పందించారు. డీమోనిటైజేషన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, పరిశ్రమల మూతపడటం, వృద్ధి రేటు తగ్గడం వంటి సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొందని చిదంబరం అన్నారు. కేవలం రూ.13,000 కోట్ల మేరే డీమోనిటైజేషన్ జరిగినట్టు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయని, ఇందుకోసం దేశం ఎంతో మూల్యం చెల్లించిందన్నారు. ‘వృద్ధి రేటు పరంగా దేశ జీడీపీ 1.5 శాతం మేర నష్టపోయింది. దీనివల్లే రూ.2.25 లక్షల కోట్ల నష్టం జరిగింది. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 కోట్ల మంది రోజువారీ వేతన జీవులు కొన్ని వారాల పాటు తమ ఉపాధి కోల్పోయారు. వేలాది ఎస్ఎంఈ యూనిట్లు మూతపడ్డా యి’అని చిదంబరం ట్వీట్ చేశారు. రాఫెల్‌పై వాగ్యుద్ధం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో..రాహుల్ బదులు కోరుతూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 15 ప్రశ్నలను ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. గత యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కన్నా 20 శాతం తక్కువ ధరలకే రాఫెల్ విమానాలను కొనుగోలుచేస్తున్నామని తెలిపారు. దీనికి రాహుల్ స్పందిస్తూ.. రాఫెల్ ఒప్పందాన్ని ఘరానా దోపిడీగా అభివర్ణించారు. వ్యాపారవేత్త అయిన స్నేహితుడిని కాపాడుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
చిన్న పట్టణాల్లో మ్యూచువల్ ఫండ్స్ హవా
న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లో మ్యూచువల్ ఫండ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ పట్టణాల్లో ఫండ్స్ మార్కెట్ వాటా 38 శాతం పెరిగింది. ఈ పట్టణాల నుంచి పెట్టుబడుల విలువ రూ.4.27 లక్షల కోట్లకు చేరింది. పరిశ్రమ చేపట్టిన అవగాహన కార్యక్రమం వల్లే చిన్న పట్టణాల్లో (బీ15 ప్రాంతాల్లో) మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు పెరగడానికి కారణమని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రో సీవోవో హర్‡్షజైన్ తెలిపారు. అలాగే, డీమోనిటైజేషన్, రిటైల్ ఇన్వెస్టర్ల బలమైన ప్రాతినిధ్యం కూడా ఇందులో ఉందన్నారు. చిన్న పట్టణాల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల మొత్తం విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.2 లక్షల కోట్లు లేదా 38 శాతం పెరిగి రూ.3.09 లక్షల కోట్ల నుంచి రూ.4.27 లక్షల కోట్లకు చేరినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ‘యాంఫి’ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సంప్రదాయ సాధనాలైన రియల్ ఎస్టేట్, బంగారం నుంచి మ్యూచువల్ ఫండ్స్ వైపు ఇన్వెస్టర్ల అడుగులు పడుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు పరిశ్రమలోని మొత్తం 42 అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల నిర్వహణలోని ఆస్తుల విలువ గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 26 శాతం వృద్ధితో రూ.23.5 లక్షల కోట్లకు చేరింది. వీటిలో బీ15 ప్రాంతాల వాటా 19 శాతంగా ఉంది. టాప్ 15 పట్టణాల నుంచి వచ్చిన పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 36 శాతమే కాగా, బీ15 ప్రాంతాల నుంచి వచ్చిన పెట్టుబడుల్లో 62 శాతం ఈక్విటీల్లోనే ఉండటం విశేషం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ సహా తొలి 15 పట్టణాలను టీ15గా, మిగిలిన పట్టణాలను బీ15 పట్టణాలుగా పిలుస్తున్నారు. -
ఒక్క కంపెనీ.. 2 వేల ఖాతాలు..
చెన్నై: ఏకంగా 2,000 పైగా బ్యాంకు ఖాతాలతో ఒక డొల్ల కంపెనీ దాదాపు రూ. 4,000 కోట్ల పైచిలుకు నగదు లావాదేవీలు నిర్వహించిన వైనాన్ని గుర్తించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంత భారీగా లావాదేవీలు ఉన్నప్పటికీ ఆదాయం గురించి సదరు కంపెనీ సరైన వివరణ ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. పెద్ద నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువును ఉపయోగించుకుని ఆ సంస్థ.. బ్లాక్‌మనీని చలామణిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసిందని వివరించారు. పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) జరగకపోయి ఉండి ఉంటే ఇది బైటపడేదే కాదని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఉదంతం వెలుగుచూసిన తర్వాత సదరు కంపెనీ ప్రస్తుతం మూతబడిందని ఆమె తెలిపారు. బీజేపీకి చెందిన వ్యాపారవర్గాలు నిర్వహించిన యాంటీ బ్లాక్‌మనీ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ ఈ విషయాలు చెప్పారు. పెద్ద నోట్లు రద్దు తర్వాతే డొల్ల కంపెనీల వ్యవహారాలు బైటికొచ్చాయని ఆమె తెలిపారు. -
అమ్మకాలు తగ్గినా, సెంటిమెంట్ మెరుగే..!
న్యూఢిల్లీ: హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలపై ‘నోట్ల రద్దు’ నిర్ణయం తక్షణం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినట్లు ఒక సర్వేలో తెలింది. రూ.1,000, రూ.500 కరెన్సీ నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆన్లైన్ హోల్‌సేల్ మార్కెట్‌ప్లేస్ వైడర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల మొత్తంగా సెంటిమెంట్ సానుకూలంగానే ఉందని కూడా సర్వే వివరించింది. కొన్ని అంశాలను పరిశీలిస్తే... ►భారత్‌లోని హోల్‌సేలర్లు, రిటైలర్లలో దాదాపు 36 శాతం మంది నోట్ల రద్దు నిర్ణయం తమ వ్యాపారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని వివరించారు. ►2016 అక్టోబర్‌తో పోల్చితే 2017 అక్టోబర్‌లో తమ అమ్మకాలు 50 శాతానికి పైగా పడిపోయాయని సర్వేలో పాల్గొన్న వారిలో 21 శాతం మంది తెలిపారు. 20 నుంచి 50 శాతం వరకూ అమ్మకాలు పడిపోయాయని తెలియజేసిన వారి రేటు 27 శాతంగా ఉంది. ► మెజారిటీ వ్యాపారాల్లో నగదు ఆధారిత లావాదేవీలు తగ్గకపోవడం గమనార్హం. డీమోనిటైజేషన్ తరువాత ఇన్వాయిస్ రహిత నగదు అమ్మకాలు తగ్గినట్లు 40 శాతం మంది మాత్రమే సర్వేలో పేర్కొన్నారు. ►డిజిటల్ పేమెంట్లు, ఆన్లైన్ బ్యాంక్ బదలాయింపుల విషయంలో డీమోనిటైజేషన్‌కు ముందు ‘జీరో’గా ఉన్న టెక్నాలజీ వినియోగం అటు తర్వాత కొంత పుంజుకుందని సర్వే వివరించింది. ►దేశవ్యాప్తంగా దుస్తులు, లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములైన రిటైలర్లు, హోల్‌సేలర్లు, తయారీదారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రాతిపదికన తాజా సర్వే రూపొందింది. ►ఫ్యాషన్, హోమ్ డెకరేషన్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాలు వంటి విభాగాల్లో హోల్‌సేల్ మార్కెట్‌ప్లేస్‌గా ఉన్న వైడర్ ప్లాట్‌ఫామ్‌పై 7,500కుపైగా తయారీ, సరఫరాదారులు ఉన్నారు. దాదాపు 29 రాష్ట్రాల్లో 16,000 పిన్కోడ్లకు సంబంధించి 7 లక్షలకు పైగా రిటైలర్లకు వైడర్ తన సేవలను అందిస్తోంది. ప్రత్యక్ష ప్రతికూల ప్రభావం... డీమోనిటైజేషన్ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఈ ప్రభావం అమ్మకాలు పడిపోతున్న రూపంలో ప్రత్యక్ష రీతిన వ్యాపారాల్లో కనిపించింది. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూల సెంటిమెంట్ కనిపించింది. – దేవేశ్ రాయ్, పౌండర్ అండ్ సీఈఓ, వైడర్ -
నల్లధనంపై తెల్లమొహం..!!
-
నల్లధనంపై తెల్లమొహం..!!
♦ అసలు ఉందా లేక తెల్లగా మారిందా? ♦ రద్దయిన రూ.1,000 నోట్లలో 99 శాతం వెనక్కి ♦ వెనక్కి రాని నోట్ల విలువ కేవలం రూ. 8,925 కోట్లే. ♦ రూ.500 నోట్లపై బయటకు రాని పూర్తి గణాంకాలు ♦ ఆర్బీఐ తాజా నివేదికతో బయటపడిన వాస్తవాలు... న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రూపంలో భారీగా నల్లధనం పోగుపడిందన్న అంచనాలతో, అవినీతిపరుల వెన్ను విరిచేందుకు నరేంద్ర మోదీ సర్కారు చేపట్టిన డీమోనిటైజేషన్ అస్త్రం సత్ఫలితాలను ఇచ్చిందా..? అన్న ప్రశ్నకు అవును అనే సమాధానం మాత్రం వినిపించడం లేదు. ఎందుకంటే ఆర్బీఐ తాజాగా వెల్లడించిన గణాంకాలు మరోలా ఉన్నాయి మరి. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ నివేదిక ప్రకారం అప్పటికి మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.1,000 నోట్ల విలువ రూ.6.86 లక్షల కోట్లు. కేంద్ర మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ స్వయంగా ఈ ఏడాది ఫిబ్రవరి 3న లోక్‌సభకు ఈ విషయాన్ని వెల్లడించారు. మరి డీమోనిటైజేషన్ కార్యక్రమం ముగిసిపోయిన ఈ ఏడాది మార్చి నాటికి కేవలం రూ.8,925 కోట్ల విలువ చేసే రూ.1,000 నోట్లు మాత్రమే వెనక్కిరాలేదని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రకారం చూస్తే మొత్తం రూ.1,000 నోట్లలో 99 శాతానికిపైగా తిరిగి వెనక్కి వచ్చాయి. కేవలం ఓ పావు శాతం లోపు నోట్లు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాకుండా ఆగిపోయాయనేది స్పష్టమైంది. రూ.500 నోట్లపై అయోమయం! ఇక రూ.500 నోట్ల విలువ గురించి ఈ విధంగా లెక్కించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే వ్యవస్థలోకి కొత్త రూ.500 నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఆర్బీఐ పాత, కొత్త రూ.500 నోట్లకు సంబంధించి వేర్వేరు గణాంకాలను ప్రకటించలేదు. దీంతో రూ.500 నోట్ల చలామణి విషయమై అస్పష్టత నెలకొంది. కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ.15.4 లక్షల కోట్లు కాగా, వీటిలో సగానికి పైగా రూ.500 నోట్లే. రద్దయిన రూ.500 నోట్లలో వాస్తవానికి ఎన్ని వెనక్కి వచ్చాయన్నది తెలియాలంటే ఆర్బీఐ స్పష్టమైన గణాంకాలు వెల్లడిస్తేనే సాధ్యం. వెనక్కిరాని 500 నోట్ల విలువ రూ.7,075 కోట్లుగా లెక్కతేలుతోంది. నల్లధనం ఎంత పట్టారు? రూ.500 నోట్లపై స్పష్టమైన గణాంకాలు బయటకు రానప్పటికీ వ్యవస్థలో ఉన్న నల్లధనాన్ని కేంద్రం ఏ మేరకు ఏరి పారేసిందో రూ.1,000 నోట్ల గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రూ.1,000 నోట్లలో దాదాపు 99.5% వెనక్కి వచ్చినట్టుగానే రద్దయిన రూ.500 నోట్లు కూడా అదే స్థాయిలో వ్యవస్థలోకి వచ్చినట్లు తాజా నివేదిక చెబుతోంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థకు వెలుపల చలామణి అవుతున్న నల్లధనాన్ని కేంద్రం తుడిచేసింది ఏముందున్న ప్రశ్న తలెత్తక మానదు. అసలు నల్లధనం పెద్దగా లేకపోయి ఉండొచ్చు. లేదా అవినీతిపరులు నేరుగా లేదా బినామీల ద్వారా బ్యాంకుల నుంచి, ఇతర మార్గాల్లో (రాజకీయ విరాళాలు, కొనుగోళ్లు) తమ నల్లధనాన్ని తెల్లగా మార్చేసుకుని అయినా ఉండొచ్చు. ఒకవేళ ఇలా చేస్తే వీరికి పన్ను అధికారుల నుంచి తాఖీదులు అందుతాయి. భారీ పనిభారంతో సతమతం అవుతున్న ఐటీ శాఖ.. నిందితులను పట్టుకునేందుకు ఎన్నేళ్లయినా పట్టొచ్చు. అప్పటికీ జరిమానాలతో బయటపడే మార్గాలు ఉండనే ఉన్నాయి. ఆర్బీఐ అందుకే వెల్లడించడం లేదా? ఆర్బీఐ డీమోనిటైజేషన్ నివేదిక ప్రకారం చూస్తే... కేంద్రం కొండను తవ్వి పట్టిన నల్లధనం ఏ మేరకు ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. భారీగా నల్లధనం వ్యవస్థలో ఉందని... నకిలీ నోట్లు కూడా భారీస్థాయిలో ఇతర దేశాల నుంచి వస్తున్నాయంటూ ఊదరగొట్టిన మోదీ సర్కారు.. ఆర్బీఐ వద్దనున్న గణాంకాలను కావాలనే ఇన్నాళ్లూ తొక్కిపెట్టిందన్నది తాజా నివేదికతో బట్టబయలైంది. డీమోనిటైజేషన్ జరిగిన తొమ్మిది నెలలకుగాని ఈ గణాంకాలను ఆర్బీఐ వెల్లడించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనబడుతోంది. నిజానికి డీమోనిటైజేషన్ తర్వాత ప్రతీ బ్యాంకు శాఖ ఎంత మేర నల్లధనం స్వీకరించిందీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో గణాంకాలతో సహా నమోదు చేశాయి. అలాగే, నకిలీ నోట్లను గుర్తించే పరికరాలతో స్కాన్ చేయడం కూడా ఎప్పుడో పూర్తయింది. దీంతో ఎంత మేర వెనక్కి వచ్చిందన్న దానిపై ఆర్బీఐ, ప్రభుత్వం వద్ద అంచనాలు చాన్నాళ్ల క్రితమే ఉన్నాయన్నది సుస్పష్టం. అయినా వెనక్కి వచ్చిన నోట్లు అసలా, నకిలీయా లెక్కింపు పూర్తి కాలేదంటూ ఆర్బీఐ ఇన్నాళ్లూ కాలయాపన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కూడా రద్దయిన నోట్ల లెక్కింపు పూర్తి కాదని ఇటీవలే ఒక సందర్భంలో అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. మరి ఆర్బీఐ నోట్ల లెక్కింపు పూర్తి కాకుండానే... ప్రధాని మోదీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో రూ.3 లక్షల కోట్ల మేర నల్లధనం వ్యవస్థలోకి రా లేదని ఎలా చెప్పారో ఆయనకే తెలియాలి మరి. నోట్ల రద్దుతో మిగిలిందేంటి..? కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం తుడిచిపెట్టుకుపోయిందో, లేదోగానీ... పన్ను చెల్లింపుదారుల సంఖ్య మాత్రం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలను రద్దు చేయడంతో పన్ను ఎగవేతలకు చెక్ పడుతుందంటున్నారు. కానీ, అసలు డీమోనిటైజేషన్ కార్యక్రమానికి కీలకమైన నల్లధనం ఏరివేత ప్రయోజనం మాత్రం సిద్ధించినట్టు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ మందగమనం: ఎస్బీఐ
బ్యాంకు వ్యాపారం దెబ్బతినొచ్చన్న ఆందోళన న్యూఢిల్లీ: ఆర్థిక రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎప్పుడో ముగిసిపోయిన అంశమని కేంద్రం పేర్కొంటుండగా... దీనికి భిన్నంగా ఎస్బీఐ వ్యాఖ్యలు చేసింది. డీమోనిటైజేషన్ కారణంగా ఆర్థిక రంగ క్షీణత ఇకపైనా కొనసాగుతుందని, తమ వ్యాపారాన్ని గణనీయంగా దెబ్బతీయొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతేడాది డిసెంబర్లో కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎస్బీఐ ఇటీవలే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రూ.15,000 కోట్ల మేర షేర్లను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో కేటాయించింది. ఈ సందర్భంగా ఎస్బీఐ తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్టు తెలియజేసింది. ‘‘నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై, బ్యాంకింగ్ రంగంపై దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించవచ్చు. బ్యాంకు వ్యాపారాన్ని ఇది బాగానే దెబ్బతీయెచ్చు’’ అని ఎస్బీఐ షేర్ల కేటాయింపునకు ముందు జారీ చేసిన ప్రాథమిక పత్రంలో పేర్కొంది. డీమోనిటైజేషన్ కారణంగా ఎదురయ్యే సవాళ్ల గురించి బ్యాంకు ప్రస్తావిస్తూ... ఇతర వాణిజ్య బ్యాంకులు, రుణాలిచ్చే సంస్థల నుంచి అధిక పోటీని ఎదుర్కోవచ్చని వివరించింది. దీంతో నికర వడ్డీ మార్జిన్, ఇతర ఆదాయంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో బ్యాంకు పోటీనివ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా నిబంధనలపరమైన వ్యయాలు, మోసపూరిత ఘటనలు అధికం కావచ్చని ఇవన్నీ కలసి బ్యాంకు వ్యాపారం, కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితులకు విఘాతం కలిగించవచ్చని వివరించింది. -
ఫండ్స్ లోకి 1.5 లక్షల కోట్లు!
భారీగా నిధులు వస్తాయని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అంచనా... న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు చర్య(డీమోనిటైజేషన్) ప్రభావంతో ఫండ్స్ ఇతరత్రా ఆర్థిక సాధనాల్లోకి పెట్టుబడులు పోటెత్తనున్నాయని మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) పరిశ్రమ భావిస్తోంది. మధ్యాకాలానికి రిటైల్, హైనెట్వర్త్ ఇన్వెస్టర్ల(హెచ్ఎన్ఐలు) నుంచి ఫండ్సలోకి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల భారీ నిధులు రావచ్చనేది పరిశ్రమ నిపుణుల అంచనా. అంతేకాకుండా.. రానున్న కొద్ది నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం, ప్రభుత్వ ఆదాయం పుంజుకోవడం, వడ్డీరేట్ల కోత వంటివి చోటుచేసుకోనున్నాయని వారు చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ వంటివాటిలో పెట్టుబడులపై దృష్టిసారించనున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ‘డీమోనిటైజేషన్ వ్యవధి తర్వాత 2-3 క్వార్టర్ల పాటు సర్దుబాట్లు ఉండొచ్చు. ఆతర్వాత స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తాయని(అత్యంత బుల్లిష్ ధోరణి) భావిస్తున్నాం. ప్రధానంగా బ్లాక్ మనీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బంగారం, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులకు వెనకాడే పరిస్థితులు ఉన్నారుు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు ప్రయోజనం లభించనుంది. వచ్చే మూడేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ రెట్టింపు కావచ్చనేది మా అంచనా’ అని మోతీలాల్ ఓశ్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఎండీ, సీఈఓ ఆశిష్ సోమయా పేర్కొన్నారు. ‘మొత్తం ఆర్థిక పొదుపు సాధనాల్లో దాదాపు 9 శాతం నగదు రూపంలో(కరెన్సీ నోట్లు) ఉంటాయని అంచనా. క్యాపిటల్ మార్కెట్ అసెట్స్‌లో ఇది 6 శాతమే. ఇప్పుడు డీమోనిటైజేషన్ కారణంగా బంగారం, రియల్టీ ఇతరత్రా సాంప్రదాయ పెట్టుబడులతో పాటు నగదు లావాదేవీలు కూడా తగ్గుముఖం పట్టొచ్చు. దీంతో పెద్ద మొత్తంలో నిధులు క్యాపిటల్ మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్నాం’ అని డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఏఎంసీ సీఐఓ(ఈక్విటీస్) ఈఏ సుందరం వ్యాఖ్యానించారు. 2015 మార్చి నాటికి బ్యాంకుల్లో వ్యక్తిగత డిపాజిట్ల(కార్పొరేట్లు, ఇతరత్రా సంస్థలు కాకుండా) విలువ దాదాపు రూ.50.6 లక్షల కోట్లుగా అంచనా. దీంతో పోల్చితే ప్రస్తుతం ఎంఎఫ్‌లలో రిటైల్, హెచ్ఎన్ఐల పెట్టుబడుల విలువ 15 శాతం(రూ.7.5 లక్షల కోట్లు) మాత్రమే కావడం గమనార్హం. ‘డీయోనిటైజేషన్ ప్రభావంతో బ్యాంకింగ్‌లోకి రూ.8-12 లక్షల కోట్ల నిధులు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఎంఎఫ్‌ల 15 శాతం వాటా అలాగే కొనసాగినా కూడా మధ్యకాలికంగా చూస్తే రూ.1-1.5 లక్షల కోట్లు రిటైల్, హెచ్ఎన్ఐల నుంచి ఫండ్సలోకి వచ్చే అవకాశం ఉంది’అని ఫండ్సఇండియా.కామ్ సహ వ్యవస్థాపకులు, సీఓఓ శ్రీకాంత్ మీనాక్షి పేర్కొన్నారు. లిక్విడ్, షార్ట్‌టర్మ్ డెట్ఫండ్సలోకి... బ్యాంకింగ్ రంగంలోకి అదనపు ద్రవ్య లభ్యత పెరుగుతుండటంతో.. ఈ నిధుల్లో కొంత లిక్విడ్, షార్టర్మ్ డెట్ ఫండ్సలోకి రావచ్చని క్వాంటమ్ ఏఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్మీ పటేల్ అభిప్రాయపడ్డారు. మరోపక్క, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల తగ్గుదల అంచనాల నేపథ్యంలో కొంత మొత్తం షార్ట్‌టర్మ్, డైనమిక్ బాండ్ ఫండ్సలోకి ప్రవహించే అవకాశం ఉందన్నారు. ‘ప్రభుత్వ డీమోనిటైజేషన్ చర్యలు.. ఎంఎఫ్ పరిశ్రమ మొత్తానికి సానుకూలంగా నిలవనుంది. ఇన్వెస్టర్లు సురక్షితమైన, మరింత వ్యవస్థీకృతమైన పెట్టుబడి సాధనాలపైపు దృష్టిసారించనుండటమే దీనికి కారణం’ అని రిలయన్స ఎంఎఫ్ సీఈఓ సుదీప్ సిక్కా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దేశీయంగా ఎంఎఫ్ పరిశ్రమ మొత్తం నిర్వహణ ఆస్తులు(ఏయూఎం) రూ.16.3 లక్షల కోట్లకు చేరింది. కాగా, డీమోనిటైజేషన్ ప్రభావంతో త్వరలోనే ఈ మొత్తం రూ.20 లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉందని సిక్కా పేర్కొన్నారు. -
వడ్డీరేట్లు మరింత కిందికి!
డిపాజిట్ల జోరుతో అదనపు ద్రవ్యలభ్యత కొనసాగుతుంది... రెపో తగ్గింపునకు ఆస్కారం... ఎస్బీఐ అంచనా... నోట్ల రద్దు ఎఫెక్ట్.. న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన(డీమోనిటైజేషన్) నేపథ్యంలో వడ్డీరేట్లు మరింత తగ్గుముఖం పట్టొచ్చని దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనా వేసింది. డిపాజిట్లు వెల్లువెత్తడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత(లిక్విడిటీ) భారీగా ఎగబాకిందని.. ఇప్పటికిప్పుడు ఇది మళ్లీ వెనక్కివెళ్లిపోయే అవకాశంలేదని కూడా పేర్కొంది. ‘ప్రభుత్వం తీసుకున్న డీమోనిటైజేషన్ చర్య ఆహ్వానించదగినదే. సేవింగ్స, కరెంట్ అకౌంట్లలోకి భారీ మొత్తంలో నగదు జమ అవుతోంది. ఈ డిపాజిట్ల కారణంగా వ్యవస్థలో అవసరానికి మించి లిక్విడిటీ వచ్చిచేరుతోంది. అరుుతే, ప్రభుత్వం నిబంధనలు సడలించిన వెంటనే మళ్లీ ఈ అదనపు ద్రవ్య లభ్యత మొత్తం వెనక్కివెళ్లిపోతుందని భావించడం లేదు. దీంతో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది’ అని ఎస్బీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా రూ.500; 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8న హఠాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పాత నోట్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి, అదేవిధంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు 50 రోజుల గడవును ఇచ్చింది. ఈ చర్యలతో బ్యాంకుల్లో డిపాజిట్లు పోటెత్తుతున్నాయి. ఒక్క ఎస్బీఐలోనే నగదు డిపాజిట్లు నవంబర్ 9 నుంచి 17 వరకు రూ.1.27 లక్షల కోట్లు జమ అయినట్లు అంచనా. మరింత మంది ప్రజలు బ్యాంకింగ్‌లోకి... ఖాతాదారులు ఎస్బీఐ బ్రాంచ్‌లలో డిపాజిట్ చేస్తున్న నగదును తమకు నచ్చినవిధంగా వాడుకోవచ్చని.. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ(ఎస్బీ లేదా టెర్మ్ డిపాజిట్ ఖాతాలపై) రేట్ల మేరకు వడ్డీని చెల్లిస్తామని ఎస్బీఐ అధికారి వెల్లడించారు. కాగా, ఈ అదనపు నిధులను ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తారా అన్న ప్రశ్నకు.. రివర్స్ రెపో(ఆర్బీ వద్ద), ట్రెజరీ బిల్స్(ప్రభుత్వ బాండ్లు)లో స్వల్పకాలిక ప్రాతిపదికన పెట్టుబడిపెడతామని వివరించారు.‘డీమోనిటైజేషన్ వల్ల పాత నోట్ల మార్పిడి, డిపాజిట్ చేయడం ద్వారా మరింత మంది ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం కానున్నారు. దీనివల్ల పన్ను ఎగవేతదారులు, ఇతరత్రా అక్రమ కార్యకలాపాలను గుర్తించొచ్చు. పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం తద్వారా పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచడంవల్ల ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు పెరగడం వల్ల రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తారుు. దీంతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి దోహదం చేస్తుంది. అయితే, ఈ అదనపు నగదు లభ్యత కారణంగా బ్యాంకులకు స్వల్పకాలానికి అదనంగా వ్యయాలు పెరగుతుతాయి. ఆర్బీఐకి కూడా కొత్త నోట్ల ప్రింటింగ్ వల్ల వ్యయ భారం తప్పదు. అయితే, ప్రారంభంలో తలెత్తే ఈ ఇబ్బందులు అన్నీ నెమ్మదిగా సర్దుకుంటే.. పారదర్శకమైన, తక్కువ నగదు లావాదేవీలు గల సమాజం ఆవిష్కృతమవుతుంది’ అని ఎస్బీఐ ఉన్నతాధికారి వివరించారు. మార్చిలోగా మరో అర శాతం రెపో కోత! ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు కూడా డీమోనిటైజేషన్ తోడ్పాటును అందించనుందని ఎస్బీఐ అధికారి పేర్కొన్నారు. ‘మా అంచనా ప్రకారం నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు చేరే అవకాశం ఉంది. నోట్ల రద్దుతో వినియోగదారుల డిమాండ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుండటమే దీనికి కారణం. దీంతో ద్రవ్యోల్బణం తగ్గేందుకు దారితీస్తుంది. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే(2017 మార్చిలోగా) ఆర్బీఐ మరో పావు నుంచి అర శాతం మేర రెపో రేటు(ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు)ను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు. అక్టోబర్ నెలలో జరిగిన పాలసీ సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఇది 6.25%కి చేరింది. 2015 జనవరి నుంచి రెపో రేటు 1.75% తగ్గింది. కాగా, డిపాజిట్ల జోరు నేపథ్యంలో ఎస్బీఐ గత వారం వివిధ కాలవ్యవధులకు చెందిన డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.15% వరకూ తగ్గించడం తెలిసిందే. -
ఆర్థికాభివృద్ధి తగ్గుతుంది..తదుపరి సంస్కరణలు కీలకం
న్యూఢల్లీ: డీమోనిటైజేషన్ కారణంగా భారత్ ఆర్థికాభివృద్ధి వచ్చే 12 నెలల్లో 1 శాతం మేర తగ్గుతుందని ప్రసిద్ధ ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్బీసీ అంచనావేసింది. పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఒనగూడాలంటే..తదుపరి చేపట్టబోయే సంస్కరణలు కీలకమైని హెచ్ఎస్బీసీ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదికలో వివరాలు... పెద్ద నోట్లను ఉపసంహరించడం..వాటి స్థానంలో కొత్త పెద్ద నోట్లను ప్రవేశపెట్టడంవల్ల కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని నష్టాలు వున్నాయి. ద్రవ్య సరఫరా తగ్గినందున, ఏడాదికాలంలో జీడీపీ 0.7-1.0 శాతం మేర తగ్గవచ్చు. అధిక ప్రభావం డిసెంబర్, మార్చిలతో ముగిసే త్రైమాసికాల్లో వుంటుంది. నల్లధనంవల్ల సమాంతరంగా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ ఇక అధికారికమైపోతున్నందున, ప్రభుత్వం ఇందుకు తగిన సంస్కరణల్ని ప్రవేశపెడితే ప్రయోజనాలు దీర్ఘకాలంలో వుంటాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా డబ్బు చేరినందున..రుణ, డిపాజిట్, ప్రభుత్వ బాండ్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు పాత పెద్ద నోట్లలో 80 శాతం బ్యాంకుల వద్దకు చేరితే, బ్యాంకుల వద్దనున్న డిపాజిట్లు రూ.11.3 లక్షల కోట్ల మేర పెరుగుతాయి. దీంతో డిపాజిట్, రుణ రేట్లు బాగా తగ్గుతాయి. ఆర్బీఐ పరపతి విధానానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో పావు శాతం రేటు తగ్గే అవకాశం వుంది.